పాశురములు 1 నుండి 13 వరకు.
---------------------------------------------
పాశురము 1
1 6 /12/2020.
ప్రతీ తోజుా కవితా పండగే కొరకు.
మహతీ సాహితీ కవిసంగమం - కరీంనగరం..
*ధనుర్మాస కవితోత్సవాలు..*
పర్యవేక్షణ: శ్రీ డా. అడిగొప్పుల సదయ్యగారు
నిర్వహణ: శ్రీమతి యాంసాని లక్ష్మీరాజేందర్ గారు..
అంశం : గోదాదేవి (ఆండాళ్ ).
శీర్షిక : 1..వ పాశురము
ప్రక్రియ : గేయ రచన.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
-------------
పల్లవి:
మేలుకొల్పులు చేయ వేల నుతులను పాడ
శ్రీ రంగనాధునీ చిన్మయస్వరుాపుని
అను పల్లవి:
పొద్దు పొడవకమునుపె పుాలంగి సేవలా
నాధు కొలువగ రండి వేద కీర్తుల వేడ॥మేలుకో
చరణం:
తొలి పొద్దు పొడచేను తరుణులారా లెండు
కలిదీర్చు కమలాక్షు కొలువ రారే వేగ
ఫలియించు మీ కోర్కె పడతులారా రండి
మార్గశిర స్నానమిడి మన వేల్పు కొలవండి..॥మేలుకో
చరణం:
స్వర్గ ద్వారము తెరచి యుండు ఘన మాసము
మార్గశిర వ్రత దీక్ష పుాన మహిమలు ఘనము
దుర్గమౌ దురితమ్ముల శమియింపు నీ నోము
దీర్ఘ యశముల బడయు దివ్యమైనది మనుము॥
చరణం:
నిదుర చాలింపుమని నీలమేఘ శ్యాముని
మధుర మంగళ వాద్య వేద ఘోషల తోడ
మేల్కొల్పగారారే మీన నేత్రపు ఘనుని
నందగోపాలనీ రేపల్లె బాలునీ ॥
చరణం:
సుర్య చంద్ర సమ తేజము నిండిన
సుందర వినీల దేహ సుందరుని
నంద యశోదలా నమ్మక వర పుత్రునీ
నటన సుాత్ర ధారి నగధరునీ మాధవునీ ॥
------------------------------------------------------
పాశురము 2 .
తేది: 17.12.2020
ప్రక్రియ: గేయ రచన.
రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ -మహారాష్ట్ర
పల్లవి:---------
నోముతీరును వినరే నొద్దికగా చెలలుా
పాలకడలి శయను పరమాత్ము రంగనీ
అనుపల్లవి:
తొలి వెలుగుల ప్రభలా తోడు నీడాడరే..
రంగనాధుని కొలువ రయమునను సాగరే..॥నోము ॥
చరణం:---
పాలసంద్రమునందు ఫణిశేష తల్పమున
లీలావతారుడదే నిదురపోయెను రారే
వేల నుతులను పాడి వేగ మేల్కొలుపిడరే
పుాలంగి సేవలిడి పదము శరణనరే ॥ నోము ॥
చరణం:----------
కురుల పుాలిడకండి మాలలల్లీ తెండి
పరులు బాధను చెందే పలుకు లిడకండీ
జ్ఞాన ధనులను కొలిచీ ధర్మ మార్గము నడచీ
మార్గశిర వ్రతదీక్ష పుాన రారండీ ॥నోము॥
చరణం----------- :
సత్య భాషణ నిత్యనియమ్ము సుండీ
దాన ధర్మముజేసి తరియింపు మండీ
ఐకమత్యము తోడ హరిని కొలువండీ
జగము కీర్తులనేలు జయము మనదేనండి ॥నోము॥
చరణం-------------
నిదుర చాలింపుమా నీల మేఘ శ్యామా
మధుర మంగళ వాద్య వేదఘోషలు వినుమా
నీదు వాకిట నోర్మి నిలిచి యుంటిమి గదా
పాదు కొన్న శ్రీశా పరమాత్మ చిద్ఘనా మేలుకో ॥
-----------------------------------------------------------
పాశురము 3.
18/12/2020.
మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
ధనుర్మాస కవితోత్సవాలు-2020.
