Monday, December 14, 2020

మహతీ సాహితీ కవి సంగమం కరీంనగర్ ఆధ్వర్యంలో
(ప్రతిరోజు కవితా పండుగే )
పర్యవేక్షణ :డాక్టర్ అడిగొప్పుల సదయ్య గారు
నిర్వహణ :దాసరి చంద్రమౌళి గారు
తేది :14/12/2020(సోమవారం )
అంశం: రైతే రాజు.
శీర్షిక ..
నిస్వార్ధ చరిత.
--------------------
రచన , శ్రీమతి , 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ -మహారాష్ట్ర .
8097622021.

నేల తల్లిని నమ్ముకున్న  
భరతమాత అన్నుల మిన్న
అందరికీ అన్నం పెట్టెే 
మన దేశపు రైతన్న.
కష్టం తో సాగు చేసి తీర్చుకుంటున్న 
నేల తల్లి ఋణం.
తనపై తనకున్న  అపారమైన 
తొణకని ఆత్మ విశ్వాసం .॥
రేయింపవళ్ళ కృషితో 
మళ్ళలో నారు నాటిన భారం.
నీరు పోసి ఏపుగా పెంచిన 
పచ్చదనపు సారం.
చేతికందిన పసిడి 
ఫలపు ఆనంద ప్రభ..
నవ్వులతో నిండిన 
హృదయానంద శోభ. ॥
కర్కశ దోపిడీలకు 
గురైన కబ్జాల నిర్బంధం.
తాను నమ్ముకున్న భుామిని 
విడలేని ఆత్మ బంధం.
చేసిన అప్పులకు 
అర్ధాకలి బ్రతుకుల బాధ.
దేశ ప్రగతిలో సమిధై 
కాలుతున్న రైతన్న గాధ ॥
అవినీతి రాజ్యాంగ 
అబద్ధపు బాసల కన్నా
రైతే రాజన్న మాటకు 
న్యాయం చేస్తున్న 
రైతన్నే మిన్న ॥

No comments:

Post a Comment