[11/3, 22:10] వడ్డేపల్లి మల్లీశం గారు: నేటి మాట 212/28.10.20
ప్రజాస్వామ్యంలో రాజకీయ పక్షాలు- ఎన్నికల మ్యానిఫెస్టోలు ఒక పరిశీలన
†*******************************
---వడ్డేపల్లి మల్లేశము,9014206412
భారతదేశ ప్రజాస్వామ్య రాజకీయ ముఖ చిత్రం లో రాజకీయ పక్షాలు కీలక పాత్ర పోషిస్తున్నవి. ప్రతి వృత్తికి స్వభావము, లక్షణాలు, నిబంధనలు, శైలి ఉన్నట్లుగానే రాజకీయ పార్టీలకు కూడా ఎన్నికల సంఘం లో నమోదు అయినప్పటి నుండి నిబంధనలతో పాటు తమదైన విధానాలను అమలు చేయవలసి ఉంటుంది. ఏ విధానాన్ని అవలంబించిన ప్రజలు కేంద్రంగా కలిగిన ప్రజాస్వామ్య వ్యవస్థకు దేశ సార్వభౌమాధికారానికి, ప్రజల స్వేచ్ఛా స్వాతంత్రం, ఆత్మగౌరవానికి భంగం కలగని రీతిలో రాజకీయ పార్టీల విధానాలు ఉండవలసిన అవసరం ఉంది. ఈ విషయాలను అనేక మంది తత్వవేత్తలు సూచించారు. నిధుల సమీకరణ, కార్యకర్తలను చేర్చుకోవడం, కార్యకర్తలకు శిక్షణ, దేశ రాజకీయ సామాజిక స్థితిగతులపై అవగాహన ఇవన్నీ ప్రతి రాజకీయ పార్టీ నిర్వహణలో భాగం. కానీ ఎక్కడ కూడా అవినీతికి తావులేని పద్ధతిలోనే రాజకీయ పార్టీల కార్యక్రమాలు కొనసాగవలసి అటువంటి అవసరం ఉంది. కానీ నేటి కాలంలో రాజకీయ పార్టీల మనుగడ స్వార్థ ప్రయోజనాలు అక్రమ సంపాదన ,ప్రజల ప్రయోజనాలను కాదని స్వార్థ ప్రయోజనాలకు పాకులాడడం స్పష్టంగా కనిపిస్తున్న వేళ ఒకసారి వాటి మేనిఫెస్టోలో గురించి ఆలోచన చేద్దాం.
ఎన్నికలు -మ్యానిఫెస్టోలు( ఎన్నికల ప్రణాళిక):-
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
ప్రతి పార్టీకి సాధారణ నియమావళి ఉన్నప్పటికీ ఎన్నికల్లో రాగానే తాత్కాలికంగా ప్రకటించే ప్రణాళిక అంటూ ఒకటి ఉంటుంది. ఎన్నికల ప్రణాళిక అంటే ఆ పార్టీ రాజకీయ దృక్పథానికి, నైతిక విలువలకు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉండాలి. కానీ ఇటీవలి కాలంలో ప్రజలను ప్రలోభపెట్టి ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలను ప్రజల ముందు
ఉంచి ప్రజలను ప్రభువులుగా కాకుండా బానిసలుగా చూసే దృష్టి సంప్రదాయం కొనసాగుతున్నది .ఇది చాలా ఆందోళనకరం.
ఎన్నికైన ప్రభుత్వాలు తిరిగి ఎన్నికల వచ్చేంతవరకు ఏనాడు ప్రజల ముఖం చూడవు. పరిపాలనలో భాగంగా వారి అవసరాలను కష్టసుఖాలను చూసి పరిష్కరించవలసిన రాజకీయ పార్టీలు ఎన్నికలు వచ్చినప్పుడే మానిఫెస్టో ప్రకటించి ప్రలోభ పెట్టడం ఆత్మవంచన అవుతుంది.
కరోనా కొనసాగుతున్న కాలంలో ఇటీవల వచ్చిన బీహార్ రాష్ట్ర ఎన్నికలు ఒకవైపు కీలకంగా భావించవచ్చు. కారణం ఏమిటంటే కరోనా సమయంలోనే వలస కార్మికుల దుస్థితిలో స్థితిగతులు ప్రభుత్వాల ప్రజల దృష్టికి వచ్చినావంటే అందులో భారత దేశ వ్యాప్తంగా బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు ఎక్కువగా ఉండటం వలన పరోక్షంగా ఈ ఎన్నికలు దేశానికి సంబంధించిన ఎన్ని
లుగా భావించవచ్చు.
ఒక పార్టీ కంటే మరొక పార్టీ మించిన స్థాయిలో ప్రజలను ప్రలోభపెట్టే క్రమంలో ఏనాడూ పట్టించుకోని పార్టీలు తాము ఎన్నికైతే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఒకరంటే మరొక పార్టీ 19 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇవ్వడం ఆచరణ సాధ్యం కాని కల్పి
తమే కదా! మరింత అడుగు ముందుకు వేసిన బిజెపి దేశాన్ని పాలిస్తున్న పార్టీ మేము అధికారంలోకి వస్తే బీహార్ లో కరోనా టీకా ఉచితంగా ఇస్తామని చెప్పడం హాస్యాస్పదమే కాకుండా బాధ్యతారాహిత్యం కూడా.
ప్రభుత్వం చేసే కార్యక్రమం అందులో సంక్షేమ కార్యక్రమం వివక్షత లేకుండా అందరికీ కొనసాగించడం నైతికమైన పద్ధతి. దానికి భిన్నంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ పక్షాన కేవలం ఒక రాష్ట్ర ప్రజానీకానికి అని చెప్పడం తో ఆ పార్టీ డొల్లతనం తెలిసిపోతుంది. ఒకవైపు ఆ టీకా రావడానికి సమయం నిర్దేశింపబడి లేదు. ఎంత కాలం పడుతుందో తెలవదు. రాణి టీకా కోసం గుర్తించడమే కాకుండా కొందరికే పరిమితం అని చెప్పడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి అవకాశం ఉన్నది.
మేనిఫెస్టోలు. న్యాయస్థానాల వ్యాఖ్యలు:-
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^?
2011లో తమిళనాడులో జరిగిన ఎన్నికల సందర్భంలో డీఎంకే అన్నాడీఎంకే పార్టీలు బాధ్యత మరచి గెలుపుని ఆశించి విచిత్రమైన ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు చేసిన సందర్భంలో తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానంల" రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టే హామీలు ఇవ్వడం పరోక్షంగా ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శకంగా నిర్వహించాలనే స్ఫూర్తిని దెబ్బతీయడమేనని" ఘాటైన విమర్శలు చేసింది. అలాగే 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ ఇంటికి ఒక కలర్ టీవీ తో పాటు ఎన్నో ఉచితంగా ఇస్తానని ఊరించి ప్రజలను వంచించినది. తిరిగి 2014లోనూ ఆ పార్టీ వాగ్దానాలకు అంతులేకుండా పోయింది. ఒక్క బీజేపీ తెలుగుదేశం పార్టీ కాకుండా దేశంలోని అనేక పార్టీలు కూడా తమ పరిధిని దాటి నైతిక విలువలను తుంగలో తొక్కి ప్రజా ధనాన్ని ప్రజలకు అందించడంలో విఫలమై తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ వాగ్దానాలు చేస్తున్నారని ప్రజలు ఆలోచిస్తున్నారు.
ప్రజలు తమ ఆగ్రహాన్ని చూపక ముందే ఇలాంటి ప్రలోభాల ను తగ్గించుకొని నిర్మాణాత్మక పరిపాలన చేపట్టవలసిందిగా ప్రభుత్వాలకు సూచనలు చేస్తున్నారు.
కరోనా టీక- ప్రభుత్వ బాధ్యత-
వ్యాధినిరోధక కార్యక్రమం:-
********************************
పోలియో, కలరా, మశూచి లాంటి అనేక భయంకరమైన రోగాలను నిర్మూలించడంలో ప్రభుత్వ వైద్య విధానం ఎంతో బాధ్యత వహించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పోలియో వంటి భయంకరమైన వ్యాధులను అదుపులో ఉంచడంలో భారత దేశ సార్వత్రిక వ్యాధి నిరోధక కార్యక్రమం 12 రకాల వ్యాక్సిన్లను దేశం లోని పిల్లలందరికీ ఉచితంగా అందిస్తున్న విషయాన్ని ఒక్కసారి మనం గమనించాలి. ఇవే కాకుండా మరిన్ని రోగాలు రాకుండా అనే మిషతో ప్రైవేటు వైద్యులు వేల రూపాయలు తీసుకొని వ్యాక్సిన్లు వేస్తున్న విషయాన్ని కూడా ప్రభుత్వం ఈ సందర్భంగా ఒక్కసారి ఆలోచించి నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. పేదవారికి ప్రభుత్వ రంగంలో అందిస్తున్న టీకాలు సరే కానీ ప్రైవేటు రంగంలో ఇస్తున్న వేలాది రూపాయలు పెట్టి వేయించుకో లేరు కదా దానికి ప్రత్యామ్నాయాన్ని ప్రభుత్వం ఆలోచించాలి.
ఇక బీహార్ లో ప్రస్తావనకు వచ్చిన కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత ఉచిత టీకా
వాగ్దానం బీహార్ రాష్ట్రానికే పరిమితం చేయడం పట్ల దేశవ్యాప్తంగా ఉన్న ఆ రాష్ట్ర ప్రజలే కాకుండా దేశ ప్రజలందరూ కూడా విమర్శిస్తున్నారు. బాధ్యతాయుతమైన కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న బిజెపి పార్టీ తన బాధ్యతల్లో భాగంగా ఎలాగైనా దేశ ప్రజలకు ఉచితంగా అందించవలసిన తరుణంలో రాష్ట్రానికే పరిమితం చేయడం మంచిది కాదు.
సంక్షేమ రాజ్యం ఇరుసుగా పనిచేసే భారత ప్రజాస్వామిక వ్యవస్థలో పేద వాళ్లకు ఉచితంగా అన్ని రకాల సౌకర్యాలను అందించవలసిన అవసరం అంతరాలు తొలగిపోయి ఆర్థిక సమానత్వం ఏర్పడేవరకు ప్రభుత్వాల పైన అదనంగా ఉన్నది.
ఇక చేసే ఎలాంటి వాగ్దానం అయినా బాధ్యతాయుతంగా, హేతుబద్ధంగా ఆచరణ సాధ్యంగా ఉండాలి. ఐదేళ్ల పాలనలో అందించలేని సంక్షేమ అభివృద్ధి ఫలాలను ఎన్నికల సమయంలోనే అందిస్తామని దుర్మార్గపు ఆలోచన ప్రభుత్వాలు మానుకొని అభివృద్ధి సంక్షేమం పట్ల నిరంతరం శ్రద్ధ పెట్టి దేశ సంపదను అందరికీ పంచే నీతివంతమైన పాలన వైపుగా రాజకీయ పార్టీలు అడుగులు వేయాల్సిన తరుణం ఆసన్నమైంది. లేకుంటే రాబోయే కాలంలో ప్రజలు ప్రజా సంఘాలు మేధావులు ప్రశ్నించడమే కాకుండా ప్రతి ఘటిస్తారు అప్పుడు రాజకీయ పార్టీలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు, కవి ,రచయిత, అధ్యక్షులు జాగృతి కళాసమితి హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట)
[11/3, 22:10] వడ్డేపల్లి మల్లీశం గారు: నేటి మాట 215/31.10.20
నిజాం పాలకుల పాలిట సింహస్వప్నం కొమరంభీం- గిరిజన ఉద్యమ నాయకునిగా కొమరం భీమ్ ప్రాశస్త్యం.-^^^^^^^^^^^^^^^^^^^^^^^^
-- వడ్డేపల్లి మల్లేశము,9014206412
కొమురంభీం నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గిరి లా శైలిలో పోరాడి వీర మరణం పొందిన ప్రజల హృదయాలలో ఇప్పటికీ చెరిగిపోని స్థానం సంపాదించుకున్నారు. అడవిని ఆటవిక ఉత్పత్తులపై ఆధారపడి జీవించే గిరిజన ప్రజానీకం పైన పశువుల కాపర్లపై న నిజాం రాజుల. భూస్వాములు దేశ్ముఖ్లు సాగించిన మారణ కాండకు చలించిపోయిన కొమరం భీమ్ తనదైన శైలిలో సైన్యాన్ని తయారు చేసుకొని శక్తి మేరకు పోరాడిన టువంటి ధన్యజీవి.
కొమురం భీం ఉద్యమ జీవితం- పోరాట చరిత్ర:-
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
తన జాతి జనులకు, తన దేశ ప్రజలకు, తన ప్రాంతీయులకు అన్యాయం జరిగినప్పుడు గళమెత్తి శిరమెత్తి ప్రశ్నించే తత్వం అనాదిగా ఈ భారతదేశంలో, తెలంగాణ ప్రాంతంలో ఎక్కువే. ఉద్యమ ప్రస్థానానికి, ఎదిరించి పోరాడదానికి, అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఏ చదువులు పట్టాలు పీహెచ్ విలువ అవసరం లేదు. అన్ని అర్హతలు ఉన్న వాళ్ళు పట్టించుకోని సమాజంలో భగత్ సింగ్ ,రాజ్ గురు, సుఖదేవ్ ,చంద్రశేఖర్ ఆజాద్, ఉద్ధం సింగ్, అల్లూరి కొమురంభీం వంటి మహానుభావులు పోరాట స్ఫూర్తితో ఉద్యమంలో దూకారు ప్రజల కోసమే మరణించారు నిజమైన చరిత్ర వారిది.
స్వాతంత్రం కంటే పూర్వం నుండి నేటి వరకు ఆదివాసీల సమస్యలు వర్ణణాతీతం పరాయి పాలన లోనూ నేటి స్వపరిపాలన లోనూ ఇప్పటికీ ఆదివాసీలు గిరిజనులు అనేక రకాల వివక్షతకు లోనవుతున్నారు. అందుకే ఆదివాసీలు తమ హక్కుల కోసం జరిపిన పోరాటాలు భారతదేశంలో చరిత్రాత్మకమైనది. నిజాం కాలంలో గిరిజనులపై ఆదివాసీలపై సామంత రాజులు, భూస్వాములు ,దేశ్ ముఖ్లు సాగించిన దోపిడీ దౌర్జన్యాలను ప్రశ్నించడానికి కొమరం భీమ్ జల్ జంగిల్ జమీన్ అనే నినాదాన్ని కి ప్రతీకగా ప్రజలతో మమేకమై సైన్యాన్ని తయారు చేసుకుని వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన దేశ భక్తుడు.
అనాదిగా అడవుల్లో ప్రకృతితో సహజీవనం సాగించే ఆదివాసీలు అడవి పై హక్కు తమ సామాజిక న్యాయం అని నినదిస్తూ పోరాడుతుంటే వాళ్ల హక్కులను కాలరాస్తున్న నిజాం ప్రభుత్వానికి గుండెల్లో సింహ స్వప్నంగా మారినాడు కొమురంభీం. ఇప్పటికీ మన రాష్ట్రంలో దేశంలోని అనేక ప్రాంతాల లోనూ ఆదివాసీల హక్కులను హరించి వేసి వాళ్ల భూములను లాక్కున్న ప్రభుత్వాలు ఎక్కువ. కొమురం భీం పదిహేడేళ్ళ వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా వీరి కుటుంబం సర్దాపూర్ కు వలస వెళ్లి అక్కడే స్థిరపడింది. వీరి భూమిని సిద్దిఖీ అన్న జమీందారు ఆక్రమించుకోవడంతో భీమ్ అతన్ని హతమార్చి కొంతకాలం అస్సాం వెళ్ళిపోయి తలదాచుకున్నాడు. పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గిరిజనులను ఒక్కతాటిపై నడిపించి ఉద్యమించాడు. ఆసిఫాబాద్ జోడేఘాట్ గుట్టలు కేంద్రంగా నిజాం పాలకుల పై గెరిల్లా పోరాటాన్ని కొమురం సూరి, ఎడమ రాము వంటి సహచరులతో కలిసి ఉద్యమములో పాల్గొన్నప్పటికీ కుర్దు పటేల్ అనే నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో 1940 అక్టోబర్ 27న జోడేఘాట్ గుట్టలు లోని కొమరం స్థావరాన్ని ముట్టడించి హతం చేశారు. అక్టోబర్ 27 అయినప్పటికీ ఆరోజు ఆదివాసీలు పవిత్రంగా భావించే ఆశ్వీయుజ శుద్ద పౌర్ణమి కనుక ఈ సంవత్సరము ఆయన వర్ధంతిని ఆశ్వయుజ పౌర్ణమి రోజున ఘనంగా జరుపుకుంటారు. అందుకే నేడు పౌర్ణమి కనుక వారి వర్ధంతి.
- కొమురం భీం జననము కొన్ని వివరాలు:-
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమైనట్లు, ప్రతి ఉద్యమకారుడు కూడా చిన్ననాటి సామాన్య జీవితాన్ని అనుభవించినట్లు కొమురం భీం కూడా చాలా పేద కుటుంబం లో అక్టోబర్ 22 1901 సంవత్సరంలో ఆదిలాబాద్ అడవుల్లో ఉన్న గిరిజన కుటుంబంలో చీఫ్ ఆబాద్ తాలూకాలోని సంకేపల్లి అనే కుగ్రామంలో కొమురం చిన్ను సోంబార్ దంపతులకు జన్మించినాడు. పదిహేడేళ్ల వయసులోనే అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి చనిపోవడంతో వారి కుటుంబం వేరే ప్రాంతానికి వలస పోయింది. సామాన్య ప్రజానీకం తోపాటు గిరిజన ప్రాంతాలలోని ప్రజల పైన సాగిస్తున్న పెత్తందారీ తనానికి దోపిడికి వ్యతిరేకంగా తనదైన శైలిలో ఒకవైపు అడవిలో జీవనోపాధిని కల్పించుకుంటూ నే అన్నిరకాల నిజాం అధికారాలను ప్రశ్నించి ప్రతిఘటించి నిజాం నవాబు సైనికులకు వ్యతిరేకంగా ఆయుధాలు సమకూర్చుకున్నారు. తన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అరాచకాలను చూసి సహించలేని కొమరం భీమ్ తన జీవితాన్ని ఉద్యమానికి అంకితం చేయడంతో ఆదివాసీల లో ప్రశ్నించే తత్వాన్ని బలంగా నింపి ఉద్యమ నాయకునిగా పోరాట వీరునిగా చరిత్రకెక్కారు.
కొమురం భీం పోరాటం నేటి ఉద్యమాలకు స్ఫూర్తి:-
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
సమాజంలోని విభిన్న వర్గాల మధ్య అంతరాలు అసమానతలు వివక్ష కుల మత వర్గ వర్ణ వివిధ రంగాలలో కొనసాగుతున్న నేటి పరిస్థితులలో ప్రజా ఉద్యమాలకు పూర్తిగా నిలిచారు కొమురం భీం. వారి పోరాట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న గిరిజనులు, ఆదివాసీలు ,కార్మికులు, రైతు సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తమ ఉనికి కోసం హక్కులకోసం ఆత్మ గౌరవం కోసం నిరంతరం పోరాటం జరుగుతూనే
ఉన్నవి. పెట్టుబడిదారులు జమీందార్లు ప్రభుత్వ యంత్రాంగం జరిపి అనేక దాడులకు వేలాదిమంది పోయినప్పటికీ ఇప్పటికీ అనేక గిరిజన ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో మైదాన ప్రాంతాల్లోనూ ప్రజా ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతి ఉద్యమం వెనుక కొమురం భీం పోరాట స్ఫూర్తి, పోరాట పటిమ, పోరాట వారసత్వం ఉన్నాయ్ అనడంలో సందేహం లేదు.
ఆదివాసీల ఆత్మ గౌరవానికి ప్రతీక కొమురం భీం పోరాటం. ఆదివాసీల ఆత్మ గౌరవం కోసం స్వయం పరిపాలన కోసం అస్తిత్వ ఉద్యమాల వేగుచుక్క గా పోరాటమే సరైన మార్గం ఊహించుకున్న కొమురం భీం ప్రజా ఉద్యమాల ద్వారానే ప్రజలు విముక్తులవుతారు అని శాస్త్రీయంగా నమ్మిన విప్లవకారుడు. ఆదివాసుల పైన బ్రిటిష్ చట్టాలు మోపిన నిరంకుశత్వానికి వ్యతిరేకంగా బిర్సాముండా సంతాల్ తెగల వాళ్ళు తిరుగుబాటు చేశారు..
ఇప్పటికీ ఆదిలాబాద్ ప్రాంతంతోపాటు ములుగు ,భూపాలపల్లి ,అనేక అటవీ ప్రాంతాల్లోని ఆదివాసీలు తమ జీవనాధారమైన పోడు వ్యవసాయానికి అనేక ఆటంకాలు కల్పిస్తున్న భూస్వాములు పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉన్నారు . అయినప్పటికీ తరతరాలుగా వ్యవసాయం చేసుకుంటున్న భూముల నుండి తరిమేసి వేసిన పంటలను ధ్వంసం చేసి జరిమానాలతో వేధిస్తూ చిత్ర ప్రజలకు ఇప్పటికీ గురి చేస్తూనే ఉన్నారు. ఈ సందర్భంలో కొమురంభీం ను ఆదర్శంగా చేసుకొని తమ ఉనికి కోసం పోరాటాలు చేస్తున్నారు. పోరాటాలతో తమ హక్కులను రక్షించుకోవలసిన అవసరం ఎంతో ఉన్నది. పోరాట పంట ద్వారా పీడిత ప్రజలను విముక్తి చేయడమే కొమురం భీం ఘనమైన నివాళి గా మనం భావిస్తూ ఆదివాసీలు గిరిజనుల పట్ల ప్రభుత్వం సానుకూల వైఖరితో అబద్ధాలు సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా వ్యవహరించాలని కోరుతాం.
( ఆశ్వయుజ పౌర్ణమి కొమురం భీం వర్ధంతి గా జరుపుకోవడం ఆచారం.31.10.20 ఆశ్వయుజ పౌర్ణమి)
( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు అధ్యక్షులు జాగృతి కళాసమితి హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట)
[11/3, 22:10] వడ్డేపల్లి మల్లీశం గారు: నేటి మాట 216/1.11.20 ఆదివారం
అంతర్జాల కావ్య గానాలు ప్రయోజనాలు-- పరిశీలన -విశ్లేషణ
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
-వడ్డేపల్లి మల్లేశము,9014206412
కరోనా విజృంభించిన అనంతరం సాహిత్య సామాజిక రంగాలలో పెనుమార్పులే వచ్చినవి. గతంలో రచయితల సభలు అనేక అంశాలపై సదస్సులు, పుస్తకావిష్కరణలు కవిసమ్మేళనాలు తరచుగా జరిగేవి ప్రాంతాలకు రాష్ట్రాలకు అతీతంగా ఆ కార్యక్రమాలు కొనసాగిన సందర్భాలు అనేకం. యానాంలో కావచ్చు కర్ణాటకలోని తెలుగు కర్ణాటక సేవాసమితి కావచ్చు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంలో ముందున్నవి. ఇక హైదరాబాదులో అయితే అనేక ప్రాంతాలతో పాటు సుందరయ్య భవన్లో తరచుగా సదస్సులు సమావేశాలు సభలు సాహిత్య సామాజిక అంశాలపై సభలు జరిగేవి.
ఇటీవల కరోనా ప్రభావం తర్వాత ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించలేని అనివార్య పరిస్థితులలో అంతర్జాలము ద్వారా అంతర్జాల సదస్సులు, కవిసమ్మేళనాలు, విశ్వ కవిసమ్మేళనాలు, సహస్ర కవిసమ్మేళనాలు, కార్యశాలలతో పాటు కావ్య గానాలు అనే ప్రత్యేక ప్రక్రియ ప్రారంభం కావడం చాలా సంతోషం.
నేటి వ్యాసంలో నా ప్రత్యక్ష పరిశీలనకు వచ్చిన కావ్య గానాలు నిర్వహణ ప్రయోజనాలపై మీతో పంచుకుంటాను.
కావ్య గానాలు ప్రత్యేక ప్రక్రియ ప్రయోజనం:-
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
సాధారణంగా కవులు ప్రచురించిన అనేక సంపుటాలను కవులు, సాధారణ విద్యావంతులు, జనం కొనుక్కొని చదువుతుంటారు. ఆ సందర్భంలో అన్ని పుస్తకాలు ప్రస్తావనకు రావు అన్ని అందరినీ ఆకర్షించవు. వాళ్ల వాళ్ల ఇష్టాన్ని బట్టి వాళ్ల ధోరణి ప్రక్రియా దృక్పధాన్ని బట్టి పుస్తకాల ఎంపికను పాఠకులు చేసుకుంటారు.
అయితే కావ్యగానం ప్రక్రియలో కవి స్వయంగా తను రాసిన ఒక కావ్యాన్ని ఎన్నుకొని అందులో కొన్ని ఎంపిక చేసుకున్న కవితలను వాటి నేపథ్యాన్ని వివరిస్తూ మధ్య మధ్యలో కవి యొక్క బాధ్యతలు, ప్రాధాన్యత, కవి దృక్పథo, పునాది, నేపథ్యం, వస్తువు, శిల్పం మొదలగు అంశాలపై తడుముతూ తన కావ్య గానాన్ని కొనసాగిస్తారు.