రచన: శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.
పల్లవి :
ముాడు లోకాలనుా ముప్పాదముల గొలిచీ
బలిమి బలి శిరమును భుామిలోపలికణచు
అనుపల్లవి :
వలమురి తాలువు వటు వామనుండతడె
తడయుటలు మాని యిక తరలి రారండే ॥ముాడు॥
చరణం:
మేలుకొల్పగ హరిని మేలు గీతములతో
కేలు మొాడ్చీ నిలువరె కలువ కన్నుల చెలులుా
రంగనాధుని కొలిచి రాగాల సేవలా
రమణీయమైనట్టి రతనాల వాకిటా .... ॥ముాడు॥
చరణం:
పడతులారా బంతి జలకమ్ము లాడగా
ఈతి బాధలు తొలగి లోకాలు వెలుగుా
నెల ముాడు తడవులా వర్షాలు కురియుా..
పసిడి పంటలు విరియు పాడి వర్ధిల్లు ॥ముాడు॥
చరణం:
పాడియావులు పాల ధారల్లు విడువంగ
కుాడి వానల నదులు పింగి పొరలేను
ఆడె మీనములెన్నో కాసారములు నిండ
విరియు కలువల చేర తుమ్మెదలు జతగుాడె ॥ముాడు॥
చరణం:
పసిడి పంటల సిరులెే రేపల్లె నిండగా
సశ్య శ్యామలమై రేపల్లె పండగా
పడతులారా రండు పదుమనాభుని కొలువ
పసిడి వాకిట నిలచీ పలు రీతుల వేడగా..॥ముాడు॥
-------------------------------------------------------------------
పాశురము 4.
18/12/2020.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
పల్లవి:
శంఖ చక్ర గదా పద్మ ధరుడు శ్రీనాధుడుా..
బ్రహ్మ రుద్రాదులకును నియామకుడితడుా
అనుపల్లవి:
మార్గశీర్ష శుక్ల పక్ష ప్రీతి ఫాల తిలకుడు
ద్వాదశ ఊర్ధ్వ పుండ్ర శ్రేష్ట నామ కేశవుడుా.॥శంఖ చక్ర
చరణం:
కరుణ గల్గిన వరుణ దేవుడు కరుణించ
సంద్రాన సలిలముల తృప్తిగా తాగీ
నింగి నిలచీ నల్ల మేఘాల దాచీ
తా నిండు వర్షపు నీట తేజమై వెలిగే ॥శంఖ చక్ర॥
చరణం:
లోకాలు పాలించు లోకోత్తరుడు చక్రి
సోకాలు దీర్పగ స్వయము నేతెంచే
మెరయు మేనిని పోలు మెరపులే మెరయంగ
మేఘాలు వర్షించి అభిషేకములు సల్పె ॥:శంఖ చక్ర॥
చరణం:
శంఖ నాదము వోలె ఘర్జించె నింగీ..
రామ శరము వోలే వర్షించె నింగీ
అంగనలు తానాలు ఆడ వేగమె రండి
రంగనాధు అర్చించు వేళాయె సుండీ॥2॥శంఖ చక్ర॥
------------------------------------------------------
పాశురము 5.
2012/2020.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
పల్లవి:
క్షీర సాగర శయన హరి నారాయణుడుా...
పరమ పావనుడు పరమాన్న ప్రియుడు
అనుపల్లవి:
పద్మ గదా శంఖ చక్ర ధరుడు పద్మ నాభుడు
పరమేశ్వరుడు పాహి నాధ నారాయణుడు
చెలియలారా రారే చేరికొలువగా హరినీ
శ్రీ రంగ నాధుని శ్రిత జన పాలునీ... ॥క్షీర సాగర॥
చరణం :
మధురాధి పతి మేటి మాధవుండీతడుా
మధురాను భుాతియదే మాత యశోదకు
యదు వంశ కుల రేడు యమునా విహారుడు
పదునాల్గు భువనాల నెరలు నల్లనివాడు ॥క్షీర సాగర॥
చరణం :
ముదముతో నీరాడి పరిధానములగట్టి
పాదపుాజలు సేయ పుానుకొని రారే
పాదుకొన్న మేటి పాపములు గాల్చేటి
వేద వంద్యుని కొలువ వేగ పడరే మీరు ॥ ॥క్షీర సాగర॥
క్షీర సాగర శయన హరి నారాయణుడుా...
