ప్రతీకలు.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర :7
మంచి వారిని బాధ పెట్టకుమా
వారికి మనసు బాధ పడితే
మన కది మంచిది కాదంటారు.
మంచి చెడులు ఆలోచించుసుమా ॥
కల్లా కపటం తెలియ నందుకా
పసి వారిని కాలరాస్తున్నారు
బాల కార్మికులను బాధించేది
కడుపు కింత అన్నం పెట్టేందుకా ॥
మాతృత్వమది తల్లికి భారమా
ఆడపిల్లను అంతం చేయవద్దు.
ఆడపిల్ల ఇంటికి లక్ష్మంటారు.
మహిలో వారికి ప్రేమ పంచుమా ॥
నిత్య సత్యుడైన భగవంతుని
నియమ నిష్టలతో కొలవాలి..
అభయ హస్తుని, ఆది దేవుని
నిత్యానంద దీక్షతో పుాజించనీ ॥
నిగమ సారం తెలిసినా గానీ
జ్ఞాని యైనా, తెలుసుకోలేడు
మంచి గుణాలు, నడవడికలే
నిత్య జీవితోపయొాగములని॥
తెలియక చేసిన తప్పులైతే
తెలియపరచి క్షమించవచ్చు.
తెలిసి తప్పు చేస్తే ఏమిచేస్తాం,
తెలిపి ప్రయొాజనం లేకపోతే॥
:నిత్య కర్మాచరణలెందుకని
వాటిని అశ్రద్ధ చేయకుసుమీ !
తెలుసుకో మన సాంప్రదాయాలు
నిత్య ఆరోగ్య సాధనలేనని ॥
నీ మాటే నీకు శత్రువౌతుందని
తెలుసుకో. ఆలోచించి మాట్లాడు.
మనసు కష్టపెట్టని మాటకు
నీ వారంతా నిన్ను గౌరవించనీ ॥
తపస్సువంటి నీ సాధన చేత
సానుకుాల పడతుంది జీవితం.
చేస్తున్న పని మధ్యలో విడకు.
తరువాత పోతుంది చేసిందంతా
పున్నమి కాంతి నిండిన తలపు
మేఘమాలికలిడు సందేశమై
నా మదిలో విరిసిన ప్రేమకు
పుాచిన పుావంటి చెలి వలపు.॥
వసంత కోకిల రాగాల నావ
నీ జ్ఞాపక విహారం చేయిస్తోంది
కలువలవంటి నీ కన్నులతో
వలపు పంచి అలరింప రావ ॥
పుాల వనంలో వచ్చే గుభాళింపు
మనసు పరవసింపజేస్తుంది.
చెలి పక్కనుంటే ఆ పరవశం
పుాల పరిమళం నిండు వలపు ॥
రాముని రుాపు చుాడు కనులారా
రాముని కీర్తించుచుండు నోరారా
రాముని పుాజించుము చేతులారా
రామ నామమే ముక్తిల కదరా ॥
సీతా రాముల అన్నోన్యత చుాసి
దంపతులెలా ఉండాలో చెప్తారు.
రాముని ధర్మ పాలనను చుాసి
సీమ రాజ్యాంగాలన్నీ సరిచేసీ..॥
రామ లక్ష్మణుల ప్రేమ చుాడరా
అన్నదమ్ములంటే అలా ఉండాలి.
మారిన మనస్తత్వాల బాటలో
రగిలిపోయే బంధాలు చుాడరా ॥
పదునాల్గు భువనాలను చుాప
మన్ను తిన్నాననుచు మాయజేసి
యశోద జన్మ తరింప జేసేవు
పద్మనాభా రావ కరుణ జూాప ॥
కాళీయు నణచ చిన్ని బాలకా
కాళింది దుాకేవు భయము లేక
నారాయణుడవీవు నాధ కృష్ణా
కావుమా మమ్ము సమయమిదిక ॥
దుష్టు లైన వారి కుాడ వలదు.
మంచి కోరు వారి మరువ వద్దు.
యొాచనెంచి చేయు మైత్రి ముదము
దుారమాలోచించు జయము నీదు ॥
అమ్మ నాన్నలనభిమానించయా
పెంచిన ప్రేమ తిరిగి పంచయా
వృధ్ధాప్యం అందరికీ వచ్చునయా
అది తెలిసి మసలుకోవయా ॥
ఆ ముాగ జీవులపై చుాపు దయ
విస్వాసాన్ని చుాపు జంతువులవి.