అక్టోబర్ 4 2020 తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ముందుగా ప్రొఫెసర్ గౌరవ మసన చెన్నప్ప గారి తెలంగాణ ఉదయం కావ్యం పై వారి గాన మాధుర్యాన్ని వివరణ భావజాలాన్ని పాఠకులకు అందించడం జరిగింది. ఆనాటి తో ప్రారంభమైన కావ్యగానం ప్రక్రియలు తెలుగు భాషా చైతన్య సమితి మరియు లక్ష్యసాధన ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ జయప్రకాష్ గారు మరియు బడేసాబ్ గారు వారి కార్యవర్గం చొరవతో ఈ ప్రత్యేక కార్యక్రమం కొనసాగుతూ వస్తున్నది.
అందుకు ముందుగా నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు. అభివందనాలు.
ఆ తర్వాత నందిని సిద్ధారెడ్డి గారి ప్రాణహిత కావ్యగానం, ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్ గారి విశాల శూన్యం కావ్యగానం, డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ గారి భరోసా కావ్యగానం కొనసాగి నవంబర్ 1, 2020 తేదీన ప్రముఖ కవి కే శివారెడ్డి గారి పక్కకు ఒత్తిగిలితే కావ్యం గానంతో నా పరిశీలనలో ఐదు కావ్యాలపై కావ్యగానం జరిగినట్లు అయింది.
ప్రయోజనాలు:- ఇందులో కవి తన కావ్యం యొక్క అంతరార్థాన్ని చెబుతూనే అనేక కవితలు వినిపించడం ద్వారా అందులో మన జీవితం కూడా ఉన్నదా? అనిపించే విధంగా కొనసాగడం ఒక ప్రత్యేకత.
ఎంపిక చేసుకున్న పది నుండి పదిహేను, ఇరవై కవితలను చదివి వినిపించినప్పటికీ ప్రశాంతంగా అర్థమయ్యేరీతిలో, తరగతి గదిలో బోధన లాగా, జీవితంలోని సందర్భాలు, విలువలు, ప్రత్యేకతలను వివరించి చెప్పడం చాలా సందర్భోచితంగానూ ప్రయోజనాత్మకంగా ఉన్నది. వారి కావ్యంలోని విషయాలనే కాకుండా వారి వృత్తి ,ప్రవృత్తి, అనుభవము, అభ్యాసము ,అధ్యయనము, పరిశీలన, పరిశోధన, విశ్లేషణ, చర్చల ద్వారా లభించిన వారి పూర్వ జ్ఞానాన్ని ఆ వేదిక ద్వారా మనకు అందించడం తో, సాహిత్య సామాజిక సాంస్కృతిక అవగాహన మనకు జరగడమే కాకుండా పాఠకులకు, కవులకు తమ కార్య రంగానికి సంబంధించిన భూమికను అందించినట్లు అవుతున్నది.
తరగతి గదిలో బోధించినట్లు గా అందిస్తున్న విస్తారమైన టువంటి జ్ఞానాన్ని, అనుభవాలను, అనుభూతులను, వర్ణనలు ,పోలికలు, బేధాలు పాఠకులుగా ఉన్న కవులు కళాకారులు మేధావులు విద్యావంతులుగా మనమందరము కూడా వినడం తో పాటు లిఖిత రూపంలో వారి అభిప్రాయాలను మన బుక్కులో పంచుకుంటే స్థిరమైన అభిప్రాయాలు మన వద్ద శాశ్వతంగా ఉండే అవకాశం ఉంటుంది అది నా అనుభవం.. మీతో చేస్తున్న విజ్ఞప్తి!
కొన్ని ప్రత్యేక వ్యాఖ్యలు:-
*****************************
కావ్య గానాన్ని వినిపించిన ప్రముఖ కవులు, ఉద్దండులు, విద్యావంతులు, మేధావులు మనకు గ్రంథాలయాన్ని ముందు పెట్టినట్టుగా అనిపిస్తున్నది.
ప్రత్యక్షంగా విజ్ఞానాన్ని అందించినట్లు పరోక్షంగా ఆ పుస్తకాలను అధ్యయనం చేయాలని సూచించినట్లు దీని భావన.
ఈ సందర్భంలో కావ్యగానం లో భాగంగా ప్రస్తుతం ఉంచిన కొన్ని విషయాలను మీ ముందు ఉంచుతాను.
డాక్టర్ శివారెడ్డి గారి మాటల్లో:-
****************************
" కవిత్వం రాయడం అంటే కవిత్వం తో సహజీవనం చేయడమే".
" కొత్త ఊహ పుట్టాలి గానీ జీవితం అంత మధురంగా కవిత్వం ఉంటుంది కవిత్వం అంత మధురంగా జీవితం ఉంటుంది ." సమూహపు జ్ఞానమే
సామాజిక సాంస్కృతిక సాహిత్య అవగాహన ఇస్తుంది.
" సృజనశీలి ఇదంతా కవులే కవులు కాకుండా చైతన్యం పొంద లేరు అందుకే ఆలోచించే ప్రతి వాడు కవి అవుతాడు."
డాక్టర్ మసన చెన్నప్ప గారి భావన:-
******************************
."కప్పి చెప్పేవాడు కవి విప్పి చెప్పేవాడు విమర్శకులు అన్న సినారే మాటలను ప్రస్తావించి....
" సమకాలీన భాషలోనే పద్య0, రచనలు చేస్తే సామాన్య ప్రజలు అర్థం చేసుకుంటారు. పద్యం సామాన్యునికి అర్థమైన సంగీతం వంటిది." నల్లగొండజిల్లా చింతపల్లి ఉన్నత పాఠశాలలో జరిగిన సంఘటనను వారి అనుభవం నుండి ప్రస్తావించారు.
" సాహిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. నీవు మాట్లాడే భాషలో మనోభావాలు ఉంటే ఇతరులకు సులభంగా అర్థమవుతాయి."
" చింతకాయ తొక్కు అనే కవితను గానం చేస్తూ తెలంగాణలో చింత చెట్లు ఎక్కువ క్షేమం ఉండదు చింతల ఉన్నాయి కనుక తెలంగాణలో చింతలు లేవు అన్నారు".
" దేశ చరిత్రను వినిపించే కవి జీవితం ధన్యమవుతుంది అని ప్రస్తావిస్తూ తెలంగాణ భాగవతము గా" తెలంగాణ ఉదయాన్ని " ప్రస్తుతించారు. "ఒక్క
బుక్క" ఖండికలో కవి పరిచయం ఉన్న నడుము వంగిన వృద్ధుని దీనస్థితిలో బుక్కెడు అన్నం గురించి ప్రస్తావించి వృద్ధుల పట్ల సానుభూతి వ్యక్తం చేయాలనే సందేశాన్ని ఇవ్వడం ముదావహం.
ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్ గారివి:-
****************************** సుదూరాల మార్గాల దార్శనికుడు వి నువ్వే కదా! బతుకు పరు గ్వేగము నేర్పిన కాలస్వరూపునివి నీవే కదా!
శబ్ద రాశి వత్తులను వెలిగించి న మా దీపావళి నువ్వే కదా! అంటూ అమ్మ, ఆలీ ,తండ్రి ,గురువు, అనే నలుగురు ప్రతివారికీ జీవితంలో ముఖ్యమైన వాళ్ళని సందేశాన్ని అద్భుతంగా సెలవిచ్చారు.
ఇక" విశాల శూన్యం "అనే పేరుతో ఉన్న వారి కావ్యంపైన వారు ఇచ్చిన వివరణ మాకు ఎంతో ఊరట ఇవ్వడమే కాదు బాధ్యతలు గుర్తింప చేసింది.
" విశాలమైన ప్రపంచంలో బాధ్యతలున, బాధ్యతగా భావించిన శక్తియుతుడు యుక్తిపరుడు ఎంతైనా చేయడానికి అవకాశం ఉందని శూన్యంగా ఉన్న అవకాశాలను భర్తీ చేయడానికి మీ ప్రజల ఉపయోగించుకోవాలని మర్మగర్భంగా చెప్పిన వారి ధోరణి కవితాత్మకంగా అనే ఉండటం కాకుండా ఎంతోమందిని కదిలింప చేసింది.
" ఏమైనా చేయడానికి ఉన్న ఖాళీని విశాల శూన్యం అనవచ్చు అని అంటే శూన్యాన్ని దేనికైనా వినియోగించుకోవచ్చు. ఈ విశాల శూన్యం పై ఏదైనా mulaqat తినడానికి సజీవ చైతన్యంగా మార్చుకోవడానికి వాడుకోవచ్చు కదా అని కావ్యం యొక్క అర్థం.
ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. సమగ్రంగా వినడం సందేహాలు నివృత్తి చేసుకోవడం స్పందించి మాట్లాడం ఇవన్నీ మన బాధ్యతలు.
చివరగా ఈ కావ్య గానాలు నిరంతరం ఇలాగే కొనసాగాలని కవులు ప్రత్యక్షంగా లేకుంటే వారికి బదులు వేరే వారితో నైనా ఒక విధానాన్ని కొనసాగించడం ద్వారా ప్రముఖ గ్రంథాలను వినడానికి అవగాహన చేసుకొని అనుభూతి పొందటానికి అవకాశం ఉంటుందని నా సూచన.
జాషువా రచనలు గాని ,గురజాడ రచనలు, వంటి ప్రాచీన రచనలపై కూడా కావ్య గానాన్ని కొనసాగించితే
లబ్దప్రతిష్టులైన కవులు వర్తమాన కవులు యువకులు అందరికీ కూడా ప్రయోజనాత్మకంగా ఉంటుంది.
ఈ సందర్భంగా పాఠకులు కవులు కళాకారులు మేధావులు లబ్దప్రతిష్టులు వర్తమాన కవులు యువతకు నిరంతరం అధ్యయనం చేయాలని పరిశీలన ద్వారానే అనుభవాలు ఊహలు మెదడులో కదలాడుతాయి అని వాటినుండి ప్రజాసాహిత్యం పుట్టుకొస్తుందని నా ప్రగాఢ విశ్వాసం.
ఈ విశ్వాసానికి జీవం పోసిన ఎందరో మహానుభావులు కవులు మేధావులు కళాకారులకు వందనాలు అభివందనాలు.
( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గ్రహీత హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట.
[11/3, 22:10] వడ్డేపల్లి మల్లీశం గారు: నేటి మాట 217/2.11.20 సోమవారం
ప్రజా ఉద్యమానికి, ప్రజా సాహిత్యానికి ఏకకాలంలో ప్రాణం పోసిన ఉద్యమకర్త కమ్యూనిస్టు నేత వట్టికోట.
^^^^^^^&^^^^^^^^^^^^^^^^^^^^^^^
-- వడ్డేపల్లి మల్లేశము,9014206412
20వ శతాబ్దం ప్రారంభం, 19వ శతాబ్దం చివరి ప్రాంతాలలో భారతదేశంలో జన్మించిన అనేకమంది మహానుభావులలో స్వాతంత్ర పోరాట వీరులు, ఉద్యమ నేతలు, సంఘసంస్కర్తలు, విద్యాబి మానంతో పాఠశాలలు, గ్రంధాలయాలు నెలకొల్పి
ప్రజా సంస్కృతి చైతన్యానికి అండగా నిలిచిన వారు అనేక మంది ప్రజల మనుషులు చరిత్రకెక్కినారు.
అందులో గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ,లజపతిరాయ్, తిలక్, అంబేద్కర్ ,సాహుమహారాజ్ అనేకమంది సోషలిస్టు ఉద్యమ నాయకులు దాదాపుగా ఒకే ఈ కాలానికి చెందిన వాళ్లు. అదే రకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి చాకలి ఐలమ్మ, సుద్దాల హనుమంతు, నల్ల నరసింహులు, వట్టికోట ఆళ్వారుస్వామి ,దాశరథి ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి
ప్రజా ఉద్యమంలో పనిచేసి ప్రజల కోసం తమ జీవితాలను ధారపోసిన వారు. దాదాపుగా ఒకే కాలానికి చెందినవారు. ఇదే కాలంలో జన్మించి తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కలాన్ని, గళాన్ని సమాంతరంగా అందించి సజీవ ఉద్యమాలకు జీవం పోసిన మహానుభావుడు వట్టికోట ఆళ్వారుస్వామి. వ్యక్తిగత జీవితం అంటే ఎరుగని వాళ్ళు నిరంతరం ప్రజాసేవలో అక్రమాలు ఆగడాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలిచి ఉన్నారు కనుక నేడు చరిత్రలో నిలిచిపోయారు.
త్యాగాల పునాదుల మీద జీవించిన వారి జీవితం ఇబ్బందుల పాలు అయినా నూతనత్వం ,భావావేశం,
చారిత్రకం,. పౌరుషాన్ని, సమయస్ఫూర్తిని, నాయకత్వాన్ని
సందర్భోచితంగా ఉద్యమానికి అందించిన వారి జీవితాన్ని చదువుకోవడమే కాదు తద్వారా స్ఫూర్తి పొంది మనకంటూ ఓ చరిత్ర నిర్మాణం చేసుకున్నప్పుడే మనకంటూ ఉనికి ఉంటుంది వారికి చరిత్రలో పేజీ ఉంటుంది.
వట్టికోట ఆళ్వారు స్వామి ప్రత్యేకత ఏమిటి:-
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
ఆయన ఒక రచయిత సేవాశీలి ఉద్యమకర్త, పాత్రికేయుడు, ప్రచారకర్త, సమకాలీన ఉద్యమానికి సంబంధించి తను రాసిన పుస్తకాలను గంపలో పెట్టి
ఊరూరా తిరిగి అమ్మి జ్ఞానాన్ని అందించిన జ్ఞాన దాత. ప్రజల భాషలో ప్రజా సాహిత్యానికి జీవoపోవడమే కాకుండా నిజాం నిరంకుశ కాలంలో హక్కులు కాల రాయ బడుతున్న ప్రజలకు మద్దతుగా నిలిచి ప్రజా
ఉద్యమాలు పాలుపంచుకోవడం కాకుండా, తెలుగులో రాజకీయ నవలను ప్రారంభించిన తొలి నవల కర్త.
వట్టికోట పోరాట ఉద్యమ కాలం:-
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
--- పేద మధ్య తరగతి కుటుంబంలో జన్మించడం వల్ల అవకాశాలు ఎదుగుదలకు అంతగా ఉండకపోవచ్చు కానీ పాకుతూ నైనా ముందుకు వెళ్లే వారికి అవకాశాలు కలిసి రావడమే కాదు ఆ ఆత్మస్థైర్యం పోరాటపటిమ దాగిఉన్న అంతరంగాల నుండి బయటికి రాక తప్పదు.
వడ్డించిన విస్తరి కాని జీవితం వలన తన బ్రతుకును కానీ దారిలో పెట్టుకోవాల్సిన అగత్యం ఏర్పడడంతో చిన్న చిన్న పనుల వలన బ్రతుకుదెరువు కానరాక పోయిన సందర్భంలో 1933లో హైదరాబాద్ రావడంతో సురవరం ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గోల్కొండ పత్రికలో ప్రూఫ్ రీడర్గా ఉద్యోగంలో చేరడంతో ఆ సన్నివేశం తన జీవితాన్ని మార్చివేసింది. 1935 నుండి 44 మధ్య కాలంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న పరిస్థితులు దయనీయంగా ఉండేవి. దేశ్ ముఖ్లు, జమీందార్లు భూస్వాములు నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాల ఏలుబడిలో విచక్షణారహితంగ,
గ్రామీణ ప్రజానీకంపై దాడులు, వెట్టిచాకిరి, అమలులో ఉండడమే కాకుండా తెలుగులో చదువుకోవడానికి పాఠశాల లేనటువంటి దయనీయమైన పరిస్థితిలో ఒకవైపు నాటి కార్యకర్తలను కలిసి వేసినవి. ఆంధ్ర మహాసభ ఆర్య సమాజం వంటి కొన్ని సంస్థలు నాటి నాయకులు కలిసి వేలాది పాఠశాలలు ఏర్పాటు చేసి దున్నేవాడిదే భూమి కావాలన్న నినాదంతో ఉధృతంగా పోరాటం జరుగుతున్న రోజులవి. కమ్యూనిస్టు పార్టీ ఆంధ్ర మహాసభ నాయకత్వంలో విస్తృతంగా బహిరంగ సభలు జరుగుతూ, తీర్మానాలు చేస్తూ, నిజాం నవాబుకు నిద్రలేకుండా చేస్తున్న కాలమది. 1938లో హైదరాబాదులో దేశోద్ధారక గ్రంథమాల స్థాపించి ఆళ్వారుస్వామి సుమారు 800 మంది సభ్యులుగా చేర్పించారు. నాటి స్థితిగతులపై కవులు రాసినటువంటి గ్రంథాలను ఈ సంస్థ ద్వారా ప్రచురించేవారు. ఒకవైపు సంస్థాపరమైన బాధ్యతలు తీసుకుంటూనే వట్టికోట తెలంగాణ నుడికారాలు తో ప్రజల భాషలో అనేక రచనలు చేశారు. వీరి రచనలో నిబద్ధత, నిజాయితీగా వాస్తవాలను రాసే ధోరణి ప్రబలంగా ఉండేది. తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభం కాకముందు నాటి గ్రామీణ ప్రాంత పరిస్థితులు, భూస్వాముల ఆగడాలకు సంబంధించిన చిత్రీకరణ "ప్రజల మనిషి" నవల. ఈ నవల రాజకీయ తొలి నవల గానే కాకుండా నాటి రాజకీయ సామాజిక ఆర్థిక పరిస్థితులకు దర్పణంగా నిలిచిన ప్రజలు ఈ నవలను ఆదరించి చదివి చైతన్యం పొందినారు. నిజాం నిరంకుశ రాచరిక వ్యవస్థ కారణంగా జాగీర్దారులు, జమీందార్లు, దేశముఖ్లు కష్టజీవులు కార్మికులు రైతు కూలీలను ఏవిధంగా అణగదొక్కే గారు ఈ నవలలో ప్రత్యేకంగా రాయబడింది.
ప్రాచుర్యము పొందిన మరో వీరి నవల గంగు లో 1940 తర్వాత జరిగిన పరిణామాలు రాజకీయ సామాజిక ఆర్థిక వ్యవస్థ గురించి స్పష్టంగా కనబడతాయి. ఒకవైపు కార్యక్రమాలలో పాల్గొంటూ ఉద్యమానికి ఊతం ఇస్తూనే నాటి సమకాలీన పరిస్థితులను రచనల ద్వారా ప్రజలకు అందించడంతో ఉద్యమం మరింత సజీవంగా ఉండడానికి దోహదం అయింది. 1944లో నిజామాబాదు లో జరిగిన ఆంధ్ర మహాసభకు మొదటిసారిగా హాజరై కమ్యూనిస్టు ఉద్యమ భావజాలాన్ని నింపుకొని తర్వాతి కాలంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తన కంటూ ఓ స్థానాన్ని పదిల పరుచుకున్నాడు. రాచరిక పాలన ఆగ్రహానికి గురైన వట్టికోట అనేకసార్లు జైలు శిక్ష అనుభవించిన ప్పుడు జైలు జీవితం ఆధారంగా" జైలు లోపల కథలు" పుస్తకాన్ని రాశారు. 1948లో నిజామాబాద్ జైల్లో దాశరథి
పద్యాలు చెబుతుంటే వట్టికోట ఆ పద్యాలను గోడలపై రాసి జైలు అధికారులతో దెబ్బలు తిన్న రాయడం మాత్రం మానలేదు అది ఆనాటి వారి పట్టుదల పటిమ.
అల్వార్ స్వామి జననము చిన్ననాటి జీవితం:-**
^^^^^^^^^^*******************
నిజాం నిరంకుశ పాలనను అంతమొందించటం కోసం ప్రజా చైతన్యం లో భాగంగా రచనలో తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పిన బహుముఖ ప్రజ్ఞాశాలి, గ్రంథాలయోద్యమ నాయకుడు వట్టికోట ఆళ్వారుస్వామి 1915 నవంబర్ 1వ తేదీన కరీంనగర్ తో సమానంగా పోరాట జిల్లాగా పేరుగాంచిన నల్లగొండ జిల్లా నకిరేకల్ దగ్గర చెరువు మాదారం లోని ఒక పేద వైష్ణవ కుటుంబంలో సింహాద్రమ్మ, రామచంద్ర ఆచార్యులకు జన్మించినాడు. బాల్య ప్రాయంలో అనగా పదకొండేళ్ళకే తండ్రి మరణించడంతో సీతారామారావు అనే ఉపాధ్యాయుడు కి వంట చేసి పెడుతూ విద్యాభ్యాసము, పుస్తక పఠనము, సమకాలీన పరిస్థితులను ఆరా తీస్తూ ఉండేవాడని తన జీవిత చరిత్ర ద్వారా తెలుస్తున్నది. ఆంధ్ర మహాసభ నల్లగొండ జిల్లా అధ్యక్షునిగా నూ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా నూ పని చేసి ప్రజా చైతన్యాన్ని కూడగట్టడంలో సఫలీకృతుడు అయిన వట్టికోట ఆళ్వారుస్వామి ఆయన అనుభవాలను ప్రజల మనిషి నవల రాయడం ద్వారా నిజంగా ప్రజల మనిషిగా ఆయనను నిలబడే టు చేసింది ఆయన కృషి పట్టుదల అంకితభావం మాత్రమే. అననుకూల పరిస్థితుల్లో కూడా దేనికి తలవంచక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్ళడమే అందులోని రహస్యం. విజయవాడలో హోటల్లో సర్వర్గా పని చేస్తూ రచయితగా ప్రచురణకర్తగా మారడంలో వారి స్వయం కృషి ఎనలేనిది. విజయవాడలో పనిచేస్తున్నప్పుడే ఇంగ్లీష్, ఉర్దూ భాషలపై పట్టు సాధించడం కాకుండా
దేశవ్యాప్తంగా జరుగుతున్న భారత స్వాతంత్ర సంగ్రామానికి ప్రభావితుడై పాలకులను ప్రతిఘటించడం ద్వారా జైలుకెళ్లిన అనుభవం కూడా చిన్ననాడే ఉన్నది.
వారి రచన రంగంలోని కీలక అంశాలు:-
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
ప్రజల జీవితాలు కథావస్తువుగా "కనువిప్పు "నాటిక తో పాటు 14 ఏకాంకిక నాటకాలను రచించారు.
గ్రంథాలయ ఉద్యమంలో బలంగా పని చేసిన కారణంగా చదువు మధ్యలో మానివేసిన ప్పటికీ 1952లో రాసిన ప్రజల మనిషి నవల నాటి సమాజాన్ని చాలా ప్రభావితం చేసింది. తెలంగాణ విశేషాలను గూర్చి "తెలంగాణ" పేరుతో సంపుటాలు ప్రచురించి నప్పటికీ" నేడు అవి చాలా వరకు అందుబాటులో లేకపోవడం బాధాకరం. వీరు రాసిన అంతా ఏకమైతే ,ఆలూ కూలి, గాలిపటం, కాఫీర్లు, పతితుని హృదయం, పరిగె ,పరిసరాలు,బధనిక మొదలైన కథలు బహుళ ప్రచారం పొందినవి. వీరు స్థాపించిన దేశోద్ధారక గ్రంథమాల నుండే సురవరం "హైందవ ధర్మ వీరులు" కాళోజీ" నా గొడవ" తొలిసారిగా వెలువడిన విషయాన్ని మనం గుర్తించాలి. 1942 లో క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో హైదరాబాద్ లో జరిగిన పోరాటంలో పాల్గొనడం వలన జైలు పాలైన వట్టికోట తర్వాత క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చి ఒక చేత పెన్ను మరో చేత గన్ను కూడా పట్టి ప్రజల పక్షాన నిలిచారు నిజాం నవాబు పాలనా కాలంలో ఉద్యమకారులు రచయితలపై పెరిగిన తీవ్ర నిర్బంధం కారణంగా అల్వార్ స్వామిని అరెస్టు చేసి సంగారెడ్డి గుల్బర్గా హైదరాబాద్ వరంగల్ జైలు కు తిప్పి తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన మొక్కవోని ధైర్యంతో బ్రతికి నేటితరం తెలంగాణకు స్ఫూర్తినిచ్చిన వట్టికోట 46 ఏళ్ల మధ్య వయస్సులోనే డిప్తీరియా వ్యాధితో 1961 ఫిబ్రవరి 5వ తేదీన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం బాధాకరమే.
తీవ్ర నిర్బంధాలు ఒత్తిళ్లు పేదరికం మధ్య అంతటి త్యాగనిరతి చూప వలసిన అవసరం ఏమొచ్చింది. ఎవరో చెబితే ఉద్యమ భావజాలంతో కలాన్ని, గళాన్ని సొంతం చేసుకోలేదు .పెన్ను ,
గన్నులను ఆయుధాలుగా మలుచుకొ లేదు. సమకాలీన పరిస్థితులకు ప్రతిస్పందించడం లోనే వ్యక్తి యొక్క నిజాయితీ విలువలు ప్రస్ఫుటమవు
తాయి. ఆ పని చేయించింది నాటి
ప్రజానీకం ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులు పాలకుల నిర్బంధం, అణచివేత.
