నవయుగంబున నాజీ నగ్ననృత్యమింకెన్నాళ్ళు ......హింసపాపమని యెంచు దేశమున హిట్లరిత్వమింకెన్నాళ్ళు అంటుా నినదించిన కాళోజీ...
తెలంగాణ తొలిపొద్దు*
*e కవితా సంకలనం*
శీర్షిక .
ఉద్యమ పోరాటకుడు.
--------------------------------
కాళోజీ..
తెలంగాణా ఉద్యమ ప్రతిధ్వని.
రాజకీయ చైతన్య సమాహార ప్రజాకవి.
, అనుభవం ఒక చోట, అధికారం ఇంకొకచోట..
అంటుా నిజాం నిరంకుశత్వ పాలనకు
వ్యతిరేకంగా పోరు సల్పిన
స్వాతంత్ర్య సమర యొాధుడు.
"ఒక్క సిరా చుక్క లక్షల మెదళ్ళ కలయిక"-
అంటుా అక్షర జ్యోతిని ప్రజ్వలించిన---
"ఆంధ్ర సారస్వత పరిషద్ వ్యవస్థాపక " సభ్యుడు.
చావు పుట్టుకల మధ్య బ్రతుకంతా , దేశంకోసమే..
అంటుా ఉద్యమించిన "పద్మవిభూాషణుడు".
అతని దేశభక్తి కై తెకంగాణా ప్రభుత్వం ,ప్రజలు,
అతని జన్మదినాన్ని "భాషోత్సవదినోత్సవంగా "
జరుపుకుంటుా అతని దేశభక్తికి పట్టంగట్టేరు.
"నా గొడవ", కావ్యంతో ' అక్షర తుాణీరాలను
సంధించిన తెలంగాణ" ప్రజా ఉద్యమ పోరాటకుడు---
రచయిత కాళోజీ .
----------------------------------------------------------
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
-------------------------
No comments:
Post a Comment