రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.
శీర్షిక : శంఖ పద్మ గదా....
పాశురము 9.
పల్లవి:
శంఖ పద్మ గదా చక్రము ధరియించీ
మధు నామక అసురుని రయమున దృుంచీ...
అనుపల్లవి:
సాత్విక లోకానందా సార జన శుభేచ్ఛా
మధుర భక్ష్య ఫలదాతా మాధవ మదుసుాదనా ॥
కొలువ రారే చెలులుా కోరి విభుని పదములుా
పిలువ రారే సఖులుా పుాజింప హరినీ ॥
చరణం:
రతనాల మేడలో రమ్య మణి ద్యుతులుా
దీపకాంతులు దివ్య గంధ పరిమళములుా
మిళితమౌ సాంబ్రాణి సౌరభమ్ములుజిమ్మ
మత్తు నిదురబోవు ముదిత లేవమ్మా..॥
చరణం:
వేల నామాల విభుని కీర్తించు చుండగా
యేల పలుకవు నీవు మా ముద్దు గుమ్మా
పుాల పరిమళ మొప్పు హంస తుాలిక పైన
చేరి నిద్దుర పోవు తరుణి లేవమ్మా ! లేచి రావమ్మా ॥
చరణం:
అత్త కుాతురా! వేగ తెమిలి రావమ్మా !
చిత్త చోరుడు మేటి వేల్పు గదా మనకుా..
పుత్తడి బొమ్మా ! వేగ కదలి రావమ్మా !
కీర్తింప మముగుాడీ పుాజింప హరినీ శ్రీ రంగ నాధునీ ॥
రండి రండే చెలులుా చెలియ లేపి రండే
రంగనాధుని కొలువ త్వరగ తెమిలి రండే...॥
No comments:
Post a Comment