Sunday, December 13, 2020

ఈ నాటి భరత చరిత.

శీర్షిక : భరత చరిత.

భవితవ్యానికి బాటగా నిలిచే అలనాటి బంగారు చరితల  జ్ఞాపకా ల దినోత్సవాలు, మనవీయత నశించిన మనుషుల మనోభావాల స్వార్ధపుారిత
స్వలాభ చర్యలకు స్థుాపాలపై వెలసిన శిలారుాప చరితలు----ప్రజానీకానికి అందుబాటులో లేని 
అమృత కలశాలు   ॥.

గుండెను కరిగించే చరిత్రల జ్ఞాపకాల తో దేశ భక్తి నిండిన ఆశయం నిండిన హృదయ సవ్వడులు.॥
పిల్లల మదిలో బాలల దినోత్స ఉత్సాహపు ఉరుకుల, సందడి.॥

పెద్దల యదలో స్వాతంత్ర్య వీరుల బలిదానపు జ్ఞాపకాల అలజడి ॥

జాతీయ ఝండా గుర్తుని
తమ యుానిఫారంకు తగిలించుకొని ,జాతి పితల త్యాగ నిరతి గాధలను ఆలాపించే ఆదర్శ బాలలు
కానరాని ఈనాటి భరత చరిత హీన స్థితి ॥

మన నుదుటి రాతను మనమే 
రాసుకున్న ,విధి వైపరీత్యాల విక్రుతి
చేష్టల విద్రోహాలను తుడిచి వేయగలిగే ఒక్క దేశభక్తుడైనా మన మధ్య రా గలిగితే 
భరత మాత చరిత ధన్యమే గదా ॥

మారని ఆనాటి మహోన్నత వ్యక్తుల జీవిత పుటలు'
ఈనాటి కఠోర కర్కశ నిర్ణయాలకు చెదలుపట్టి
ముాలబడిన  విరిగిన సోపానాలు.॥

వెల వెల బోతున్న వీరి చరితలు "" కరోనా వంటి " మహమ్మారీల ఆక్రమణలకు హా హా కారాలు చేస్తున్న
ఈ నాడు రచ్చకెక్కిన రాజకీయ రాట్నాల లో నలుగుతున్న- అసందర్భపు చర్చల స్వార్ధపు వేటలు ॥

రచన.
శ్రీమతి, పుల్లాభట్ల ,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.


 ॥

No comments:

Post a Comment