Monday, November 23, 2020

నా నిర్ణయం.

23 /11/2020 .
రచన: శ్రీమతి :
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
శీర్షిక .
నా నిర్ణయం.
-------------

నాలుగు నెలలుగా సాగుతున్న పోరు
భార్యా భర్తల అనుబంధపు తేరు
నిదుర లేని రాత్రులు పెంచిన ఆలోచనల జోరు.
అంతరాత్మ ఘర్షణలో జ్ఞాపకాల హోరు ॥

మళ్ళీ పెళ్ళంటుా బంధువులు పోరుతున్నా
సవతి తల్లి నా బిడ్డకు వద్దంటుా, నా పెంపకానికై
అన్నీ వదులు కొని అల్లారు ముద్దుగా పెంచి
ఒంటరి పోరాటంలో అలసి వడలిన నాన్న ॥

తనను మంచి స్కుాలులో చదివించేందుకు
పగలు రాత్రి రెక్కలు ముక్కలు చేసుకుంటుా
మైళ్ళ కొలదీ దుారం నడవ వలసి వస్తున్నా, 
తనకు మురిపెంగా కొత్త స్కుాటీ కొనిచ్చిన నాన్న॥

నా పెళ్ళితో నా భార్యకు , బరువైన నాన్న.
నాన్నా , నేనా అంటున్న సవాలుకు ,జవాబు
చెప్పలేని నేను, నాన్నను వృద్ధాశ్రమంలో చేర్చమన్న ఆమె నిర్ణయానికి మౌనంగా కుంగిపోతున్న నాన్న.

రాత్రంతా ఆలోచించి తీసుకున్న నిర్ణయం.
నాన్న తరువాతే ఆమె అన్న నిజమైన సత్యం.
నాలోని అంతరాత్మను చంపుకోలేని  నేను
పెట్టె తీసుకొని ఆమెను బైటకు నడవమన్నాను॥
--------------------------------------------------------------


పిల్లలను ఎంతో మమకారంతో పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులకు ప్రతీ చోట ,

పిల్లలకు పెళ్ళిళ్ళు చేసిన తరువాత ఎదురౌతున్న సమస్య...

కష్టమైనా ఇష్టంగా తీసుకొనే మీ నిర్ణయం.

పెద్దలపాలిటి వరమౌతుంది.

పెరిగిపోతున్న   వృుద్ధాశ్రమాల  ఉధృతాన్ని తగ్గించండి...🙏🙏

  .

No comments:

Post a Comment