Monday, December 7, 2020

గురువే దైవం

శీర్షిక .
గురువే దైవం.
-----------------
తల్లిదండ్రులు ఇంట            తొలి గురువులదె గదా
అమ్మ పదమే నోట             అక్షరాభ్యాసముగ  ॥

పలు చిన్ని పదములను    పథము నడగులు నేర్పి
పరికించు ప్రతి దాని           పేరెరుగ జేయుదురు  ॥ 

తరువు  నీడను ఇచ్చు        చెరువు నీరము నిచ్చు
గురువు జ్ఞానము నిచ్చు     గుణములె మన జీవము॥

శాంతి, సహనము తోడ       సరళ భావము విడక
సార చరితల నెల్ల             సొక్కి చదివింతురుగ॥

సత్ బోధలను జెప్పి           సద్గుణుని చేసేటి
గురు గౌరవుండిలను         గురువె గద  దైవంబు॥  

మహిని మసలుట కెల్ల         మార్గదర్శక మిడియు
సుజ్ఞాన మును పెంచు     శుభ మాన్యు డతడె గద॥
 
రాముడైనను గాని              శ్యాముడైనను గాని
అవని లోగురువులను       ఆశ్రయించిన వారె ॥

సురులైన మునులైన           గురు పాదములు బట్టి
సారమౌ జ్ఞానమును           సరి పొంద గోరెదరు ॥

సకల తీర్ధము లెల్ల              గురు పాదముల నుండు
అట్టి గురువుల పదము      ఆశ్రయించుము సతము॥

నను తీర్చి దిద్దిన            నా గురువులకు నేడు
నమ్మికను  జేతు  నే     నమము  నమ్రత తోడ   ॥
 --------------------------------------------------------------+--
  
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021.

No comments:

Post a Comment