Thursday, December 17, 2020

పాశురము 3.

18/12/2020.
పాశురము 3.
రచన: శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.

పల్లవి :
ముాడు లోకాలనుా  ముప్పాదముల గొలిచీ
బలిమి బలి శిరమును  భుామిలోపలికణచు
అనుపల్లవి :
వలమురి  తాలువు  వటు వామనుండతడె
తడయుటలు మాని యిక తరలి రారండే  ॥ముాడు॥
చరణం:
మేలుకొల్పగ హరిని మేలు గీతములతో
కేలు మొాడ్చీ నిలువరె కలువ కన్నుల చెలులుా
రంగనాధుని కొలిచి రాగాల సేవలా
రమణీయమైనట్టి రతనాల వాకిటా .... ॥ముాడు॥
చరణం:
పడతులారా బంతి జలకమ్ము లాడగా
ఈతి బాధలు తొలగి లోకాలు వెలుగుా
నెల ముాడు తడవులా  వర్షాలు కురియుా..
పసిడి పంటలు విరియు పాడి వర్ధిల్లు ॥ముాడు॥
చరణం:
పాడియావులు పాల ధారల్లు విడువంగ
కుాడి వానల నదులు పింగి పొరలేను
ఆడె మీనములెన్నో కాసారములు నిండ
విరియు కలువల చేర తుమ్మెదలు జతగుాడె ॥ముాడు॥
చరణం:
పసిడి పంటల సిరులెే రేపల్లె నిండగా
సశ్య శ్యామలమై రేపల్లె పండగా
పడతులారా రండు పదుమనాభుని కొలువ
పసిడి వాకిట నిలచీ పలు రీతుల వేడగా..॥ముాడు॥


No comments:

Post a Comment