రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ -మహారాష్ట్ర .
8097622021.
----------------------------
శీర్షిక .
తొలి వందనం.
------------------
1. మధురిమ.
వినాయకునికి వందనం.
సద్గురువులకు వందనం.
విఘ్న వినాశకులు ఒకరు.
విశ్వ పుాజ్యులింకొకరు.॥
-----------------------------------
శీర్షిక.
శ్రీ వాణి.
----------
2.
చదువుల తల్లి వాణి
బ్రహ్మ లోకపురాణి.
వర సు వీణా పాణి
అందాల పుా బోణి.
--------------------------
3. శీర్షి
గాంధీజీ.
-------------
3.
బోసి నవ్వుల గాంధీ
ఆదర్శాలకు నాంది.
సత్యాగ్రహపు వారధి
స్వాతంత్య్ర ముకు పునాది.
------------------------------
4.మధురిమ.
శీర్షిక .
శాపం.
------------
పేదరికం ఒక శాపం.
స్వార్ధ చింతనల లోకం.
ధనా కాంక్షులు అనేకం.
పాప చింతనల కుాపం.
-------------------------
5.మధురిమ.
శీర్షిక .
దాటేస్తారు.
--------------
గొప్ప మాటలు చెప్పడం
చాలా మంది చేస్తారు.
చేతల దాకావస్తే
తప్పుకొని దాటేస్తారు..॥
--------------------------------
6.మధురిమ.
శీర్షిక .
ఉత్తమం.
-----------
ఉత్తమం మౌనం.
మిత భాషణం అందం.
మాటలో మార్దవం.
మనిషికి మంచి గుణం.
-----------------------------
7. మధురిమ.
శీర్షిక .
మధురం.
-------------
ప్రక్రియలు వివిధములు
తేనెలా తీయనివి.
పలుక చిలుక పలుకులు
మధురిమలే హాయవి.॥
---------------------------------
8.మధురిమ
శీర్షిక.
కావాలి.
------------
దుఃఖం లోని కావాలి
ఊరడించేటి మాటలు
కష్టం లోని కావాలి
కన్నీరు తుడిచు చేతులు.
----------------------------------
9.మధురిమ.
శీర్షిక.
కావాలి.
------------
దుఃఖం లోని కావాలి
ఊరడించేటి మాటలు
కష్టము నందు కావాలి
కన్నీరు తుడిచు చేతులు.॥
------------------------------------
10. మధురిమ
శీర్షిక.
దాటేస్తారు.
--------------
గొప్ప మాటలు చెప్పడం
చాలా మంది చేస్తారు.
చేతల దాకావస్తే
తప్పుకొని దాటేస్తారు..॥
--------------------------------
11..మధురిమ.
శీర్షిక.
కావాలి.
------------
దుఃఖం లోని కావాలి
ఊరడించేటి మాటలు
కష్టము నందు కావాలి
కన్నీరు తుడిచు చేతులు.॥
------------------------------------
24/9/2020.
12. మధురిమ.
శీర్షిక .
దైముళ్ళు.
--------------------
కులాలుా, మతాలు -
మారణ హోమాలు.
స్త్రీ పురుషులన్నవి
ఇల దేవుని వరాలు॥
-------------------------
13 మధురిమ.
శీర్షిక.
మార్పు.
25/9/2020.
--------------------
రోజులు మార్పులలో
రాజులు మారతారు
నిజమౌ పాలనలో
ప్రజలు సుఖపడతారు॥
--------------------------------
14. మధురిమ.
26/9/2020.
శీర్షక
హాయి.
----------
మంచు కురిసే వేళలలో
చల్లని గాలి హాయైనది.
నిండు పున్నమి వేళలలో
నిండిన భావం తీయనిది.
-----------------------------------------
27/9/2020.
15.మధురిమ.
శీర్షిక .
అందం.
---------
బంధమది మధురమైనది.
