🌺 🌺 మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం 🌺🌺
🌹ప్రతి రోజూ కవితా పండుగే🌹
పర్యవేక్షకులు:డా౹౹అడిగొప్పుల సదయ్యగారు
తేదీ:21/11/2020(శనివారం)
నిర్వహణ: కుందారపు గురుమూర్తి
కవి పేరు:
ఊరు:
నేటిఅంశం: ఐచ్ఛికము
నేటిప్రక్రియ: "పద్యము"(ఆటవెలది మాత్రమే)
కవి మిత్రులు వారికి ఇష్టమైన ఏ అంశంలో నైనను ఆటవెలది పద్యములు అల్ల వలెను
సమయం:ఉదయం 5-00గం౹౹ల నుండి రాత్రి 9-00 గం౹౹ల వరకు
ఫలితాల వెల్లడి:రాత్రి 9-30గంటలకు
నియమములు::
1. కవిత పద్య ప్రక్రియలోనె ఉండాలి.
2. పద్యము పేరును తప్పక సూచించాలి.
3.రెండు అంతకంటే ఎక్కువ పద్యాలు రాయాలి.
4.సవరణ కోరిన పద్యాలను తప్పక సవరించి మరలా పంపవలెను
5.లక్షణాలను చదువుకొని పద్యమును రాయవలెను
6.పాదములు వాక్యాలుగా ఉండరాదు
7.సాధ్యమైనంతవరకు పాదాల మధ్యలో అచ్చు ప్రయోగము లేకుండా సంధిగత పదములు వ్రాసినచో అద్భుతముగా నుండుని గ్రహింపవలెయును
8.పునరుక్తి దోషముండరాదు అనగా ఒకే పదమును అదే అర్థములో పదే పదే వాడరాదు
9.సూచనలు సహృదయముతో స్వీకరించగలరు
ఆటవెలది పద్య లక్షణాలు:
1. ఆటవెలది పద్యములో 4 పాదాలు ఉంటాయి
2. 1,3 పాదాలలో వరుసగా 3సూర్య గణాలు 2ఇంద్ర గణాలు ఉంటాయి
3. 2,4 పాదాలలో 5సూర్య గణాలు ఉంటాయి
4. మొదటిగణం మొదటి అక్షరానికి 4వ గణం మొదటి అక్షరానికి యతి మైత్రి కుదురుతుంది
5. ప్రాస నియమము ఉండదు. ప్రాసయతి కుదురుతుంది
ప్రాసయతి అనగా
యతి కుదరనపుడు ప్రాస స్థానములోని అక్షరానికి,(అనగా పాదంలోని రెండవ అక్షరానికి)
యతిమైత్రి తర్వాత అక్షరానికి(4వ గణం రెండో అక్షరానికి) ప్రాస వేయాలి.
ప్రాసలో హల్లుకు ప్రాధాన్యత ఉంటుంది
!!గణములు!!
సూర్య గణాలు రెండు
III-నగణము
UI-హగణము లేదా గలము
ఇంద్ర గణాలు ఆరు
నలము IIII
నగము IIIU
సలము IIUI
భగణము UII
రగణము UIU
తగణము UUI
యతి:పద్యపాదములో మొదటి అక్షరాన్ని యతి అంటారు
ఇందులో అచ్చుకు ప్రాధాన్యత ఉంటుంది
యతిమైత్రి కలిగిన అక్షరాలు....
1) అ-ఆ-ఐ-ఔ
2) ఇ-ఈ-ఋ-ౠ-ఎ-ఏ.
3) ఉ-ఊ-ఒ-ఓ.
గమనిక:
హల్లుతో పాటు దాని మీది అచ్చుకు కూడా యతిమైత్రి పాటించాలి.
ఉదా:
i)క-కా-కై-కౌ;
ii)కి-కీ-కృ-కౄ-కె-కే;
iii)కు-కూ-కొ-కో.
4)క-ఖ-గ-ఘ
5) చ-ఛ-జ-ఝ-శ-ష-స
6) ట-ఠ-డ-ఢ
7) త-థ-ద-ధ
8) ప-ఫ-బ-భ-వ
9) అనుస్వారం(సున్న)తో కూడిన వర్గాక్షారాలు నాలుగు ఆ వర్గపు పంచమాక్షరం (అనునాసికాక్షరం)తో యతి చెల్లుతాయి.
ంక,ంఖ,ంగ,ంఘ-ఙ;
ంచ,ంఛ,ంజ,ంఝ-ఞ;
ంట,ంఠ,ండ,ంఢ-ణ;
ంత,ంథ,ంద,ంధ-న;
ంప,ంఫ,ంబ,ంభ-మ.
10) పు,ఫు,బు,భు-ము.
11) ర-ఱ-ల-ళ.
12) న-ణ.
13) అచ్చులతో య,హ లకు యతి చెల్లుతుంది. అంటే
(i) అ,ఆ,ఐ,ఔ, య,యా,యై,యౌ, హ,హా,హై,హౌ;
(ii) ఇ,ఈ,ఋ,ౠ,ఎ,ఏ, యి,యీ,యె,యే, హి,హీ,హృ,హె,హే;
(iii) ఉ,ఊ,ఒ,ఓ, యు,యూ,యొ,యో, హు,హూ,హొ,హో.
14) ‘క్ష’ అనేది కకార, షకారాల సంయుక్తాక్షరం కనుక దానికి క,ఖ,గ,ఘలతోను, చ,ఛ,జ,ఝ,శ,ష,సలతోను యతి చెల్లుతుంది.
15) యతిమైత్రి లేని అక్షరాలు రెండింటికి ఋత్వం ఉన్నట్లయితే వాటికి యతి చెల్లుతుంది. ఉదా. కృ-తృ.
ఉదాహరణ:1
U I /I I I /U I / U I I /U U I
*ఆ* ట/వెలది /యందు / *న* ద్భుత/మైనట్టి
U I/ I I I/ U I / U I / I I I
*పద్య* /ములను/ వ్రాయ/ *హృద్య* /ముగను
*క* వులు సిద్దమైరి *క* లములఁజేబూని
*మం* చి యంశములను *మ* లచుటకును
ఉదాహరణ:2
*మా* ట తూట వోలె *మ* రణంబు కలిగించు
*పెద* వి దాటితేను *పృథి* విఁగనగ
*జ* గతిలోన నిదియె *జ* రిగెడు సత్యంబు
*వి* నుము గురువు మాట *వీ* నులార
మరిన్ని ఉదాహరణల కొరకు "వేమన" పద్యాలను పరిశీలించగలరు
మీ
కుందారపు గురుమూర్తి.
!!గమనిక!!
పర్యవేక్షకులు డా౹౹అడిగొప్పుల సదయ్యగారి అధ్వర్యంలో
వ్రాసిన ప్రతి ఒక్కరికీ చిరకాలం గుర్తుండే ప్రశంసాపత్రాలు ఇవ్వబడును.
లెక్కలేనిహితులు ముఖపుస్తకములోన
ReplyDeleteపలకరించలేరు బయటకలసి
నిన్ను చదివి మెచ్చు నిజమైనమిత్రులు
నలుగురున్న మైత్రి వెలుగు శేషు...
మొదటి పాదం....ప్రాస యతి కుదరిందా లేదా,. గురువుగారు!
వివరముగా తెలిపిరి
ReplyDelete