19/12/2020.
సుందరాకాండ..పాటవెలదుల లో...
సృష్టి కర్త: శ్రీ వడ్డేపల్లి కృష్ణ గారు.
రచన :శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
ప్రథమ వందనములు:
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
---------------------------------------------
.1.
తల్లి తండ్రి గురుల దలచి మదిని
కోరి ఆశి సులను లను కొలువ ప్రీతి
పావనులగు వారి పాద ములకు
వందనముల జేతు వరలు భక్తి ॥
2.
రమణి సీత గుాడు రాము గొల్చి
జక్క రేయి పవలు జపము జేసి
గుండె లోన జుాపు గుణుడు ఘనుడు
రామ దాసు డతడె రక్ష నాకు ॥
3.
వాయు పుత్రుడతడు వాక్చతురుడు
వేద సారమెరుగు వేద విదుడు.
వానరముల మేటి జ్ఞాన ధనుడు.
అంజనీ సుతునకు అంజలిడుదు ॥
4.
రామ చరిత భువిని రమ్యమదియె
శుభము లేలు చరిత సుందరమ్ము
సుప్రసిద్ధి గాంచె సుంద్ర కాండ
మాన్య మగుట నెంచి మానసమున ॥
5.
సాయి పదములంటి సాదరమున
సమ్మతీయ మంటి సాధు గురుని
విఘ్న నాశకుండు విజయ మొసగ
వేడుచుంటి నతని వేల్పు గాదె ॥
6.
పాట వెలదు లందు పద్య ములుగ
రామ భక్తు ఘనత రాయ నెంచి
ఆది కావ్య మౌచు నలర జగతి
ఆదరణను పొంద అనువదింతు ॥
7.
పాట వెలదు లనెడు ప్రక్రియిదియె
సృష్టి కర్త అతడు తృప్తి పరుడు
వడ్డెపల్లి కృష్ణ వంద్యు డతడు
అతని కిడుదు నమములాది గాను॥
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment