*తిరుప్పావై 4వ పాశురము*
🕉🌞🌏🌙🌟
🔥🕉🌞🌏🌙🌟
*భగవంతుని నాలుగో స్థానం - అంతర్యామి*
*ఆండాళ్ తిరువడిగలే శరణం*
*4.పాశురము*
*ॐॐॐॐॐॐॐ*
*ఆళి మళైక్కణ్ణా! ఒన్ఱు నీ కై కరవేల్*
*ఆళి ఉళ్ పుక్కు ముగందు కొడార్ త్తేఱి*
*ఊళి ముదల్వన్ ఊరువం పోళ్ మెయ్ కఱుత్తు*
*పాళియన్ తోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్*
*ఆళిపొల్ మిన్ని వలమ్బురిపోల్ నిన్ఱదిరుందు*
*తాళాదే శారుంగం ఉదెత శరమళైపోల్*
*వాళ ఉలగినిల్ పెయ్దిడాయ్ నాంగళుమ్*
*మార్గళి నీరాడ మగిళుందేలోర్ ఎమ్బావాయ్*
గోపికలు తమ వ్రతముచే లోకమంతయు పాడిపంటలతో సమృద్దిగా వుండాలని కోరుకున్నారు. తన వ్రతముకు స్నానము ప్రదానము కావున స్నానము చేయుటకు అనుగుణముగా జలమును సమృద్దిగా ఉండవలెను అని భావించినారు. ఈ వ్రతమునకు ఫలముగా అనుకుని వేరే వాటిని ఆశ్రయించక భక్తి తో భగవంతుని వినయ విదేయత కలిగివున్నారు. వానదేవుని ఈ పాసురములో ప్రార్ధిస్తున్నారు. మరి ఈ పాశురము లో ఎలా అడుగుతున్నారో తెలుసుకుందాము.
*తాత్పర్యము:-*
ఓ పర్జన్య దైవమా! వర్షమును కురిపించుటలో లోభత్వమును జూపకుము. నీవు సముద్రములోని నీటి నంతను కడుపు నిండుగ త్రాగుము, అటుపిదప నీవు పైకెగసి, సృష్టికంతకును కారణభూతుడైన ఆ శ్రీమన్నారాయణుని శరీరపు రంగు వలె నీ శరీరమునకును ఆ నలుపురంగు నద్దుకొనుము. స్వామి కుడి చేతియందున్న సుదర్శన చక్రము వలె మెరయుము. ఎడమ చేతిలోని పాంచజన్య శంఖమువలె గంభీరముగా గర్జించుము. స్వామి సారంగమను ధనుస్సు నుండి వెడలే అవిరళ శరాలుగ వర్షధారలను కురిపించుము. మేమందరము యీ వర్ష ధారలలో స్నానమాడెదము. లోకము సుఖించునట్లు వర్షించుము మా వ్రతమును నిరాటంకముగ జేసికొనుటకై యిక ఏ మాత్రమూ ఆలసింపక వెంటనే వర్షింపుము స్వామీ!
గంభీరమైన స్వభావము కలవాడైన వర్షము కురుయునట్టి ఓ మేఘదైవతమా! నీవు వర్షజలముననుగ్రహించు దాత్రుత్వములో ఏ మాత్రము సంకోచము చూపించకు. గంభీరమైన సముద్రము మద్యలోనున్న నీటినంతను బాగుగా త్రాగి గర్జించి ఆకాసమునంతను వ్యాపింపచేయును.
సమస్త జగత్తులకు కారణమైన శ్రీమన్నారాయణుని శరీరమువలె దివ్యమైన నల్లని స్వరూపమును ధరించి ఆభగవంతుని సుందర విశాల దీర్గబాహువుల జంటలో కుడిచేతి యందలి చక్రాయుధమువలె మెరయుచు ఎడమచేతి యందలి శంఖము వలె మధురగంభీరముగా ఉరిమి ఆ భగవంతుని శారంగమను ధనుస్సు నుండి వెడలివచ్చు బాణములవలె వర్షదారాలు లోకమునంతను సుఖింప జేయు నట్లును. మేము సంతోషముతో మార్ఘశీర్ష స్నానము చేయునట్లు వర్షించు. అని అండాళ్ళమ్మ ఈ పాశురములో ప్రార్దించుచున్న
*వర్షం_కోసం_మేఘనికి_విన్నపం:*
ఓ వానదేవుడా! మేము చేయబోవు ఈ వ్రతానికి నీరు చాలా అవసరం. ఆ నీటిని నీవు సమృద్ధిగా కురిపించవలసింది. మరి నీళ్ళు నీక్కెక్కడివంటావా! సముద్రానికి వెళ్ళు. వెళ్ళి సముద్రంలోని నీళ్ళను గొంతువరకూ తృప్తిగా తాగి గర్జిస్తూ నింగికెగురు. విష్ణువు యొక్క నల్లని శరీరంవలె నీవునూ నల్లని ఛాయను పొందు.
జలధిశాయి ధరించిన చక్రకాంతివలె మెరుపులతోను, శంఖధ్వనివలె ఉరుములతోను, శార్ జ్ఞ్గము నుండి వెలువడిన తీవ్రమైన శరపరంపరవలె సంతత వర్షధారలతో లోకాలన్నీ ఆనందించేటట్లు వర్షించు. గోవిందుని పొందుగోరు మేమంతా ఈ మార్గశిరమాసంలో నీట జల్లులాడి వ్రతం ఆచరిస్తాం.
*భావం:-*
గంభీర స్వభావుడా ! వర్ష నిర్వహకుడా ! ఓ పర్జన్య దేవా ! నీవు దాతృత్వములో చూపు ఔదార్యమును ఏమాత్రమును సంకోచింప చేయకుము.
గంభీరమగు సముద్రములో మధ్యకుపోయి, ఆ సముద్ర జలమునంతను నీవు పూర్తిగా త్రాగి, గర్జించి ఆకాశమున వ్యాపించి సర్వజగత్కారణ భూతుడగు శ్రీమన్నారాయణుని దివ్యవిగ్రహమువలె శ్యామల మూర్తివై ఆ పద్మనాభుని విశాలసుందర బాహుయుగళిలో దక్షిణ బాహువు నందలి చక్రమువలె మెరసి ఎడమచేతిలోని శంఖమువలె ఉరిమి శార్జ్గ్నమును ధనుస్సు నుండి విడిచిన బాణముల వర్షమా అనునట్లు లోకమంతయు సుఖించునట్లు మేము సంతోషంతో మార్గశీర్ష స్నానము చేయునట్లు వర్షింపుము.
*అవతారిక:-*
సర్వవ్యాపాకుడైన త్రివిక్రముని వ్యాపకత్వాన్ని యెరిగి ఆ పురుషోత్తముని కొలిచిన కలిగే ఫలితాలను గురించి 3వ పాశురంలో గోదాదేవి వెల్లడించింది. అట్టి పరమాత్ముని యేమరక భక్తితో పూజించే శక్తియుక్తులు కావలెనన్న ముందు శారీరక శుద్ధి, ఆపై అంతర్ శుద్ధి అవసరం కద! అందుకే బాహ్య శుద్ధి కొరకు గోదాదేవి వర్షదేవుడైన వర్జన్యుణ్ణి ప్రార్థంచి వ్రతాంగమైన స్నానానికై వర్షించమని కోరుతున్నదీ పాశురంలో.
గోపికలు తను వ్రతముచే లోకమంతటను పాడిపంట సమృద్ధిగా ఉండవలెనని కోరిరి. తన వ్రతమునకు స్నానము ప్రధానము కనుక ఆ స్నానము చేయుటకు అనుగుణమగు జలము సమృద్ధిగా ఉండవలెనని భావించిరి.
వీరు కృష్ణభగవానుడే 'ఉపాయము - ఫలము' అని నిశ్చయించుకొని ఇతరమయిన
వానిని వేనిని ఆశ్రయింపనివారు, ఇట్లు అనన్య భక్తితో పరమాత్మనాశ్రయించిన వారివద్ద భగవానునివద్ద వినయవిధేయతలతో మెలిగినట్లు దేవతలందరూ ఆజ్ఞావశవర్తులై యుందురు.
మనిషిని మనిషిగా తీర్చిదిద్దే వ్రతం ఇది. మానవ జన్మకు సాఫల్యాన్ని ప్రసాదించేది ధనుర్మాస వ్రతం. మనలో కోరిక అంటూ కల్గితే చాలు ప్రకృతిలోని శక్తులంతా సహకరిస్తాయి. దేవతలంతా సహకరిస్తారు. మొదటగా మనకు భగవంతుని తత్వాన్ని వివరించింది ఆండాళ్ తల్లి. ఈ దివ్య తత్వాన్ని నారాయణ ఆని అంటారు. ఈ తత్వాన్ని మనం ఏ రూపంలో అయినా గుర్తించవచ్చు. వేదవ్యాస భగవానుడి కుమారుడు శ్రీసుఖుడు ఇట్లా అంతటా దైవన్ని దర్షించుకొనేవాడట.
దేనిపై పెద్దగా వ్యామొహం లేనివాడవటంచే అలా వెల్లి పోతుంటే, పుత్రవ్యామోహంచే వేదవ్యాసుడు అతని వెంట పరుగెత్తేవాడట. పుత్రా అని తన పిలుపులకు ఆయన స్పందించకపోయే సరికి చెట్లు,పక్షులు ఓయ్ అని పలికేవట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే శ్రీసుఖునిలో ఉన్న తత్వమే అన్నిటిలోనూ ఉందికనకనే అలా స్పందించాయి. ప్రతి వస్తువులోను అది ఉండి నిలబెడుతుంది.దాన్ని మనం చూడగలగాలి, కాని కంటికి కనబడదు. కాబట్టి మనం ఈ తత్వాన్ని అంతర్యామిగా గుర్తించాలి.
ఆండాళ్ తల్లి మనిషిలోని మంచి తనాన్ని మేల్కొల్పటానికి ధనుర్మాస వ్రతం చేసింది, మనల్ని అట్లానే ఆచరించమంది.
అందరితో కలిసి ఆచరించాలి అని చెప్పింది. అందరితో కలిసి చేస్తేనే అనుభవ యోగ్యం అవుతుంది. అందరికి సాముహికంగా క్షేమం కల్గాలని అని మనం చేస్తున్నాం, అలాంటి వాన్ని ముముక్షువు అంటారు. మనం ఒక ముముక్షువుగా బ్రతక గలగాలి. తత్వన్ని అంతటా చూడగలగాలి. తీపికి రుపం ఎమిటి, వివిద పదార్థాలలో నే చూడగలం. అలాగే పరమాత్మ తత్వాన్ని మనం కంటితో చూడలేము కనక, మనవంటి వారికి ఇష్టమయ్యే మనవంటి రూపాన్నే ధరించి మన ఆరాధనలు అందుకోవటానికి చేరుతుంది ఆ బ్రహ్మ తత్వం. కాని అది మాత్రమే ఆయన రూపం కాదు.
సామాన్యంగా భగవంతుడు తన పరివారం అందరితో కల్సి ఉంటాడు, లోకంలో ఒక్కొక్క ఒక్కొక్క ప్రయోజనం కోసం వివిద దేవతలను ఆశ్రయిస్తారు. కాని ఒక్కరిని ఆరాధించి సకల ఫలితాలు పొందాలంటే ఏదైన సాధన ఉందా అంటే- అది నారాయణుని ఆశ్రయం తప్ప ఏది లేదు ఎందుకంటే సకలఫలప్రదోహి విష్ణు: అనేది మనకు ఋషివాక్కు. మిగతావరంతా "ఏకైక లభాయ:" కాని "సర్వ లాభాయ కేశవ" అంటారు. ఒక్క పరమాత్మను మనం ప్రసన్నం చేసుకొంటే ఇతర దేవతలంతా సహకరిస్తారు.
అందరూ భయపడే యముడు చెప్పినమాటలు ఏమిటంటే, విష్ణువు భక్తుల జోలికి తన దూతలను వెల్లవద్దని.
భగవత్ ప్రేమ కల్గి విష్ణువుకే అంకితమయ్యే వాల్లంటే యముడు కూడా భయపడుతుంటాడు. నారాయణ స్మరన చేయటంచే యమదూతలు అజామయున్ని వదిలివెళ్ళుతారు. విష్ణుదూతలు అతన్ని తీసుకుపోతారు. భారతంలో అజామయుడి సన్నివేషంలో ఇది చెప్పబడి ఉంది. అలాగే ఏదేవతను కొలిచినా,ఆయా దేవతల ద్వారా ఫలాన్ని ఇచ్చెది నేనే నయా అని భగవద్గీత ఏడవ అధ్యాయంలో చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. మనం ఒక్క శ్రీకృష్ణ పరమాత్మను ప్రసన్నం చేసుకొంటే మిగతాదేవతలు తామంతట తామే సహకరిస్తారు.
అలా వచ్చిన దేవతల్లో ముఖ్యుడైన వర్ష దేవునికి ఆండాళ్ చేసిన విన్నపం ఇలా ఉంది.
*ఆళి మళైక్కణ్ణా! -* సముద్రమ్లో నుండి నీల్లను గ్రహించి నిర్వహించేవాడా - వానదేవా-పర్జన్యా. *ఒన్ఱు నీ కై కరవేల్ -* ఏ మాత్రం నీవు చేయి దాచుకోవద్దు-ఉదారంగా ఇవ్వు, *ఆళి ఉళ్ పుక్కు -* సముద్రం అట్టడుగు లోపలి దాకా వెల్లి , *ముగందు కొడార్ త్తేఱి -* పిల్చుకో, ముందు నీవు తృప్తిగా కడుపు *నిమ్పుకోని -* చాలా ఎత్తుకు వెల్లాలి.
