తెలంగాణ ఆటవీ శాఖ, ములుగు రేంజ్ వారి,
తెలంగాణ సాహితీ లీడ్ ఫౌండేషన్ . కు
"ప్రపంచ ఓజోన్ డే " సందర్భంగా రాసినది.
శీర్షిక .
చిలకమ్మ కధ
------------
అందాల ఓ చిలుక, ఆకాశమందునా
గూడు కట్టగ తలచి, నింగి నెగిరీ పోయె ||
చెట్లు చేమలు నిండు, ఓ చిన్ని అడవిలో
గుబురు నిండిన ఆకు, చివురు కొమ్మల నడుమ ,
ఏరి చేర్చెను ఎండు, పుల్లలెన్నో వెదికి
గూడు వెలసెను తుదికి, సేద తీరగ మదికి ||
ముద్దు ముచ్చటవలసి , కోరి తానే వలచి
గోరింక తోడుగా. ,చిరు కూనలను సాకె ॥
కిచ కిచలు అవి పలుక , చిన్ని రవముల తోడ
చిందులేసెను చిలుక, గోరింక జత కలుప ||
ఏఏటి కా ఏడు, తీరనీ భయమంట -
తరుల గూల్చెడి నరుల, ,మ్రొక్కి వేడెడిదంట ॥
గాలి, నీడ, ఫలము లిచ్చు, చెట్టు కొట్టవచ్చి నట్టి.
నరుని చుాచి వణికెడిది , నరుని తీరెరుగనిది ॥
ఎగరలేని కూనల , ప్రాణాలె పణమంట
చిలకమ్మ కంటిలో , కన్నీటి వరదంట ||॥
నమ్మలేనీ వింత , మరుగాయె వనమంత
నీడ నిచ్చెడి జాడ, కానరాలేదంట ॥
తరుల జాడలు తరిగె. కొండ చరియలు విరిగె
చిలకమ్మ గూటికై , చిరునీడ కరువాయె ||
( దయచేసి పర్యావరణ రక్షణ చేయండి )
-------------------------------------------------------
రచన. శ్రీమతి.
పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.
కల్యాణ్ ( మహరాష్ట్ర ).
8097622021.
హామీ =
" చిలకమ్మ కధ " శీర్షిక గల ఈ కవిత,
ఏ మాధ్యమునందును ప్రచురితము కాని-
నా స్వీయ రచన.
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ .మహారాష్ట్ర .
పచ్చ పచ్చ టి చెట్లు , ఫలములిచ్చెడి చెట్లు
పరుల కై ఉపయొాగకరమైన వౌ చెట్లు॥
ప్రాణ వాయువు నిచ్చు, ప్రాణ దాతయె తరువు
కడ తేర కలపిచ్చి , కరుణ చుాపెడు తనువు.॥
అట్టి మేటి తరు సంపద-నహరహము కాపాడి
ఆనంద, ఆరీగ్య- సీమలను ఏలండి...॥
( దయచేసి పర్యావరణ రక్షణ చేయండి )
--------------------------------------
No comments:
Post a Comment