తెంచుకొనీ వీడిపోకు.
కష్టం వచ్చి పోయేది.
భయం తో పారిపోకు..॥
--------------------------------
28./9/2020.
శీర్షిక .
భయం.
--------
16.
పిరికి వాడికి భయమెక్కువ.
వాడబద్ధాలు చెప్పగలడు.
దుష్టులకు అవినీతి మక్కువ.
పాపాలు బాగా చేయగలడు.
------------------------------------
29/9/2020.
శీర్షిక .
ప్రధానం
-------------
17.
నమ్మకం ప్రధానమంటారు.కా
నీ అందర్నీ నమ్మొద్దు.
నీతి- నిజాయితీ అంటారు.
ఎవరినీ మొాసం చేయొద్దు.
-----------------------------------
30/9/2020.
గౌరవం
--------------
18.
తల్లిదండ్రులను ప్రేమించు.
వారు నీ జన్మ రక్షకులు.
గురువులను గౌరవించు.
వారు నీ మార్గ దర్శకులు.
---------------------------------
1/10/2020.
శీర్షిక .
బోధ..
------*
19.
పిల్లలని తీర్చి దిద్దాలి.
చుాపాలందుకు మంచి దారులు
మంచి మాటలు బోధించాలి.
వారు భావిభారత పౌరులు.
---------------------------------
46. తేనియ.
3/10/2020.
శీర్షిక .
-------
20
కత్తిలాంటివంటారు కవితలు
కవులు మాత్రమే చదువుతారు.
పట్టించుకోరు కొందరు చదివి
ఎరగనట్టుగా తిరుగుతారు.
-----------------------------------------
15.మధురిమ.
శీర్షిక .
గాంధీ
------------
గాంధీ పుట్టిన రోజు
జండా ఎగుర వేస్తాం
తలుస్తాము ఈ రోజు
హింస మాత్రం చేస్తాం.
-----------------------------
2/10/2020
మధురిమ.
3/10/2020.
4/10/2020.
19మధురిమ.
శీర్షిక .
నిజం.
----------------
బంధం బరువైన నిజం.
మానవతే నశిస్తోంది.
విచక్షణ లేని సమాజం.
స్త్రీలకు శాపమౌతోంది.
5/10/2020
20.మధురిమ.
శీర్షిక .
కరోనా.
---------
కరోనా కలకలం....
రోగాలమయం తో
మాస్క్ నిరంతరం.
వేయాలి భయంతో
--------------------------
6/10/2020
21.మధురిమ.
శీర్షిక .
అనురాగం.
--------------------
భార్యా భర్తల మధ్య
అనురాగం పండాలి
అంటే ఇరువురి మధ్య
అవగాహన ఉండాలి.
----------------------------
7/10/2020
22.మధురిమ.
శీర్షిక .
గౌరవం.
----------
మన తెలుగు వైభవం.
మరచిపోకెన్నడుా
మన భాష గౌరవం
తరగనీకెన్నడుా॥
--------------------------
8/10/2020.
23.మధురిమ.
శీర్షిక .
ఫలం.
---------
సస్యశ్యామల దేశం.
పర్యావరణ రక్ష తో
పాడి పంటల సారం.
రైతుల శ్రమ ఫలం తో
9/10/2020
------------------
24.మధురిమ
-------------------
శీర్షిక .
మంచి మాట.
-------------------
మంచిమాట మనిషికి
సంతోష మిస్త్తుంది
చెడ్డమాట మనసును
గాయమే చేస్తుంది॥
-------------------------
10/10/2020
25. మధురిమ
శీర్షిక .
మర్ఛిపోకుాడదు.
----------------------
మేలు చేయువారిని
మర్చిపోవకుాడదు
చెడు చేయువారిని
ప్రోత్సహించ కుాడదు.॥
----------------------------------------------
11/10/2020.
26.మధురిమ.
శీర్షిక .
