Friday, December 11, 2020

మేము సైతం మినీ కధ

6/12/2020 
గోరసం వారం వారం కధానిక  పోటీ కొరకు.
శీర్షిక .
 మీతో సమానంగా మేము సైతం.
---------------------------------------------
పార్ధుా కెంతో ఆనందంగా ఉంది.
ఇంకో వారం రోజుల్లో తన పెళ్ళి .లావణ్యతో...
లావణ్య...ఎంత అందమైన పేరో అంత అందమైన రుాపం...దానికి తోడు అందమైన మనసు..
ఈ ఆనందానికి కారకులు అమ్మా నాన్న కదుా...।
తను పధ్నాలుగేళ్ళప్పుడు ఆత్మహత్యకు కుాడా ప్రయత్నంచేడు. తను కోసం  బతకడం కోసం అమ్మా నాన్న ఎంత పరితపించేరనీ...
సిద్ధుా ఆలోచనలు గతంలోకి వెళ్ళేయి.

సిద్ధుా పుట్టినపుడే కుడిగాలు తొడలదాకా బాగానే ఉండి ఆతర్వాత రెండించీల నుండి చిన్న పాదం తో
పుట్టేడు.. తను పెరుగుతున్నా  కుడి కాలు మాత్రం తొడల దాకా బానే ఉంది పాదం మాత్రం సన్నటి
తోలుకు వేలాడ దీసినట్టుండి, ఏడాదిపిల్ల పాదంలా ఉండిపోయింది.
 దానికి తోడు ఎడమ కాలు సన్నగా బలహీనంగా ఉండడంతో...చంకల కింద కర్రలతో 
ఒక కాలితో నడవ లేక ...బయటకు వెళ్ళ లేక ,
ఆటా పాటలకు తోటి వారితో కలవలేక, ఇంట్లో డేకురుతుా ప్రతీ పనీ చేసుకోలేక ,పెద్దవుతుా ఉంటే
తన అవసరాలకు అమ్మ మీద ఆధారపడలేక, పధ్నాల్గేళ్ళకు ఇంటి వెనుక బావిలోకి దుాకేశాడు.

అదే సమయంలో నీళ్ళకోసం వచ్చిన పక్కింటామె
 నుాతిలో ఊపిరాడక కొట్టుకుంటున్న తనను 
 చుాసి కేకలు పెట్టడం తో బతికిపోయేడు.
 
 ఆ తర్వాత తన తండ్రి తనకు చక్రాల కుర్చీ తెచ్చి
 దానిలో కుార్చో బెట్టి బయటి ప్రపంచం లోకి తీసుకు వెళ్ళడమే గాక, స్కుాల్ లో చేర్పించి ఇంట్లో ట్యుాషన్
 పెట్టించి , కంప్యుాటర్ కొనిచ్చి అందులో తనలాంటి వారి గురించిన విషయాలు తెలుపుతుా , ఎఅత ఆత్మ స్థైర్యాన్ని , ధైర్యాన్ని నుారిపోసేవాడో...
 
 నా కన్నా హీనస్థితిలో ఉన్న వారి గుార్చి కధలు కధలుగా చెప్పేవాడు అదే పనిగా ...
 అసలు వినికిడిశక్తి లేని థామస్ అల్వా ఎడిసన్ కనుకొన్న విద్యుత్తు నేటి ఆధునిక అభివృద్ధి కారణానికి     ఎంత కీలకమయ్యిందో..
అంధుడైన లుాయిస్ బ్రైలీ , కోట్లమంది అంధులు ,వినికిడిలోపం ఉన్న  వాళ్ళ ఉన్నత చదువులకు అవసరమైన లిపిని కనుగొని తన తోటివారి భవితకు ఎలా కారకుడయ్యేడో...
గుడ్డి , ముాగ, చెముడు ఉన్నా  హెలెన్ కెల్లర్   ఆత్మ స్థైర్యంతో బ్రెయిన్ లిపి నేర్చుకొని  ఎన్ని అద్భుత గ్రంధాలురాసేడో....వివరంగా తెలియ పరచేవాడు .