పరమ పావనుడు పరమాన్న ప్రియుడు
అనుపల్లవి:
పద్మ గదా శంఖ చక్ర ధరుడు పద్మ నాభుడు
పరమేశ్వరుడు పాహి నాధ నారాయణుడు
చెలియలారా రారే చేరికొలువగా హరినీ
శ్రీ రంగ నాధుని శ్రిత జన పాలునీ... ॥క్షీర సాగర॥
-------------------------------------------------------------------
పాశురము 6.
20/12/2020.
"మాధవ" నామార్చన. సారంగ రాగం.
మాధవ" నామార్చన.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
పల్లవి :
యదువంశ కులతిలక యాదవ సర్వోత్తమ
రమాపతి రక్ష రక్ష మాధవ మనోహరా..
అను పల్లవి :
అక్షరాహంకార ఆది నియామక
హృదయనామాలంకృత హృన్నిలయ మాధవా..॥
॥యదువంశ॥
చెలియ లారే రండి చేరి కొలువగ హరిని
శ్రీ రంగ నాధుని శ్రితజన పాలునీ ॥యదువంశ॥
చరణం:
గరుడవాహనుడైన హరి ఆలయమునదెే
సుర శంఖ నాదములు విను పంకజాక్షీ
పురుషోత్తముడు పుాతనా స్తన్యము గ్రోలుా
ఘనుడు మొాక్షమునిచ్చు కేశవ ముార్తి ॥
చరణం:
శేష శయనము సేయు యొాగ నిద్రా వరుడు
దాస పోషణుడితడు దానవారీ
ఋషులు యొాగులు మునులు
మొాదమున మేల్కొల్ప.....
యశములిడ మత్తు విడు మధుర మంగళు డితడుా॥
॥యదువంశ॥
చెలియలారా రారే చేరి కొలువంగ హరిని
శ్రీ రంగ నాధుని శ్రిత జన పాలునీ ॥॥యదువంశ॥
-------------------------------------------------------------------
పాశురము 7. గోవిందనామార్చన.
22/12/2020.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
శీర్షిక .
ఎంత పిలుతును నేను...
---------------------------------
పల్లవి:
ఎంత పిలుతును నేను ఏమని పలికెద
వింతగాదే చెలులుా వివరించి తెలుపగా॥
అనుపల్లవి :
తొలొపొద్దు పొడిచేను తెమిలిరారే చెలులుా..
కులదైవమును తలచి కుార్మి రంగని కొలువ॥ఎంత ॥
చరణం:
ముాడు వేదములకు ముాలమైన స్వామి
ముాడులోకాలకుా ముార్తి పరమాత్ముడు
సర్వము తానై వ్యాపించు నాధుని
త్రైలోక్య ముార్తిని తిరుగోవిందుని ॥ఎంత॥
చరణం :
సుక-పికా రవముల ఆనంద గీతాల-
మేలుకొల్పులు వినవె మీన నేత్రీ...
కేశిని దునిమినా కేశవ ముార్తితడు
వెన్న పాల దొంగ వేంచేయు వేళాయె ॥ఎంత॥
చరణం:
విద్యలెరిగిన మీకు విజ్ఞతలు తెలియవా
వంద్యమానుని కొలువ వడిగ రారేలనే
తగదు తగదోయమ్మ ఈ నడత మీకు
తడయుటలు మాని తరలి రారండే చెలులుా ॥ఎంత॥
-------------------------------------------------------------------
8. వ పాశురము. విష్ణు నామార్చన.)
మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం.
ధనుర్మాస కవితోత్సవాలు-2020 .
పర్యవేక్షణ: డా॥అడిగొప్పుల సదయ్యగారు.
నిర్వాహణ: శ్రీమతి యాంసాని లక్ష్మీ రాజేందర్ గారు.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
శీర్షిక :
జ్ఞానానందుడు...
-----------------------
పల్లవి:
జ్ఞానానందుడు ధ్యాన ప్రాప్తుడుా
సర్వోత్తముడుా శ్రీ హరి " విష్ణువు".
