Tuesday, December 15, 2020

అల్లసాని పెద్దన

మహతి సాహితి కవి సంగమం, కరీంనగర్ 
ప్రతిరోజూ కవిత పండగే 
పర్యవేక్షణ.. డా. అడిగొప్పుల సదయ్య గారు 
నిర్వహణ.. బీరప్పోళ్ళ అనంతయ్యగారు 
తేదీ.. 15/12/2020, మంగళవారం 
అంశం.. అల్లసాని పెద్దన

ప్రక్రియ : ఇష్టపది .
రచన , శ్రీమతి , 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ -మహారాష్ట్ర .
8097622021.


ఆంధ్ర కవితా పితగ అల్లసాని పెద్దన
అష్ట దిగ్గజాలలొ   అగ్రజుడు ఈతడుా ॥

ఆంధ్ర వాజ్మయమున అలరె మను చరితమది
ప్రధమ ప్రబంధమై ప్రసిద్ధి గాంచినదది ॥

గండపెండేరమ్ము ఘనమగు సన్మానము
గర్వింపగపొందిన  ఘన అమానాత్యుడుా ॥

రాచ కార్యాలకుా రాయల సహాయకుడు
పెద్దనమానాత్యుగ  పేరొందిన ఘనుడుా ॥

ఆంధ్ర కళా భోజుని ఆస్థాన దిగ్గజుడు
శఠగోప యతి గురుని శరణ శిష్యుడితడుా ॥

అద్వైత సిద్ధాంత,  హరికధా సారమును
అదె రామ స్థవమును , ఆ చాటు పద్యాలు-

చక్కనౌ  చిక్కనౌ చిరు శృంగారపు నిధి
రచియించిన ఘనుడుా  రాజ భోజప్రియుడు॥

వర్ణనా కౌశలం వరమైనదతనికిని
అల్లసాని వారిది అల్లికయే జిగి బిగి ॥

No comments:

Post a Comment