11/11/2020.
(గోరసం వారం వారం చిత్రశీర్షిక కొరకు)
శీర్షిక:
ప్రకృతి, పురుషుడు.
చిత్ర కవిత.
-----------------------------
అర్ధ నారీ తత్త్వం.
ప్రకృతి భుామైతే ఆకాశం పురుషుడు.
ఈ రెండింటి కలయిక పుార్తి విశ్వ నిర్మాణం.
స్త్రీ పురుష శక్తుల సమన్వయ సమ్మేళనం.ప్రకృతి
పురుషులు సమాన రీతిలో తమ విధులను నిర్వర్తిస్తే
,
వైపరీత్యాలకు తావులేని సశ్యశ్యామలావని
చక్కని నీడలో మానవ జీవితాలు మహొజ్వలమై
ప్రకాశిస్తాయి. ఇదే విధంగా భుామి మీద స్త్రీ పురుషులు
సమానత్త్వ సద్భావన తో సక్రమ బాధ్యతలను
నెరవేర్చి దేశ పురోగతి పథంలో తమ విజ్ఞాన
వికాశానికి కృషిచేస్తుా ఉంటే , దేశ అత్యున్నత స్థితికి
కారకులై భావి తరాల జీవన సాఫల్యతకు పుాల బాట
వేయగలుగుతారు.వారు దేశ పౌరులుగా సశ్యశ్యామల
శాంతియుత భరతావనికి ముద్దు బిడ్డలుగా దేశ
ఖ్యాతిని కీర్తి శిఖరాగ్రాలకు చేర్చగలుగుతారు.
రచన :శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
No comments:
Post a Comment