దాదాపుగా 75 సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ సాయుధ
పోరాటo ఉదృతంగా కొనసాగిన ఈ నేలపై నాటి కంటే నేడు దారుణ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పాలకుల ప్రలోభాలు, దాటవేసే ధోరణులు, నిర్మాణాత్మక క్రియాశీల పథకాలు అమలు చేయని కారణంగా బడ్జెట్లో ప్రణాళికలలో సాధారణ ప్రజానీకాన్ని పరిగణించక పోవడం వలన నేడు ఈ దుస్థితి దాపురించింది. నా కంటే నేడు విద్యా ,చైతన్యం, విజ్ఞానం అపారంగా పెరిగినప్పటికీ సోయ్ లేకపోవడం ,స్వార్థ చింతన కారణంగా ఈ వ్యవస్థను మరింత ఉన్నతమైన స్థితికి తీసుకుపోవడానికి దారులు మూసుకుపోయాయి. ఆ దారులను వెతికి గమనాన్ని నిర్దేశించుకొని గమ్యాన్ని చేరుకోవడానికి ప్రజానీకం ఆలోచిస్తేనే ప్రజల జీవన పరిస్థితులు మారుతాయి. ఈ కనీస జ్ఞానాన్ని ప్రేరణను వట్టికోట జన్మదినం సందర్భంగా అయినా మనం పొందకపోతే వారి త్యాగనిరతికి అర్థం లేదు మనకంటూ ఒక ఉనికి ఉండదు.
(1.11.20 వట్టికోట ఆళ్వారు జన్మదినం సందర్భంగా ఈ ప్రత్యేక వ్యాసం)
( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు కవి ,రచయిత, అధ్యక్షులు జాగృతి కళాసమితి హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట)
[11/3, 22:10] వడ్డేపల్లి మల్లీశం గారు: నేటి మాట 218/3.11.20 మంగళవారం
సాహిత్యము -అధ్యయనము -సామాజికత సమాజంలోని భిన్న వర్గాల స్పందన.....
******************************************
-- వడ్డేపల్లి మల్లేశము,9014206412
సమాజాన్ని ఆకళింపు చేసుకొని, విభిన్న పరిస్థితులలో సమాజానికి మార్గ నిర్దేశం చేసేది సాహిత్యం. అయితే సాహిత్యానికి ముడిసరుకు మాత్రం సమాజం నుండి లభిస్తుంది. రెండు భిన్నమైన అంశాలు అయినప్పటికీ పరస్పరము మూలాలను అందించు కొని కర్తవ్యాన్ని నిర్వహించే క్రమంలో సమాజము, సాహిత్యం రెండూ అగ్రభాగాన నిలిచిన వే. సాహిత్య పఠనం క్రమంగా తగ్గుతూ వస్తున్న సందర్భంలో గ్రంథాలయ వారోత్సవాల పేరుతో నిరంతరం ఏటా కార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రేరణ అందిస్తున్నప్పటికీ సెల్ ఫోన్ టీవీ అంతర్జాలము తదితర యాంత్రికీకరణ ప్రభావంతో పుస్తకపఠనం క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఒక సర్వే ప్రకారం గా విద్యావంతులైన వారిలో సాహిత్య పఠనం పట్ల ఆసక్తి చూపి చదువుతున్న పాఠకుల సంఖ్య 13 శాతం గా ఉన్నట్లు తేలింది. ఇది వాంఛనీయం కాదు. అధునాతన అక్షరాస్యత శాతం ప్రకారమైన సరాసరి అక్షరాస్యత 77.7% ఉండగా 13 శాతం తో సరి పుచ్చుకోవడం సామాజిక మార్పుకె పెద్దగా ఉపయోగపడే స్థాయిలో లేదనేది నిర్వివాదాంశం. ఈ క్రమంలో పఠించ గలిగే అక్షరాస్యత శాతాన్ని పెంచడంతోపాటు సమాంతరంగా సాహిత్యాన్ని అధ్యయనం చేసే వాళ్ల సంఖ్యను కూడా పెంచుకోవలసిన అవసరం ఉన్నది.
సమాజము -సాహిత్యం:-
^^^^^^^^^^^^^^^^^^^
మానవుడు సంఘజీవి అన్న అరిస్టాటిల్ ప్రకారం భిన్నమైన ఆలోచనలు సాంప్రదాయాలు ఆచారాలు అలవాట్లు జీవన విధానాలు ఉన్న వ్యక్తుల సమూహముగా
సమాజం కొనసాగుతూ ఉంటుంది. రాజ్యాంగబద్ధంగా చట్టాల పరిధి మేరకు సంక్షేమం అభివృద్ధి దిశగా కొనసాగే పాలన ప్రజలను కంటికి రెప్పవలె చూడవలసిన బాధ్యత ఉంటుంది. పాలకులు పాలితులు సమాజము నుండి వస్తున్న సందర్భంలో స్థానాలలో ని తేడా వలన పాలకులు స్వప్రయోజనాలకు పాల్పడటంతో పాటు ప్రజలను అశ్రద్ధ చేసే అవకాశం ఉన్నది. ప్రజల ఆచార వ్యవహారాలతో పాటు జీవనశైలి, బ్రతుకుదెరువు, ఆదాయ మార్గాలు ,ప్రభుత్వ సహకారం, ఉపాధి కల్పన ,ఉద్యోగ అవకాశాలు ఇదంతా సమాజంలోని భిన్న పార్శ్వాలు. ప్రజలకు రాజ్యాంగబద్ధ హక్కులతో పాటు పౌర సమాజం గా బాధ్యతలు కూడా ఉంటాయి. అటు ప్రభుత్వాలు ఇటు పౌరసమాజం బాధ్యతల నిర్వహణ క్రమంలో కొన్ని ఉల్లంఘనలకు పాల్పడటం వలన సమస్యలు, గందరగోళాలు తలెత్తుతుంటాయి.
సాహిత్య రంగం పైన తెలిపిన సమాజంలోని విభిన్న అంశాలను ప్రజల ఆర్థిక స్థితిగతులు హక్కులు బాధ్యతలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు మానవతావాదం లో కుటుంబ సంబంధాలలో రావలసిన గణనీయ మార్పులను సృజనకారులు సమాజ హితాన్ని కోరి అక్షరబద్ధం చేస్తారు. ఇట్లా రూపొందిన సాహిత్యం సమాజ పరిస్థితులకు సంబంధించి రికార్డుగా కూడా పనిచేస్తుంది. అంతేకాకుండా ఉల్లంఘనలకు పాల్పడిన వారి కర్తవ్యాలను, బాధ్యతలను ఎత్తిచూపి చైతన్య పరుస్తుంది.
సాహిత్యం చూపే ప్రభావం చాప కింద నీరులా గానూ, గడ్డివాము కాలిన విధంగానూ, ఉప్పెన వలె కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఉన్నత వర్గాలు, పెట్టుబడిదారులు, భూస్వాములు, పారిశ్రామికవేత్తలు, చివరికి రాజ్యం కూడా అప్పుడప్పుడు సామాన్య ప్రజానీకానికి హాని చేసే సందర్భాలు ఉంటాయి. అప్పుడు సాహిత్యరంగం సమాజం లోనికి చొచ్చుకొని వచ్చి జోక్యం చేసుకొని పరిష్కార మార్గాలను కవితలు, వ్యాసాలు, గేయాలు, పద్యాలు, పాటలు, నాటికలు మొదలగు రూపాలలో ప్రజానీకానికి అందిస్తారు.
సమాజము సాహిత్య ,అధ్యాయనం
విభిన్న ధోరణులు:-
*********************************
ఈ క్రమంలో మన ముందు ఉన్నటువంటి సమాజాన్ని, అందుబాటులో ఉన్న సాహిత్యాన్ని వర్తమాన కవులు, పాఠకులు, విద్యావంతులు, సామాజిక చింతన గల ప్రతి వాళ్లు కూడా అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఇక్కడ అధ్యయనం అంటే కేవలం పుస్తకాలు మాత్రమే చదవడం కాదు. పుస్తకాలను చదివినా కేవలం ఆటవిడుపుగా కాకుండా పరిశీలన, పరిశోధనాత్మక దృష్టితో చదివినప్పుడే వాటి మూలాలు చదవడంతో పాటు మన బాధ్యతలను గుర్తింపు చేస్తుంది సాహిత్యం. ఉనికి ప్రశ్నార్థకమైనప్పుడు, సమాజం అల్లకల్లోలం అయినప్పుడు , అణచివేత, ఆధిపత్యము, పీడన, దోపిడి కొనసాగినప్పుడు అనివార్యంగా సాహిత్యం అంటే దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కవులు, కళాకారులు, మేధావులు, తమ కళా రూపాల ద్వారా జనబాహుళ్యానికి భరోసానిస్తూ అండగా ఉంటారు.
ఇక అధ్యయనం అంటే ఉత్తమ సాహిత్య పట్టణము తో పాటు సామాజిక పరిశీలన విభిన్న పరిస్థితుల పరిశోధన, సమకాలీన అంశాలపై చర్చ చేయడం కూడా అధీనంలోని అంతర్భాగాలు అవుతాయి. అందుకే ఊహించి స్పందించి ఆలోచించే ప్రతి వాళ్లు కూడా కవులు కళాకారులే అవుతారు.
ఈ విషయాన్ని అనేక మంది ప్రముఖ కవులు ప్రస్తావించిన విషయాన్ని మీ ముందుంచుతున్నాను.
ఇక సమాజంలో అంతర్భాగమైన ఇటువంటి రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు హక్కుల కార్యకర్తలు మేధావులు బుద్ధిజీవులు విద్యావంతులు తమ ఉద్యమ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి క్రమంలో సాహిత్యం పరమైన కథలు, కవితలు, పాటలు ,గేయాలు, నాటికలను విస్తృతంగా ఉపయోగించుకుంటూ సమాజాన్ని చైతన్యవంతం చేస్తారు. ఇంతటి విస్తృతమైన విడదీయరాని అనుబంధం సమాజము సాహిత్య మధ్య ఉన్నప్పుడు రెండు వర్గాల ప్రతినిధులు కూడా తమ బాధ్యతలను కర్తవ్యాలను సమున్నతంగా నిర్వహించినప్పుడు మాత్రమే ఆ సమాజంలో ఉన్నత సమాజం గా గుర్తించబడి మరింత ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఈ ఆకాంక్షను కలిగి ఉండడాన్ని రాజనీతిజ్ఞత అని ప్రముఖులు నిర్వచించారు. అంటే రాజకీయాల్లోను సామాజిక బాధ్యతల నిర్వహణ క్రమంలోనూ సాహిత్యరంగంలోనూ ఉన్న వ్యవస్థ మరింత ఉన్నతంగా చేరుకోవడానికి నిబద్ధతతో పని చేయడాన్ని రాజనీతిజ్ఞత అనవచ్చు.
ఈ క్రమంలో లో ఇటీవలి కాలంలో చాలామంది వర్తమాన కవులు, యువ కవులు పుట్టుకు వచ్చారు. వీరంతా సమాజాన్ని అధ్యయనం చేయడంతో పాటు సాహిత్యాన్ని అధ్యయనం చేస్తేనే తిరిగి ఉత్తమ సాహిత్యాన్ని నిర్మించే అవకాశం ఉంటుంది. అప్పుడు సాహిత్య ప్రభావం సమాజంలో మెండుగాను, నిండుగా ఉంటుంది
ఈ సందర్భంలో పుస్తకాల పట్టణానికి సంబంధించి "నిత్య కృత్యం అవ్వాలి" అనే శీర్షికన నా కవితను మీ ముందుంచుతున్నాను
పఠనం నటన గా కాకుండా
మనసు పెట్టి అవలోకించాలి
ఏది పడితే అది చదవడం కూడదు!
ఎట్ల పడితే అట్ల చదవడం కాకూడదు!
జన జీవితానికి nitadu వంటి అంశం
ప్రజా ప్రయోజనానికి పాకులాడే ముచ్చట
సగటు మనిషి జీవిత కథా చిత్రీకరణ
అదే పుస్తకం మనకు పటన యోగ్యం
మొక్కుబడిగా పేజీలు తిప్పడం కాదు,
పరిశీలనా దృష్టితో సామాజిక చింతన తో
సాగే నిత్య అధ్యయనమే పుస్తకపఠనం!
ఉత్తమ సాహిత్యాన్ని అందించే కవులున్నారు
బాలల కోసం పాకులాడే సాహితీవేత్తలు ఉన్నారు.
మార్పు కోసం తపన పడే రచయితలు ఉన్నారు.
అంతరాలు, అసమానతలు, వివక్షతను కూల్చి,
సమ సమాజం వైపు నడిపించే సామ్యవాదులు ఉన్నారు.
రచయిత ను బట్టి పుస్తక ఎంపిక కాదు!
ఆశయాన్ని బట్టి పుస్తక ఎంపిక చేసుకోవాలి.
సానుకూల ఆలోచన సమానత్వం తెస్తుంది.
ప్రతి ఇంటా ఊరువాడా చదవాలి.
మనసు పెట్టి సమాజాన్ని పరిశీలించాలి.
నిద్ర ఆహారం లాగా.....
పుస్తక అధ్యయనం నిత్యకృత్యం కావాలి.
పాఠకులను పెంచాలి బాధ్యతలు పంచాలి.
సమాజం వికసించాలి.
( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు కవి రచయిత సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు అధ్యక్షులు జాగృతి కళాసమితి హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట)
[11/4, 20:34] వడ్డేపల్లి మల్లీశం గారు: నేటి మాట 219/4.11.20 బుధవారం
మానవ సంబంధాలు- మానవతా విలువలు
-- వడ్డేపల్లి మల్లేశము,9014206412
^^^^^^^^^^^^^^^&^^^^^^^^^^^^
కుల, మత, ప్రాంత ,వర్గ, వర్ణ ,లింగ, భాష, ఆర్థిక అంశాలకు అతీతంగా సాజన్ న్యాయ సూత్రాలకు అనుబంధంగా మనుషుల మధ్య కొనసాగాల్సిన సానుకూల సంబంధాలను మానవ సంబంధాలు అంటారు. ఈ రకమైన సంబంధాలు ప్రాచీన కాలంలో, గ్రీకు, సింధు నాగరికత కాలాలలో, క్రీస్తు పూర్వం బుద్ధుని కాలంలోనూ సజీవ మానవ సంబంధాలు కొనసాగినట్లు గా చరిత్రకారులు చెబుతున్నారు. ఈ అంశానికి బలాన్నిచ్చే మరొక ఆధారం ప్రాచీన కాలంలో మనుషులంతా సమానమే అన్న మతం బౌద్ధ మతం అని చెప్పడంలోనే దాని ప్రాధాన్యత తెలుస్తున్నది. ఒక సమాజం సాఫీగా నడుస్తున్నంత సేపు, వ్యక్తులు సమూహాలలో కృత్రిమ ఆలోచనలు రానంత వరకు, పై నుండి ఇతర శక్తుల ప్రభావం లేనంత వరకు మానవ సంబంధాలు ఆరోగ్యకరంగా నూ సజీవంగా ను కొనసాగినట్లు తెలుస్తోంది. అందుకే ప్రఖ్యాత శాస్త్రవేత్త " రూసో"
" పుట్టుకతో మనిషి సహజంగా మంచి వాడేనని భౌతిక, సామాజిక శక్తులు పరిస్థితులు అతన్ని ప్రభావితం చేయడం వల్లనే వికృతంగా మారుతున్నాడు" అని అంటాడు.
పై అంశాలను పరిశీలించిన తర్వాత ప్రస్తుత సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక నేపథ్యం లో మానవ సంబంధాలను6 ప్రాతిపదిక అయినా మానవతా విలువలను పరిశీలించ వలసి ఉన్నది.
మానవ సంబంధాలు అంటే ఏమిటి?:-
***************************************
మానవ సంబంధాలు అనే పదం చాలా విశాల అర్థాన్ని కలిగి ఉన్నది. కుల సంబంధాలు, బాంధవ్యాలు ,రక్త సంబంధాలు మానవ సంబంధాల లో అంతర్భాగం. ఆదిమ కాలంలో లో భాష లేకపోయినా శబ్దాలతో ని పరస్పర అవగాహనతో సైగల ద్వారా సామూహిక సహవాసం చేసిన సందర్భాలున్నాయి. క్రమక్రమంగా నాగరికత వెల్లివిరిసి భాషలు ఉద్భవించడం ఇనుము ఇతర ఖనిజాలు కనిపెట్టబడిన తరువాత వివిధ నాగరికత దశలను దాటి ఉన్నత స్థాయికి చేరుకున్న నేటి కాలంలో కూడా తిరిగి ఒకసారి దారి తప్పుతున్న మన జీవన విధానాలను సజీవ సంబంధాలను కొనసాగించాలని మానవ బంధాలను సమీక్షించుకోవలసిన అవసరం అనివార్యంగా ఏర్పడినది.
కారణాలు ఎన్నున్నా ఏవైనా ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే తప్పుడు విధానాలకు, సోయ లేని తనానికి, నిర్లక్ష్యానికి, అక్రమ మార్గాలకు కళ్లెం వేయకపోతే నాగరికత ముసుగులో మనం పతనం అంచుకు చేరుకునే ప్రమాదం ముంచుకు రాగలదు.
బలహీనమైన మానవ సంబంధాలు అన్వేషణ:-
^^^^^^^^^^^^^^^–---------------
ఎవరికి వారిమే గతానికి ప్రస్తుతానికి ఒక యాభై సంవత్సరాల క్రితానికి ఇప్పటికీ కుటుంబాలు, సమూహాలు ,గ్రామాలు, పట్టణాలు వేదికగా ప్రజల మధ్య కొనసాగుతున్న సంబంధాలను పరిశీలిస్తే భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ను మనం గుర్తించవచ్చు. కుటుంబ సభ్యులను పట్టించుకోకపోవడం, నిర్జీవ స్థాయికి చేరుతున్న బంధుత్వాలు, అవసరం మేరకే వాడుకొని దూరం కొట్టడం, పని చేసినప్పుడు లేని కులం అడ్డంకి ఇతరత్రా రావడం, కులం, పేదరికం, వృద్ధాప్యం, అమాయకత్వం, నిరక్షరాస్యత ముసుగులో తోటి మనుషులను అవమానించి ఈసడించి గెంటి వేయడం, భౌతిక దాడులకు పాల్పడడం మనుషుల మధ్యన మనం చూస్తున్న అనాగరిక చర్య లు కొన్ని.
ఇక మానవ సంబంధాలు బలహీనం కావడానికి ఆ నేపథ్యంలో జరుగుతున్న పైన పేర్కొన్న అనాగరిక చర్యలకు మూలాలను
పరిశీలించవలసి ఉంది. "ధనమెచ్చిన మదమెచ్చును" అన్నట్లు ఆర్థికంగా బలోపేతం కావడం పేదవారి పట్ల సహజంగా చిన్న చూపు చూడడానికి ప్రధాన కారణమే.
స్వార్ధపరత్వం ,అహంకారం, యాంత్రికీకరణ పారిశ్రామికీకరణ, ప్రభుత్వ రంగం క్రమంగా తగ్గి ప్రైవేటు రంగం పెరిగిపోవడం, పేదరికం నిర్మూలించకపోవడం, అసమానతలు అంతరాలు వివక్షత గణనీయంగా పెరిగిపోవడం, ప్రభుత్వం కూడా పెట్టు దారుల పక్షాన వ్యవహరించడం డబ్బు సంపాదించాలనే కాంక్ష, తీరిక లేకపోవడం
మొదలైనవి. వీటికి తోడు మీడియా ప్రభావం, టీవీ, సినిమా సంస్కృతి, ప్రపంచ బ్యాంకు కనుసన్నల్లో కొనసాగుతున్న సామ్రాజ్యవాద ధోరణి, శోభనం మన తగ్గిపోవడం కూడా ప్రధానమైన కారణాలుగా చెప్పుకోవచ్చు.
అంటే సామాజిక రాజకీయ ఆర్థిక సాంస్కృతిక సాహిత్య రంగాలలో వచ్చిన పెను మార్పులు మనిషిని ఉక్కిరిబిక్కిరి చేయడంతో పాటు మనిషి కూడా కొన్ని స్వార్థపు చర్యలకు పాల్పడడం కూడా ప్రధాన కారణాలే.
మానవతా విలువలపతనం:-
--------------------------
సమాజంలో మానవతా విలువలను విస్తృతంగా నింపి ప్రచారం చేయవలసిన కొన్ని రంగాలు తమ సామాజిక బాధ్యతను విస్మరించడం కూడా దుస్థితికి కారణాలు.
పూర్వకాలం నాటి నైతిక విద్య కానీ, శతక సాహిత్యం కానీ ,సామాజిక, సాహిత్య విలువలను పెంచే పాఠ్యాంశాలుగా ని అంతగా లేకపోవడం వాటిని నొక్కి చెప్పకపోవడం మనిషి పక్కదారి పట్టడానికి కారణం అవుతున్నది.
సోదర భావాన్ని పెంచడం ,తోటి మనిషిని సాటి మనిషిగా గుర్తించడం, విశాల భావాన్ని అలరింప చేయడం, పరస్పర స్నేహసంబంధాలను అన్నిటికీ అతీతంగా కొనసాగించడం, స్వార్థాన్ని విడిచిపెట్టి చరిత్ర అధ్యయనం ద్వారా తమకంటూ ఒక పేజీని లిఖించు కోవడానికి వీలుగా త్యాగాలకు సిద్ధపడటం, అంతా నాకే కావాలి అనే
ఆలోచన నుండి అందరి కోసం అనే భావన పెంపొందింప చేయడం నేటి తక్షణ కర్తవ్యాలు.
విద్యారంగము, సామాజిక రంగం, సాహిత్య రంగం, కవులు కళాకారులు మేధావులు సామాజిక బాధ్యతను చిత్తశుద్ధిగా
భుజానికి ఎత్తుకోవడం ద్వారా ఇది క్రమంగా
సాధ్యపడుతుంది.
అంటరానితనాన్ని పాటిస్తూనే వారి సేవలను పొందే ద్వంద వైఖరి విడనాడడం కూడా అత్యవసరం. మానవ వికృత చేష్టలకు కళ్లెం వేయడానికి రాజ్యాంగ పరిధి మేరకు చట్టాల నిబంధనలకు అనుగుణంగా ఉన్న అంశాల్లో చట్టాలను అమలు చేయడం ద్వారా వ్యక్తి దుష్ప్రవర్తన ను కట్టడి చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. క్రమంగా మసకబారుతున్న మానవ సంబంధాలను కాపాడుకోవడానికి బహుముఖ వ్యూహాలను అమలు చేస్తే తప్ప మానవ సంబంధాలలో గత వైభవాన్ని సాధించలేము. అందుకే అక్షరాస్యులు నిరక్షరాస్యులు అనే తేడా లేకుండా మనసున్న మంచి మనుషులుగా తయారు కావడంతోపాటు పరమత సహనం, ఇతర ప్రజానీకాన్ని సహించే సామరస్య ధోరణి పెంపొందించుకోవడం కూడా చాలా తోడ్పడుతుంది. ఇక ఎవరికి వారు మీ ప్రశ్నించుకోవడం ప్రధానమైన అంశం. ఉత్తమ సాహిత్యాన్ని ఉత్తమ నాగరికతను అధ్యయనం చేయడం ద్వారా ఉన్నత విలువలను పెంపొందించుకునే క్రమంలో రాజీ మార్గంలో ప్రపంచమంతా కుటుంబం అనే
విశ్వజనీనత కు అంకురార్పణ జరిగితేనే మానవతా విలువలు మేల్కొని చిగురిస్తాయి. మసకబారిన మానవసంబంధాలు వికసిస్తాయి. ప్రకాశిస్తాయి. అందరికీ వందనాలతో.. ...సామాజిక బాధ్యతగా వ్యవహరిస్తారని, సమాజాన్ని, సాహిత్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా కొనసాగుతున్న విలువలను, పరిస్థితులను గమనించి తదనుగుణంగా వ్యూహాలను మార్చుకుంటారని ఆశిస్తూ........
( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు, కవి ,రచయిత ,అధ్యక్షులు జాగృతి కళాసమితి హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట)
[11/5, 09:09] వడ్డేపల్లి మల్లీశం గారు: నేటిమాట220/5.11.20 గురువారం
పోరాటమే జీవితంగా బ్రతికిన నల్ల నరసింహులు. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర.
-- వడ్డేపల్లి మల్లేశము,9014206412
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
నిజాం రాజు పాలకుడిగా తన ఆధ్వర్యంలో రజాకార్లు ,సర్దేశాయి లు జమీందార్లు ,జాగీర్దార్లు,మక్తేదార్లు, దేశ్
ముఖ్లు,సర్దేశముఖ్లు అంతా కలసి లక్షలాది తెలంగాణ ప్రజలపై దశాబ్దాలుగా కొనసాగించిన రాక్షస, పైశాచిక ,దాడికి వ్యతిరేకంగా అణచివేత, హత్యాకాండ, అత్యాచారాలకు ప్రతిఘటన గా అప్పటిదాకా బాంచన్ నీ కాల్మొక్తా అని బ్రతిమిలాడిన పేద రైతాంగ జనం చేతులను, శరీరాలను, కారం పొడిని,గుత్పలను, చివరికి బందూకులను
పట్టి జరిపిన ప్రపంచ ప్రసిద్ధి చెందిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఎందరో వీరులు నేలకొరిగారు మరెందరో పోరాడినారు. అందులో సింహ గర్జన చేసిన పోరు బిడ్డ పేద పద్మశాలి యువకిశోరం కడివెండి గడ్డ నల్ల నరసింహులు.
నాటి పరిస్థితులు కొన్ని:-
^^^^^^^^^^^^^↑^^^^^^^^^^^^^^^^^^^^^
నాటి నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రంలోని 7430 గ్రామాలలో ఆయన సొంత ఖర్చులకోసం సర్ఫ్ ఎ ఖాస్ అని పిలువబడే భూమి ప్రభుత్వ దళారులై
న పైన చెప్పబడిన వారి చేతుల్లో ఉండేది.
