🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯
*మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం*
*ధనుర్మాస కవితోత్సవాలు-2020*
🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚
పర్యవేక్షణ: *డా॥అడిగొప్పుల సదయ్య*
నిర్వహణ: *శ్రీ ముక్కా సత్యనారాయణగారు*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
రచన: బెజ్జారపు కళ్యాణాచార్యులు
గ్రామం: కోరుట్ల
అంశం: పద్మనాభుడు
ప్రక్రియ: వచనకవనం (భక్తి గీతం)
*మోహన రాగం- ఆదితాళం*
ప: చిరుమందహాస శ్రీ వేంకటేశా
శ్రీ పద్మనాభ ధరణీ ధరేషా
జగమంత నీదే బ్రతుకంత నీవే..
చ:1
మధురాంతరంగం గోవిందనామమ్
నిలిచుండె చూడు ఆనందగీతం
ఎదలోనీ పాటయి పలికింది నాలో
పలికించె వాడు నీ పలుకు పాటయి
ఓ...దేవ దేవ మమ్మేల రారా
శ్రీ శ్రీనివాస శ్రితపారిజాత..!!శ్రీ పద్మనాభ!!
చ2
అణువణువు నీవే అలరారే దేవా
అలరించి రావా శ్రీకాంతునల్లే
కరుణాంతరంగ కలశాబ్దివాసా
కడజేర్చునావ కైమోడ్పు దేవ
కళ్యాణాచార్యుల కరుణించి బ్రోవ
శ్రీ శ్రీనివాస శ్రితపారిజాత..!!శ్రీ పద్మనాభ!!
No comments:
Post a Comment