వాగ్దేవీ కళాపీఠం.
దత్తపది. కల - తల - మర - వస
ప్రక్రియ: కంద పద్యం .
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
కలయా నిజమా ఏమని
తలచెను తామది యశోద తనయుని గాంచిన్
ఇలనదె మన్ను తినెడు ఆ
అల్లరి క్రిష్ణయ్య నోట అలభుా వనముల్ ॥
పలుమారులుగ యశోదదె
జలచర ,వనగిరుల గాంచె జగ ప్రళయములన్
అల నమరవినుతు నదే
ఇల మ్రొక్కెను దైవ సముని ఇందిర రమణున్ ॥
11/12/2020.
వాగ్దేవీ కళాపీఠం
చేప -రొయ్య -నత్త- పీత
ప్రక్రియ : ఆటవెలది.
రచన: శ్రీమతి:
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
చేప రుాప మెత్తి చెలగు సోమకు జంపి
వేద ములను దెచ్చు వేల్పు నీవు
పిల్ల వాడ వైన పీతాంబరములిడి
వెన్న పాలు దోచు వెన్న దొంగ
రొయ్యననుచు సాగి రోట తరుల గుాల్చి
శాప ములను బాపు సార ఘనుడ .
అల్ల నల్ల నున్న నత్తటాకము చేరి
కాళి యునదె నణచి కాచి నట్టి
నల్లనయ్య నీకు నమము లివియె గొను
నంద బాల క్రిష్ణ నరస్వ రుాప ॥
11/12/2020.
వాగ్దేవీ కళాపీఠం
చేప -రొయ్య -నత్త- పీత
ప్రక్రియ : ఆటవెలది.
రచన: శ్రీమతి:
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
చేప రుాప మెత్తి చెలగు సోమకు జంపి
వేద ములను దెచ్చు వేల్పు నీవు
ధరణి బ్రోవ నీవు దశరుాప ములనెత్తి
అభయ మొసగి నట్టి ఆది విష్ణు ॥
పిల్ల వాడ వైన పీతాంబరములిడి
వెన్న పాలు దోచు వెన్న దొంగ
రొయ్యననుచు సాగి రోట తరుల గుాల్చి
శాపములను బాపు సార ఘనుడ .
అల్ల నల్ల నున్న నత్తటాకము చేరి
కాళియునదె నణచి కాచి నట్టి
నల్లనయ్య నీకు నమము లివియె గొను
నంద బాల క్రిష్ణ నరస్వ రుాప ॥
వాగ్దేవి కళాపీఠం - విజయవాడ కవన వేదిక..
(08.12.2020) ఇచ్చిన పదాలు
------------------------------
కామ - భామ - మామ - రామ
ప్రక్రియ :ఆటవెలది.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
---------------------
భామ సీత బట్టి బాధించె కృుారుండు
కామ మునను చెలగు ఖలుడు లంక
మామనోహరుండు మట్టు బెట్టునటంచు
రామ శౌర్య గుణము రమణి దెల్పె ॥
కందము
కామము నిండిన అసురుడు
భామన్ చెరబట్టి దెచ్చె భంగ పడంగన్ ॥
రమణి రావణు తొపలికె
మామది దోచిన రాముడు మట్టుబె ట్టునటంచున్
హర - గణేశ - కుమార - నంది.
ప్రక్రియ :ఆటవెలది.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
-------------------------------
అమ్మ చెప్పె ననుచు ఆజ్ఞపాలించుచుా
అడ్డ గింప హరుని ఆగ్ర హించి
ఒక్క వేటు వేయ ఒరిగె బాలునితల
వచ్చి కుమరు జుాచి వగచె గౌరి.॥
పుత్రు డనియు దెలిసి పుత్ర ప్రేమయె కల్గ
గజపు శిరము బెట్టె ఘనము గాను
విజయ గణేశు డతడు విశ్వమేలిన వాడు
నంది వాహను సుతుకు నమము లివియె॥
*ఏరు - పారు - ఊరు - మారు*
----------------------------------------------------
• వాగ్దేవి కళాపీఠం - విజయవాడ కవన వేదిక*
----------------------------------------------------
2/12/2020.
వాగ్దేవి కళాపీఠం - విజయవాడ కవన వేదిక
అంశం : ఏరు - పారు - ఊరు - మారు .
రచన:శ్రీమతి:పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
మారుతున్న మనస్తత్త్వాల వికృత చేష్టలకు
ఏరులై పొంగుతున్న స్త్రీ ల కన్నీరు।
ఊరుా వాడా జాతి-మత విభేధాలతో
పారు తున్న మానవ సంబంధాల రక్తపుటేర్లు.॥
3/12/2020
వాగ్దేవి కళాపీఠం - విజయవాడ కవన వేదిక.
అంశం : అమ్మ - అయ్య - అన్న - అక్క
రచన: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
మినీ కవిత..
శీర్షిక .
ఇల వెలసిన దేముళ్ళు.
---------------------------------
అమ్మ తన రక్త మాంసాలని
పంచి ఇచ్చిన సృష్టి కర్త.
నాన్న మన భావి జీవిత
కలల సాకారాల పెట్టుబడి.
అన్న అంతరంగ ఆప్తుడైన
బాల్య స్నేహితుడు.
అక్క ,అమ్మ తరువాత అమ్మై
ఆదరించే ప్రేమ ముార్తి ॥
అమ్మ , బిడ్డ ఆకలెరిగి
కడుపు నింపేది.
నాన్న , బాధ్యతెరిగి బిడ్డల
భవిష్యత్తు తీర్చి దిద్దేవాడు.
అన్న ,తన హితునిగా
వెన్నంటి కాచేవాడు.
అక్క , బరువు బాధ్యతలను పంచుకున్న అమృతమయి అమ్మ కు మారు పేరు.
-----------------------------------*---------------------
No comments:
Post a Comment