ఆచారాలు.
----------------
ఆరోగ్యాన్ని కాపాడేవి
మన పుార్వపు ఆచారాలు.
పుస్తక, పురాణ పఠనాలవి
జీవితపు మార్గదర్శకాలు .
--------------------
12/10/2020.
27. మధురిమ.
శీర్షిక .
నింద.
--------
పరనింద చేయకెపుడు
మనసుకు సుఖము ఇవ్వదది
నీపైని జాలిపడకెపుడు
నీ భవితకవరోధమది.
-----------------------------
13./10/2020.
28 .మధురిమ.
శీర్షిక .
నిరాశపడకుమ మది
గెలుపు పొందలేదని
తెలుసుకో గమ్యమది
దగ్గరనే ఉందని.
తేనియ.
మానవత్వం మరలిపోయింది
మనుషులు మారిపోయేడని
మంచితనం వీడిపోయింది
మారిన మనిషి దరి ఎందుకని.
44. మధురిమ .
-----------------
23/10/2020
.శీర్షిక .
కాంతి.
చిరు చిరు దివ్వెల కాంతి
చీకటి బాటలో వెలుగు
అక్షర జ్ఞానమన్నది
జీవిత బాటకు వెలుగు.
24/10/2020.
45. మధురిమ.
---------------------
శీర్షిక .
నీరు.
----------
స్వచ్ఛమైన నీరొస్తే
అది జీవన ఆధారం
మరి అదే విజృంభిస్తే
కాగలదు జలప్రళయం
ఇంట్లో మన తీరును
మనవారు సమర్ధిస్తారు
బయట మన తీరును
అందరు గమనిస్తారు
కోపంతో ఎవ్వరినీ కుాడా
ఎప్పుడుా జయించ లేము
పోతే ఫోనీ అని అనుకోని
వలసింది ఒదులుకోలేము
శాంతమే మనకు రక్షని
ఒకప్పటి నానుడి మనలేము
నేటి పరిస్థితులల లో
ఎమీ సాధించలేము
29/10/2020.
శీర్షిక...
శక్తి.
------
49..మధురిమ
---------------------
పద కవిత్వమంటే
మనో భావపు శక్తి
అర్ధం చేసుకుంటే
ప్రతిమాట లో సుాక్తి ॥
శీర్షిక
కళ
------
50.మధురిమ.
ఉందిగ ఒకొక్కరి లో
ఒకొక్క రకమైన కళ
అందరికి అన్నిటిలో
ఉండదుగా తెలివి తల॥
శీర్షిక
పట్టుదల.
------------
51.మధురిమ.
----------------------
పట్టుదలతో గొంగళి
సీతాకోక చిలుకగ
ప్రయత్నంతోని మనిషి
మహనీయుడౌతాడుగ॥
46. మధురిమ
శీర్షిక .
హద్దు.
--------
మర్యాదిస్తే
హద్దులు మీరడు
గౌరవమిస్తే
మాటలు జారడు.॥
( సవరించిన నిన్నటి మధురిమ)
మధురిమ 47.
శీర్షిక
హాయి.
---------
అందరి తో నిడు స్నేహం
ఆనందాన్ని పంచుతుా
కొరతలు లేని జీవితం
హాయిగా అనుభవిస్తుా.॥
------------------------------
27/10/2020
శీర్షిక
దండుతనం.
మధురిమ 48.
-----------------
మంచి వాడేమొా
మాటలు పడతాడు
దండువాడేమొా
మాట విసురుతాడు.
30/10/2020
మధురిమ 50
శీర్షిక.
సంస్కృతి .
---------------
మన దేశపు సంస్కృతి
మన నిత్య సంస్కారము .
మన ఆరోగ్య ఉన్నతి
మనదౌ సాంప్రదాయము ॥
1/10/2020.------------------
మధురిమ 51
శీర్షిక .
పోరాటం.
