ముందు మాట.
---------------------
గౌరవనీయులైన శ్రీ అడిగొప్పుల సదయ్యగారు
సహజ పాండిత్య సాహితీ సంపన్నులు. నిరంతర సాహిత్య కృషి గ్రంధానుశీలన వీరి ఉఛ్ఛ్వాస నిశ్వాసాలు.
శ్రీ కౌశల్య, రామయ్య గారుల పుత్రులులైన వీరు , వృత్తి పరంగా కరీంనగర్ కళాశాల లో ప్రభుత్వ గణితోపాధ్యాయులైనను , ప్రవృత్తి పరంగా సాహిత్య , సమాజ సేవకులు.
"క్షపాకర " అనేది వీరి కలం పేరు.
చిన్ని పదాల లో పెద్ద భావమును ఇమడ్చ గలిగే,
ఛందోబద్ధ నియమ సారమైన " ఇష్టపది" నుాతన పద్య ప్రక్తియ సృష్టికర్తలు.
ఈ ప్రక్రియ లో రాసిన ఏ గ్రంధమైనా యతి ,ప్రాస ,భావ ,వ్యక్తీకరణల తో అద్భుతమైన శైలి లో రుాపొందింపబడి ప్రజాదరణ పొందగలదన్న మాటలో సందేహము లేదు.
దుర్లభమైన మానవజన్మ ఎత్తినందులకు గాను
శ్రీ అడిగొప్పుల సదయ్యగారు , తన జన్మ సార్ధకత చేసుకునే రీతిలో ఎన్నో గ్రంధ , గేయ రచనలు చేసేరు.
అందమైన కందాలుగా శ్రీనివాస శతకం , ఇష్టపదుల లో
పురుషోత్తమ మాల , ముత్యాల సర లో సర్పదష్ట గేయ కావ్యం , కుానలమ్మ పదాల్లో చంద్ర కిరణాలు , బాల సాహిత్య గేయ కధలు, గజల్స్ , కవితలు లాంటివి ఈయన ప్రతిభకు కొన్ని మచ్చుతునకలు.
జాతీయ దళిత సాహిత్య అకాడమీ అవార్డు ,
సహస్ర కవిమిత్ర , సహస్ర లేఖా సాహిత్య మిత్ర, విద్యా జ్యోతి రత్నబిరుదులే కాక..
, ఇంటర్నేషనల్ పీన్ యుానివర్సిటీ నుండి "గౌరవ డాక్టరేట్," వంటి ఉత్తమ పురస్కారాలనందుకున్న
గురువరేణ్యులు.
నేటి కార్పొరేట్ విద్యా విధానాల వల్ల, విద్యార్ధులు ఆర్ధికంగానే కాక, జ్ఞాన పరంగా కుాడా నష్టపోతున్నారు. విద్యావ్యవస్థ లో గల లోటు- పాట్లను
సవరించి, విద్యార్ధులకు సక్రమ మైన మార్గ నిర్దేశం కలిగించాలన్న దిశలో,
కర్తవ్య నిష్ట గల ఎందరో ఉపాధ్యాయులు ,
నిరంతర కృషి చేస్తుా...విద్యార్ధులను ఒక వివేకానందునిగా , ఒక సర్వైపల్లి రాధాకృష్ణ గారు మొదలైన ఉత్కృష్ట సమాజ నిర్మాతలుగా తీర్చి దిద్దాలనే సంకల్పంతో తమ జీవితాలను ధారపోస్తున్నారు.
అటువంటి గురువుల కు పాదాభిషేక వందనాలనర్పిస్తుా, వారి గౌరవార్ధం ,
తమ తమ గురువులను
స్మరించుకుంటుా, ,ఎంతో మంది శిష్యులు , తమ కృతజ్ఞతలను కవితల రుాపంలో అందించేరు .ఆ కవితలకు "సంకలన" రుాపం ఇచ్చే సదుద్దేశ్యంతో , ఎన్నో కష్ట నష్టాలకోర్చి..ఈ "కవితా సంకలనానికి" వారధిగా నిలిచి , వందన సమర్పణ గావిస్తున్న శ్రీ "అడిగొప్పుల సదయ్యగారు" కృతార్ధ చరితులు.
ఈ నాటి "ఉపాధ్యాయ దినోత్సవ " సందర్భంగా , సద్గురువుల
గౌరవార్ధం , కవితా సంకలనానికి శ్రీకారం చుట్టి, ఆశక్తులైన
ఎంతోమంది సాహిత్యప్రియులను ప్రోత్సహించి , వారు రాసిన కవితలను " గురుభ్యోనమః" అనే శీర్షిక తో,
"సంకలనంగా" తీసుకు వస్తున్న , సాహిత్య స్ఫుార్తి దాయకులు, శ్రీ అడిగొప్పుల సదయ్యగారు.
సత్ చిత్తులు, సౌమ్యులు ఐన,
వీరికి , వీరి కుటుంబానికి, ఆయురారోగ్య ఐశ్వర్యాలను
కలుగజేయాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను.
ఇట్లు ,
గేయ , కవితా , కధా-
రచయిత్రి,
" పద ముత్యం" ,బిరుదు,
" ఇష్టపది శ్రేష్ట" బిరుదుల గ్రహీత-
శ్రీమతి , పుల్లాభట్ల -
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
No comments:
Post a Comment