Wednesday, December 23, 2020

చిన్ని కృష్ణుడు

మహతీ సాహితీ కవి సంగమం
పర్యవేక్షణ: డా: అడిగొప్పుల సదయ్యగారు
తేది: 23.12.2020  బుధవారం
అంశం: ధనుర్మాస కవితోత్సవం
ప్రక్రియ: వచన కవిత
నిర్వహణ: శ్రీమతి యాంసాని లక్ష్మీ రాజేందరు గారు
రచన: చయనం శివ రామ కృష్ణ మూర్తి
ఊరు : సికింద్రాబాద్ - 500 061
చరవాణి : 9866102590

శీర్షిక: శిఖిపించమౌళి
******************
తెల్లవార వచ్చె తరుణులార
పాలు పితుకు వేళాయె పడతులార
గోధూళి వేళాయె గోపకులార
గోపూజవేళాయె బ్రాహ్మణులార

నల్లని కురులు చక్కగా చుట్టి
నల్లని కనుబొమ్మల నల్ల కాటుకపట్టి
నగు మోము మీద కస్తూరి బొట్టుపెట్టి
నును బుగ్గమీద నల్ల చాదు చుక్కపెట్టి

మోహను గాంచి మైమరిచె ఆ యశోద
మృత్తిక నారగించె ఆ మధుకరుడు
మన్ను తినెనంచు మొరపెట్టె రాముడు
మూడులోకములు చూపె ఆ మురారి

ముగ్ద రూపముననేగు దెంచె మాయవి
మురిపించి వడిచేరె వాత్సల్యుడు
ముద్దు చేసి చనుబాలిచ్చె పూతన
మహిషవాహను చెంత చేర్చె హరి

ఎంత పుణ్యము చేసె ఆ శిఖిపించము
ఎమి పుణ్యము చేసె ఆ పిల్లనగ్రోవి
ఎక్కదెక్కడ తిరిగె ఆ గోవు నీ చెంతచేరె
ఏమి చేయ నీ దయాద్ర చూపు దొరకు నాకు

చయనం శివ రామ కృష్ణ మూర్తి

No comments:

Post a Comment