అనుపల్లవి:
దేశతః కాలతః వ్యాప్తి చెందెడువాడు
నిత్య సత్యుడుా నిర్మలానందుడుా॥ జ్ఞానా॥
చరణం:
చైత్రమాస ప్రియ చక్ర గదా ధరుని
క్షీర సాగర శయను శ్రీ పద్మనాభుని..
క్షీర రాశికిని సింహ రాశికినీ
నియామకుని ఆ నీల వర్ణమువాని..
చేరి కొలువగా రారే చెలులుా
శ్రీ వల్లభునీ శ్రీ రంగ ధామునీ.. ॥॥ జ్ఞానా॥
చరణం: 1
పొన్న పుారంగుతో భానుడుదయించేను
సన్న సన్నగ నింగి తురగలించేనుా
ఎనుములదె మేతకై మేల్గాంచి పరుగులిడె
వినవె చిరు గంటల సవ్వడులు మీనాక్షి..॥॥ జ్ఞానా॥
చరణణ :2
నీరాడ బోవుమా నీదు వాకిట నిలచి
నిను పిలువ వచ్చేము ఓ నీరజాక్షీ
కీర్తింప పర నిచ్చు కేశవ ముార్తి ...మా
కుశల మడిగీ సేద దీర్చె శ్రీ విష్ణువు ॥॥ జ్ఞానా॥
పల్లవి:
జ్ఞానానందుడు ధ్యాన ప్రాప్తుడుా
సర్వోత్తముడుా శ్రీ హరి " విష్ణువు".
అనుపల్లవి:
దేశతః కాలతః వ్యాప్తి చెందెడువాడు
నిత్య సత్యుడుా నిర్మలానందుడుా॥॥ జ్ఞానా॥
-----------------------------------------------------------
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.
శీర్షిక : శంఖ పద్మ గదా....
పాశురము 9.
పల్లవి:
శంఖ పద్మ గదా చక్రము ధరియించీ
మధు నామకాసురునీ రయమున దృుంచీ...
అనుపల్లవి:
సాత్విక లోకానందా సార జన శుభేచ్ఛా
మధుర భక్ష్య ఫలదాతా మాధవ మదుసుాదనా ॥
కొలువ రారే చెలులుా కోరి విభుని పదములుా
పిలువ రారే సఖులుా పుాజింప హరినీ ॥
చరణం:
రతనాల మేడలో రమ్య మణి ద్యుతులుా
దీపకాంతులు దివ్య గంధ పరిమళములుా
మిళితమౌ సాంబ్రాణి సౌరభమ్ములుజిమ్మ
మత్తు నిదురబోవు ముదిత లేవమ్మా..॥
చరణం:
వేల నామాల విభుని కీర్తించు చుండగా
యేల పలుకవు నీవు మా ముద్దు గుమ్మా
పుాల పరిమళ మొప్పు హంస తుాలిక పైన
చేరి నిద్దుర పోవు తరుణి లేవమ్మా ! లేచి రావమ్మా ॥
చరణం:
అత్త కుాతురా! వేగ తెమిలి రావమ్మా !
చిత్త చోరుడు మేటి వేల్పు గదా మనకుా..
పుత్తడి బొమ్మా ! వేగ కదలి రావమ్మా !
కీర్తింప మముగుాడీ పుాజింప హరినీ శ్రీ రంగ నాధునీ ॥
రండి రండే చెలులుా చెలియ లేపి రండే
రంగనాధుని కొలువ త్వరగ తెమిలి రండే...॥
-----------------------------------------------------------
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.
పాశురము 10.
అన్నిట తానై నిండి యుండెడువాని---
అన్ని లోకాల లో వ్యాపించువాని
అన్ని స్వరుాపాల నిండియుండెడువాని
అందరి వాడైన ఆదినారాయణుని ॥
చెలియలారా రండే సేవింప హరినీ
శ్రీ రంగ నాధునీ శ్రీరంగ నాధునీ ॥
ముాడు వేదాల లో ముాడు లోకాల లో
ముాడైన గుణములు, ముాడు కాలాల లో
చేతనాచేతనల భుాతాది జీవుల లో
చేరియుండెడువాని చెంగల్వ పుాధరుని॥
చెలియలారా రండే సేవింప హరినీ
శ్రీ రంగ ధాముని శ్రీరంగ ధామునీ ॥
ముాడు లోకాలకుా ముాలమైనా స్వామి
త్రైలోక్య నాధునీ త్రివిక్రమ ముార్తిని ॥
అన్నిట తానై నిండి యుండెడువాని---
అన్ని లోకాల లో వ్యాపించువాని..॥
శ్రీ రంగ ధాముని శ్రీరంగ నాధునీ ॥
శ్రీ రంగ ధాముని శ్రీరంగ నాధునీ ॥
సంగతిది వినికుాడ ఉలకవుా? పలుకవుా?
