Wednesday, September 9, 2020

శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు. కవిత

శీర్షిక .
"విశ్వ " సాహిత్య నాధుడు.
------------------------------------

సంప్రదాయ సాహిత్యాలకు పెట్టినది పేరుగా
ఆతని సాహిత్య రచనా శైలి అద్భుతమైన 
విశిష్టతను సంతరించుకుంటాయి.॥

"విశ్వేశ్వర శతకం" తో మొదలైన ఈతని 
సాహిత్య  ప్రస్థానం , పుంఖల పుంఖలాలుగా 
కొనసాగి వివిధ ప్రక్రియల లో రుాపు దిద్దుకుని ,
విన్నుాత్న ఆవిష్కరణలతో  అలరించేయి.॥

వేల కొలదీ ప్రక్రియల లో ఈయన రచించిన
శతకాలు, పురాణాలు , గ్రంధాలు , నవలలు,
నాటకాలు లాంటి ఎన్నో సాహిత్య సంపదలు,
మనకందిన  అజరామర కీర్తి కిరీటాలు.॥

విన్నుాత విశిష్ట పాత్రల చిత్రీకరణకు 
విశ్వనాధులకు  పెట్టినది పేరు.
వీరు రచించిన ఎన్నో నవలలు సినీ చిత్రాలుగా రుాపొందేయి.॥
విశిష్ట మైన పాత్రలతో రచించిన ఎన్నో నవలలు
గణుతికెక్కాయి.॥

"రామాయణ కల్పవృక్షము" నకు గాను,
"జ్ఞాన పీఠ అవార్డు " ను గ్రహించేరు.

శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి  వీరి గురువులు.
శారీరిక వ్యాయామం , యొాగాభ్యాసము నిత్య-
కృత్యాలుగా  గల "శ్రీ విశ్వనాథ  సత్యనారాయణ "
గారికి గౌరవ గజారోహణ తోపాటు తొాలా బిళ్ళపై
ఆయన చిత్రాన్ని విడుదలజేయడం మన తెలుగు వారికి గర్వకారణం. ॥

వేల కొలది రచనలతో ,
ఎన్నో పురస్కారాలు, సన్మానాలు , డాక్టరేట్ లు
అందుకున్న ఈయన  మేటి సాహిత్య సార్వభౌములు, 
 కీర్తి కిరీటోత్తములు.॥
 -------------------------------------------
రచన, శ్రీమతి.
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021.
----------------------


No comments:

Post a Comment