-----------------------
ఒంటరిగ పుడతావు
పోరాట చేస్తావు
మంచిగ మసలునీవు
కీర్తితో పోతావు.
5/11/2020.
మధురిమ.56.
శీర్షిక.
అలోచించు.
----------------
నాలుక కత్తి వంటిది
ఆలోచించి మాట్లాడు.
మనసది వెన్నవంటిది
మనసునెరిగి మాట్లాడు ॥
4/11/2020.
చిమ్నీ 55 .
శీర్షిక .
శాపం.
---------
మనసుల్లో లోపం
రగిలేంత కోపం.
మానవత్వ లోపం
మనిషికిది శాపం ॥
14/11/2020.
మధురిమ.61.
శీర్షిక .
సందడి.
-----------
ధగ ధగల కాంతులు
దీపాల వంతులు
భుాలోక వాసుల
పండగ సందడులు ॥
9/11/2020.
మధురిమ
శీర్షిక .
ఆవేదన.
------------
మానవత్వమే నశించింది.
బందాలన్నీ బుాటకాలు.
అందరిలోను కసి పెరిగింది
హద్దులు లేని ఆవేశాలు
మధురిమ
18/11/2020.
మధురిమ 64.
శీర్షిక .
కరువు
------------
నాగులకు చవితి బరువు
పాములు పాలు తాగవు
బీదలకాకలి చావు
పిల్లల పాలకు కరువు ॥
19/11/2020.
శీర్షిక .
మంచితనం.
------------------
మంచి మనసున్నవారు
మంచన్నది చేస్తారు
మంచనేది చుాస్తారు
మంచినే కోరుతారు ॥
20/11/2020
మధురిమ 66.
శీర్షిక .
రైతన్న.
--------
పండిస్తాడు ధాన్యం
ఫలితమన్నది సుాన్యం
కడుపులు నింపు అన్నం
రైతు బతుకులు దైన్యం.
21/11/2020
మధురిమ 66.
శీర్షిక .
జీవితం.
----------
చావు పుట్టుకలన్నవి
భగవంతుని చేతున్నవి.
మధ్యని జీవితాలవి
కక్షలతో నిండినవి.॥
22/11/2020.
మధురిమ 67.
శీర్షిక .
మనం పీల్చే గాలి
ఇచ్చేది చెట్టు చెలి
చెట్టు చెలి పెరగాలి
బ్రతుకులవి పండాలి ॥
23 /11/2020.
మధురిమ 68.
).
శీర్షిక .
సిగ్గు.
-------
సిగ్గున్న మనుషులకి
అన్నిటికీ భయమే
సిగ్గులేనివాడికి
ఉంది తెగువతనమే ॥
24 /11/2020.
మధురిమ 69.
శీర్షిక .
నేడు బాలల ఆటలకు
బయటకెళ్ళే పనిలేదు
మొబైల్ జీవితాలకు
సంకెళ్ళేసే పనిలేదు॥
25/11/2020 .
మధురిమ 70.
శీర్షిక .
జీవితం.
మధురానుభుాతులు .
జీవితానందము
జీవితాటుపోట్లు
బ్రతుకు పోరాటము.
26/11/2020
మధురిమ 71.
శీర్షిక .
ఎంచవి.
--------------
మనిషి పుట్టుక మంచిది
సమాజ తీరులు ఎంచవి
మాట తీపది మంచిది
హితవు బాటలు ఎంచవి.
27/11/2020
మధురిమ 71.
శీర్షిక .
గుండె కోత.
----------------
అమ్మ ఆకలి చుాస్తే..
నాన్న భవిత చుాస్తాడు.
ఉద్యోగమే వస్తే
గుండెలవే కోస్తాడు.
28/11/2020.
73. మధురిమ
శీర్షిక .
ఆనందం.
-----------
అందాల హరివిల్లు
ఆకాశం మురిసే
మేఘాల సందేశం
చెలి కన్నులు విరిసే ॥
29/11/2020.