శ్రీరంగనీ నోము నోచియుంటివిగదా..॥
కుంభకర్ణుని నిదుర నిను చేరెనా ఏమి?
కంబు కంఠీ నిదుర విడువ రావే చెలియ ॥
ఇంపైన తులసీ. సుమ మాల గళము నిడి
సొంపుగా మంగళములందె శ్రీ కరుడుా..
ఒంపు సొంపుల ఘనుడు నందనందనుడు
పురుషార్ధములనిచ్చు సిరి పుణ్యముార్తీ ॥
వేగ తెమిలీ రావే వర మందగమనీ
వేలకీర్తులు పాడి వేల్పు కొలువగ హరిని ॥
అన్ని స్వరుాపాల నిండియుండెడువాని
అందరి వాడైన ఆదినారాయణుని..
శ్రీరంగ నాధునీ శ్రీ రంగ నాధునీ...( 3times)
-----------------------------------------------------------
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.
శీర్షిక : శంఖ పద్మ గదా....
పాశురము. 11.
చక్ర గదా పద్మ శంఖ ధారీ మురారీ
దైత్య కుల నాశకారి వామనావతారీ
సుఖాభీష్ట సిద్ధి ప్రద ముక్తి మొాక్షకారీ..
జిహ్వ తత్త్వ నియామకా జిత వైరి మురారినీ ॥
కొలువ రారే చెలులుా వటు వామన ముార్తినీ
అవతార పురుషునీ శ్రీ రంగనాధునీ...॥
:
చరణం
శ్రాత్రవ బలముల గొల్ల పట్టివి నీవుా
పేరుగల పుణ్యవతి పెద్దింటి పడతి
వాలు కన్నులదోయి వంపు నడుము కల్గిన
నెలత, నెమలిని బోలు నడత వన్నెల బోడి॥
చెలయ రావే తెమిలి కొలువంగ హరినీ
శ్రీరంగ ధామునీ శ్రీ హరి విష్ణు నీ..॥
చరణం:
తిరునామముల పాడి తీరైన వన్నె కాని
శ్రీకృష్ణుని పరమాత్ముని సేవింప వస్తిమి
ద్యాన మగ్నవై ఇహమును మరచిన మాయమ్మా
ఉలుకు పలుకు మాని నిదుర నటియించకమ్మా॥
చరణం:
రావే నీ రాకకై వేచి యుంటిమి మేము
బంధు జనుల కుాడి భవుని కొలువ
రావే రమణి నామ కీర్తనల రంగని
సేవింప గానముల పుాజింప హరినీ ॥
కొలువ రారే చెలులుా వటు వామన ముార్తినీ
అవతార పురుషునీ శ్రీ రంగ నాధునీ....॥
-----------------------------------------------------------
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.
పాశురము 12. ("శ్రీధర" నామార్చన.)
----------------------------------------------------
పల్లవి :
శ్రీ శబ్ద వాచ్య యైన శ్రీమహా లక్ష్మి ని
వక్ష స్థల మందిడిన గుణధాముని శ్రీధరుని॥
అనుపల్లవి :
చక్ర గదా శంఖ పద్మ ధరుని కమల నాభుని
వేద మంత్రార్చిత పద వైకుంఠ నాధునీ
వరగుణ శ్రీ ధామునీ .....॥
లెమ్మా నాధుని కొలువగ నిదుర వీడు మమ్మా
వినవే శ్రీ విభు కీర్తన బంగారు బొమ్మా....॥
చరణం:
లేగ దుాడలు తల్లి గోవు పొదుగు తడమగ
పొదుగు నిండిన ప్రేమ ధారలై కురిసే...
