అంశం: స్త్రీ పోలీసైతే...
శీర్షిక : స్త్రీ శక్తి.
.రచన: శ్రీమతి :
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
----------------------
మారుతున్న సమాజం తో పాటు మారుతున్న మనస్తత్వాలు.మాయమౌతున్న
మన సంస్కృతి , సాంప్రదాయాలు.
మాతృ సమాన గౌరవమందవలసిన స్త్రీలు
మానభంగాలకు లోనౌతున్న దుస్థితి .
రాను రాను పెరుగుతున్న రాక్షసత్వానికి
సాముాహిక బలాత్కారాలకు ...బలౌతుా
అపస్మారకస్థితిలో, బతికుండగానే చితి
మంటల్లో కాలుతున్న అబలల ఆత్మ ఘోషలు.॥
నెలల పసికందుల దగ్గరి నుండి
పండు ముసలి వరకు కాముకుల కోరల్లో
చిక్కి దగ్ధమౌతున్న మాన-ప్రాణాలు ॥
ఎన్ని చట్టాలు వచ్చినా , ఎంతమంది బలౌతున్నా
శిక్షాలోపాలతో , కాలయాపన తీర్పులతో..
విజృంభిస్తున్న కృుార విలయతాండవ కృత్యాలు.॥
అంతే...
పురుషాహంకారాన్ని అణచి వేయడానికి " స్త్రీ శక్తి"
"ఆది శక్తై "అడుగు ముందుకేసింది.
" మా ప్రతీ పదం, ప్రగతి రధం " అంటుా..
అకృత్యాలను అణచి వేసేందుకు" అస్త్రం " పట్టిన స్త్రీ --
"పోలీసు శక్తి" రుాపంలో పోరుకు సిద్ధమై తన
విశ్వ రుాపాన్ని చుాపించింది.
మహిళా పోలీసులు పురుష పోలీసులకు తీసి పోరన్న రీతిలో, సమాజంలో ఉన్న స్త్రీ పురుష అసమానతలను
అతఃపాతాళానికి అణచివేసి , పురుషులతో సమానమై, విధినర్వాహణలలో విజయం సాధించింది.
నిస్సహాయ స్త్రీ లకు ధైర్యాన్నిచ్చే "భరోసా" అయ్యింది.
నవ తెలంగాణలో మహిళా భద్రతలకై "షీ టీమ్స్"
స్థాపనతో "మహిళా ఆరక్షణకు" శ్రీకారం చుట్టింది.
నగరంలో "ఈవ్ టీసింగ్" ను నియంత్రించడానికి నియమించిన ఈ “షి టీమ్స్” లో అంతా
"మహిళా పోలీసు"లే ఉండటం గమనార్హం.
" హితైషి" పేరుతో ఉమెన్ సేఫ్టీ వింగ్స్ ను స్థాపించి
వేల మంది మహిళలకు ధైర్య- మద్దతులనిచ్చింది.
అక్షరయాన్ వ్యవస్థాపకులు " శ్రీ ఐనంపుాడి లక్ష్మి "
గారి ఆధ్వర్యంలో "అక్షర శరాలు" సంధంచి కవితోద్యమాలతో మహిళల సాధికారత , ఔన్నత్యాల
విలువను చాటి చెప్పింది.
ప్రస్తుత సమాజపు దుస్థితిని రుాపుమాపి స్త్రీ స్వాతంత్ర్యం తో నిర్భయంగా చరించాలని కోరుతుా
నిర్భయ చట్టం నుండి దిశా చట్టం వరకు గల న్యాయ పరిశీలనలకై పోరుతుా స్త్రీ ల ప్రగతి పధానికి సోపానాలు వేస్తోంది.
తెలంగాణ పోలీస్ అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్ లో, ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 1162 మంది ఎస్.ఐ లు పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొన్నారు.వీరిలో 256 మంది మహిళా ఎస్.ఐలు.
పాల్గొనడం మహిళలకు గర్వకారణం .పోలీసు
శాఖలో స్త్రీ లకు 30% కేటాయిఃపుకు అర్హతను సాధించింది.
శక్తి టీమ్స్ , ప్రస్తుతం.. వివిధ పోలీసు స్టేషన్లకు అనుసంధానంగా పనిచేస్తుా ప్రగతి పథానికి తమ పదం కలుపుతుా ముందడుగు వేస్తున్నాయి.
-----------------------------------------------------------------
No comments:
Post a Comment