Sunday, December 27, 2020

పాశురము 12." శ్రీదర" నామార్చన .

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.

పాశురము 12.   ("శ్రీధర" నామార్చన.)
----------------------------------------------------
పల్లవి :
శ్రీ శబ్ద వాచ్య యైన శ్రీమహా లక్ష్మి ని
వక్ష స్థల  మందిడిన  గుణధాముని శ్రీధరుని॥

అనుపల్లవి :
చక్ర గదా శంఖ పద్మ ధరుని   కమల నాభుని
వేద మంత్రార్చిత పద  వైకుంఠ నాధునీ
వరగుణ శ్రీ ధామునీ .....॥

లెమ్మా నాధుని కొలువగ నిదుర వీడు మమ్మా
వినవే శ్రీ విభు కీర్తన బంగారు బొమ్మా....॥

చరణం:
లేగ దుాడలు తల్లి గోవు పొదుగు  తడమగ
పొదుగు నిండిన ప్రేమ ధారలై కురిసే...
యేరులై పారేటి  పాడి నిండిన నల్ల-
గొల్ల వాని చెల్లెలా వాదమేల తరలిరా.... ॥

లెమ్మా నాధుని కొలువగ నిదుర వీడు మమ్మా
వినవే శ్రీ విభు కీర్తన బంగారు బొమ్మా....॥

చరణం:
రావణాంతకుడైన రామ చంద్రుని కొలువ
నామ గానము కన్నా మించు జపము ఏదీ...
సీమాటి ! నిను పిలువ  నిదుర మత్తేలనే
నమ్మి - కొలువగ రావే నళినాక్షి నాధునీ...॥

లెమ్మా నాధుని కొలువగ నిదుర వీడు మమ్మా
వినవే శ్రీ విభు కీర్తన బంగారు బొమ్మా....॥

శ్రీ శబ్ద వాచ్య యైన శ్రీమహా లక్ష్మి ని
వక్ష స్థల  మందిడిన  గుణధాముని శ్రీధరుని॥

చక్ర గదా శంఖ పద్మ ధరుని   కమల నాభుని
వేద మంత్రార్చిత పద  వైకుంఠ నాధునీ
వరగుణ శ్రీ ధామునీ .....॥

లెమ్మా నాధుని కొలువగ నిదుర వీడు మమ్మా
వినవే శ్రీ విభు కీర్తన బంగారు బొమ్మా....॥

No comments:

Post a Comment