ప్రతీ జీవితానికి ఒక లక్ష్యం ప్రణాళిక ఉంటాయి .వారిప్రతిభను గుర్తించి వారు ఆత్మస్థైర్యంతో చేసే పోరాటం లో వారికి స్ఫుార్తినిచ్చే విధంగా మనం సహాయపడితే వారు చేయలేని పనంటుా లేదని నిరుాపించినవారెంతమందో ఉన్నారు అంటుా తనకు స్ఫుార్తి నిచ్చేడు.
 నాన్న చెప్పిన వాటితో బాటు
ఆత్మస్థైర్యంతో పేరొందిన  తనలాంటి వారి ఎంతో మంది కధలు గుగుల్ సెర్చ్ చేసి తెలుసుకున్నాడు.
గవర్నమెంట్, ప్రైవేట్ రంగాల లో తమవంటి వారికై చేకుార్చే సదుపాయాలను తెలుసుకున్నాడు.

నాలాంటి చాలామందికి స్ఫుార్తినిచ్చే దిశలో   "మీతో పాటు మేము సైతం" అటుా అన్ని రంగాల లోనుా సమానంగా దుాసుకుపోయి ఎంతోమంది  వికలాంగులు పేరొందినపుడు తను మాత్రం ఏం తక్కువ ? తనకు అంగ లోపం గాని , బుద్ధి లోపం కాదుగా...అన్న స్థితికి వచ్చేడు. 
ఎప్పుడైతే ఆత్మ విశ్వాసం పెరిగిందో తను మరి వెనుకకు తిరిగి చుాడలేదు .
 దాంతో తను తనకిష్టమైన కంప్యూటర్ రంగంలో ఎవరుా ఊహించలేని స్థాయికి ఎదిగేడు. నలభై ఏళ్ళ జీవితం ఒంటరి బతుకు పోరాటం అన్న చిన్న నిస్పృుహ బాధిస్తున్న సమయంలో లావణ్య పరిచయం ప్రేమగా మారింది .
 
 వినికిడి శక్తి లేని లావణ్య ప్రభుత్వ సహాయ సహకార
 పద్ధతుల ఆలంబనతో చదువుకున్న అనాధ.తను పనిచేసే  కంపెనీలోనే పనిచేస్తున్న బాధ్యతగల ఉద్యోగిని. తనకన్నా రెండేళ్ళు పెద్ద. 
 
అదే విషయంలో సంశయిస్తున్న తనకు ,
వివాహ బంధం అన్నది ఇద్దరు వ్యక్తుల మానసిక 
మమతానురాగాల కలయికని , చివరిదాకా ఒకరిపై ఒకరుగా చేపట్టే గట్టి నమ్మకం తో కుాడిన బంధమని , కష్ట-సుఖాలను పంచుకోవలసిన ఒక ధర్మ బద్ధమైన  బాధ్యతని, అమ్మ ఎంత చక్కగా చెప్పిందో..

అదిగో దాని ఫలితమే తనో ఇంటివాడు కుాడా కాబోతున్నాడు. ఒకప్పుడు పిరికిగా చనిపోవాలనుకున్న తను ఈ రోజుా ఇంత మంచి స్థితికి రావడానికి కారణం తన ఆత్మస్థైర్యం. అమ్మా నాన్నల 
ప్రేమ పుారిత సహకారం.

ఇక ముందు, జీవితం తను లావణ్య కలసి తనలాంటి వారికి స్ఫుార్తినిచ్చే కొన్ని పనులు చేబట్టి అవిటి తనం అసహాయత కాదని నిరుాపిస్తాం....తమ లాంటి కొంతమందికైనా తమ చేయుాత నందించి మార్గదర్శకులమౌతాం...
అనుకుంటుా తేలికగా శ్వాస తీసుకున్నాడు పార్ధు...
అందమైన ఆలోచనలతో, ఆనందంగా తేలిపోతుా..

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .
8098622021.

No comments:

Post a Comment