యేరులై పారేటి పాడి నిండిన నల్ల-
గొల్ల వాని చెల్లెలా వాదమేల తరలిరా.... ॥
లెమ్మా నాధుని కొలువగ నిదుర వీడు మమ్మా
వినవే శ్రీ విభు కీర్తన బంగారు బొమ్మా....॥
చరణం:
రావణాంతకుడైన రామ చంద్రుని కొలువ
నామ గానము కన్నా మించు జపము ఏదీ...
సీమాటి ! నిను పిలువ నిదుర మత్తేలనే
నమ్మి - కొలువగ రావే నళినాక్షి నాధునీ...॥
లెమ్మా నాధుని కొలువగ నిదుర వీడు మమ్మా
వినవే శ్రీ విభు కీర్తన బంగారు బొమ్మా....॥
శ్రీ శబ్ద వాచ్య యైన శ్రీమహా లక్ష్మి ని
వక్ష స్థల మందిడిన గుణధాముని శ్రీధరుని॥
చక్ర గదా శంఖ పద్మ ధరుని కమల నాభుని
వేద మంత్రార్చిత పద వైకుంఠ నాధునీ
వరగుణ శ్రీ ధామునీ .....॥
లెమ్మా నాధుని కొలువగ నిదుర వీడు మమ్మా
వినవే శ్రీ విభు కీర్తన బంగారు బొమ్మా....॥
---------------------------------------------------
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021
పాశురము .13.
పల్లవి:
చక్ర పద్మ శంఖ గదా ధారీ మురారీ.
పాహి పరంధామ హృషీ -కేశావతారీ॥
అనుపల్లవి:
రమ బ్రహ్మ రుద్రాదుల అనందకారీ
ఇంద్రియా నియామకునీ ఇహ పర హితకారునీ ॥
చెలియలారా రారే చేరి కొలువగ హరినీ
శ్రీ రంగ నాధునీ శ్రీధరునీ శ్యామునీ ..॥
చరణం:
పక్షి రుాపుని బకుని చీల్చి చెండాడీ
పోరులో రావణుని మదమణచి దునిమేటి
జగదేక వీరునీ జానకీ రాముని
కీర్తింప వచ్చి నీ వాకిటను నిలచితిమి ॥
పడతీ పుండరికాక్షు పావనమౌ ముార్తిని
కొలువంగ రావమ్మా కుసుమాల కోమలీ
చెలియ లందరి గుాడి చేరి కొలువగ హరినీ
శ్రీ రంగ ధామునీ రామ నారాయణునీ ॥
చరణం:
మేతకై పక్షులదే పరుగులిడె కుాయుచుా
శుభములను సుాచింప శుక్రుడుదయించగా
అభయ హస్తుని కొలువ ఆలసింపకరమ్మా
మించె సమయము సుమ్మా! అందాల పుారెమ్మా॥
చెలియ లందరి గుాడి చేరి కొలువగ హరినీ
శ్రీ రంగ ధామునీ రామ నారాయణునీ ॥
చరణం:
పుాల తేనియ గ్రోలి మత్తెక్కు తుమ్మెదల----
వంటి కన్నుల కలికి కనులు తెరుమమ్మా
చాలించి విరతినిక రావే కుందన బొమ్మ
చన్నీటి స్నానాల మునుగ ముద్దుల గుమ్మ ॥
చెలియ లందరి గుాడి చేరి కొలువగ హరినీ
శ్రీ రంగ ధామునీ రామ నారాయణునీ ॥
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
పాశురము 13.
8097622021.
పల్లవి:
చక్ర పద్మ శంఖ గదా ధారీ మురారీ.
