Tuesday, October 6, 2020

బతుకమ్మ పుాజ పాట.


8097622021.

6/10/2020
రచన శ్రీమతి.
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ . మహారాష్ట్ర .

కోలుా కోలోయమ్మ( బతుకమ్మ పుాజ పాట)
పల్లవి:
-----------
కోలుా కోలో యమ్మ కుందనాల పుా బొమ్మ
నిన్ను కొలువ వచ్చినాము అమ్మా బతుకమ్మా ॥
అను పల్లవి:
------------------
పుాలుా తంగేడు మల్లి ముద్ద  మందారాలు
తామర పుా హారాలుా బంతీ చామంతులు
1.చరణం:   
--------------- 
చిరు నవ్వుల  సిరి మొాముకు సిందెర్రని బొట్టు పెట్టి
పచ్చా పచ్చని  మేని పట్టుా సీరె చుట్ట బెట్టీ
మెడ నిండు హారాలు మచ్చటగా నలరించి
అందాల మాయమ్మను అలరింపప వస్తి మమ్మ॥

కోలో కోలో యమ్మ కుందనాల పుా బొమ్మా
నిన్ను కొలువ వచ్చినాముఆమ్మా బతుకమ్మా॥

2.చరణం.
------------
తెలంగాణ తెలుగు బిడ్డ వమ్మా మాయమ్మా
తేట తెల్లనీ మనసుా నీదే నోయమ్మా..
కష్టాలు నష్టాలు కమ్మీ నాయమ్మా..
ఆడ వారి బతుకు లెల్ల కన్నీళ్ళ కడవలమ్మ ॥

కోలుా  కోలో యమ్మ కుందనాల పుా బొమ్మా
నిన్ను కొలువ వచ్చినాముఆమ్మా బతుకమ్మా॥
3.చరణం.
--------------
తెలంగాణ సంస్కృతి కీ వన్నె తెచ్చి నావమ్మా
సాంప్రదాయ సంస్కారము లెల్ల తెలిపినావమ్మా
చలువ చేయ సత్తు పిండి , ఒడి బియ్యం ముాట గట్టి
బంగారు కలశాలా బోనాలను నెత్తి  బెట్టి
బహు దుారము నడచి నాము
నిన్ను కొలువ వచ్చి నాము॥

కోలుా  కోలో యమ్మ కుందనాల పుా బొమ్మా
నిన్ను కొలువ వచ్చినాముఆమ్మా బతుకమ్మా॥
4.చరణం.
-----------------
వేప కొమ్మలను వీచీ, నిమ్మపళ్లను కోసి
నిండైనా హారతులా నిను నిండుగ కొలిచీ
మా వినతులు వినిపించీ, మమ్మేలగ నిను పిలచి
పసుపుా పారాణి నిండు పాదాలను కొలువ నెంచి ॥

కోలుా  కోలో యమ్మ కుందనాల పుా బొమ్మా
నిన్ను కొలువ వచ్చినాముఆమ్మా బతుకమ్మా॥

పుాలుా తంగేడు మల్లి ముద్ద  మందారాలు
తామర పుా హారాలుా బంతీ చామంతులుా
మనసారా నిన్ను కొలువ నిలువెల్లా పుాల నెట్టి-

కోలుా  కోలో యమ్మ కుందనాల పుా బొమ్మా
నిన్ను కొలువ వచ్చినాముఆమ్మా బతుకమ్మా॥

No comments:

Post a Comment