వాగ్దేవీ కళాపీఠం..విజయవాడ.
అంశం : భావి భారతం: బాల ప్రబోధం.
రచన : శ్రీమతి, పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
శీర్షిక :
స్ఫూర్తి దాయకుడు.
-----------------------------
ఆనాడు దేశ స్వాతంత్ర్యం కోసం, తమ-జీవితాలని ధారపోసిన ,ధన్యజీవుల బాధా భరిత గాధా తరంగాలు, ఈ నాటికీ మన మదిని కలచివేస్తున్న జ్ఞాపకాల కన్నీటి ఝరీ తరంగాలు ॥
మనిషి " లో" మనిషిని తట్టి లేపే నిశ్శబ్ద సందేశ నినాదాల, చైతన్యపు సడులు వారి చరితలు.॥
తరాలు మారినా ,నెహ్రుా వంటి ఎందరో మహాత్ముల జ్ఞాపక దినోత్సవాలు, మనవీయత నశించిన మనుషుల మనోభావాల స్వార్ధపుారిత
స్వలాభ చర్యలకు స్థుాపాలపై వెలసిన శిలారుాప నిధులు. ॥
నేడు మనం సంవత్సరానికి ఒకసారి జరుపుకొనే
వారి జ్ఞాపకాల చరితా గానాల దేశ భక్తి
స్ఫుార్తి ...దేశోన్నతి కోసం పాటుపడాలన్న
తపనావేశం కలిగే యువతను మేలుకొల్పాలి .॥
ఈ మార్పు సమత- మమతల శాంతియుత సమాజ స్థాపనకు నాంది కావాలి .॥
.
No comments:
Post a Comment