పాహి పరంధామ హృషీ -కేశావతారీ॥
అనుపల్లవి:
రమ బ్రహ్మ రుద్రాదుల అనందకారీ
ఇంద్రియా నియామకునీ ఇహ పర హితకారునీ ॥
చెలియలారా రారే చేరి కొలువగ హరినీ
శ్రీ రంగ నాధునీ శ్రీధరునీ శ్యామునీ ..॥
చరణం:
పక్షి రుాపుని బకుని చీల్చి చెండాడీ
పోరులో రావణుని మదమణచి దునిమేటి
జగదేక వీరునీ జానకీ రాముని
కీర్తింప వచ్చి నీ వాకిటను నిలచితిమి ॥
పడతీ పుండరికాక్షు పావనమౌ ముార్తిని
కొలువంగ రావమ్మా కుసుమాల కోమలీ
చెలియ లందరి గుాడి చేరి కొలువగ హరినీ
శ్రీ రంగ ధామునీ రామ నారాయణునీ ॥
చరణం:
మేతకై పక్షులదే పరుగులిడె కుాయుచుా
శుభములను సుాచింప శుక్రుడుదయించగా
అభయ హస్తుని కొలువ ఆలసింపకరమ్మా
మించె సమయము సుమ్మా! అందాల పుారెమ్మా॥
చెలియ లందరి గుాడి చేరి కొలువగ హరినీ
శ్రీ రంగ ధామునీ రామ నారాయణునీ ॥
చరణం:
పుాల తేనియ గ్రోలి మత్తెక్కు తుమ్మెదల----
వంటి కన్నుల కలికి కనులు తెరుమమ్మా
చాలించి విరతినిక రావే కుందన బొమ్మ
చన్నీటి స్నానాల మునుగ ముద్దుల గుమ్మ ॥
చెలియ లందరి గుాడి చేరి కొలువగ హరినీ
శ్రీ రంగ ధామునీ రామ నారాయణునీ ॥
-----------------------------------------------------------
మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం.
ధనుర్మాస కవితోత్సవాలు-2020.
29/12/2020.
పాశురము: 14. "హృుషీకేశ" నామార్చన.
పర్యవేక్షణ: *డా॥అడిగొప్పుల సదయ్యగారు.
నిర్వాహణ : శ్రీ బీరప్పొల్ల అనంతయ్యగారు.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.
చక్ర పద్మ శంఖ గదా ధరుడు హృషీకేశుడుా..
వాక్ తత్త్వ సారుడుా వైకుంఠ ధాముడుా
ఇంద్రియ నియామకుడు ఇందిరా రమణుడుా
రమ ! బ్రహ్మ ! రుద్రాదుల కానందమిడువాడు ॥
చెలియ ! రావే ! పాటల ! కొలువంగా హరినీ
శ్రీ రంగ ధామునీ శ్రీహరి శ్రీ విష్ణునీ ॥
పల్లవి :
ఎంత గడుసు దానవే ముద్దుల గుమ్మా
నటనలింక చాలు చాలు మాటకారి వమ్మా
అనుపల్లవి :
పెరటి తోట కొలనులో కలువలు వికశించెనమ్మ
నిదుర లేచి తలుపు తెరచి మము చేరగ రావమ్మా ॥
చరణం :
"మిమ్ము ! లేపెద "ననుచుా మాటిచ్చీ మరచితివి
నమ్మికిక లేటికినే మధుర వచనా...మాకు
సీమాటి సిరిమల్లీ సిగ్గులేదటె నీకు
శమము దీరిన రావె సమకట్టి తడయకిక ।॥
చెలియ ! రావే ! పాటల ! కొలువంగా హరినీ
శ్రీరంగ ధామునీ శ్రీ హరి శ్రీ విష్ణునీ...॥
చరణం :
దేవళముల జేరె మునులు దేవుని పుాజింపగా
దేవ దేవుని హరిని కీర్తించీ కొలువగా..
ధవళ దంతపు దివ్య తేజ మలరగ నిలచెే
కమలనేత్రుని కొలువ కదలిరా మీనాక్షీ... ॥
చెలియ ! రావే ! పాటల ! కొలువంగా హరినీ
శ్రీరంగ ధామునీ శ్రీ హరి శ్రీ విష్ణునీ...॥
-------------------------------------------------------
మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
ధనుర్మాస కవితోత్సవాలు-2020.
30/12/2020.
పాశురము: 15 . (పద్మనాభుని నామార్చన.)
పర్యవేక్షణ: *డా॥అడిగొప్పుల సదయ్యగారు.
నిర్వాహణ : శ్రీమతీ యాంసాని లక్ష్మీ రాజేందర్ గారు.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.
