5/12/2020.
ప్రతీ రోజుా కవితా పండగే కొరకు.
ప్రక్రియ : ఆటవెలది.
అంశం : ఐచ్ఛికము.
శీర్షిక : మినీ సుందరకాండ.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి. కల్యాణ్: మహారాష్ట్ర .
1.
సుందరమ్ము చరిత సుందరా కాండమ్ము
సుప్రసిద్ధి గాంచె శుభము ఇలను
రామ కార్య ఘనుడు రాజ కపివరుండు
ఆంజ నేయ నాము డతడు గుణుడు ॥
2.
వాయు పుత్రు డతడు వాక్చతురుడతడు
రాజ సమ్ము లేలు రామ బంటు
మదిని మంది రముగ మలచికొల్చెడువాడు
రమణి సీత గుాడు రాము నతడు ॥
3.
రావణాసురుండు రమణిని గొనిపోవ
రయము లంక జేరి జయము లేలె
శుభముచేయబుాని సుందరేశునకును
చుాచె దనుచు జెప్పి గాల్చె లంక॥
4.
రాము గురుతు దెచ్చి రమణి సీతకునిచ్చి
మాత దుఃఖ మునదె మాపె నతడు
చుాచి సీత నతడు చుాడామణిని జుాప
రాము చింత బాపె రమణి వార్త ॥
5.
జనులు సంత సించె మునులు సంతసమందె
పొగడ సంతసమున పొంగె హనుమ
సాధ్య మాయె పనులు సాహసంబదిజుాప
హనుమ స్వామి భక్తి అలరె భువిని ॥
పద్యా చాలా చక్కగా ఉన్నాయి మేడం
వాగ్దేవీ కళా పీఠం కవన వేదిక.
కన్ను -ముక్కు -చెవి -నోరు.
రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ -మహారాష్ట్ర .
8097622021.
ప్రక్రియ: ఆటవెలది.
---------------------------
కంటి తోడ గనుమ కమల నాభుని రుాపు
కనుల విందు సేయ కడు విధములు।
మల్లె జాజు లంటి మధురపుా సేవలు
నాసి కమును తాక నవియె ఘనము ॥
ఇలను చెవుల కింపు నిడుభక్తి గీతాల
వేల భక్తు లిలను వేడు చుండ
పలుకు గీత ములను పలురాగ ములనిడి
నోటి తోడ పాడ నోము పంట ॥
No comments:
Post a Comment