Monday, September 7, 2020

మెట్టినిల్లు కవిత.

వారం వారం  e కవిత, కోసం పంపినది.
అంశం   =   నమ్మకం.

రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021.

శీర్షిక .
మెట్టినిల్లు.
---------------
పుట్టిన దగ్గరనుండి పెరిగీ పెద్దయ్యే వరకు
అమ్మా నాన్నల  ప్రేమ, అనురాగాల మధ్య
ఎంతో  ముద్దుగా పెరుగుతుంది ఆడపిల్ల..
ఆడిందే ఆట , పాడిందే పాటగా పెరిగిన-
తనను , ఎవరో తెలియని మరొక కొత్త కుటుంబంతో  సంబంధాన్ని కలుపుకొని , ఒక కొత్త వ్యక్తితో
వివాహ బంధం పేరుతో ముాడు ముళ్ళుా వేయించి, ఇతనే నీభర్త, ఇకనుంచీ వీరే నీ కుటుంబం -
అని చెప్పి,  వారి వెంట వెళ్ళమన్నపుడు ,
ఆ అపరిచిత వ్యక్తుల తో ,  ఆనందంగా వారివెంట వారింటికి వెళుతున్న ,  ఒక ఆడపిల్లకు , అత్యంత "నమ్మకం" , వారంతా ఇక నుంచి తనవారని.
తనను తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ప్రేమిస్తారని,
భర్తగా అతని అనురాగంలో ఆనంద డోలిక -
లుాగుతానని.
ఆ "నమ్మకం"తోనే,  పేగు బంధాన్ని  తెంచుకొని ,
రక్త సంబంధాలకు దుారమై ,
ఎప్పుడుా ఎరగని వారిమధ్యకు-
తన జీవిత చివరి దశ వరకు, తనను తాను
అర్పించుకునేందుకు ఆనందంగా ఏడడుగులు వేసి
అత్తింటికి చేరుతుంది ఒక ఆడపిల్ల .
ఆ "నమ్మకం"తోనే , పుట్టెడు బాధ్యతలను తనపై వేసుకుంటుంది.  ఆ ఇంటి వారసత్వానికి
ఆది ముాలమౌతుంది.
ఆ ఇల్లే తన ఇల్లనే "నమ్మకం" తో
ఆ ఇంటిని స్వర్గంలా తీర్చి దిద్దే ప్రయత్నంలో,
కష్ట- నష్టాలను ఓర్చుకుంటుా , ఆ కష్టం లోనే -
తన ఆనందాన్ని వెతుక్కుంటుా కొవ్వొత్తిలా--- కరిగిపోతుంది .
--------------------------------------------------

హామీ...
ఈ వచన కవిత ఏ మాధ్యమునందుా ప్రచురితం కాని
నా స్వీయ రచన.
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

No comments:

Post a Comment