పన్నులు వసూలు చేసే అధికారాన్ని పొందిన కొందరు భూస్వాములు వేల లక్షల ఎకరాల భూములను వారి అజమాయిషీలో పెట్టుకునేది. ప్రజలందరూ కౌలుదార్లు కూలీలు దొరల గదిలో వ్యక్తి బానిసలుగా బ్రతికే నిస్సహాయ స్థితిలో ఉండేవారు.
ఉదాహరణకు మానుకోట కు చెందిన జనా రెడ్డి ప్రతాపరెడ్డి కుటుంబం లక్షా 50 వేల ఎకరాల భూమిని, విసునూరు దేశముఖ్ రాపాక రామచంద్రారెడ్డి కి 60 గ్రామాలకు సంబంధించి 40 వేల ఎకరాల భూమి సూర్యాపేట దేశముఖ్ 20 వేల ఎకరాల భూమిని కలిగి ఉండేవారు. దిక్కు మొక్కు లేని లక్షలాది పేద జనం భూముల్లో పంట పండిస్తుంది ఆ ఫలాన్ని అనుభవిస్తూ సర్వాధికారాలు కలిగి తరతరాలుగా ప్రజలను హింసిస్తూ దోపిడీ చేస్తున్న పదుల సంఖ్యలో భూస్వాములు ఒక అసమ సమాజాన్ని నిర్మించి అనివార్యంగా ప్రజా పోరాటం రూపుదిద్దుకోవడానికి కారణమయ్యారు.
ప్రజలకు భూములు లేవు అన్ని దొరల భూములే ఒకరిద్దరికి ఉన్న ఆ భూమిని జప్తు చేసుకునేవారు. ఆగడాలను ఎదిరించిన వారిని పోలీసుల సహకారంతో ,రజాకార్ గుండాలతో ,తామే స్వయంగా పోషించే రౌడీ మనుషులతో దాడి చేయించి చంపేవారు.
తెలంగాణ ప్రాంతం అంతటా వందలకొద్దీ గడీల కింద ప్రజలు నలిగిపోతూ కాలగర్భంలో కలిసిపోతున్న దుర్భర పరిస్థితులలో మరొకవైపు విద్యాగంధం లేక తెలుగు పాఠశాలలు కన్న రాకపోవడంతో సంస్కృతి సాంప్రదాయాలు భాషను రక్షించుకోవడం కోసం ఆంధ్ర మహాసభ పేరుతో కమ్యూనిస్టుల ప్రవేశం వారి ఆగడాలకు కళ్లెం వేసే కొత్త రూపాన్ని సంతరించుకున్నది. కమ్యూనిస్టు పార్టీ నిషేధించడం వల్లనే ఆంధ్ర మహాసభ రూపంలో ఉద్యమాన్ని ఉధృతం చేయవలసి వచ్చింది. పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణరెడ్డి ,బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి ,దేవులపల్లి వెంకటేశ్వరరావు, భీమిరెడ్డి నరసింహారెడ్డి, తరిమెల నాగిరెడ్డి వంటి మానవీయ కోణంలో ఆలోచించే భూస్వామ్య కుటుంబాలకు చెందిన వారు అయినప్పటికీ తమ యావదాస్తిని ప్రజలపరం చేసి, భార్యా పిల్లలతో ఉద్యమంలో దూకడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అలాగే నికృష్ట జీవితం గడుపుతున్న అతి పేద కుటుంబాలకు చెందిన వారు కూడా నిరక్షరాస్యులైన ఉద్యమస్ఫూర్తితో ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో తెలంగాణ పోరు లో నిలిచిన
ధీరులు ఎందరో. నల్ల నరసింహులు, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ బండి యాదగిరి వంటి పేదలు ఎందఱో ఎందరెందరో.
నల్ల నరసింహులు ప్రస్థానం:-
**************************
40 నుండి 45 వరకు మధ్య జరిగిన దోపిడి 45 ప్రాంతంలో మరింత ఎక్కువ కావడంతో ఉద్యోగం అనివార్యమైనది.
భువనగిరిలో జరిగిన ఆంధ్ర మహాసభ పదకొండవ సభలో చేసిన తీర్మానాల మేరకు సంఘాలుగా ఏర్పడి ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని కార్యాచరణ ప్రకటించారు. ఆ పిలుపు అందుకున్న కడివెండి గ్రామానికి చెందిన పేద పద్మశాలి బిడ్డ నల్ల నరసింహులు తెలంగాణ సాయుధ విముక్తి ఉద్యమ పోరాట కెరటాలలో ఒకడిగా విప్లవ్ ఇచ్చినాడు. చారిత్రాత్మక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన ఆంధ్రమహాసభలో అత్యంత కీలక పాత్ర వహించిన నల్ల నరసింహులు వేలాది మంది యోధులతో నిజాం ప్రభుత్వాన్ని ప్రతిఘటిస్తూ జనగామ ప్రాంతాల నాయకుడిగా వీరోచిత విముక్తి పోరాటంలో పాల్గొని ఎన్నో త్యాగాలు చేశాడు. ఎన్నోసార్లు పోలీసులకు పట్టుబడి చిత్రహింసలకు గురై కోర్టు కేసులు ఎదుర్కొని మూడు సార్లు ఉరిశిక్ష విధించబడిన ఎప్పటికీ న్యాయస్థానములో అత్యంత ధైర్యంగా తన వాదనలను వినిపించి న్యాయస్థానాలు పోలీసుల చేతనే తెలంగాణ టైగర్ అని కీర్తించబడ్డ సామాన్య పేద బిడ్డ అసామాన్య వీర కిశోరం గా మారి నాడు.
నా సందర్శనలో కడివెండి గ్రామాన్ని కడివెండి గ్రామ ప్రారంభంలోనే ఉండే స్మారక స్థూపం, గ్రామం నడిబొడ్డున గల తొలి amarudaina దొడ్డి కొమురయ్య స్మారకస్థూపం మొదలైనవి చూసి బాబు ఉద్వేగానికి గురైన అనుభూతి నాస్వీయ
అనుభవం. నరసింహులు స్వగ్రామం కడవెండి అది ప్రస్తుతం జనగామ జిల్లాలోని పాలకుర్తి మండలానికి పది కిలోమీటర్ల దూరంలో గల చిన్న గ్రామం. చేనేత పని చేసి నాటి ఉర్దూ మీడియం లో ఏడవ తరగతి వరకు మాత్రమే చదువుకున్న నరసింహులు తన కుటుంబ ఆర్థిక పరిస్థితులను కూడా పక్కనపెట్టి నాటి దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించడానికి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఏళ్లతరబడి అజ్ఞాతంలో ఉండి పోరాడిన ధీరుడు వీరుడు. కనీసం ఆ గ్రామంలో వారు నివసించిన ఇంటి స్థలాన్ని కూడా చూడలేకపోయినా అంటే ఎలాంటి దాఖలాలు లేకుండా ఆ కుటుంబమే కనుమరుగైనది. నిర్మాణ రంగంలోకి దూకిన నల్ల నరసింహులు జనగామ తాలూకా లోని ఎన్నో గ్రామాలలో సంఘం దళాలను నిర్మించి స్వయంగా నాయకత్వం వహించి అగ్ర నాయకత్వానికి కింది దళాలకు సమన్వయ పరిచిన మేధావి కొదమ సింహం నరసింహులు. ప్రజలను కార్యకర్తలను సంఘటిత పరచడంతో దొరలకు రజాకార్లకు నిద్ర లేకుండా చేశాడు. ఆనాడు విసునూరు రామచంద్రారెడ్డి తల్లి జానమా కడివెండి గ్రామం లో దొర గా పిలువబడుతూ దోపిడీ చేసేది. నల్లా నర్సింహులు మొట్టమొదటి తిరుగుబాటును తన సొంత ఊరు కడివెండి లోని జానమ్మ పైననే మొదలుపెట్టి న సందర్భములో 1947 సెప్టెంబర్ 11న నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా భూస్వాముల ఆగడాలను తరిమికొట్టేందుకు ఆంధ్ర మహాసభ నిజమైన సాయుధ పోరాటానికి పిలుపు ఇవ్వడం జరిగింది
భూస్వామ్య వ్యవస్థ బలంగా పాతుకుపోయిన నల్గొండ కరీంనగర్ వరంగల్ ఖమ్మం జిల్లాలోని లక్షలాదిమంది నిరక్షరాస్యత ప్రజా సైన్యం ఎక్కడికక్కడ దొరల గడిల పై రజాకార్లపై పోలీస్ క్యాంపు లపై ప్రతీకారం తీర్చుకున్నారు. వెట్టి పేరుతో తరతరాలుగా బందీ అయిన ప్రజల అప్పు పత్రాలను కాల పెడుతూ గడిల ను ధ్వంసం చేస్తూ దొరలను ప్రజాకోర్టులో నిలబెట్టి శిక్షిస్తూ వేల కొలది ఎకరాలభూములను విముక్తి చేసి దున్నే వాడికి పంచిపెడుతూ ఈ విముక్తి ఉద్యమం 1951 అక్టోబర్ వరకు కొనసాగింది ఈ ఉద్యమంలో వేలాది మంది నేలకొరిగారు.
పరకాల లో జెండా పండుగ నాడు భయంకర సామూహిక హత్య తర్వాత బైరాన్పల్లిలో 118 మందిని కాల్చి చంపి కమ్యూనిస్టుల పై ప్రతీకారం తీర్చుకున్నారు.
అజ్ఞాత దళాలు అటు రజాకార్లు పోలీసుల అమానుష చర్యలతో తెలంగాణ అంతా అగ్నిగుండమే ప్రజ్వరిల్లుతున్న వేళ 122 జలాలను ఆత్మార్పణ గెరిల్లా సమూహాలను నిర్మించి నాయకత్వం వహించిన నరసింహులు కదనరంగంలో ముందుండి నడిపించి అనేకసార్లు హింసను అనుభవించాడు.
నరసింహులు పైన నేరాలు త్యాగాలు:-
********(**************************
నిజాం రాజు దిగిపోవడంతో సమస్య పరిష్కారం కాలేదు. కొత్త సమస్య ప్రారంభమై యూనియన్ సైన్యాలు కమ్యూనిస్టులను పైన దాడులకు తెగబడ్డారు. 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచి పెట్టగా తిరిగి భూస్వాములకు అప్పగించే విధంగా ఆ సైన్యాలు ఒత్తిడి చేసి కమ్యూనిస్టులను తరిమికొట్టిన వి. వందలాది మంది కమ్యూనిస్టు కార్యకర్తలను నాయకులను అడవుల్లోకి తరుముతూ హత్య చేస్తున్నప్పుడు సికింద్రాబాద్ జైలు 12 మందిలో ఒకడిగా ఉండి రేపు ఉరితీయబడ్ తాడు అనగా అంతర్జాతీయ కమ్యూనిస్టు సంస్థలు భారత ట్రేడ్ యూనియన్ లో ఆందోళన ఫలితంగా ఉరితీత కు 12 గంటల ముందు నరసింహులు ఉరితీత నిలిపివేయబడింది.
సంకెళ్ళతో బంధించబడ్డ నరసింహు
లును చూడడానికి వచ్చిన సైనిక జనరల్ జె.ఎన్.చౌదరికి జిల్లా ఎస్పీ ధనరాజు నాయుడు సంకెళ్ళతో ఉన్న నరసింహన్ను టైగర్ ఆఫ్ తెలంగాణ అని పరిచయం చేసాడట. నిరంతరం గర్జించి ఉరిమే పులి అని నరసింహులు అనేవారని ఆ గ్రామ ప్రజలు మా సందర్శనలో నాతో చెప్పినారు. నిజామును కూలదోసిన కమ్యూనిస్టులు నెహ్రూ ప్రభుత్వానికి కూడా ప్రమాదమే అనే తప్పుడు సంకేతం తో కమ్యూనిస్టు పార్టీ నిషేధించడం కాకుండా హెలికాప్టర్ల ద్వారా కరపత్రాలు పంచి అజ్ఞాత నాయకులను క్యాడర్ను లీడర్ను లొంగిపోవాలని హెచ్చరించిన నేపథ్యంలో నరసింహులు తో పాటు అనేక మంది యోధులు నల్లమల్ల రాచకొండ అడవుల్లోకి పారిపోయి పోరాట విరమణ తర్వాత తిరిగి జనం లోకి వచ్చారు.
ఇప్పటికీ నరసింహుడు పై ఉన్నటువంటి కోర్టు కేసుల వల్ల నాటి ప్రతిపక్ష నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య చొరవతో చివరి ఉరి శిక్ష నుండి బయటపడి 1959 జనవరి 26న స్వేచ్ఛా ప్రపంచంలోకి కాలు పెట్టాడు.
తరువాత వీరోచిత పోరాటం చేసిన వ్యక్తిగా ఆదరణ లభించినప్పటికీ బొంబాయి సోలాపూర్ భీమండి తదితర ప్రాంతాలలో ఆదరించ బడిన తాను తన ధర్మపత్ని వజ్రమ్మ తెలంగాణ సాయుధ పోరాట మృతులు నాలుగువేల మంది పంపిణీ చేసిన 10 లక్షల ఎకరాల భూమి చారిత్రక విజయాలను స్మరించుకుంటూ జీవితమే నిరంతర పోరాటం అనే సిద్ధాంత అవగాహనతో తన శేష జీవితాన్ని గడిపాడు మహేంద్ర 93 నవంబర్ 5న కన్నుమూసిన కడివెండి గ్రామ ప్రజలకు జనగామ ప్రాంతంలో రాష్ట్ర స్థాయిలోనూ ఒక పోరాట వారసత్వం గా నిలిచిన నరసింహులు ప్రజా ఉద్యమాలకు మద్దతుగా అండగ ప్రజా పోరాటాల లోనే లీనమయ్యాడు. త్యాగాల పోరుబిడ్డ నరసింహులు చరిత్రను నేటితరం యావత్తు అధ్యయనం చేయకపోతే చరిత్రను విస్తరించినట్లు. ఏడవ తరగతి వరకు మాత్రమే చదువుకున్న నరసింహులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను నిక్షిప్తం చేయడం మరో విజయంగా చెప్పుకోవచ్చు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని అధ్యయనం చేయడం ద్వారా నేటి తరం నాటి సామాజిక రాజకీయ సాంస్కృతిక వాతావరణాన్ని ఉద్యమాలను ప్రతిఘటనను దోపిడిని అంచనా వేయవచ్చు నేటి పాలనకు హోల్ చుకోవడానికి నాటి ఉద్యమం నుండి స్ఫూర్తి పొందడానికి ఉపయోగపడుతుంది. సాయుధ పోరాట యోధుడు నల్ల నరసింహులు అమర్హై.
( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు అధ్యక్షులు జాగృతి కళాసమితి హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట)
[11/6, 21:46] వడ్డేపల్లి మల్లీశం గారు: నేటి మాట 220/6.11.20 శుక్రవారం
కపిలవాయి లింగమూర్తి జీవితము- పరిశోధనాత్మక సాహిత్యం-సామాజికస్పృహ
- వడ్డేపల్లి మల్లేశము,9014206412
↑^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ ---- ఉత్తమ సాహిత్యం సమాజానికి ఎంతో దోహదం అని మొగల్ చక్రవర్తుల కాలంలో గాని, శ్రీకృష్ణదేవరాయల కాలంలో గాని నాటి పాలకులు సాహిత్య పోషణ చేయడమే కాకుండా రాజులు సైతము పని ఒత్తిడిలో కూడా సాహిత్యాన్ని సృష్టించి సాహిత్య సంపదను సుసంపన్నం చేసినారు. క్రీస్తుపూర్వం బాణుడు, విజయనగర సామ్రాజ్య నేత శ్రీ కృష్ణ దేవరాయలు, అక్బర్ కాలంలో కూడా సాహిత్య అభిమానిగా సాహిత్య ప్రేమికుడిగా సాహిత్య పోషకుడుగా
భారతదేశంలో సాహిత్యము విరాజిల్లిన మాట అక్షర సత్యం.
దీని వెనుక గల తాత్వికతను అర్థం చేసుకుంటే పాలనాపరంగా ప్రభువులు, లేదా పాలకులు, ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం, అభివృద్ధి కొరకు తీసుకునే చర్యలతో ప్రజా జీవితం సుసంపన్నం కావాలని ఆశిస్తూ నే సాహిత్య రంగం లోని ప్రముఖ కవులు కళాకారుల రచనల ద్వారా సమాజానికి మరింత దోహదం జరుగుతుందని ఆనాటి పాలకులు ఆశించారు. స్వాగతించారు. అంతేకాదు నాటి కవులకు స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇచ్చి ప్రజల కోసం పని చేయడంలో ఉత్తమ సాహిత్యాన్ని పెంచి పోషించారు కూడా.
మరి నేడు ప్రజలకు ఉపయోగపడే మాటలు మాట్లాడిన ఉత్తమ రచనలు చేసిన అవినీతి అక్రమాలు అన్యాయాలపై ప్రతిఘటించే తత్వం ని ప్రజానీకానికి చైతన్యం తీసుకువచ్చిన అదేదో ప్రభుత్వానికి పెను ప్రమాదం పొంచి ఉన్నట్లు గా అనేకమంది సంపాదకులు, కవులు, కళాకారులు, రచయితలను పొట్టనపెట్టుకోవడమే కాకుండా కటకటాల్లో నిర్బంధించిన చరిత్ర ఈ దేశానికి ఉన్నది. ఈ నేపథ్యంలోనే ప్రజలకు సంబంధించినటువంటి ఉత్తమ సాహిత్యాన్ని వెలువరిస్తున్న కవులు కళాకారుల జీవితాలకు భరోసా ఇవ్వడంతో పాటు ఉత్తమ సాహిత్యానికి చట్టబద్ధతను తీసుకురావడం కోసం ఉత్తమ సాహిత్యాన్ని సృష్టించిన కవులు రచయితలను మననం చేసుకుంటూ ప్రజలు గా మనం వారికి మద్దతు అందించవలసిన అవసరం
ఉన్నది. అంతేకాదు ఉత్తమ సాహిత్యాన్ని పోషించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మనం నొప్పి చెప్పవలసిన అవసరం ఉన్నది.
గత ఐదారు సంవత్సరాలుగా ఉత్తమ సాహిత్యాన్ని అందించిన కవులు రచయితలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో "మౌనమే నీ భాష "అన్నట్లుగా గుడ్డిగా తల ఊపే స్థితికి రావడం బాధాకరం. ఆందోళనకరం.
ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రంలో అనేకమంది అనేక పరిశోధనాత్మక రచనలు చేసి జన జీవితాన్ని ప్రభావితం చేసిన లబ్దప్రతిష్టులైన సాహితీవేత్తలను సందర్భోచితంగా మననo చేసుకోవడం ద్వారా వారి నుండి స్పూర్తి పొందుదాం .ఆ సాహిత్యాన్ని వర్ధమాన రచయితల సాహిత్యాన్ని ప్రజా జీవనానికి అంకితం చేద్దాం. ఈ వెలుగులోనే మనం నేడు తెలుసుకో పోయే ప్రముఖ రచయిత కపిలవాయి లింగమూర్తి జీవితం సాహిత్యం.
లింగ మూర్తి గారి సాహిత్య సేవ:-
************************************
ఇప్పటికి పుస్తకాలు, గ్రంథాలు, రచనలు ఎందుకు చదవాలి అనే వాళ్లు కోకొల్లలు.
అదే సందర్భంలో ఉత్తమ సాహిత్యాన్ని పరిశోధనాత్మక విప్లవ అభ్యుదయ సాహిత్యాన్ని చదివే వాళ్ళు కోకొల్లలు కూడా.
కనుక నేటి కవులకు దిక్సూచి గానూ., పాఠకులకు ప్రయోజనాత్మకంగా నూ ఉత్ప్రేరకంగా ను ప్రేరణ గాను పని చేసి శక్తిని పొందడానికి ఉపయోగపడుతుంది కనుకనే ఉత్తమ సాహిత్యాన్ని అధ్యయనం చేయవలసిన అవసరం ఉన్నది.
పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ కవి, రచయిత, సాహితీ పరిశోధకుడు, దేవాలయాలు స్థల మూలాలు తెలిపే పరిశోధనలు చేసి చరిత్రకు ఆనవాళ్ళు అందించిన అగ్రశ్రేణి కవి. కవి కేసరి అనే బిరుదు గల వీరు శ్రీశ్రీ, తిలక్ కలలాగానే తొలినాళ్లలో పద్యరచన తో ప్రారంభమైన ఆ తర్వాత అన్ని ప్రక్రియల్లో మీ రచనలను కొనసాగించి సాహిత్యాన్ని శక్తిమేరకు సుసంపన్నం చేసినారు. ప్రధానంగా కథారచన, విమర్శ, జానపద సాహిత్యంపై పరిశోధన నేటి కవులకు ఎంతో ఉపయుక్తమైన రచనలు చేయడం పరిశోధన చేసే వారికి కూడా తోడ్పడుతుంది. వీరి జీవితము సాహిత్యంపై ఇప్పటికే నలుగురైదుగురు పరిశోధకులు పరిశోధన
పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది.
ఒక రచనపై పరిశోధకుడు పరిశోధించాలి అంటే మరింత లోతుగా వెళ్లడం ద్వారా భాష సాహిత్యం సంస్కృతి చరిత్ర ఆనవాళ్లను జనానికి అందుబాటులోకి తేవడమే అవుతుంది. ఇలాంటి పరిశోధనలు చేసే పరిశోధకులకు ప్రభుత్వపరంగా అనేక రకాల సౌకర్యాలు కల్పించడంతోపాటు భరోసాను ప్రభుత్వపరంగా ఇవ్వవలసిన అవసరం ఉన్నది.
కపిలవాయి భావన- రచనలు:-
^^^^^^^^^^^^^^^^^^^^^^
ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు భాషా సాహిత్యాలకు అంతేకాకుండా ప్రజల జీవితాలకు కొంత అన్యాయం జరిగిందని తపనపడే కపిలవాయి ప్రజలతో పేజీ లేదు కానీ నిర్వహణ వల్లనే ఈ దౌర్భాగ్యం తలెత్తినట్లు అంతేకాకుండా తెలుగు రాష్ట్రాలలో తెలుగు అధికార భాషగా కొనసాగక పోవడం పట్ల చాలా ఆవేదన చెందేవారు. అంతేకాకుండా పరిపాలన తెలుగులో జరగాలని ఉత్తర్వులు తెలుగు
లో వెలువడాలి అని బోధన తెలుగు మాధ్యమంలోనే కొనసాగాలని ఆశించేవారు ఆకాంక్షించే వారు.
ఈ సందర్భంలో ఒక మాట!
కోట్ల రూపాయలు పెట్టి ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించిన ,మంచి భోజనం, అంతకుమించి ప్రారంభ, ముగింపు సమావేశాలు ఘనంగా నిర్వహించి అతిథులను భారీఎత్తున సన్మానించుకున్న,..
తెలంగాణలో స్వరాష్ట్రంలో ఇప్పటికీ కపిలవాయి ఆకాంక్షలు నెరవేరలేదు.
రాష్ట్రం ఏదైనా తెలుగు మాధ్యమానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం ,ఉత్తర్వులన్ని ఆంగ్లంలోనే రావడం, తెలుగు భాషకు ఏరకంగానూ ప్రాధాన్యత ఇవ్వకపోవడం పాలనలో దాని ప్రస్తావనే లేకపోవడం బాధాకరం కాకుండా కపిలవాయి ఆలోచనలను తుంగలోతొక్కి నట్లే.
కొన్ని రచనలు వివరణ:-
*****************************
80 రచనలకు పైగా రాసినట్లు చెప్పబడుతున్న వీరి రచనలు అముద్రితాలు గా ఉన్న 25 రచనలు సాహితీ రంగంలో వీడియో ఒక స్థానాన్ని మనకు తెలియజేస్తున్న వి. ఉపాధ్యాయుడిగా ఉపన్యాసకుడిగా పనిచేస్తూనే చివరివరకు తన రచనా రంగాన్ని మొక్కవోని ధైర్యంతో అలుపెరగకుండా కొనసాగించడం నేటి కవులకు యువకులకు వర్తమాన కవులకు ఒక పాఠంగా స్వీకరించవలసిన అవసరం ఉన్నది. అది మనందరి యొక్క సామాజిక బాధ్యత.
" ఎంతసేపు ఎవరో చేస్తారు మనము చూస్తామని ధోరణిని విడనాడి వలసిన అవసరం ఉన్నది. అందుబాటులో ఉన్న సాహిత్యాన్ని కానీ వెతికిన సాహిత్యాన్ని గాని ఆలోచించము ,రచయిత కృషిని ప్రశంసించ
ము, పుస్తకాలను చదవo. మాటలతో సెల్ఫోన్ వ్యాపకాల తో కాలయాపన చేస్తూ నిర్వీర్యం అవుతున్న యువతకు భవిత నాశనము కాకుండా ఉండాలంటే పుస్తక అధ్యయనం చేయాలని నా విజ్ఞప్తి"...........
💐 అనుభవాలు అనుభూతులు తో కూడిన స్వీయ రచనలతో పాటు, పాలమూరు జిల్లా దేవాలయాలు 2010లో సమగ్ర పరిశోధన చేసి రచించారు. వీరి సంపాదకత్వంలో అనేక పుస్తకాలు వడమే కాకుండా కొన్ని అపరిష్కృతంగా ఉన్న అంశాలను పరిష్కరించడంతో పాటు కఠినమైన అంశాలకు వ్యాఖ్యానాలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా కావ్యాలు గీతాలు శతకాలు వచన సాహిత్యం స్థల పురాణాలు బాలసాహిత్యం మొదలైన ప్రక్రియలలో శతాధిక గ్రంథకర్త గా పేరుగాంచిన కపిలవాయి లింగమూర్తి సాహిత్యంపై ఇప్పటికే సిద్ధాంత గ్రంథాలు ఆరు వెలువడినట్లు గా అవి వివిధ విశ్వవిద్యాలయాలలో పరిశోధించే పడినట్లు తెలుస్తుంది.