*ఊళి ముదల్వన్-* సృష్టి కార్యం చేయడానికి ముందు స్వామి ఎలాంటి నీలి కాంతి తరంగాలు కల్గి ఉంటాడో, *ఊరువం పోళ్ మెయ్ కఱుత్తు -* అట్లాగే నీ ఆకారాన్ని సరిదిద్దుకో, *పాళియన్ తోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్ ఆళిపొల్ మిన్ని -* బీటలువారి ఉన్న ఈ భూమికి ఒక్క సారిగా కురవకూడదు, మొదటగా మెరవవలె,తర్వాత ఉరమవలె, తరువాత కురవవలె.
ఆమెరవడం ఎట్లా అంటే సుదర్షణచక్రం మెరుస్తున్నట్లుగా ఉండాలి.
*వలమ్బురిపోల్ నిన్ఱదిరుందు -* ఎట్లా ఉరమాలి అంటే శ్రీపాంచజన్యంలా-శంఖం ద్వనిలా ఉరుమవలె. ఆద్వని ద్వారా భగవంతున్ని ద్వేషించేవాల్లు కూడా భక్తులుగా మారేట్లు గా ఉండాలి.
తాళాదే శారుంగం ఉదెత *శరమళైపోల్ వాళ ఉలగినిల్ పెయ్దిడాయ్ -* ఇక కురవడం స్వామి వేసే భాణాలవలె కురవాలి, అందరు సుఖించెందుకు వర్షించు.
ఆంగళుం *మార్గళి నీరాడ మగిళుంద్* - మార్గశీర్ష స్నానం కోసం మాకు సరిపడేంత నీరు ఉండేలా వర్షించు.
🕉️🌞🌏🌙🌟
*(ఉదయరవిచంద్రిక రాగము -ఆదితాళము)*
ప. వెనుదీయబోకుమా! వర్జన్యమా!
కనికరముంచుమ! వర్షాధిదైవతమ!!
అ. ప. పానము చేయుమ! సాగర జలముల
ఘనమౌ గర్జన చేయగరమ్మా!!
1 చ. ఆకాశమున కెగసి లోకకారణుని
పోకడి తిరుమేని నలుపు నలదుకొనుమ!!
2 చ. విశాల సుందర భుజ పద్మనాభుని
అసదృశమగు చక్రమువలె మెరసి
ఆశనిపాత శంఖముగ గర్జించి
ఆ శార్జపు శరములుగ వర్షింపుమా!!
3 చ. ఆశల, లోకము సుఖముల నొందగ
మాస మార్గళిని మాకై వర్షింపుమా
వెనుదీయబోకుమా! పర్జన్యమా!!
🕉️🌞🌏🌙🌟
*తిరుప్పావై 4వ పాశురము తెలుగు అనువాద పద్యము*
*ॐॐॐॐॐॐॐॐॐॐ*
.సీసమాలిక
హర్షము నింపెడు వర్షము కురిపింపు
మార్గళి మాసాన మరులు నింపు
వర్ష నిర్వాహకా! వరముల నందుచు
స్నానమాచరణకై చనిరి జనులు
జలనిధి చొరబడి సలిలము త్రాగెడు
కాలోప లక్షిత కారణుండు
నీలవర్ణము వాడు నీరజనాభుడు
సుందర దేహుండు శుభము లొసగు
తళుకుతో మెరియు సుదర్శన జ్వాలగా
మెరుపుల కాంతులు మేఘమందు
శంఖ రవంబులు బింఖాన చేయుము
శర వర్షము బోలు నురుము లుండె
శ్రీ సుదర్శన ధారి శ్రీదేవితో కూడి
పాంచజన్యము దాల్చె పావనుండు
తే.గీ. హృదయ గంభీర భావాలు మొదలు గాగ
దక్షిణావర్త శంఖము లక్షణముగ
సుందరమగు బాహుడు యరవింద నయన
శార్ఙ్గ నందక ధారియౌ స్వామి యితడు
నార్తితో సేవ జేసిన యాదరించు
శ్రద్ధ భక్తిని కల్గించి బుద్ధి నిమ్ము
శ్రీధరుని మానసంబున స్థిరము కమ్ము!!
🕉🌞🌎🌙🌟
No comments:
Post a Comment