Monday, December 14, 2020

మేధావి.

సమ్మాహనాలు.
20/10/2020.
రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ -మహారాష్ట్ర .
8097622021.
శీర్షిక .
మేధావి.
------------
46.
సృష్టి కర్త  బ్రహ్మగ
బ్రహ్మ సృష్టి బొమ్మగ
బొమ్మ కు ప్రాణమీయ మనిషిగా ఈశ్వరీ ॥
47
మనిషిగా భువినెంచి
భువిలోని  కేతెంచి
ఏతెంచి సుఖమెంచి పెరిగితివి  ఈశ్వరీ ॥
48
చదువుతో  జ్ఞానమె
జ్ఞానముతొ జీవితమె
జీవిత పోరాటపు మర్మమెరిగె  ఈశ్వరీ ॥
49
తెలివితో మసలుచుా
మసలుచుా  చదువుచుా
చదివి భువిభవితనుా తీర్చుచుా  ఈశ్వరీ ॥
50
భువనమున భవనములు
భవనములు క్షిపణులుా
క్షిపణులుల పలు రక్షణ, సేవలుా  ఈశ్వరీ  ॥
51
ఆకశమున ఎగిరిరి
ఎగిరి గ్రహముల చేరి
చేరి  దేశ కీర్తిని నిలిపితిరి ఈశ్వరీ ॥
52
సంగీత సాహితులు
సాహిత్య కవనములు
కవన సమ్మాహములు కావ్యాలు ఈశ్వరీ ॥
53
ఘనమౌ పురాణములు
పురాణా వేదములు
వేదములు, నాదములు సాధనలు  ఈశ్వరీ॥
54
అద్భుత  మేధావులు
మేధావులు మనుజులు
మనిషి గణుతికెక్కిన చరితలుా ఈశ్వరీ ॥
55
సృష్టి కి ప్రతి సృష్టి ని
సృష్టిగను వృత్తినీ
వృత్తుల చేపట్టిరి విజయ మని ఈశ్వరీ ॥
56
తానే ఒక శిల్పిగా
శిల్పిగా మచలెగా
మలచె జీవితాలను  మంచిగా  ఈశ్వరీ ॥
57
బ్రహ్మ  రాత మార్పుడు
మార్చిన మహనీయుడు
మహనీయుడు భువిలో మానవుడు ఈశ్వరీ ॥
-------------------------------------------------------

No comments:

Post a Comment