కపిలవాయి జీవితము కొన్ని ఘట్టాలు:-
******************************************
ఉత్తమ సాహిత్యాన్ని సృష్టించిన కవుల జీవిత చరిత్రలు కూడా మనకు శిరోధార్యమే.
ప్రతికూల పరిస్థితుల్లోనూ, తమను ఏ రకమైన పరిస్థితులు ప్రభావితం చేసింది, ధైర్యంతో ఏ రకంగా సామాజిక బాధ్యత నిర్వహించడానికి కొనసాగించినది వారి జీవిత చరిత్ర ద్వారా తెలుస్తోంది. అందుకే కవులు ,కళాకారులు, పరిశోధకులు, మేధావులు, శాస్త్రవేత్తలు, ప్రజా నాయకుల జీవిత చరిత్రను అధ్యయనం చేయడం అనివార్యం. ప్రతి వారికి అవసరం కూడా!
ఉమ్మడి పాలమూరు జిల్లా అచ్చంపేట తాలూకా బల్మూర్ మండలం లోని జీను కుంట అనే గ్రామంలో మాణిక్యమ్మ వెంకటాచలం దంపతులకు మార్చి 31 1928 సంవత్సరంలో వీరు జన్మించినారు. అతి పిన్న వయసులోనే తండ్రి చనిపోవడంతో మేనమామ దగ్గర పెరిగి పాఠశాల విద్యను ఉర్దూ మాధ్యమంలో పూర్తిచేశాడు. ఆంధ్ర సారస్వత పరిషత్ పరీక్షలు రాసి అనంతరం
0.u. నుండి ఎమ్మెల్యే పట్టా పొంది నాగర్కర్నూల్ పాఠశాలలో తెలుగు పండితుడిగా, 1972 నుండి 83 లో ఉద్యోగ విరమణ చేసే వరకు వేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో లెక్చరర్గా పనిచేశారు.
సన్మానాలు బిరుదులు ప్రశంసలు:-
***********************************(*****
1983 లో నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, ఆ తర్వాత నారా చంద్రబాబునాయుడు, రాజశేఖర్ రెడ్డి వీరి సాహిత్య కృషికి ఘనంగా సన్మానించారు.
అలాగే తెలంగాణ ఆవిర్భావం అనంతరం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర సన్మానించడం ద్వారా నలుగురు ముఖ్యమంత్రులతో సన్మానించడం ఏకైక తెలుగు కవి పరిశోధకులుగా కపిలవాయి లింగమూర్తి మిగిలిపోయారూ
కొన్ని పురస్కారాలు:-
************
తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం, బూర్గుల రామకృష్ణారావు ప్రతిభా పురస్కారం, బ్రౌన్ సాహిత్య పురస్కారం, నోరి నోరి నరసింహశాస్త్రి పురస్కారం., కందుకూరి రుద్రకవి పురస్కారం, పులికంటి సాహితీ పురస్కారం, బి.ఎన్.శాస్త్రి స్మారక పురస్కారం వీరికి లభించినాయి.
వీరి ఉత్తమ సాహిత్యాన్ని గుర్తించిన వెన్నెల సాహిత్య అకాడమీ సంస్థ వీరి జీవితము సాహిత్యంపై" కవితా కళానిధి కపిలవాయి లింగమూర్తి అనే పేరుతో డాక్యుమెంటరీని నిర్మించగా 2011లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండవ ఉత్తమ డాక్యుమెంటరీ గా నంది అవార్డును ప్రకటించడం సంతోషకరం.
వీరికి లభించిన కొన్ని బిరుదులు:-
*********((((((**************((
1992 లో కవితా కళానిధి పరిశోధనా పంచానన, 96 లో కవి కేసరి, 2005లో వేదాంత విశారద, 2010లో గురు శిరోమణి, 2012లో సాహిత్య స్వర్ణ సౌరభ కేసరి, సాహితీ విరాణ్మూర్తి వంటి అనేక బిరుదులు లభించడానికి బట్టి వీరి సాహిత్య రంగంలో సేవలను కృషిని మనం అర్థం చేసుకోవచ్చు.
వారి జీవితాన్ని సాహిత్యాన్ని మనసుపెట్టి అధ్యయనం చేయడం ద్వారా వారి రచనలు పుస్తకాలను వెతకాలంటే చదవాలని ఆత్రుత మనలో కలుగుతుంది. ఆరాటం ఉంటేనే పోరాటం ఉంటుంద.
అప్పుడే జ్ఞానం మన సొంతం అవుతుంది. ఆ సామాజిక లబ్ధి కోసమే ఈ చిరు ప్రయత్నం.
( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, కవి, రచయిత ,అధ్యక్షులు జాగృతి కళాసమితి హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట)
[11/7, 21:46] వడ్డేపల్లి మల్లీశం గారు: నేటి మాట 221/7.11.20 శనివారం
భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత సర్ సివి రామన్ భారత శాస్త్రీయ పరిశోధనా రంగంలో కలికితురాయి
- వడ్డేపల్లి మల్లేశము,9014206412
***†*****************************
శాస్త్ర సాంకేతిక రంగం, పరిశోధన, సామాజిక, సేవా రంగాలలో పని చేస్తున్న నిపుణులు, శాస్త్రవేత్తలు, కళాకారులు, సామాజిక వేత్తలు చేసే కృషి ఒక దేశ అభివృద్ధిలో అనన్య సామాన్యమైనది.
ప్రభుత్వానికి అనుకూలమైన వాదనలు చేసి అనుకూల రచనలు చేస్తూ అందుబాటులో ఉండే వారి రచనలు లేదా పరిశోధన ప్రభుత్వ గుర్తింపు వస్తూ ఉంటే సృజనాత్మకత పద్ధతిలో నిర్మాణాత్మక రీతిలో ప్రజా సంక్షేమం ప్రజల కేంద్రంగా పనిచేసే పరిశోధన కారులకు ప్రభుత్వం కొంత వివక్ష ధోరణితో నే చూస్తున్న అనేది చరిత్రలోకి వెళితే మనకు తెలుస్తుంది. సూర్యుడు కేంద్రంగా భూమి తిరుగుతుందని వాదన వినిపించిన శాస్త్రవేత్తలను, జర్మనీలో శాస్త్ర పరిశోధనలు చేస్తున్న ఐన్స్టీన్ ఆదేశ నియంత నియంతృత్వానికి భరించలేక ఇతర దేశాలకు పారిపోయిన సంగతులు మనకు చరిత్రలో లభిస్తాయి. అలాగే ఇటీవలి కాలంలో భారతదేశంలోనూ అనేక మంది సామాజిక వేత్తలు, ,ప్రొఫెసర్, సంపాదకులు, ప్రముఖ సాహితీవేత్తలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రచనలు చేస్తున్నారనే నెపంతో విజ్ఞాన భాండాగారాన్ని సముద్రంలో విసిరివేసి నట్టు పాలకులే దుష్ట సాంప్రదాయాలకు ఒడిగట్టిన సందర్భాలు అనేకం. ప్రపంచంలో చాలా దేశాలలో శాస్త్రవేత్తలు పరిశోధకులు మేధావులు సామాజికవేత్తలు ను ఆయా దేశాల ప్రభుత్వాలు గుర్తించి గౌరవించి పాలనలో వారి సహకారాన్ని తీసుకోవడం అనేక దేశాల్లో జరుగుతున్న ప్రక్రియ. కానీ దానికి భిన్నంగా భారతదేశంలో శాస్త్రవేత్తలు, మేధావులు, సామాజికవేత్తలు, రచయితలు, విద్యా రంగ నిపుణులకు బదులుగా రాజకీయ నాయకులే మాట్లాడి ఆ రంగాలపై ఆధిపత్యం చెలాయించే డం అలవాటు. దానివల్లనే సాంకేతికంగా దేశం ముందుకు పోలేక రాజకీయ చట్రంలో బందీ అయి ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగానే కొనసాగడం మనం చేసుకున్న పాప ఫలమే.
అయినా భారతదేశంలోని అనేక మంది శాస్త్రవేత్తలు తమదైన శైలిలో నమ్మిన సిద్ధాంతం కోసం శాస్త్ర పరిశోధనలు చేసి ప్రపంచస్థాయి పేరును ఆర్జించిన మహానుభావులు ఎందరో కలరు అందులో ఒకరు సర్ సివి రామన్.
సి.వి.రామన్ శాస్త్ర సాంకేతిక పరిశోధన:-
^^^^^^^^^^^^^^^^^^^^^^^
ఎం.ఏ పూర్తి చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సంపాదించిన సి.వి.రామన్ ఉద్యోగరీత్యా కలకత్తాకు బదిలీ అయి నాడు.
ఉద్యోగ క్రమంలో భాగంగా ఇండియన్ సైన్స్ అసోసియేషన్కు రోజూ వెళ్ళి పరిశోధనలు చేసుకునేవారు. రామన్ చిత్తశుద్ధిని గమనించిన కలకత్తా విశ్వవిద్యాలయం వి.సి.
బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖ రాస్తూ రామన్ సైన్స్ పరిశోధనలను పూర్తి కాలానికి వినియోగించుకుంటే బాగుంటుం దని సూచించారు చేశారు కానీ బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించలేదు. దానితో రామన్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తికాలం పరిశోధన కొనసాగించడానికి సిద్ధపడ్డారు.
ఒకసారి కలకత్తాలో ప్రయాణం చేస్తున్నప్పుడు బాబు బజార్ స్ట్రీట్ వద్ద ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అనే బోర్డు చూసి ఆ సంస్థ కార్యదర్శి అమృతలాల్ సర్కార్ను కలిసి పరిశోధన చేయడానికి అనుమతిని పొందాడు. ఉదయం 10 నుండి 5 గంటల వరకు ఉద్యోగము సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి 10 గంటల వరకు పరిశోధన సెలవు దినాలు ఆదివారాలు కూడా పరిశోధనలోనే గడిపేవాడు.
అత్యంత ఆసక్తి పరిశోధన పట్ల జిజ్ఞాస తను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా యూనివర్సిటీ ఫిజిక్స్ ప్రొఫెసరుగా చేరడానికి దోహదపడింది. తన తల్లి పార్వతి సంగీత వాయిద్యాలను ప్రధానంగా మొదటి పరిశోధన కావించిన రామన్ శబ్దశాస్త్రం నుంచి తన పరిశోధనలను కాంతి శాస్త్రం వైపు మరణించినాడు. ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశము సముద్రం నీరు రెండింటికి నీలిరంగు ఉండటానికి కారణాన్ని పరిశోధించి సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెందడమే కారణం అని ఊహించాడు. తన ఊహను నిరూపించడానికి ద్రవాలు వాయువులు పారదర్శక ఘనపదార్థాలు కాంతి పరిక్షేపణం గురించి పరిశోధన చేయడం ప్రారంభించాడు.
యువ శాస్త్రవేత్త అయిన కె.ఆర్ రామనాథం కె ఎస్ కృష్ణన్ సివి రామన్ కు అండగా నిలిచారు. తగినంత అధునాతన పరికరాలు లేకపోయినా రామన్ తన ఆలోచనకు ప్రయోగ రూపంలో జవాబు లభిస్తుందని విశ్వాసముతో ముందుకెళ్ళి నాడు. 1928 ఫిబ్రవరి 28వ తేదీన రామన్ పారదర్శకంగా ఉన్న ఘన లేదా ద్రవ లేదా వాయు మాధ్యమం గుండా కాంతిని ప్రసరింపజేసే నప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది అని నిర్ధారణకు వచ్చాడు దీనినే రామన్ ఎఫెక్ట్ అన్నాడు. తన ప్రతిపాదనను వందల ఇరవై ఎనిమిది మార్చి 16వ తేదీన బెంగుళూరులో జరిగిన శాస్త్రజ్ఞుల సదస్సులో ప్రస్తావించడమే కాకుండా అందరి ముందు ప్రదర్శించాడు.
రామన్ ఎఫెక్ట్ పలువురి ప్రశంసలు సత్కారాలు.:-
******************************************
రామన్ ప్రతిపాదనకు సంతృప్తి చెంది బ్రిటిష్ ప్రభుత్వం 1929 లో నైట్హుడ్ బిరుదుతో సత్కరించింది. ఈ సందర్భంగా ప్రపంచ శాస్త్రవేత్తల బృందం రామన్ ఎఫెక్ట్ అసామాన్యమైన దని 200 రూపాయలు కూడా విలువ చేయని పరికరాలతో ఈ దృగ్విషయాన్ని నిరూపించడం అత్యద్భుతం అని ప్రపంచ శాస్త్రవేత్తలు కొనియాడారు.
వీరి సిద్ధాంత ప్రతిపాదనకు వందల ముప్పై లో నోబెల్ బహుమతి రాగా 1954 లో భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో గౌరవించింది. భారతరత్న పురస్కారాన్ని అందుకున్న సమయంలో రామన్ చేసిన ప్రసంగంలో విజ్ఞాన శాస్త్ర సారాంశం ప్రయోగశాలల పరికరాలతో వికసించదు . నిరంతర పరిశోధన స్వంతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞానశాస్త్ర సాగరాన్ని దాటడానికి ఉపయోగపడతాయి అన్న మాటలు ప్రభుత్వాలను శాస్త్రవేత్తలను ఆలోచింపజే
స్తున్నవి. నేను నా దేశం లో చివరి వరకు నిజమైన సైన్స్ నిర్మాణము చేయాలనుకున్నాను అంటూ చివరి వరకు శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి పాటుపడిన సర్ సివి రామన్ 1970 నవంబర్ 20 వ తేదీన మరణించినాడు.
రామన్ ఎఫెక్ట్ ధ్రువీకరించిన ఫిబ్రవరి 28వ తేదీ ని భారతదేశంలో నాటి నుండి జాతీయ విజ్ఞాన దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా ప్రభుత్వపరంగా అధికారికంగా వస్తున్నది.
జననము బాల్యము విద్యాభ్యాసం:-
^^^^^^^^^^^^^^^^--^^^^^^
చంద్రశేఖర వేంకట రామన్ అనే పూర్తి పేరు గల సి వి రామన్ 1888 నవంబర్ 7వ తేదీన మద్రాసు రాష్ట్రములోని తిరుచినాపల్లి సమీపములో అయ్యంపెటాయ్ అనే కుగ్రామంలో చంద్రశేఖర్ అయ్యర్ parvathi ammal దంపతులకు మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు.
విశాఖపట్నంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న సి.వి.రామన్ చిన్నతనం నుండి విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల అమితమైన ఆసక్తి ప్రదర్శించి పరిశీలన చేసేవారు. మరొకవైపు వారి తండ్రి భౌతిక శాస్త్ర అధ్యాపకుడు కావడంతో భౌతిక శాస్త్రం పట్ల ప్రత్యేక దృష్టి పెట్టడానికి కారణం అయ్యింది. 12వ ఏట మెట్రిక్యులేషన్ లో ఫిజిక్స్లో గోల్డ్మెడల్ సాధించి 1907లో ఎమ్మెస్సీ ఫిజిక్స్ లో యూనివర్సిటీకి ప్రథముడిగా నిలిచా డు. అపారమైన శ్రద్ధ పరిశీలనా దృక్పథం కలిగిన సి.వి.రామన్ 18 వ ఏటనే కాంతికి సంబంధించిన ధర్మాలపై ఈయన పరిశోధనా వ్యాసం లండన్ నుంచి వెలువడే ఫిలసాఫికల్ మేగజైన్లో ప్రచురించబడింది. ఆయనలోని పరిశోధనా అభిరుచిని గమనించిన అధ్యాపకులు ఇంగ్లాండు వెళ్ళి పరిశోధన చేయమన్నారు కానీ నిర్వహించిన వైద్య పరీక్షలో బృందంలోని ఒక వైద్యులు ఈయన ఇంగ్లాండ్కు వెళ్లడం వాతావరణం సహకరించదని చెప్పడంతో మాతృ దేశములోనే పరిశోధన చేయాలన్న ఆయన కళకు ఆటంకం కలగదని అందుకు చాలా సంతోషించాడు.
ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సంస్థలలో పరిశోధన కావించి భారతదేశ పరిశోధనా రంగానికి అద్భుతమైన చేయూతనందించిన డాక్టర్ సివి రామన్ విమానంతో పాటు శాస్త్రీయ రంగంలో దేశ అభివృద్ధికి చేయాలనే తపన నేటి తరం యువ శాస్త్రవేత్తలకు, విద్యావంతులకు, సామాజిక వేత్తలకు కనువిప్పు కావాలి.
శాస్త్రవేత్తలు ఎంత పరిశోధనలు చేసిన ప్రభుత్వాలు సంబంధిత అధికారులు ఆ పరిశోధన యొక్క సారాన్ని గుర్తించి అభివృద్ధి వైపు మరలి ఇస్తేనే ఈ దేశానికి గుర్తింపు, గౌరవం ప్రపంచస్థాయిలో లభిస్తుంది స్వార్థము, అక్రమ సంపాదన అన్ని రంగాల్లోనూ చొరబడిన నేటి కాలంలో శాస్త్ర సాంకేతిక రంగాలు ప్రలోభాలకు తలవంచితే జరిగేది విష పరిణామాలే. ఒకవైపు శాస్త్రవేత్తలకు సంపూర్ణ స్వేచ్ఛ స్వతంత్ర లతోపాటు బడ్జెట్ కేటాయించి ప్రోత్సహించవలసిన ప్రభుత్వాలు ఆ దిశగా కృషి జరగకుంటే పరిశోధనా లితాలు ప్రజల దరిచేరవు. వాటికి సార్థకత ఉండదు. ఈ విషయంపై ప్రభుత్వాలు మేధావులతో సుదీర్ఘంగా ఆలోచించి ఒక కార్యాచరణ ప్రక
తించాల్సిన అవసరం ఉన్నది.
-- వారి జయంతి సందర్భంగా ఈ ప్రత్యేక వ్యాసం మీ ముందుంచుతున్నాను.
( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు కవి రచయిత అధ్యక్షులు జాగృతి కళాసమితి హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట)
[11/8, 21:56] వడ్డేపల్లి మల్లీశం గారు: నేటి మాట 223/8.11.20 ఆదివారం
పర్యావరణ పరిరక్షణ పట్టని ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తలు-- పౌర ధర్మాన్ని విస్మరిస్తున్న ప్రజానీకం- కాలుష్య నిర్మూలన సమాజం బాధ్యత.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
పర్యావరణ పరిరక్షణ అనేది ఒక దేశానికి సంబంధించిన అంశం కానేకాదు. ఉమ్మడి ఓజోన్ పొర ,నదులు, సముద్రాలు,
ఉప్పెనలు ,సముద్ర ప్రవాహాలు ఇవన్నీ అంతర్జాతీయస్థాయిలో ఒక దేశంలో జరిగే సంఘటన తో ఇతర దేశాలు కూడా ప్రభావితమవుతాయి. జపాన్ లో చెలరేగిన ఉప్పెనలు, తుఫాన్, ప్రకృతి బీభత్సం ధాటికి పసిఫిక్ మహా సముద్రం అంతా చెత్త తో నిండిపోయిన విషయం మనందరికీ తెలిసినదే.
అందుకే ఇది అంతర్జాతీయ స్థాయి సమస్యగా ఐక్యరాజ్యసమితి పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఓజోన్ పొరను రక్షించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటూనే ఉన్నది. ఆ క్రమంలో దేశాలతో పాటు భారత దేశం కూడా దైనందిన సమస్యలపై స్పందించి పర్యావరణ పరిరక్షణ కాపాడుకోవడానికి కృషి చేయవలసిన అవసరం ఉన్నది.
ఐక్యరాజ్యసమితిలో సంతకాలు చేసినప్పటికీ దానికి భిన్నంగా ప్రభుత్వాలు పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు ప్రైవేటు రంగంలో పరిశ్రమలు నెలకొల్పడానికి విచ్చలవిడిగా అనుమతులు ఇస్తూ నిబంధనలు పాటించకపోవడంతో భూపాల్ విషవాయువు ఘటన నుండి ఇటీవల ఒక పట్టణంలో జరిగిన గ్యాస్ పేలుడు వరకు ఎంతోమంది బలైన విషయం మనందరికీ తెలిసినదే. సజీవదహనం మే కాకుండా వాతావరణం కాలుష్యం కావడం అందులో నుండి వచ్చే వ్యర్థ పదార్థాలు జల వాయు కాలుష్యమూలకు కారణం అవుతుంటే ఓజోన్ పొర ని ఎలా రక్షించేది రోగాల బారి నుండి ప్రజలను ఎలా కాపాడేది?
ప్రమాదాలు జరిగినప్పుడు కేవలం పరిహారం ప్రకటించడంతో ఆ సమస్య తీరిపోతుంది. యధావిధిగా ప్రైవేటు పెట్టుబడిదారీ వర్గం పర్యావరణ ద్రోహానికి పాల్పడుతూనే ఉన్న సందర్భంలో ప్రభుత్వాలు నియంత్రణ లేకపోవడం చాలా విడ్డూరం. పార్లమెంటులోనూ రాష్ట్ర శాసనసభలోనూ ఇందుకు సంబంధించిన చట్టాలను సమగ్రంగా చేసి ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో ఏదైనా కాలుష్యం ఏర్పడకుండా తగు శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఉన్నది లేకుంటే సమీప భవిష్యత్తులో రాబోయే తరాల జీవితం అంధకారం అవుతుంది.
పొగ కమ్ముకుంది ఢిల్లీ నగరం:-
*******************************
హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీ తదితర పరిసర ప్రాంతాల రాష్ట్రాలలో పంట పండించిన అనంతరం కొజ్జాలు కాలబెట్టిన సంప్రదాయంతో ఆ పొగ కమ్ముకుంది ఢిల్లీ పరిసర రాష్ట్రాలన్ని కాలుష్యం అవుతున్న విషయం గత మూడు నాలుగు సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. రైతులకు నచ్చచెప్పి ఆ విషయాన్ని ఎందుకు మానిపించడం లేదు ఎందుకు కృత్యము కాలుష్యాన్ని కొని తెచ్చుకోవడం.
విచ్చలవిడిగా వాడుతున్న ఎరువులు క్రిమిసంహారక మందులు పురుగు మందుల వలన భూమి నీరు కాలుష్యమై పండించిన పంటలు తింటూ ఉంటే అనేక రోగాల బారిన పడుతున్న విషయం శాస్త్రవేత్తలకు, ప్రభుత్వాలకు తెలవదా? కొన్ని ఇతర దేశాల్లో సేంద్రియ ఎరువుల విధానం ద్వారా పంటల పండించడంతో ఆరోగ్యానికి హానికరం లేనివిధంగా ఆహారాన్ని అందించే ప్రయత్నాలు జరుగుతున్న వి మరి భారతదేశంలో ఆ విషయాలు ఎందుకు పట్టించుకోవడం లేదు?
మరికొన్ని పర్యావరణానికి హాని చేస్తున్న అంశాలు:-
*******************************************
ప్లాస్టిక్ వాడకాన్ని రాష్ట్ర తో పాటు కొన్ని రాష్ట్రాలు నిషేధించి అమలు చేస్తున్నట్లు తెలుసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ప్లాస్టిక్ వాడకం మరింత పెరిగింది. మరోవైపు మద్యపాన దుకాణాలను విచ్చలవిడిగా పెరగడంతో వాడి పడేస్తున్న సీసాలు, ప్లాస్టిక్ డబ్బాలు, బాటిల్స్ కాలుష్యాన్ని మరింతగా పెంచుతున్నవి.
ఇటీవల హైదరాబాదులో వచ్చిన వరదలు అనేక అక్రమ నిర్మాణాలకు, పౌర ధర్మాన్ని విస్మరించిన ప్రజలు రాజకీయ నాయకులు చోద్యం చూస్తున్న ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వాలు కూడా కారణమే.
ఒకవైపు గ్లోబల్ వార్మింగ్ తో నీటి మట్టాలు పెరగడం కాకుండా ప్రాణవాయువును పెంచే చర్యలు చేపట్టకపోవడంతో క్లోరోఫ్లోరో కార్బన్లు వాతావరణం లో చేరి వాతావరణం వికృతం కావడానికి ఓజోన్ పొరకు నష్టం చేయడానికి కారణం అవుతున్నది. చెట్ల పెంపకం పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ తిరిగి విద్యుత్ తీగలు, అనేక ఇతర నిర్మాణాలకు ఆటంకం అవుతున్నాయని పెంచిన చెట్ల కంటే ఎక్కువ సంఖ్యలో చెట్లను కొట్టి వేయడం వల్ల 33 శాతం అడవుల లక్ష్యాన్ని చేరుకోలేక పోతున్నారు.