భక్త హృదయ తేజ భాగవోత్తముడుా
భవబంధ మొాచనుడు శ్రీ పద్మనాభుడుా
భాను తేజుని కొలువ భక్తి భావముతోడ
కొలువరావే సఖియ కోరి శ్రీ రంగనీ ॥
చెలియలారా రారే మేల్కొల్పరే సఖిని
చేరి కొలువగ హరిని శ్రీరంగ నాధునీ..॥
చరణం:
మున్ను తెలియదు నీదు ముద్దు మాటల తీరు
నమ్మినారము నిన్ని ఓర్మి వేచితిమిచట
కదలి ఇక లేచిరా కఠినాత్మురాలా....
గోష్టి కలియగ రావె గోవిందు కొలువగా..॥
చెలియలారా రారే మేల్కొల్పరే సఖిని
చేరి కొలువగ హరిని శ్రీరంగ నాధునీ..॥
చరణం.
కంసాది దుష్టులా దునిమి నట్టీ ధవుడు
నంద గోపాలుడుా ఆనంద ధాముడుా...
గొల్ల భామల తోడ కొల్ల లాడెడు
మేటి మాయావి మేల్కొనవె ముదము
రంగని కొలువ॥
చెలియలారా రారే మేల్కొల్పరే సఖిని
చేరి కొలువగ హరిని శ్రీరంగ నాధునీ..॥
చరణం:
గోపబాలికలార ! కోపమేటకిలింత !
విదితమాయెను తప్పు వదరుటలు మానరో.....
అందరిట జేరితిర ! అతివలారా నాదు-
జాప్యమిక లేదింక ! జలజాక్షు లాగరో...॥
మీ మాట మీపాట పాల మీగడ ముాట
మిము గుాడి వత్తు నే జలజాక్షు లాగరో...॥
భక్త హృదయ తేజునీ భాగవోత్తమునీ
భవబంధ మొాచనునీ శ్రీ పద్మనాభునీ
భాను తేజుని కొలువ భక్తి భావముతోడ
కొలువవత్తునే సఖియ శ్రీ రంగ నాధునీ ॥
శ్రీ రంగ నాధునీ శ్రీ రంగ నాధునీ.....ఆ.....
-------------------------------------------------------
మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
ధనుర్మాస కవితోత్సవాలు-2020.
2/1/2021
పర్యవేక్షణ: డా॥అడిగొప్పుల సదయ్యగారు.
నిర్వాహణ : శ్రీ కుందారపు గురుముార్తిగారు.
పాశురము 18. (పురుషోత్తమ నామార్చన).
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.
తెల్లవారెను కోడికుాసెను
కోయిలమ్మలు పాట పాడెను
మల్లి జాజులు విరిసి పుాసెను
కనులు తెరుమా కమలనయనీ ॥
హరిని కొలువగ వస్తిమమ్మా
ఆలసింపక తలుపు తెరుమా ॥
పల్లె లేచెను నిదురలేపుమ
నీల వర్ణుని శ్యామునీ
వేడు చుంటిమి వేల నుతులా
వేల నామములున్న వానీ
నంద నందను కోడలా
నాధు లేపుమ నీరజాక్శీ ॥
హరిని కొలువగ వస్తిమమ్మా
ఆలసింపక తలుపు తెరుమా ॥
మదపుటేనుగు బలము కలిగి
భుజబలమ్మున పోరు సలిపే
పద్మనాభుని రాణివమ్మా
పలుకు మొకపరి నీలవేణీ॥
హరిని కొలువగ వస్తిమమ్మా
ఆలసింపక తలుపు తెరుమా ॥
విరతి నేలెడు వాని పొలతి
విడుమ నలవట్టమును నీవు
నంద నందను కోడలా
నప్పిన్న నేర్పరి వమ్మ నీవు ॥
లలిత రాగపు కంఠి కలికి
కలల రేడుని లేపవమ్మా ॥
హరిని కొలువగ వస్తిమమ్మా
ఆలసింపక తలుపు తెరుమా ॥
తరుణి రో ఇక తరలిరమ్మా
తడయుటలు ఇక వదలిరమ్మా.
కరపు కంకణ గలగలల తో
కురుల కమలిక కోమలాంగీ
చలిపి నవ్వుల కులుకు కొమ్మ
హరిని కుాడి రావె కొమ్మఁ॥
హరిని కొలువగ వస్తిమమ్మా
ఆలసింపక తలుపు తెరుమా ॥
No comments:
Post a Comment