వారం వారం కవిత కోసం
రచన: శ్రీమతి :
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
---------------------
అంశం : నాన్న. (వచన కవిత)
శీర్షిక .
అంతర్మధనం.
------------------
అమ్మ పొత్తిళ్ళ లో ఉన్న నా బుగ్గలను
సున్నితంగా తాకుతుా, కొడకు పుట్తేడన్న
సంతోషంతో మెరిసే కళ్ళతో నన్ను చుాస్తుా నాన్న.॥
ఉత్తమ కళాశాలలో నన్నుచేర్పించాలన్న తపనతో
ఎడ్మిషన్ల బారెడు లైనులో,చమటలు కక్కుతుా నాన్న॥
శక్తిని మించి పడే శ్రమ ఫలితాన్ని నా "ప్రోగ్రస్ కార్డ్"
రిపోర్టులో చుసుకొని సంత్రుప్తిగా తలుాపుతుా నాన్న ॥
సాంప్రదాయానికి విరుద్ధంగా చేసుకున్న పెళ్ళితో
కోడలు చేసే అవమానాలకు తట్టుకోలేక కన్నుముాసిన
జీవిత సహచరిని చితి మంటల్లో నైరాస్యంగా చుాస్తుా నాన్న ॥
ఆకలైనా ,అనారోగ్యమైనా, చెప్పుకోడానికెవరుాలేక
ఒంటరిపోరాటంలో జవసత్వాలుడిగిన నాన్న ॥
ముసలితనం లోతనకు చేదోడు-వాదోడుగా ఉండవలసిన కొడుకును అందుకోలేక చేతికర్రను
ఆధారంగా చేసుకొని , రాని మృత్యువును రమ్మని కోరుతుా , గమ్యమెరుగని చోటుకు తరలిపోతుా నాన్న.॥
"నాన్న "లో నేను "నాలో" నాన్న...
"కేర్" మన్న కన్నా ఏడుపుకు ఉలిక్కి పడి కళ్ళు తెరిచేను.
నాకు వచ్చినది కలా ..లేక, రాబోయే నా భవిష్యత్తుకు
నిదర్శనమా...
తెలీని భయంతో "కన్నా" ని దగ్గరగా హత్తుకున్నాను.
నాలుగు నెల లుగా కనుపించని నాన్నని తలుచుకుంటుా.....
--------------------------------------
No comments:
Post a Comment