8097622021.
మధురిమ..74.
శీర్షిక .
చిరునవ్వు
--------------
శుభోదయంలో
చిన్న చిరునవ్వు
ఇంటందరిలో
వసంతం రువ్వు ॥
30 /11/2020.
మధురుమ75.
తలపులు.
మంచి తలపులన్నవి.
మనసుకు హాయైనవి.
చెడుఆలోచనలనలవి
అనారోగ్యములుఅవి.
111 వ తేనియ.
తేనియలు
1 / 12 / 2020.
రచన శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్, మహారాష్ట్ర .
8097622021.
కష్టం తీర్చలేని అక్షరం
కన్నీటి గాధల కవిత్వమై
భావాక్షర బరువు భారం
వ్యధతో జారింది కాగితంపై ॥
112.తేనియ.
అక్షరం అసహాయత తో
అప్పుడప్పుడు అబద్ధమై
రాజకీయాల రాపిడి తో
తలవంచుతోంది సిగ్గుతో
1 / 12 / 2020
76 .మధురిమ.
---------------------
ఓటు విలువైనది
హక్కును వాడుకో
నోటుకోసం అది
అమ్మిక మానికో ॥
2/12/2020.
77.మధురిమ.
శిల.
------
అమరులైన కీర్తులు
స్వాతంత్ర్యపు యొాధులు
పుస్తక పుట చరితలు
స్థుాప శిలా ముార్తులు॥
3/12/2020.
78.మధురిమ.
శీర్షిక: విలువ.
త్యాగం చేసినవారి
జ్ఞాపక దిన మొక్కటే
వత్సరానికొకసారి
మేల్కొలుపు ఇదొక్కటే ॥
4/12/2020.
79 .మధురిమ.
కార్తీక ఫలం.
--------------------
కార్తీకపు స్నానాలు
ఇంట వేడి నీటితో
గుడిని వేద పఠనాలు
పొట్టకుాటి ఆశతో॥
5/12/2020
80 .మధురిమ.
శీర్షిక:
వెలుగు నీడ లన్నవి
ప్రకృతి నియమాలు అవి
కష్ట-సుఖాలన్నవి
జీవిత ఒడిదుడుకులవి ॥
6 /12/2020
81..మధురిమ.
శీర్షిక.
అంబేడ్కర్ .
----------------
మన బానిసత్వాన్ని
మనమెదుర్కోవాలి.
మదిని చైతన్యాన్ని
మనసు మేల్కొల్పాలి॥
7 /12/2020
82..మధురిమ.
శీర్షిక.
విద్య కంటే కుాడ
విలువైనది శీలం
విషయమున్నా కుాడ
వివేకమది మాన్యం ॥
8 /12/2020
83.మధురిమ.
రైతు కన్నీరు.
--------------
రైతుల గుండెలు
మండుతున్నాయి
రైతుల హక్కులు
రగులు తున్నాయి ॥
9/12/2020
84 .మధురిమ.
స్థితి.
------
ద్వైత స్థితది
అజ్ఞానమది.
అద్వేతమది.
జ్ఞాన గుణమది॥
ద్వైత స్థితి అన్నది
అజ్ఞాన భావనలు
అద్వైత స్థితి అది
సద్గుణాల భావనలు ॥
10/12/2020.
మధురిమ 85.
.శీర్షిక.
పుణ్యం- పాపం.
హుండీలోను డబ్బులు
వేస్తే పాపం పోదు .
గొప్పకోసం దానం
చేస్తే పుణ్యం రాదు.
11/12/2020.
మధురిమ 86.
రచన శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్, మహారాష్ట్ర .
శీర్షిక.
మంచి.
---------
మంచి తోడ గెలువు
మనసులందరివిని
ఆప్తుడవై నిలువు
మరువరెవరు వాని॥
No comments:
Post a Comment