పౌర ధర్మాన్ని విస్మరిస్తున్న ప్రజానీకం:-
**************************************(
ప్రభుత్వ యంత్రాంగం విచ్చలవిడిగా చెత్తను బజార్ లో వేసే నిర్మాణాలు ఇస్తున్నట్టు ప్రకటించిన బోర్డులు ఉన్నప్పటికీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇక రాష్ట్రంలో రోడ్ల దుస్థితి దయనీయంగా ఉండడమే కాకుండా దుమ్ముతో ప్రజల ఆరోగ్యం అబాసుపాలు అవుతున్నది. ఇక ప్రజలు కూడా తమ దైనందిన జీవితంలో ప్లాస్టిక్ వస్తువులను ఎక్కువగా వాడడం చేతి సంచులను వాడకపోవడం పర్యావరణాన్ని పరిరక్షించి అనే స్పృహ లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం కూడా మనం ఇక్కడ ప్రస్తావించవలసిన అవసరం ఉన్నది. ప్లాస్టిక్ను మానండి పర్యావరణాన్ని కాపాడండి అని నినాదాలు ఇస్తూ ఊరేగింపులు చేసినప్పటికీ ఆచరణలో తిరిగి బజార్ కి వెళ్ళినప్పుడు షాపుల్లో చేతిలో కవర్ తోనే ఇంటికి వస్తున్న విషయం మీ అందరికీ తెలిసినదే. ప్రజానీకం స్వచ్ఛందంగా కవర్లను ప్లాస్టిక్ వస్తువులను ప్లాస్టిక్ బాటిల్స్ వాడకాన్ని బహిష్కరించినట్లు అయితేనే ప్రభుత్వం కూడా ఆలోచించే అవకాశం ఉన్నది నష్టం జరిగేది ప్రజలకే కనుక ప్రజలు ముందుగా సన్నద్ధం అయితే ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. ఇంట్లోని చెత్తను బయట వేయడం, అంతేకాకుండా చెత్తను మురుగు కాలువల్లో వేసి మురుగు నీరు ప్రవహించకుండా అడ్డుకోవడం, దుకాణాలలో వాడిన వ్యర్థ పదార్థాలు కూరగాయలు ఇతర తినుబండారాలను రోడ్లపై వేసి శుభ్రం చేయడం ఇదంతా మన బాధ్యతను విస్మరించడం కాదా?
ఒకవైపు ప్రభుత్వాలు పెట్టుబడిదారులు పరిశ్రమలో పరంగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుంటే బాధ్యత కలిగిన పౌరులుగా ప్రజానీకం కూడా అశ్రద్ధ చేయడం కొరివితో తల గోక్కున్నట్లు అవుతుంది.
విధానపరమైన నిర్ణయాలు పర్యావరణానికి సంబంధించిన పరిరక్షణ చర్యలు శాస్త్రవేత్తలు మేధావులు బుద్ధి జీవులతో ప్రభుత్వాలు ఆలోచించి ప్రజలకు చక్కటి ఆదేశాలను అందించడం ద్వారా ప్రభుత్వం కూడా ప్రభుత్వ యంత్రాంగం కీలక బాధ్యతలు పోషించాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మద్యం దుకాణాల తో పాటు ప్లాస్టిక్ బాటిల్స్ తో ప్లాస్టిక్ కవర్లు ఇతర వ్యర్థ పదార్థాలు ఫ్లెక్సీలను చూపించవలసిందిగా ప్రజానీకం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది.
రాజకీయ పక్షాలు అధికార పార్టీ ప్రభుత్వ పరంగా ప్రచార కార్యక్రమాలకు జన్మదిన లకు ప్రైవేటు ఆసుపత్రుల ప్రారంభోత్సవాలకు సంబంధించి ఫ్లెక్సీలను విచ్చలవిడిగా కడుతుంటే ఎలాంటి నియంత్రణ ప్రభుత్వం చేయక పోవడం శోచనీయం వాటిని వెంటనే నిషేధించడం ద్వారా ప్రజలకు ఆదర్శంగా ఉండవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.
( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు కవి రచయిత అధ్యక్షులు జాగృతి కళాసమితి హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట)
[11/9, 21:55] వడ్డేపల్లి మల్లీశం గారు: నేటి మాట 224/9.11.20 సోమవారం
వ్యక్తుల ప్రైవేటు బ్రతుకు వారి వారి సొంతం పబ్లిక్ లో నిలబడితే ఏదైనా అంటాం శ్రీశ్రీ వ్యాఖ్యానాన్ని నేటి సమాజానికి
అన్వయించుకుoదాం.
******************?************************
- వడ్డేపల్లి మల్లేశము,904206412
సందర్భానుసారంగా వ్యక్తుల మధ్య చర్చ జరిగినప్పుడు అవునండి నా
కుటుంబం నా ఇష్టం .ఎవరు మాట్లాడడానికి అంటూ ఉంటారు. ఒక స్థాయిలో అది వాస్తవమే కావచ్చు. కానీ ఈ వ్యక్తి సంఘజీవి అనే విషయాన్ని మరిచి పోతున్న సందర్భంలోనే ఈ దురహంకారం మనకు కళ్ళనిండా కనపడుతున్నది. అందుకే కాబోలు అరిస్టాటిల్" మానవుడు సంఘజీవి" అని హెచ్చరిక చేసి సమాజానికి ఒక ఆదేశాన్ని జారీ చేశాడు. చుట్టూ సమాజం ఉందని, కుటుంబాలు ,బంధుత్వాలు, మనుషులు, మానవ సంబంధాలు అన్నీ మరిచి ఈ లోకంలో మేము మాత్రమే బ్రతికే ఉన్నాము అని మురిసిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇతరుల గురించి పట్టించుకోని వారితో సంబంధం లేదు కానీ, దురహంకారము, dura బిప్రాయము, సమాజంపట్ల వ్యతిరేక ధోరణి కలిగి ఉన్న వారితోనే అసలు చిక్కు వచ్చి పడింది.
మా ఆస్తిపాస్తులు మాదేనని, మాకు ఎవరు ఏమి చేసి పెడుతలేరని, ఎవరికి లొంగి ఉండాల్సిన అవసరం లేదని, అవసరమైతే పదిమందికి మేమే పెడతామని, డాంబి
కాలు పలికేవారు ఈ సమాజంలో కోకొల్లలు.
సామాజిక చింతన లేకపోవడం, సమాజము గురించి సమస్యల గురించి సోయి లేకపోవడం, తమ గురించి మాత్రమే పట్టించుకోవడం, సంఘ జీవులం అన్న విషయం మరచి పోవడం, డబ్బు ఉందన్న అహంకారంతో పరుగెత్తడం, తమ కుటుంబం బాగుంటే చాలునని మురిసిపోవడం, కొడుకు, కోడలు, బిడ్డ ,అల్లుడు అందరూ ఉద్యోగులే
నని అతిగా ప్రవర్తించడం, తోటి మనిషిని సాటి మనిషిగా చూడాలని స్పృహ లేకపోవడం మనిషి ఒంటరివాడు కావడానికి ప్రధాన కారణాలు.
ఈ సందర్భంలో శ్రీశ్రీ అన్న మాటలను సర్వత్ర వర్తింపజేసుకుంటే మనసు కుదుటపడుతుంది .పరిష్కార మార్గం దొరుకుతుంది .సామాజిక చింతన కు సమాజం అలవాటు పడే పరిస్థితులు చేరువవుతాయి.
వ్యక్తుల ప్రైవేటు బ్రతుకు వారి వారి సొంతం*:-
***********************************
పైన తెలిపిన ఉపోద్ఘాతం కి కొంత ఉపశమనం పద్ధతిలో శ్రీశ్రీ గారు వ్యక్తుల ప్రైవేటు బ్రతుకు కొంత అవకాశం ఇద్దాం అని ఆలోచించారు. కానీ కడప దాటకుండా ఎంతసేపు ఇంట్లో ఉంటారు. బయటికి వస్తే పది మందిలో బాధ్యులు అవుతారు అందరిలో స్పందించవలసిన అవసరం ఉంటుంది అని దీని అర్థం.
మనిషి తన చుట్టూ జరుగుతున్న అనేక విషయాలను ఏనాడు పట్టించుకోడు తనకు సందర్భము సంబంధం ఉంటే తప్ప. కాలం కలిసి రాక సమస్యలు ఊడిపడి బజారున పడే పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు నీకు సహకరిస్తారు? ఈ సోలి జ్ఞానం లేదనే మనిషి ఒంటరి జీవితం గడుపుతున్నాడు. అందుకే శ్రీశ్రీ గారు ఒంటరి జీవితాన్ని కొంత మినహాయింపు ఇచ్చాడు. అంటే దాని అర్థం ఒంటరిగా బ్రతకలేము అని సూచన చేసినట్లే లెక్క. పేదల పట్ల జాలి లేదు .వృద్ధుల పట్ల ఆదరణ లేదు. బిచ్చగాళ్ళ పట్ల కనికరం లేదు.
ప్రక్క వారి పట్ల పరిచయము కూడా లేని దౌర్భాగ్యపు పరిస్థితిలో మానవుడు జీవిస్తున్నాడు. అమానవీయ సంఘటనలు రోజురోజుకు మితిమీరుతున్న వేళ కళ్ల ముందు జరుగుతున్న సంఘటనలకు అయ్యో పాపం అన్న లేని దౌర్భాగ్యపు పరిస్థితిలో మానవుడు నిట్టూర్పులు విడుస్తూ ఉన్నాడు.
ఇది బలహీనత ?చేతకాని తనమా? పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యమా? సామాజిక స్పృహ లేని అజ్ఞానమా? తనదాకా వచ్చినప్పుడు చూద్దామని అహంకార ధోర
నా?
ఈ నిర్లక్ష్యానికి మూలాలు ఎక్కడో తెలుసా?:-
*****************************************
కుల వివక్షత, మతతత్వం, ఆధిపత్య ధోరణి ,అహంకారము, ధనవంతులo అన్న డాంబికం, సమాజంలో వివక్షత ,అంతరాలు, అసమానతలు, పేదరికం ,నిరుద్యోగం, ఆకలి చావులు, ఆత్మహత్యలు ఈ సమాజాన్ని నిట్టనిలువునా చీల్చుతూ ఉంటే రెండు వర్గాలుగా ఈ సమాజం చీలిపోయి పరిష్కారం కానరాక ,అయోమయం, గందరగోళం లో సంఘర్షణకు లోనవుతూ ఉన్నది.
ఉన్నత వర్గాలు పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు చివరికి ప్రభుత్వం కూడా పేదవాడికి శత్రువుగా మారిపోతే అంతరాలకు అంతే లేకుండా పోయింది. ప్రశ్నకు జవాబు లేక ,ప్రతిఘటనకు ప్రతిస్పందన లేక, నిరాదరణకు ఆదరణ లేక, సమానత్వం అనే భావన కనుచూపుమేరలో కానరాక ఒక వర్గం ఉన్నత వర్గం పై ,ప్రభుత్వం పై అస్త్రాలు సంధించ వలసిన అవసరం ఏర్పడింది. ఇది ఒక సంధి కాలం.
నలుగురిలో నిలబడితే ఏమైనా అంటాం:-
*************************************
వ్యక్తిగతంగా ప్రైవేటు బ్రతుకుకె స్వేచ్ఛ ఇచ్చిన మహాకవి శ్రీశ్రీ నలుగురిలో నిలబడితే మాత్రం ఏదైనా అంటాం .అని ఖచ్చితంగా నినదించాడు. నిలదీశాడు. ప్రశ్నించాడు.
ఇక్కడ శ్రీ శ్రీ యొక్క ఉద్దేశ్యం మనిషి సామాజిక చింతన కు, సామాజిక బాధ్యతకు, సంఘజీవి అనే అర్థానికి, దూరంగా పారిపోకూడదు అని. అందుకే నలుగురిలో నిలబడితే ఏమైనా అంటాం ....అని బల్లగుద్ది మాట్లాడినాడు. మానవుడు అనేక సందర్భాల్లో తన బాధ్యతను విస్మరిస్తున్నారు. సామాజిక బాధ్యతను మరి విస్మరిస్తున్నారు.
స్వార్థానికి ఒడిగట్టి అక్రమ సంపాదనకు అనుంగు సహచరులకు, తమ పలుకుబడిని ప్రయోజనాలను, ఆస్తిపాస్తులను, అవకాశాలను తన వర్గ ప్రయోజనం కోసమే ఆరాటపడుతూ సామాజిక బాధ్యతను మరచిపోతున్నాడు.
సామాజిక మార్పుకు దోహదపడాలి సంఘ సేవ లో పాల్గొనాలి .అంతరాలను తొలగించడంలో ముందుండాలి. మనిషిని మనిషిగా చూసే మానవ సంబంధాలు విస్తరి ల్లాలి .వర్ధిల్లాలి. ఇది శ్రీశ్రీ ఆకాంక్ష. అందుకే వ్యక్తుల మీద అంత కసి తో పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం అని బల్లగుద్ది, గలబట్టి మాట్లాడగలిగిన దమ్మున్న మహాకవి శ్రీశ్రీ ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితులు నేడు సమాజంలో దాపురించిన వి.
వారసత్వంగా నో, అవకాశాలవల్లనో, కులబలం వల్లనో, చదువుకున్న కుటుంబం కావడం వల్లనో, మోసగించే తత్వం వల్లనో, పెట్టుబడిదారుల అండ వల్లనో, దోపిడీ తత్వం వల్లనో, డబ్బున్న కుటుంబం అయినంత మాత్రాన సమాజానికి దూరంగా బ్రతక లేవు కదా! మంచిని మంచి అని చెడును చెడు అనగలిగే నిజాయితీ లేకపోతే నీవు మనిషి ఎలా అవుతావు? కష్టజీవుల చెమట బిందువుల నుండి, చీకట్లో బ్రతుకుతున్న రైతు మీ పళ్ళెములో పోసిన మెతుకుల అనుభూతులు ఒక్కసారైనా ఆలోచించావా?
ఇప్పటికైనా మన సామాజిక బాధ్యతను నిర్వహిస్తాం మనం ఏ ఆర్థిక పరిస్థితి లో ఉన్నాము అనేది ముఖ్యం కాదు అందరమూ సమానంగా కలిగే సార్వజనీన ఈ విధానం ఈ దేశంలో కొనసాగాలని ఆశిద్దాం .సామ్యవాద సమతా వాదము ధ్యేయంగా సమసమాజ స్థాపన దిశగా ఈ దేశంలో పరిస్థితులు మారే
ది ఎన్నడు? దాశరథి ఆశించినట్లు కరువుకాటకాలు కనిపించని కాలం ఎప్పుడు వస్తుంది? ఈ దేశంలో ఉన్న సంపద ఉన్న జనానికి అందరికీ చెందాలి కదా.
అందుకే శ్రీశ్రీ గారు పది మందిలో నిలబడితే ఏమైనా అంటాం ఏదైనా అడుగుతాం ఇది దేనికైనా నీవు బాధ్యత వహించాలి అని చెప్పడంలో అర్థం ఇదే.
ధనవంతులు ,పెట్టుబడిదారులు, ఉన్నత వర్గాలు ,కోటీశ్వరులు, విర్రవీగే కాలానికి కాలం చెల్లిపోయింది. ప్రణాళికలోని బడ్జెట్లోనూ పేదవారిని పరిగణనలోకి తీసు
కోని అక్రమ పద్ధతులకు కాలం చెల్లింది.
రాశుల మొత్తం ముంబై రాశుల సంఖ్య అనే కొత్త నినాదం ఈ దేశములో పేదవాళ్ళు నిలదీస్తున్నారు. నినదిస్తున్నారు. మీ ఆర్థిక పరిస్థితి తో సంబంధం లేకుండా ఈ నినాదాన్ని అంగీకరిస్తే నీవు అందరి వాడివి అవుతావు . సంఘజీవి అవుతావు. లేకుంటే ఒంటరి వాడిగా అల్ప సంఖ్యాక వర్గం గా మిగిలిపోతావ్. ఏ వైపు నీ గమ్యం, గమనం తేల్చుకో!
విద్యావంతులుగా ,మేధావులుగా, ఉద్యోగులుగా, కార్మికులుగా ,రైతులుగా, ఒక్కసారి సామాజిక చిత్రాన్ని ఆలోచిద్దాం. మానవ జన్మ ఎత్తినందుకు ఉనికి కోసం ఆరాట పడదాం. బ్రతుకు అర్థాన్ని తెలుసుకుని జీవితాన్ని సార్ధకం చేసుకుందాం.
అంగీకరిస్తే ఆలోచించండి! ఆచరించండి! చేయి చేయి కలపండి!
( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు అధ్యక్షులు జాగృతి కళాసమితి హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట)
[11/10, 19:17] వడ్డేపల్లి మల్లీశం గారు: నేటి మాట 225/10.11.20 మంగళవారం
ప్రభుత్వాలు_ సామాజిక చింతన, నియంతృత్వ ప్రజావ్యతిరేక ధోరణులు--- గుణపాఠాలు, పాలన-- అధికారపక్షం.
***************************************
**. పరిపాలన అనే దానికి విస్తృతమైన అర్థం ఉంది. పాలన అంటే కూడా అదే భావన
వర్తిస్తుంది. పాలనా శాస్త్రవేత్తలు పరిపాలనా శాస్త్రం ఇచ్చిన నిర్వచనం ప్రకారం" నిబంధనలను తయారుచేసి లేదా ఉన్న వాటిని అమలు చేసే బాధ్యత కలిగిన వ్యక్తుల సమూహం అంటే ముఖ్యమైన పనులను పూర్తిచేసే నాయకత్వ స్థానాల్లో ఉన్న వారిని సూచిస్తుంది".
మరింత విస్తృతంగా చెప్పుకుంటే "ఏదేని ఒక ప్రాంతం దేశం రాష్ట్రం పరిపాలన విధులు బాధ్యతలు నిర్వహించే మంత్రులు అధికారులు వ్యవస్థ తీసుకునే చర్యలుగా"
పరిపాలనను నిర్వచించవచ్చు.
మరి ఇంత సూటిగా చెప్పుకుంటే "ఒక లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రజలను నడిపించేలా నిర్వహణకు చర్యను కూడా పరిపాలన అంటారు".
క్రీస్తు పూర్వం 4వ శతాబ్దానికి చెందిన భారతదేశ రాజకీయ తత్వవేత్త కౌటిల్యుడు తను రచించిన అర్థశాస్త్రం లోనే రాజకీయ శాస్త్రాన్ని విస్తృతంగా పరిచయం చేశాడు" రాజకీయ శాస్త్రాన్ని సజావుగా రాజ్యాన్ని ఏలే ఎందుకు ఉపయోగించుకోవాలని యుద్ధాల్లో ఇతర దేశాలతో మంతనాలు ఎలాంటి విధానాన్ని చేపట్టాలి, గూఢచార వ్యవస్థను ఎలా నడపాలి, రాజా ఆర్థిక స్థిరత్వానికి ఏం చేయాలి అనే అంశాలను సోదాహరణంగా వివరించాడు. అంటే పాలకులు దేశాన్ని, ప్రజలను ,ఆర్థిక వ్యవస్థను, ప్రజల జీవన విధానాన్ని ప్రజలు కోరుకున్న రీతిలో నిర్వహించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యంత్రాంగం గా ప్రభుత్వమును, దాన్ని చర్యలను పాలనా చర్యలు గా భావించవచ్చు
ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక సామాజిక తత్వవేత్త మార్క్స్ ప్రకారం "రాజ్యాలు ప్రజల సాధారణ ఆసక్తులకు అనుగుణంగా నడుచుకోవాలని కానీ నడుస్తున్నట్లుగా చూపించుకుంటూ ప్రజలను విస్మరించి అనేక వర్గాల ఆసక్తులకు అనుగుణంగా మాత్రమే నడుచుకోవడం వల్లనే ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్యన సంఘర్షణ వస్తుందని" స్పష్టంగా చెప్పాడు.
ప్రజాస్వామ్యంలో రాజకీయ పక్షాలు అధికార పార్టీ:-
**********************************
రాజకీయాలు రాజకీయ శాస్త్రము పరిపాలన ప్రజా సంక్షేమ పాలన విషయంపై పైన చర్చించిన అంశాలను వివిధ తత్వవేత్త అభిప్రాయాల ప్రకారం గా, నిఘంటువు ననుసరించి కూడా ప్రజలను రక్షించేది పాలన అని తేటతెల్లమవుతుంది.
దానికి పునాది రాజకీయ పార్టీలు మెజారిటీ స్థానాలను గెలుచుకున్న ఏకైక పార్టీ లేదా ఉమ్మడి పార్టీ అధికారంలో కొనసాగడానికి అర్హత ఉంటుంది దానిని ప్రభుత్వం అంటున్నాం. అధికారంలో ఉన్న పార్టీ తను నమ్ముకున్న లక్ష్యాన్ని ప్రజల కోణంలో చట్టాలు, న్యాయాలు ,రాజ్యాంగ పరిధి మేరకు పాలన పైనే దృష్టి ఉంచాలి. కానీ ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వంలో కానీ ప్రధానంగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాలలో పాలన మీద కాకుండా ,అధికారాన్ని శాశ్వతం చేసుకోవడానికి ఉపాయాలను అన్వేషిస్తూ వీలైన చోట్ల ప్రతిపక్షాలను నియంత్రిస్తూ ప్రజలను ప్రలోభాలతో కొన్నట్లే, ప్రతిపక్షాల లో గెలిచిన శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులను అధికార పార్టీ లోకి తీసుకోవడానికి ఆరాటపడుతూ భయపెట్టి ఆశచూపి చేర్చుకుంటే ఇక ప్రతిపక్షాలెక్కడ?
ప్రతిపక్ష సభ్యులు కూడా తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా ఎన్నికైన వెంటనే అధికార పార్టీ లోకి పోవడం కూడా సిగ్గుచేటు! ఇలాంటి సంఘటనలు గత ఐదారు సంవత్సరాలుగా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో, ఇతరత్రా అనేక రాష్ట్రాల్లో కూడా చూసినాము.
మరొక కోణంలో ఆలోచిస్తే సామాజిక వర్గాలు గా ఉన్న ఈ వ్యవస్థలో కులం ప్రధాన పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్షాలు కూడా డబ్బున్న ఉన్నత వర్గాలకే టికెట్ ఇవ్వడంతో 52 శాతానికి పైగా ఉన్న వెనుకబడిన తరగతుల వారికి రాజకీయంలో చోటు లేకుండా పోతున్నది. రాజకీయ పార్టీలలో తోక లాడించే స్థితిలో నుండి వెనుకబడిన వర్గాలు ప్రశ్నించే స్థాయికి చేరుకుంటే నే రాజ్యాధికారంలో వాటా వెనుకబడిన వర్గాలకు లభిస్తుంది. ఈ విషయంలో అధికార ప్రతిపక్షాలు అది ఒకే
వరస.
ప్రతిపక్షాలు కూడా అవకాశవాదాన్ని వినియోగించుకుంటూ అధికారపక్షం పై దుమ్మెత్తి పోస్తున్నాయి కానీ, ప్రజాప్రయోజనాలకు సంబంధించి ప్రకృతి వనరుల పరిరక్షణ విషయంలోనూ, కళాకారులు మేధావులు జర్నలిస్టులు నిర్బంధాల గురిచేస్తున్న విషయంలోనూ, పేదరిక నిర్మూలన ఉపాధి కల్పన ఉద్యోగ అవకాశాలు మెరుగు పరచడం అంతరాలను తొలగించే విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసిన దాఖలా ప్రతిపక్షాలకు లేదు. ఏ పార్టీని నమ్మాలో అని సందిగ్ధంలో ఉన్న ఓటరు అధికార ప్రతిపక్షాల మోసానికి దోపిడీకి బలవుతూనే ఉన్నాడు ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు అనాదిగా ఓటమికి గురవుతున్న విషయం. అవకాశవాద రాజకీయాలతో కాలం వెళ్లదీసే ప్రజలు భరించారు సహించరు ఊరుకోరు. ఈ విషయాన్ని అధికార పార్టీతో సహా ప్రతిపక్షాలు కూడా పాఠాలు నేర్చుకోవాలి.
నియంతృత్వ ప్రజావ్యతిరేక ధోరణులు గుణపాఠాలు:-
****************************************
మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు గా తెలంగాణ రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో దినదినగండంగా బ్రతుకుతున్న అట్టడుగు వర్గాలు పైసా పైసా కూడబెట్టుకున్న నివేశన స్థలాల కు ప్రభుత్వం ఎల్ ఆర్ ఎస్ పేరుతో సుమారు 12 వేల కోట్లు ప్రజల ముక్కుపిండి వసూలు చేయాలని నిర్ణయించుకోవడం ప్రతిపక్షాల చేతిలో పెద్ద అస్త్రం. ఈ అస్త్రాన్ని వినియోగించి ప్రజల పక్షాన పోరాటానికి ప్రతిపక్షాలు మరింత ఉవ్వెత్తున ఉద్యమాన్ని తీవ్రతరం చేయవలసిన అవసరం ఉన్నది. రాజ్యాంగబద్ధంగా పాలించ వలసిన ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన సందర్భాలు అనేకం.
ఇటీవల చట్టసభల్లో 40 ,50 శాతానికిపైగా నేర స్వభావం కలిగిన వాళ్ళు, నేరచరిత్ర కలిగిన వాళ్ళు ఉన్నారంటే పాలన ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పాలకులు తత్వశాస్త్రాన్ని ,అర్థశాస్త్రాన్ని, సామాజిక శాస్త్రాలను, ప్రభుత్వ పాలనా శాస్త్రాలను, ప్రజలను అజయ్ నీవు చేసినప్పుడే నిజమైన ప్రజా పరిపాలన చేయగలరు. ఎంతసేపు రాజకీయ పార్టీని ఎన్నికల్లో గెలిపించుకోవడానికి తన శక్తియుక్తులను పోలీసు బలగాలను అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్న సమయంలో ప్రతిపక్షాలు కూడా అవకాశంగా ఉపయోగించుకొని ప్రభుత్వ యొక్క దుర్మార్గాలను ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ఇటీవల ఎన్నికల ఫలితాలు ప్రభుత్వాల స్వయంకృతాపరాధం కి నిదర్శనంగా కన పడుతున్నప్పటికీ
ప్రతిపక్షాలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజల కోసం పనిచేయాలి కానీ మళ్ళీ ప్రలోభాలకు ప్రభుత్వం లో చేరితే ప్రజలు సహించరు. ఇలాంటి పార్టీ ఫిరాయింపుల సందర్భంలో ఫిరాయింపుకె పాల్పడిన ప్రజాప్రతినిధిని ప్రజల సమక్షంలో శిక్షించినచో భవిష్యత్తులో అలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి దీనిని ప్రజలు జాగరూకత తో, చైతన్యంతో గమనించాలి .ఆచరించాలి.