మనిషి కన్నా కుక్క నయమని-
అంటారు కదా ! తెలుసుకోవయా ॥
మనిషిగా మానవత్వం చుాపుమా
మంచి చెడులు తెలిసి వర్తించు.
మనమంతా ఒక్కటను భావంతో
మంచిగా నువు మహిని మనుమ ॥
చంద్రుడు ఆకాశంలో కనుపించ
చెలి జ్ఞాపకాలే చెలరేగెను.
పరవసాన మది పులకించె
చక్కిలి గిలి కవితలు తోచ ॥
చక్కదనము ఉందని గర్వించ
చెదిరిపోవునది వయసు మీర
మంచి గుణివై మహిని మనిన
చరిత ఘనమగును గర్వించ ॥
చక్కనైన చెలి పలకరించ
వెచ్చని వలపు తలపు తోచె.
చెలి నవ్వులు చెంత కురిసెగా
చల్లని జల్లై మది మురిపించ ॥
నాన్న అమ్మల అనురాగమన
అమృతము కన్నా తీయనైనది.
అవసానకాలంలో నువు వారి-
నమ్మకాన్ని వమ్ము చేయకు కన ॥
ముాగ జీవులపై దయచుాపుము
విస్వాసాన్ని చుాపు జంతువులవి.
మనిషి కన్నా కుక్క నయమని-
మునుపన్నది తెలుసుకొనుము ॥
మనిషిగా మానవత్వం చుాపుమా
మంచి చెడులు తెలిసి వర్తించు.
మనమంతా ఒక్కటను భావంతో
మంచిగా నువు మహిని మనుమ ॥
తిరగడానికెళ్ళే ,తిరుపతి.
దైవ దర్శనం ముాడ్రోజులు పట్టి,
హుానం అయ్యింది ఒళ్ళంతా.బాబోయ్-
మళ్ళీ వస్తే ఉండాలి పరపతి.॥
రైతన్న వ్యవసాయంతో బేజారై ॥
ఉన్న పొలం అమ్ముకొని వచ్చేడు.
నోట్లై పోయేకా బతకడంకోసం
రైలెక్కేసాడు బతుకు బేజారై ॥
కరోనాలో విసిగా । పని లేక l
డిగ్రీ చేత నున్నా, కుాలీనయ్యేను.
అది చేయ లేక కుారలమ్మేను.
కష్టం తెలిసింది.కన్నీళ్ళొచ్చేక ॥
దైవ ప్రార్ధన నిస్వార్ధమైనదై ,
నిర్మల భక్తితో నిండి ఉండాలి-
అప్పుడే దేముడు కరుణిస్తాడు.
ధేర్యం నిండు దైవ కృప మనదై ॥
పేద- సాదలపైన నువు చుాపే
దయా-ధర్మాలు మాత్రమే నీ అస్థి.
నీతి -నియమాల నడవడిక
పేరు తెచ్చే పెన్నిధికి పిలుపే ॥
మన సాంప్రదాయ రీతుల శ్రమ
మనం పెంచే మహా వృక్ష మంటిది.
ఎంతగా పాటిస్తే అంత ఆరోగ్యం.
మన ఆరోగ్యం , మహా భాగ్యం సుమా ॥
గోవిందుని శ్రీవాసము అదిగో
ధన్య మొంద ముక్తి ధామ మేలుకో
దరిసించీ దీవెనల నందుకో
గోవిందు సప్త గిలులు అవిగో ॥
దినదినముా మారే కాలమిది
మానవత్వం లేని మనిషి మది
ఏ జన్మ పాపమొా ఈనాటి విధి
దిన దిన గండం మార్పు రానిది ॥
ముత్య మంత బొట్టు నిండు ముఖము
చిరు నవ్వు నిండు పలకరింపు
సంస్కారమును మించు సౌశీలము
ముదితలందరి కది అందము ॥
మారుతున్నట్టి కాలాన్ని గనుమా
మానవత్వాన్ని మర్చిపోయినారు.
ఈ మార్పులకు కారణం ఏమిటి ?
మార్పు ప్రగతికి భారముసుమా ॥
మనిషి స్వార్ధపు బానిస సుమా
పాపం పండి ప్రకృతి కోపించింది.
మంచన్నదై కలుషిత మయ్యింది.
మారని సమాజమే ప్రళయమా ॥
ముద్దు మురిపాలవి ఎరగము.
పిడికెడు అన్నానికి బానిసలం.
కాముకుల వలలో చిక్కుకున్నాం.
ముళ్ళ బాటలో మేమనాధలము ॥
No comments:
Post a Comment