రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021.
-----------------------
శీర్షిక .
చైతన్యపు వారధి.
-------------------------
ఉద్యమాలె ఊపిరిగా, ప్రజల తోడె జీవముగా
చైతన్యపు వారధిగా , పోరాటపు సారధిగా..॥
ప్రత్యేక తెలంగాణ , సాధించిన సాధకుడు.
పద్మవిభుాషణాలంకృత ఘన వైతాళికిడు ॥
తెలంగాణ తెలుగు బిడ్డ , తెలంగాణ ప్రీతి గడ్డ.
నిజాం నిరంకుశత్త్వానికి , నిరసనల వేటలో ధీట.॥
ఉద్యమాలె ఊపిరిగా నిత్య పోరాట బాట.
స్వేశ్ఛ కై తపించి పోరి ,జీవిత మర్పించు నేత॥
బహు భాషా కోవిదుడు , సత్యహింసా వాదకుడు.॥
ప్రతిధ్వనించు ప్రేరణల , ఉద్యమ పోరాటకుడు.॥
కలం కత్తి ఝళిపించి కవితలల్లు యొాధుడు॥
ప్రజా కవిగ పేరొందిన పరమ దేశ భక్తుడు ॥
అసమానతలా- వేదన , అక్షర అస్త్రాలుగ జేసి ,
ఉద్యమాల సంధించిన అక్షరసంధాపకుడు.॥
తెలంగాణ చైతన్యపు పోరు జోరు వారధి
ఉద్యమాలు సాగించిన ప్రజా రధపు సారధి ॥
నా గొడవ" రచన జేసి, పలుకు భాష సమర్ధించి
తెలంగాణ అభివృద్ధి ని, సాధించిన సాధనకుడు.॥
ఎన్నో పదవుల ప్రభువు , మరెన్నో రచనల కొలువు.
నేటికీ ' అతని "జన్మదిన" వేడుక -
"తెలంగాణా ,-భాషాదినోత్సవం"గా , జరుపుకోబడడం , ప్రజల మదిలో, చిరస్థాయిగా నిలిచిపోయిన
అతని కీర్తికి నిదర్శనం . అంతటి ఘన చరితుడు,
"కాళోజీ" వందనీయుడు.
-------------------------------------------------------------
No comments:
Post a Comment