28/11/2020.
ప్రతీ రోజుా కవితా పండగే కొరకు.
రచన: శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
అంశం : ఐచ్ఛికము.
పద్య ప్రక్రియ.
ఆటవెలది.
1.
ఇరుగు పొరుగు తోడ ఇష్టుడై మెలగుమ
దుష్టు లకును ఉండు దుార ముగను.
సంప్రదాయమాది సన్మార్గము లెంచి
ధర్మ నిరతి తోడ ధరను మనుమ ॥
2.
పెట్టు వంద నమ్ము పెద్దవారి కెపుడు
గురుల గౌరవించు గుణుడవౌచు ।
జ్ఞాన మార్గ మదియె జ్ఞానివై మనుమా
సత్య మార్గ మెంచు సమ్మతించి ॥
3.
అన్న మదియె ఘనము ఆబ్రహ్మ రుాపము
ఆక లన్న వారి కదియె పెట్టు.
పాచి కుాడు వీడి పక్వ భోజన మిడు
తినుమ నమము జేసి తీర్ధ మదియె ॥
4.
చేత నైన మంచి చేయంగ నీవెంచు
ధనము కుాడి రాదు ధరణి యందు
మంచి మాట తోడ మన్ననే పొందుమా
మంచి పనులు చేసి మహిని మనుమ ॥
5.
తల్లిదండ్రులిలను తథ్యమ్ము వేల్పులు
కరకు మాట లాడి కసర బోకు
ముదుసలైన వారి ముద్దుగా చుాడుమా
వారి మాట వినుమ వారి గనుమ ॥
No comments:
Post a Comment