చట్టసభల్లో ప్రతిపక్షాలు నామమాత్రంగా ఉండడం, వివిధ పద్దుల పై చర్చ సమగ్రంగా జరగకపోవడం, ప్రశ్నించిన వారిని మార్షల్స్ తో బయటకు గెంటి వేయడం మార్క్స్ అన్నట్టుగా పాలకుల ఆసక్తుల కోసమే సభ నడిపినట్లు అవుతున్నది.
ప్రభుత్వాలు సామాజిక చింతన నాయకుని క్రేజీ:-
*******************
ప్రభుత్వాలకు సామాజిక చింతన లేకపోవడం, సంక్షేమం, అభివృద్ధితో పాటు అంతరాలు ,అసమానతలు, వివక్ష లేని సుపరిపాలనను అందించడం పట్ల అనాసక్తి, ఉన్నత వర్గాల కొమ్ము కాయడము, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం, మన దేశంలో, మన రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాలలో అలవాటయిపోయింది. పలు ప్రజా ఉద్యమాల సందర్భంగా అతిగా స్పందించి ప్రభుత్వాలను ఆదేశించిన న్యాయవ్యవస్థ అవసరమైతే రాజ్యాంగానికి అనుగుణంగా ప్రభుత్వాలను శాసించడం ద్వారా చేయవలసిన అవసరం ఉన్నది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల నుండి బయటపడడానికి ప్రజలకు ఇదొక్కటే మార్గం. కానీ కనుచూపు మేరలో అలాంటి అవకాశం కనిపించకపోవడం వేరే దారి లేని పరిస్థితిలో ప్రజలు ప్రజాస్వామ్యంలో ఓడిపోతున్నారు. ప్రజలను ప్రభువులుగా చూడాల్సిన పాలకులు బానిసలుగా చూడడం వలన నాయకుని యొక్క క్రేజీ అనే కొత్త పదం ఇటీవల రాజకీయాల తెరమీదికి వచ్చింది.
రాజకీయాలను నడిపి సుపరిపాలన అందించడానికి నాయకుని యొక్క క్రేజీ, అందము ,భాష ఇవి ముఖ్యం కావు. కానీ దయనీయమైన పరిస్థితుల్లో వ్యక్తిపూజకు పాల్పడిన అనేక సందర్భాలు పాలాభిషేకంతో, ఫ్లెక్సీల ఏర్పాటు తో ఏక వ్యక్తి పాలన కొనసాగిన విధానం మన రాష్ట్రంలో స్పష్టంగా కనబడుతున్నది. అధికారానికి రాకముందు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి గతంలో ప్రశ్నించిన సవాళ్లను పరిష్కరించకుండా ఆ దుర్మార్గాల నే కొనసాగించడం నేటి రాజకీయాలకు అలవాటయిపోయింది.
ఈ వల్ల జరిగిన జరుగుతున్న ఉప ఎన్నికలు గాని మధ్యంతర ఎన్నికలు గాని ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే ప్రజల అభిప్రాయాలు వ్యతిరేకత స్పష్టంగా కనబడుతున్నది. ఈ పాఠాలను అధికార పార్టీ ప్రభుత్వాలు గుణ పాఠాలు గా నేర్చుకుంటే తప్ప భవిష్యత్తులో మనుగడ సాగించలేవు.
ఇవ్వాళ తెర మీద నడుస్తున్న రాజకీయాలు ప్రజల ముందు రసవత్తరంగా చర్చించ బడుతుంది. పాలకుల స్వభావాలు, పరిధులు, పరిధి దాటిన పరిస్థితులు, నేరమయ రాజకీయాలు, లోపాలను ప్రజలు నిక్కచ్చిగా ఎత్తిచూపుతూ బహిరంగ చర్చ చేస్తున్నారు.
రాజకీయాలపైన సాగుతున్న చర్చ ప్రజల మనో గతాలు ఉమ్మడి వేదికపైకి వస్తే రాజకీయ పార్టీలకు ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. అంటే అంత బలంగా ప్రజల్లో వ్యతిరేకత ,ఆలోచనా ధోరణులను తాను రాజకీయ పార్టీలు పరిగణనలోకి తీసుకెకుంటే, గుర్తించకుంటే, ప్రజలను ప్రభువులుగా చూడకుంటే ప్రజాస్వామ్యం మనజాలదు. దానికి ప్రత్యామ్నాయ పరిస్థితులు అంబేద్కర్ సూచించినట్లుగా వ్యవస్థ తనకు అనుకూల మైనటువంటి యంత్రాంగాన్ని రూపొందించు
కుంటుంది. అది ఒక చారిత్రక పరిణామం అని చెప్పిన విషయాన్ని పాలకులు రాజకీయ పార్టీలు మరిచిపోకూడదు. ప్రజలుగా విభిన్న వర్గాల లో ఉన్న ఉద్యోగులు ,కార్మికులు, మేధావులు ,రైతులు, విద్యావంతులు, విద్యార్థులు యావత్ సమాజము కూడా జరుగుతున్న రాజకీయ ముఖచిత్రాన్ని దీర్ఘంగా ,సుదీర్ఘంగా, లోతుగా పరిశీలించి అధ్యయనం చేయవలసిన అవసరం మాత్రం
స్పష్టంగా ఉన్నది.
( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు" కవి, రచయిత, సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు, అధ్యక్షులు జాగృతి కళాసమితి హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట)
[11/11, 20:29] వడ్డేపల్లి మల్లీశం గారు: నేటి మాట 226/11.11.20 బుధవారం
విద్యారంగ అభివృద్ధికి బాటలుపరిచిన తొలి విద్యా మంత్రి అబుల్ కలాం ఆజాద్- జాతీయ విద్యా దినం- జీవితం--- వ్యక్తిత్వం, పరిశీలన
********************************************
- వడ్డేపల్లి మల్లేశము,9014206412
స్వతంత్ర భారత విద్యామంత్రిగా విద్యారంగ అభివృద్ధికి విశేషకృషి మౌలానా అబ్దుల్ కలాం జయంతిని జాతీయ విద్యార్ధి లంగా జరుపుకుంటున్న వేల ఆయన వ్యక్తిత్వాన్ని ,స్వాతంత్ర పోరాట చరిత్రను సాహిత్య సామాజిక స్పృహను తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న అనేకమందిలో మౌలానా కూడా ప్రముఖుడు.
విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి తనదైన శైలిలో సంగీత, సాహిత్య, నాటక, లలిత కళా అకాడమీలను స్థాపించినాడు.
భారతదేశంలో ప్రముఖ విద్యావేత్త గా, పాత్రికేయుడుగా రాణించిన మౌలానా బహుముఖ ప్రజ్ఞాశాలి గా, బహుభాషా వేత్త గా స్వతంత్ర భారతదేశంలో తనదైన రాజనీతిజ్ఞతను ప్రదర్శించి చరిత్రలో తనకంటూ ఓ స్థానం లిఖించుకున్నాడు కనుకనే అతని జీవితాన్ని అధ్యయనం చేయవలసిన అవసరం ఏర్పడింది. సందర్భోచితంగా సవాళ్లను అధిగమించే విషయంలో కానీ, నిర్ణయాలు తీసుకునే విషయంలో ,తన సామాజిక తనిఖీ చాటుకునే విషయంలో, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం బయట పడుతుంది. అది ఆదర్శం అయితే పలువురికి మార్గనిర్దేశం అవుతుంది. అందుకే కదా జాతీయ విద్యా దినోత్సవం గా జరుపుకోవడం.
పదవులు బాధ్యతలు చాలామందికి వస్తాయి కానీ పదవికి బాధ్యతకు ప్రజలకు వన్నె తెచ్చే పని చేసిన వారు చరిత్రలో నిలుస్తారు. పదవి వల్ల వంట చేసుకున్న వాళ్ళు పదవి వల్ల సంపాదించిన వాళ్ళు పదవి వల్ల ఉన్నత స్థానానికి చేరిన వాళ్ళు ఆ పదవి పోవడంతోనే కనుమరుగవుతాయి చరిత్ర పరిణామక్రమం 3 చరిత్ర చెప్పిన సత్యం ఇది. ఈ సత్యాన్ని, వాస్తవాన్ని నేటి తరం నాటి తరం మన మనసులో నిలుపుకొని సామాజిక బాధ్యతగా మనిషిగా బ్రతకడానికి ఇలాంటి మహానుభావుల జీవిత చరిత్రలు తోడ్పడతాయి.
మౌలానా వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికి చూపిన ఆరాటం:-
*******************************************
అతను ఒక జాతీయవాద విప్లవకారుడిగా ఎదగడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇస్లామిక్ భావాలతో అతను ఆఫ్ఘనిస్తాన్ ,
ఈరాక్, ఈజిప్టు, సిరియా మొదలైన దేశాలను సందర్శించి అక్కడి బావ వాదులతో చర్చించటమే కాకుండా ఆఫ్ఘనిస్తాన్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ యొక్క ఆలోచనలతో ఆసక్తి చూపి నాడు.
ఇరాక్ లో రాజ్యాంగ ప్రభుత్వ స్థాపనకు పోరాటం సాగుతున్న నిర్వాసిత విప్లవకారులను కలుసుకున్నాడు. అంతేకాకుండా ఈజిప్టులో అతను షేక్ మొహమ్మద్, సయ్యద్ భాష వంటి ప్రపంచంలోని ఇతర విప్లవకారులను కలుసుకొని రాజ్యాంగము ,చట్టము, న్యాయము, ప్రజా దృక్పథంలో జాతీయవాదిగా ఎదగడానికి కృషి చేశాడు.
విదేశాలనుండి స్వదేశం తిరిగి వచ్చిన అనంతరం అరవింద ఘోష్ శ్యాంసుందర్ చక్రవర్తి వంటి ప్రముఖ విప్లవకారులను కలుసుకొని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు ఉద్యమాన్ని చేపట్టడంతో, బెంగాల్ బీహార్ లకు మాత్రమే పరిమితమైన రహస్య విప్లవాత్మక చర్యలు రెండు సంవత్సరాలలో ఉత్తర భారతదేశం లోని పలు ప్రాంతాలకు విస్తరించడంలో మౌలానా విశేష కృషి చేసినట్లు తెలుస్తున్నది.
విప్లవకారులు ముస్లిం కమ్యూనిటీని
విప్లవ వ్యతిరేకులుగా భావిస్తున్న కాలమది.
కారణమేమంటే భారత స్వాతంత్ర పోరాటానికి బ్రిటిష్ ప్రభుత్వము ముస్లింలను వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నారని భావించడం వలన. ఈ అపప్రధ వలన ముస్లిం కమ్యూనిటీ మొత్తము భారత స్వాతంత్రోద్యమం కి వ్యతిరేకంగా పని చేస్తుండగానే ఆరోపణకు కలత చెందిన మౌలానా అటు ముస్లిం కమ్యూనిటీని మేల్కొలుపుతూ నే ఇటు విప్లవ సహచరులను ముస్లింల పట్ల శత్రు భావాన్ని పోగొట్టడానికి సాయశక్తులా ప్రయత్నించాడు. ఆ రకంగా ముస్లింలు కూడా స్వాతంత్ర పోరాటానికి చిత్తశుద్ధిగా పనిచేస్తున్నారని చెప్పే ప్రయత్నం ఆయన కృషి లో కనబడుతుంది.
జర్నలిస్టుగా, రచయితగా మౌలానా అబుల్ కలాం ఆజాద్:-
********************************************
జర్నలిస్టుగా పత్రికా రంగం ద్వారా సామాజిక మార్పుకు కృషి చేయాలనే ఉద్దేశంతో, మరోవైపు ఎగిసిపడుతున్న స్వాతంత్ర్య కాంక్షను, ప్రజల పోరాట కర్తవ్యాలను గుర్తింప చేయడం కోసం, ముఖ్యంగా ముస్లింల మధ్య విప్లవాత్మక భావజాలాన్ని పెంచడానికి"అల్ హిళాల్" వార పత్రికను ప్రారంభించాడు. ఈ పత్రిక హిందూ ముస్లిం వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు నివారించడమే కాకుండా ఐక్యతకు తీర్చడంలో కూడా తోడ్పడింది. ఈ పత్రిక అతివాద భావజాల గొంతుక గా మారిన నేపథ్యంలో ప్రభుత్వం దానిని 1914లో నిషేధించింది.
అబ్దుల్ కలాం ఆనాడు కలిగి ఉన్న లక్ష్యాలు రెండు.1 భారత స్వాతంత్ర విప్లవోద్యమంలో హిందూ ముస్లింల ఐక్యతను పెంపొందించడం2 జాతీయవాద స్వాతంత్ర పోరాట భావజాలాన్ని నింపడం. ఈ రెండు
లక్ష్యాలతో ప్రారంభించిన కొద్దిరోజులకే "అల్ బలగ" పత్రికను 916 లో బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. అంతేకాదు దుస్సాహసానికి పాల్పడుతున్న ఆజాద్ ను అరెస్ట్ చేసి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత 1920లో విడుదల చేయడం జరిగింది. విడుదల అయినాక తిరిగి ఖిలాఫత్ ఉద్యమం ద్వారా ముస్లిం కమ్యూనిటీ లో బ్రిటిష్ వ్యతిరేక భావజాలాన్ని పెంచడంలో కృతకృత్యులయ్యారు.
కలాం పాత్రికేయుడు గానే కాకుండా రచయిత కవిగా ప్రముఖ పాత్ర పోషించి ఖురాన్ అనువాదాన్ని "తర్జుమానుల్ ఖురాన్ పేరుతో రచించినాడు.గుబార్ ఏ-ఖాతిర్ తో పాటు భారతదేశం స్వాతంత్ర్యం సాధించి తీరుతుంది అని ప్రగాఢ విశ్వాసంతో" "ఇండియా విన్స్ ఫ్రీడం" అనే సుప్రసిద్ధ గ్రంథాన్ని కూడా రచించినాడు.
జాతీయ విద్యా దినోత్సవం నేపథ్యంలో మౌలానా జననం, బాల్యం, జీవితం:-
*****************************************
వాదనలో రారాజుగా, చర్చలు సంప్రదింపులలోమేటిగా రాణించిన అబుల్ కలాం తన స్వేచ్ఛా స్వాతంత్రాలు ప్రతీకగా తన కలం పేరును "ఆజాద్" గా ప్రకటించుకున్నాడు. ఈయన మక్కా నగరంలో 1888 సంవత్సరం నవంబర్ 11వ తేదీన అలియా బేగం ,ఖైరుద్దీన్ అహ్మద్
లకు జన్మించినాడు. 1857 సైనిక తిరుగుబాటు సందర్భంగా భారత దేశం విడిచి మక్కా వెళ్ళిన ఖైర్ ఉద్దీన్ తిరిగి 1890 సంవత్సరంలో తన కుటుంబంతో సహా భారతదేశానికి తిరిగి వచ్చినాడు. ఆజాద్ సంప్రదాయక ఇస్లామిక్ విద్యనభ్యసించిన అది తొలినాళ్ళలో అతని ఇంట్లోనే కొనసాగింది. మొదట తండ్రి తర్వాత ఉపాధ్యాయులు ఇంట్లోనే ఆజాద్కు బోధించారు. అరబిక్ హర్షం భాషలతో పాటు ధర్మ శాస్త్రము రేఖా గణితము బీజగణితము అభ్యసించారు. విద్యాగంధం పట్ల ఆత్రుతతో
స్వీయ అభ్యసనం అధ్యయనము ద్వారా ఇంగ్లీషు ప్రపంచ చరిత్ర రాజకీయాలను నేర్చుకున్నాడు. ఉర్దూ హిందీ పర్షియన్ బెంగాలీ మొదలైన అనేక భాషలలో ప్రావీణ్యతను సంపాదించుకున్న మౌలానా విద్యార్థి దశలోనే ఇతర దేశాలకు వెళ్లి అపారమైన జ్ఞానాన్ని పుణికి పుచ్చుకున్నాడు.
స్వాతంత్ర పోరాటంలో మౌలా:నా-
*************************************
ఆయన అసలు పేరు మోహియుద్దీన్
అహ్మద్. అబ్దుల్ కలాం అనేది ఆయనకు లభించిన బిరుదు. అని నిరంతరం తన బిరుదు కలం పేరుతోనే తన జీవితమంతా కొనసాగినది . ఇతర దేశాల పర్యటన ద్వారా తనను తాను తీర్చిదిద్దుకున్న అనంతరం 520 లో గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమం పట్ల ఆసక్తి కనబరిచి కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా రాజకీయ స్వాతంత్ర పోరాట జీవితాన్ని ప్రారంభించాడు. తన ప్రతిభాపాఠవాలతో వెనువెంటనే ఢిల్లీ కాంగ్రెస్ ప్రత్యేక స్పెషల్ అధ్యక్షునిగా 1923లో ఎన్నికైనారు. అనంతరం 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టు చేయబడి మీరట్ జైల్లో ఒకటిన్నర సంవత్సరంపాటు జైలు జీవితం గడిపాడు. 1940లో రామ్ గాడి లో జరిగిన కాంగ్రెస్ మహా సభకు అధ్యక్షునిగా ఎన్నికై 1946 వరకు ఆ పదవిలో కొనసాగాడు.
హిందూ ముస్లిం మతం పేరుమీద దేశ విభజనను అంగీకరించలేదు మౌలానా ఎప్పుడు. హిందువులు ముస్లింలు కలసి సహజీవనం చేసిన ఏకీకృత దేశము గానే స్వతంత్ర భారతం కొనసాగాలని ఆయన చిరకాల వాంఛ. విభజనకు వ్యతిరేకం అయినా ఆయన అభిప్రాయానికి భిన్నంగా ప్రాతిపదికమీద పాకిస్తాన్ భారత దేశం రెండు దేశాలుగా పోవడం పట్ల ఆయన చాలా కలత చెందాడు . అంటే ఆయన మతఛాందస వాది కాదు అని మనకు అర్థమవుతుంది. నాటి సమకాలీన రాజకీయ వాసాలు పరిస్థితులు దేశవిభజనను ఆపలేక పోయిన విషయాన్ని
మౌలానా మౌనంగా భరించాడు.
పంచ పోరాటంలో భాగంగా జరిగిన ఖిలాఫత్ ఉద్యమము సహాయ నిరాకరణోద్యమం ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 10 సంవత్సరాలపాటు జైలుశిక్ష అనుభవించిన
మొక్కవోని ధైర్యంతో స్వాతంత్రం సిద్ధిస్తుందని ఆశించాడు. భారతానికి విద్యాశాఖ మంత్రిగా పదకొండు సంవత్సరాల పాటు పని చేయడం ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన మౌలానా అబుల్ కలాం 1958 ఫిబ్రవరి 22వ తేదీన శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు.
ఆశయాలు ఆకాంక్షలు నైతిక విలువలకు కట్టుబడిన ఒక రాజకీయ సామాజిక విప్లవ నాయకుడు మౌలానాను
భారతదేశపు ప్లేటో అని గాంధీ నెహ్రూ ఇతని మౌలానా అని పిలిచేవారు.
1992లో భారత ప్రభుత్వం మరణానంతరం భారతరత్న పురస్కారంతో గౌరవించింది.
అన్నింటికంటే మిన్నగా విద్యారంగంలో ఎనలేని మార్పునకు శ్రీకారం చుట్టిన ఆయన జయంతి రోజున జాతీయ విద్యా దినోత్సవం గా ప్రజలు జరుపుకోవడం పెద్ద పురస్కారంగా ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనంగా మనము చూడవలసి ఉంటుంది.
( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు కవి ,రచయిత , అధ్యక్షులు జాగృతి కళాసమితి హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట)
[11/12, 20:25] వడ్డేపల్లి మల్లీశం గారు: నేటి మాట 227/12.11.20 గురువారం
రాజకీయ, ప్రజా ,సాహిత్య జీవితంలో ఎందుకు స్తబ్దత? మేధావుల మౌనం ప్రమాదకరం విప్లవ అనుభవాలు ఏమైనాయి?
*********************************************
-- వడ్డేపల్లి మల్లేశము,9014206412
సమాజము చలనశీల మైనది. భూమి తిరుగుతుంటే భూమి మీద ఉన్న ప్రతి వాళ్లు తిరిగినట్లే సమాజం చలనశీల మైనది
అయినప్పుడు సమాజంలోని భిన్న వర్గాలు నిరంతరము అవసరాలను ,సందర్భాలను, అవకాశాలను, స్వభావాలను బట్టి స్పందించవలసి ఉంటుంది. మౌనం దేనికీ పనికి రానిది. మాట ఒక భూషణం అంటారు. కానీ మాట ఒక ఆయుధం ,అస్త్రం, అవసరం.
మాట అన్వేషణకు, అన్యోన్యతకు, అవగాహనకు, అంగీకారానికి, ఆమోదయోగ్య నికి, ఆత్మీయులుగా మలుచుకోవడానికి, అసలు నిజాన్ని బయట పెట్టడానికి, చాలా బలమైన సాధనం.
ఈమాట కవులు, కళాకారులు, మేధావులు, విద్యావంతులు , రాజనీతిజ్ఞులు ప్రజా సంఘాలు ప్రతిపక్షాలు అధికారపక్షం ఎన్నికల సంఘం న్యాయవ్యవస్థ తో సహా ప్రభుత్వరంగ సంస్థలు అన్నింటికీ అనివార్యమైన దే. ప్రభుత్వ బడ్జెట్ అంచనాలు ఖర్చుచేసిన గణాంకాలను ప్రభుత్వ సంస్థ అయిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్( కాగ్) అనేక సార్లు తప్పుబట్టిన విషయాన్ని ఈ సందర్భంగా తగిన ఉదాహరణగా గుర్తించవచ్చు.
అనేక సందర్భాలలో న్యాయవ్యవస్థ ప్రభుత్వాలను ఆదేశిస్తూ ప్రభుత్వ కర్తవ్యాలను మార్గనిర్దేశం చేస్తూ అక్రమ పద్ధతులను అడ్డుకున్న సందర్భాలు కూడా భారతదేశ చరిత్రలో లేకపోలేదు. ఇక రచయితలు కవులు కళాకారులు విప్లవ అభ్యుదయ భావజాలంతో ప్రభుత్వ తప్పుదారి నడకను సరి చేసిన సందర్భాలు అనేకం. కానీ ఆ గళాలు, గళాలు నేడు ఎందుకు మూగబోయిన వి?
మేధావుల మౌనం పనికిరాదు:- వివిధ పాలనా సంస్థల , ప్రజల అవసరాలు ఎన్నికలు, ప్రజల ఉనికికి సంబంధించిన అనేక సందర్భాలలో మేధావులు ప్రశ్నించి నిలదీసి దారిలో పెట్టిన సందర్భాలు అనేకం. అయితే అనేక అవాంతరాలు, అడ్డంకులు ఉండవచ్చు.
కారాగారవాసం నియంత్రణ పత్రికా స్వేచ్ఛ లో కోత, భయబ్రాంతులకు గురి చేయడం వంటి సంఘటనలు లేకపోలేదు. ఇలాంటప్పుడే రాజ్యాంగ సంస్థలు ప్రధానంగా న్యాయవ్యవస్థ జోక్యం చేసుకొని రాజ్యాంగ పరంగా సంక్రమించిన హక్కులను కాపాడవలసిన గురుతర బాధ్యత ఉన్నది. అప్పుడే ప్రశ్నోత్తరాల ప్రాతిపదికన ప్రజాస్వామ్యం మనగలుగుతుంది! నిలబడుతుంది!
తమ జీవితాలనే త్యాగం చేసి ప్రజల కోసం పని చేసిన మేధావులు ఈ గడ్డపై అనేకమంది అసువులు బాసినారు. అందుకే వారు త్యాగధనులు గా ఈ నెల పై చరిత్రలో నిలిచిపోయారు. పరిపాలన నియంతృత్వం వైపు దారితీసినప్పుడు, ప్రజల హక్కులను కాలరాసే నప్పుడు, ప్రలోభాలతో ప్రజలను బానిసలుగా చూసినప్పుడు కవులు కళాకారులు మేధావులు యొక్క పాత్ర అనివార్యమైనది. అప్పుడే పాలన చక్కబడుతుంది. వక్రబుద్ధి దూరమవుతుంది.
అభ్యుదయ భావజాలం నుండి అధికారపక్షం గూటిలోని కి:-
******************************************
గతంలో అభ్యుదయ భావజాలం తో వివిధ సంస్థల్లో పని చేసి ప్రజల పక్షాన నిలిచిన అనేకమంది జర్నలిస్టులు కవులు మేధావులు ఉద్యమ కార్యకర్తలు నేడు మౌనంగా ఉండడానికి ప్రధాన కారణం అధికారపక్షం గూటిలోని పక్షిగా మారిపో
వడమే. ప్రజల పక్షాన నిలిచి రచనలు చేసిన సంపాదకులు, జర్నలిస్టులు ,ప్రభుత్వాన్ని నిలదీసిన మేధావులు, కవులు తెలంగాణ ప్రభుత్వంలో అధికార పదవులలో కొనసాగడం, గోరంతను కొండంత గా వర్ణిస్తూ ప్రభు భక్తి ప్రదర్శించడం కూడా రాష్ట్రంలో స్తబ్దత ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.
