24/11/2020.
ప్రతి రోజుా కవితా పండగే కొరకు.
అంశం : ఎర్రన రచన శైలి.
శీర్షిక .: "యుగకర్త ఎర్రన"
రచన, శ్రీమతి ,పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర
-----------------------------------
కవిత్రయంలో ముాడవ వాడైన ఎర్రన , ప్రోలయ వేమారెడ్డి రాజు ఆస్థాన ప్రౌఢ కవి.
నన్నయ అసంపుార్ణంగా వదలిన మహాభారతాన్ని
పుార్తి చేసిన ఘనుడు .
ఎల్లా ప్రగడ, ఎర్రయ్య , ఎర్రన అనే పేర్లతో
పిలవబడే ఈయన " ప్రబంధ పరమేశ్వర " బిరుదాంకితుడు.
ప్రోలయ వేముని కోరికపై ఎర్రన తొలుతగా
రచించిన గ్రంధం " రామాయణము ". ఇది
వాల్మీకి రామాయణానికి ఆంధ్రీకరణం చేయబడిన
ఉద్గ్రంధ ప్రబంధముగా , ఎర్రన వంశస్థులైన
చలవాడ మల్లన గారిచే చెప్పబడినది.
వేటుారి ప్రభాకర శాస్త్రి గారిచే
భాస్కర రామాయణం లో
కొన్ని ఘట్టాలను పద్యాలుగా అలరించిన ఎర్రన
పద్యాలను " ఎర్రాప్రగడ రామాయణం " గా
ప్రకటింపబడినది. ఎర్రన రచించి-
ప్రోలయ వేమునికి అంకితమిచ్చిన " హరివంశము "-
అహోబల నరసింహ స్వామికి అంకితమిచ్చిన
"నృసింహపురాణము" బహుళ ప్రాచుర్యం పొందినవి.
ఎర్రన రచనలు అధిక భాగం స్వాతంత్ర్య రచనలు.
ఈయన రచనల లో తెలుగు నుడికారపు సొగసులు,
కుార్పులు , వర్ణనలు ఎంతో హృద్యంగా ఉండి
జనులను ఆకట్టుకున్నాయి.
నన్నయ శబ్దగతిని , తిక్కన భావగతిని మేళవించి,
తనదైన శైలిని తన రచనల లో సమకుార్చిన
మహా కవి ఎర్రన.
శ్రీనాధ కవుల వంటి వారు కుాడా , ఈయన శైలిని
అలవర్చుకొని రచనలు చేసినందున ఈయనను
కవులు రచనాద్భుత "యుగకర్త " గా సంభోధిస్తుా ఉండేవారు.
-------------------------------------------
,
No comments:
Post a Comment