అయితే కొద్ది మంది అధికారంలో కొనసాగుతోంది కూడా ప్రజా సమస్యల పైన స్పష్టంగా స్పందిస్తూ రచనలు చేస్తున్నారు.
వారి పైన కూడా ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది కనుక అధికారాన్ని చూడకుండా ప్రజల కోసం పని చేయడానికి స్వచ్ఛందంగా పదవిని వదులుకోవడం మేలు ఆ వైపుగా ఆలోచించలేరా?
కవుల నిర్వచనాన్ని కనిపించకపోతే ఎలా?
*****************************************
కష్టజీవికి ఇరువైపులా ఉండే వాడు కవి అని శ్రీశ్రీ అంటే, ప్రజా శ్రేయస్సు కు పని చేసే వాడే నిజమైన కవి అని ఆదికవి నన్నయ
నొక్కి చెప్పారు. ప్రజల మేలు కోరేది సాహిత్యమని సాహిత్యానికి ప్రతినిధులుగా కవులు కళాకారులు మేధావులు రచయితలు తమ ధర్మాన్ని నిర్వహించాలని సాహిత్య రంగం నిర్దేశిస్తూ ఉంటే, అనేక సందర్భంలో ఈ భావజాలాన్ని ఆమోదించిన ప్రజాప్రతినిధులు, మంత్రులు, అధికారులు వీరిపైన నియంత్రణ, నిర్బంధాన్ని విధించడం ద్వంద్వ వైఖరి కాదా?
కవి ,రచయిత రాజ్యాంగ పరిధికెలో పడినప్పటికీ ,ప్రభుత్వాల నిర్బంధము, నియంత్రణకు అతీతంగా సకల ప్రజానీకానికి అండగా, ఆసరాగా, భరోసాగా నిండు మనసుతో పనిచేసే వర్గం. విద్యారంగము, సాహిత్య రంగం, సామాజిక రంగం, సాంస్కృతిక రంగం, సమాజాన్ని తీర్చి దిద్దుట లో గణనీయమైన పాత్ర పోషించే రంగాలు. ఈ రంగాల ను ఏ శక్తి కూడా ఆపలేదు, ఆపకూడదు.
యువతకు దారి లేకుండా చేయడమే:-
***********************************
సామాజిక మార్పుకు సైనికుల్లా పని చేసే యువత, వర్తమాన కవులకు, మేధావులు సామాజిక కార్యకర్తలు రచయితల మౌనం భవిష్యత్తుకు దారి లేకుండా చేయడమే అవుతున్నది. భారతదేశ ,తెలంగాణ రాష్ట్ర భారీ సవాళ్లను అధిగమించడానికి కంకణబద్ధులై పనిచేయాల్సిన యువత యువకులు నవ కవులు ప్రభుత్వం వైపు ప్రజల వైపు అని తేల్చుకునే సందర్భంలో మేధావుల మౌనం వారిని అయోమయానికి గురి చేస్తూ ఉంటుంది. ఇక్కడే రాష్ట్రం లేదా దేశం భారీ నష్టానికి గురయ్యే ప్రమాదం పొంచి ఉన్నది
ఈనాడు యువత ,నవ కవులు ఆధునిక విలాసాల మోజులో పడి సెల్ఫోన్ వ్యవస్థ ,టీవీ సీరియల్స్ ప్రభావానికి గురై కర్తవ్య రహితంగా ప్రవర్తిస్తున్న సందర్భాలు అనేకం. ఇక్కడే వీరికి దిక్సూచిగా పని చేయాల్సిన కవులు, కళాకారులు, జర్నలిస్టులు ,సంపాదకులు ,సామాజిక కార్యకర్తలు తమ భావి ఎజెండాను యువత ముందు పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఈ సందర్భంలోనే మేధావులు తమ విధానాన్ని స్పష్టంగా ప్రకటించడం ద్వారా భవిష్యత్తు సవాళ్లకు అధిగమించే శక్తిని నేటితరానికి అందించవలసిన సామాజిక కర్తవ్యాన్ని విస్మరించరాదు. చలనశీల మైన సమాజాన్ని ప్రభుత్వాలు తమ అవసరం కోసం అప్పుడప్పుడు ఎన్నికలు ప్రలోభాలు ఫలితాలు అధికారం రాజకీయ లబ్ధి అనే పాచికలు విసిరి ప్రజల మనోగతాన్ని దారి మళ్ళించే ప్రమాదం ఉన్నది. ఇక్కడి ప్రజలు నిజమైన ప్రభువులుగా రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన అధికారాన్ని ఓటు హక్కును వినియోగించి ప్రభుత్వ తప్పిదాలను ,నిరంకుశ విధానాలను, అక్రమ ఆచరణను ఖండించ వలసిన అవసరం. ప్రజలను కన్నబిడ్డలుగా పాలించ వలసిన ప్రభుత్వాలు ఎల్ఆర్ఎస్ వంటి అనేక వివిధ పథకాల పేరుతో దోపిడీకి పాల్పడడం నిజంగా ప్రజల పాలిట సంకటమే. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాన్ని స్వాగతిస్తూ తప్పులను సవరించుకుంట అని తెలిపిన అధికారపార్టీ ఆలోచనను స్వాగతిస్తూనే ఎటువంటి ప్రభుత్వాన్ని ఎటువంటి పాలనను ప్రజలు కోరుకుంటున్నారు అధికార ప్రభుత్వం కూడా ఆలోచించిన్నాడు ప్రజల బాధలు కొంచమైనా తగ్గుతాయి.
అధికారపక్షం లో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల మధ్య ఉన్న మేధావులు ప్రజల వైపు నిలబడాలి కనపడాలి ప్రజల పక్షమే ఆనబడాలి.
( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు, కవి ,రచయిత ,అధ్యక్షులు జాగృతి కళాసమితి హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట)
[11/13, 18:48] వడ్డేపల్లి మల్లీశం గారు: ఒక్క సిరా చుక్క తో లక్ష మెదళ్ళను
కదిలించిన ధిక్కారస్వరం kaloji
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
-- రచన: వడ్డేపల్లి మల్లేశము
9014206412
ధిక్కార స్వరాన్ని వినిపించి, ప్రజా పక్షాన నిలిచి తెలంగాణ యాస భాష నిజమైన భాషగా నినదించి మన భాషకు పట్టాభిషేకం కట్టిన భాషా చరిత్రకారుడు kaloji. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం ప్రజాకవి కాళోజీ జయంతి రోజైన సెప్టెంబర్ 9 ని ఇకనుంచి తెలంగాణ భాషా దినోత్సవంగా జరపాలని నిర్ణయం తీసుకోవడం హర్షణీయం.
కాళోజీ ప్రజాకవి ఎలా కాగలిగాడు:-
^^^^^^^^^^^^^^^^^^^^^^
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న తెలుగునే ప్రామాణికమైన భాష అని గత ప్రభుత్వాలు నిర్ణయించడం ఒక విధంగా తెలంగాణ భాష యాస లను అగౌరవ పరచడం అని నినదించిన కాలోజి రాష్ట్రంలో చలామణిలో ఉన్న అన్ని మాండలికాలకు చిత్రమైన ప్రాధాన్యత ఇవ్వాలని ప్రశ్నించేవాడు. తెలంగాణ భాష అన్న యాస అన్న అపారమైన అభిమానం ఉన్న kaloji తన రచనలన్నీ గాన మాండలికం లోనే కొనసాగించాడు.
ఏ కవికైనా ఉండాల్సిన మూడు లక్షణాలను కాలేజీ నుండి మనం గ్రహించవచ్చు. ప్రస్తుతం రచనలు చేస్తున్న ఆధునిక కవులు అప్పుడప్పుడు ఈ కవితా లక్షణాలను విస్మరిస్తున్న ప్పటికీ అర్థవంతమైన సాహిత్యమైనా మానవతా కోణం లేనప్పుడు అది నిరర్థక మే.1 సరళ భాష2 దిక్కార స్వరం3 మానవతావాదం.
కేరళ భాషను ఎంచుకుని ప్రజల భాషలో రాశాడు కనుకనే రచన నా గొడవ దగ్గరయింది. సామాన్య ప్రజల కష్టాలను వర్ణించిన నా గొడవ ప్రజలభాషలో లేకుంటే అది ఎవరికీ పట్టక పోయేది.
వేమన శతకం లోని పద్యాలు ప్రజా జీవితానికి దర్పణం పట్టినట్లు, వీరి సరళమైన భాష వల్ల వేమన లాగే ప్రజాకవి కాగలిగాడు." నాది పలుకుబడుల భాష బడి పలుకుల భాష కాదు అని గ్రాంథిక భాషను దిక్కరించి ఈ ప్రాంతం వారు ఆ ప్రాంత భాషలోనే రాయాలని సూచించేవారు. "తెలుగు భాషలో ఒక ప్రాంతం వారి భాషకు ఆధిపత్యము లభించి మిగతా ప్రాంతాల భాష హీనంగా చూడటం అంగీకారం కాదని, రెండున్నర జిల్లాల దండి భాష అయినప్పుడు తక్కినోళ్లకె ప్రత్యేకంగా రాజ్యం కావాల్సిందే అని కోరడంలో తప్పులేదు "అని అన్నాడు.
తెలంగాణ భాషాభిమాని:-
^^^^^^^^^^^^^^^^^^^^
మా న్యాయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధిపతి గా పనిచేసిన రాయప్రోలు సుబ్బారావు గారు తెలంగాణ యాస భాషలను కించపరుస్తూ మాట్లాడుతూ ఉండేవాడు. గైర్ ముల్కీ అయిన సుబ్బారావు తెలంగాణ భాషను కించపరుస్తూ మాట్లాడటాన్ని తీవ్రంగా పరిగణించిన కాళోజీ ప్రతిస్పందన ఇది.
" లే మావిచిగురు లను లెస్సగా మెసేవు
రుతు రాజు వచ్చెననిఅతి సంభ్రమంతోడ
మావి కొమ్మ ల్మీద మైమరచి పాడేవు
తిన్న తిండివివారిదే కోకిలా
పాడుపాటివ్వారిదే" చురకలంటించారు.
మాతృభాషను నిర్లక్ష్యంతో పరభాష మోజులో ఉన్న వారిని ఉద్దేశించి
" తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు
సంకోచ పడి ఎదవ సంగతేమిటిరా
అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు
సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా?
942 లో రాసిన ఈ కవిత ఇప్పటికీ మనకు వర్తిస్తుంది. తల్లి భాషను అగౌరవపరిచే సంస్కారాన్ని వీడాలని భాషను భుజాలపై
మోషే వైఖరిని ఎండగట్టాలని కాలోజి ఏనాడో చెప్పాడు.
మానవతావాది kaloji:-
*****************
శ్రీ శ్రీ చే ప్రశంసించ బడిన కాళోజి అసలైన మానవతావాది. ప్రపంచం బాధ అంతా శ్రీశ్రీ బాధ అయితే కాలోజినా గొడవ కు సామాన్య మనిషి కేంద్రం. మానవుని కేంద్రం చేసుకోకుండా సమాజ విశ్లేషణ చేయలేమని భావించిన protagoras తత్వవేత్త తో ప్రారంభమైన మానవతావాదం క్రమంగా పరిణామము చెంది అనేక రూపాలుగా మారిపోయింది. మానవతావాదం అన్ని కోణాలను విలీనం చేసుకున్న kaloji తన ఆత్మకథలో
" నానఇజాల అడుగున చూడ నా ఇజం దే అగుపడు జాడ" అని మానవుడే అన్నిటికి కొలమానం అనే భావనను ప్రోటాగారస్
స్వీకరించగా, ప్రశ్నించే భావం ఉన్న వాడే మనిషి అనే దోరణిని ఎం.ఎన్.రాయ్ నుంచి గ్రహించాడు kaloji.
ఇజాలు ముఖ్యం కావని, మానవుని మూర్తిమత్వ వికాసానికి దోహద పడకపోతే నిరర్ధకమని హెచ్చరించాడు.
మనిషి -సమాజం- కాళోజి:-
***********************
మనిషిని సాటి మనిషిగా చూడగలిగేది నిజమైన సమాజమని ఈ క్రమములో ప్రజాస్వామిక పౌర హక్కులకు భంగం వాటిల్లితే సహించే వాడు కాదు. సభలు సమావేశాలు సందర్భంలో అడ్డుకున్న అభ్యంతర పెట్టిన పోలీసు వారిని నిక్కచ్చిగా మందలించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాళోజీని హింసా వాది ఉగ్రవాది అని కొందరు విమర్శిస్తే తన "నా గొడవలో" స్పష్టమైన వివరణ ఇచ్చాడు. హింస తప్పు, రాజ్యహింస తప్పు ,ప్రతి హింస తప్పు కాదు అని చెప్పారు. కాలోజి తాత్విక దృష్టి లో అన్యాయాలను ఎదిరించే ప్రతివాడు
చైతన్య శీలి. తిరుగుబాటు అనే బతుకు బాట గా మనుషులు మారడానికి ప్రభుత్వాల విధానాలే కారణమని చెప్తూ "ఆత్మకథలో"
" అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి
అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి
అన్యాయాన్నెదిరించినవాడే నాకు ఆరాధ్యుడు"
కాలోజీ ప్రజాస్వామిక తాత్వికత:-
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
భారతదేశంలోని సామ్యవాదులు అయినా ఎం.ఎన్.రాయ్ జయప్రకాష్నారాయణ వలె పార్టీలకతీతంగా ప్రజాస్వామ్యాన్ని ఆదరించారు kaloji. ప్రజాస్వామిక విలువల పట్ల పూర్తి విశ్వాసం కలిగి ఉన్నాడు కనుకనే
ప్రజాస్వామిక దార్శనికుడు వోల్టేరును
తనలో జీర్ణించుకు న్నాడు.
" నేను నీ అభిప్రాయాలతో ఏకీభవించక పోవచ్చు. కానీ నీ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా ప్రకటించుకునే నీ హక్కు కోసం అవసరమైతే నా జీవితాన్ని పణంగా పెట్టి పోరాడుతాను"
----వోల్టేరు
నేటి ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతదేశంలో ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఉన్నాయా ?ఒక్కసారి పరిశీలించండి.
సమాజంలో ప్రజల మధ్యన ఉన్న అంతరాలను వ్యత్యాసాలు అనే గృహంలో ప్రస్తావిస్తూ పుట్టుక ఒకే విధమైన జీవనవిధానంలో ఇంత తేడా ఎందుకని క్రింది రూపంలో ప్రశ్నించాడు.
1 అన్నపు రాసులు ఒక చోట ఆకలి మంటలు ఒకచోట
2 హంసతూలికా లోక చోట అలిగిన దేహాలు ఒకచోట
శ్రీశ్రీ వలనే మాత్రాఛందస్సులో మొదటి రచనలు చేసినప్పటికీ ఈ భూమిపై జరిగే అవకతవకలు అన్యాయాలు ఆవేదన కలిగించగా గేయాలు రాసి కవితలు వినిపించి సభలలో ఉపన్యాసాలతో ఉర్రూతలూగించే వారు.
తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి కాళోజి చేసిన కృషి ఎనలేనిది. తెలంగాణ ప్రజా సంస్కృతికి భాషకు విఘాతం కలిగినప్పుడు అలా తన స్వరాన్ని వినిపించే అణగారిన వర్గాల కోసం గళమెత్తి ప్రశ్నించేవాడు. తెలుగు ప్రజల పౌర హక్కుల కోసం ,ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం మరిచి నప్పుడల్లా చురకలంటించారు .
సామ్యవాద స్థాపనే లక్ష్యంగా పోరాడిన యోధుడు జయప్రకాష్ నారాయణ గూర్చి kaloji" పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది అని కీర్తించాడు". ఇవే మాటలు కాలోజి జీవితానికి కూడా వర్తిస్తాయి అనడంలో సందేహం లేదు. నా జీవితాంతం బడుగు జనుల కు బాసటగా భాషా పలుకుబడుల పరిరక్షణకు ఉద్యమకర్త గా పనిచేసిన కాలోజీ తెలంగాణ సామాజిక కవి అనడంలో అతిశయోక్తి లేదు.
( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత, కవి, రచయిత)
[11/14, 22:06] వడ్డేపల్లి మల్లీశం గారు: నేటి మాట 229/14.11.20 శనివారం
అధికార పార్టీ పంజరాల్లో చిక్కకుండా ప్రజా కవులు కళాకారులను కాపాడుకుందాం.
నమ్ముకున్న ప్రజలకు ద్రోహం చేయొద్దు-
ప్రజల విజ్ఞప్తి!
********************************************
- వడ్డేపల్లి మల్లేశము, 9014206412
ప్రతి వర్గానికి ప్రజలే ఉమ్మడి మార్కెట్. రాజకీయ పక్షాల వాళ్లు ప్రలోభాలతో ఓట్లు వేయించుకుంటున్నారు. ఎన్నికల సంఘం ఆదేశం మేరకు ఓటర్ల జాబితా అనుగుణంగా ప్రజలు తమని ఏదో ఉద్దరిస్తారు అని రాజకీయపక్షాలకు ఓట్లు వేస్తున్నారు. పెట్టుబడిదారులు ,పారిశ్రామిక వేత్తలు అనేక ప్రలోభాలు, ఆకర్షణ పథకాలు, విలాసాలు, ప్రచారాలతో తమ ఉత్పత్తులను ప్రజలచే కొనేలా ప్రోత్సహించి, ఒత్తిడి చేసి లబ్ది పొందుతున్నారు. ఉన్నవాడు మరింత కోటీశ్వరుడు కావడానికి లేనిపోని పథకాలను స్కీములు ఆకర్షణ అవకాశాలను ప్రవేశపెట్టి ప్రజలను మోసగించి బోర్డులు మార్చి కోట్లు గడిస్తున్నారు. మరొకవైపు ఆహారపదార్థాలు నూనెలు తదితర తినుబండారాలు పూర్తి కల్తీ ప్రజలకు అమ్మి ప్రజలను నమ్మిస్తున్నారు. మనలోని వాడు మన లతోనే భూములకు ధరలు విపరీతంగా పెంచి లేనిపోని అవకాశాలను చెప్పి ,నాలుక మీద నే ధరలను మార్చి సామాన్యునికి అందకుండా చేసి, అర గుంట కూడా కొనలేని అధ్వాన స్థితికి ప్రజానీకాన్ని దిగజార్చిన ఘనత రియల్ ఎస్టేట్ బడాబాబుల ది వారి కొమ్ముకాస్తున్న ప్రభుత్వానిది.
ఇప్పుడు చెప్పండి ప్రజలే మార్కెట్ గా ప్రజలే కొనుగోలుదారులు గా ఒకవైపు మూస పోతుంటే వారు తయారు చేసిన ఉత్పత్తులకు మాత్రం ధర వాలే నిర్ణయించుకునే అధికారం లేకుండా పోవడమే ప్రజలు మోసపోతున్నారు మోసగించ పడుతున్నారన దానికి ప్రత్యక్ష నిదర్శనం.
ఈ నేపథ్యంలోనే ప్రజలకు అంతో ఇంతో అండగా ఉన్నారు అనుకున్న కవులు, కళాకారులు, మేధావులు ,జర్నలిస్టులు, విద్యావేత్తలు ,సంపాదకులు తమ గత చరిత్రను, ప్రజల కోసం పని చేయాల్సిన ప్రాథమిక ధర్మాన్ని విస్మరించి అధికార పార్టీలో చేరి ప్రజల విస్మరించడం ని ప్రజలు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు.
చట్టసభలు రాజకీయ ప్రాధాన్యత ప్రజలు:-
************************************
చట్టసభల్లో కి ఎన్నుకోబడే ప్రజా ప్రతినిధులు ధర్మబద్ధంగా ,నీతివంతంగా, రాజ్యాంగబద్ధంగా ఉండాల్సింది పోయి ఇటీవలికాలంలో పూర్తిగా నేర చరిత్ర కలిగిన వాళ్లతో పార్లమెంటు తో సహా అనేక రాష్ట్రాల శాసనసభల్లో నిండిపోవడం ప్రజలకు న్యాయం జరగదని తేలిపోయింది.
ప్రజా ప్రతినిధి అంటే తన నియోజకవర్గం మేరకు ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలు అవసరాలకు అనుగుణంగా చట్టసభల్లో ప్రజల పక్షాన పోరాడి సాధించేవాడు అని అర్థం. కానీ ప్రజా ప్రతినిధి పేరుతోనే తమ పలుకుబడి ఆస్తులు అక్రమ సంపాదన అవసరాలను తీర్చుకోవడానికి సరిపోని వాళ్లు ఇక ప్రజలకు ఏం చేస్తారు అది ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇక్కడ వ్యక్తులు కలుషితం కావడం రాజకీయ చట్టసభలు కూడా కలుషితం కావడం అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇక ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశమే లేకుండా పార్టీ ఫిరాయింపుల ప్రోత్సహించడం ద్వారా ప్రతిపక్షాలు నామమాత్రంగా మిగిలిపోయి ప్రజాస్వామ్యాన్ని ఎక్కిరిస్తున్నాయి.
రాజ్యసభలోనూ రాష్ట్రాల శాసన మండలి సభలోనూ నామినేటెడ్ పోస్టుల సందర్భంలో సంఘ సేవకులు, మేధావులు విద్యావేత్తలు సాహిత్య రంగం నిపుణులకు అనాదిగా భారతదేశంలో అవకాశముంది అది కొద్ది సీట్లకు మాత్రమే
గతంలో సాహిత్య రంగానికి చట్టసభల్లో ప్రాధాన్యత:-
**************(*****
ప్రముఖ కవి విశ్వ నరుడను అని సగర్వంగా చాటి చెప్పిన జాషువా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శాసన మండలి సభ్యులుగా పనిచేశారు. అలాగే తెలంగాణ సాయుధ పోరాటంలో ముఖ్య భూమిక పోషించిన దాశరథి కృష్ణమాచార్య ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా కొంతకాలం పనిచేశారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాజ్యసభ సభ్యునిగా పని చేసినారు. వీరంతా నాటి రాజకీయ నైతిక విలువలకు కట్టుబడి తమ పరిధి మేరకు రాజకీయ అనుభవాలను జోడించి ప్రజల కోసం పని చేయడం జరిగింది కానీ రాజకీయ పార్టీల వ్యక్తులు గానూ అధికార పార్టీకి అండగా అనుచరులుగా కొనసాగలేదు. అది వారికి ఉన్న నైతిక ఆత్మస్థైర్యానికి గుర్తుగా మనం చెప్పవచ్చు.
తెలంగాణలో ఇటీవలి పరిణామాలు:-
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత అప్పటిదాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విప్లవోద్యమాలు ప్రజా ఉద్యమాలలో ప్రజల పక్షాన పనిచేసిన సంపాదకులు, జర్నలిస్టులు, ప్రొఫెసర్లు, కవులు నాటి తెలంగాణ స్పృహను మరిచి రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్రలు పోషిస్తూ తమ ఉద్యమ భావజాలాన్ని పూర్తిగా మరిచి పోయినారు. అంతేకాకుండా ప్రభుత్వం యొక్క ప్రతి చర్యను సమర్థిస్తూ అనేక మంది కవులు పాలాభిషేకం వరకు గొప్పగా చెప్పుకునే పరిస్థితి ప్రజాస్వామ్యంలో మంచిది కాదు.
తెలంగాణ ఉద్యమ కాలంలో 2008 -9 నుంచి 12- 14 వరకు ధూమ్ దాం లు కుల సంఘాల పోరాటాలు వంటావార్పు వివిధ పోరాటం రూపాల ద్వారా సాధించిన తెలంగాణ పునర్నిర్మాణ దశలో ఆ కవులు కళాకారులు ధూమ్ దాం వర్గాలను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేసుకున్న తర్వాత రాష్ట్రంలో చైతన్య గీతాల సందడి కనుమరుగయ్యింది. ఈ రకంగా వందలాది మంది కవులు కళాకారులు ప్రభుత్వ మద్దతు దారులుగా మారిపోవడం లేదా ఉద్యోగులుగా స్థిరపడడం అధికార ఉన్నత పదవులు అలంకరించడం వలన ప్రభుత్వాలను ప్రశ్నించే సాంస్కృతిక కళా రంగాల్లో లేకుండా పోయినవి. ఒకవైపు ప్రతిపక్షాలు నామమాత్రంగా మారడం, ప్రశ్నించిన మేధావుల నిర్బంధించడం కొనసాగుతూ ఉంటే ప్రజా కళాకారులకు ఆశలు చూపి పదవులు ఇచ్చి ప్రశ్నించకుండా చేయడం ప్రజల సంక్షేమాన్ని టార్గెట్గా చేసినట్లు కాదా?
కాళోజీ పురస్కారా గ్రహీత అధికార పార్టీ ఎమ్మెల్సీ గా మారడ మా?
*************************((
గత కొంత కాలంగా ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాల్లోకి ఎంపిక చేసే అభ్యర్థుల లో ప్రముఖ ప్రజా కళాకారుడు, ఆశుకవి, ధిక్కారానికి దిక్సూచిగా పరిచయమైన కాలోజీ పురస్కార గ్రహీత గోరటి వెంకన్న గారి పేరు వినబడుతూ వస్తున్నది. ప్రస్తుతము అధికార పార్టీ ఎమ్మెల్సీ సభ్యులుగా నిర్ణయించడంతో మరో ప్రజా కవి ప్రజలకు దూరం కావడం పట్ల ప్రజలు ఆందోళన చెందుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
సామాన్య ప్రజల జీవన చిత్రాన్ని, కష్టనష్టాలను, ఈతి బాధలను, చెమట చుక్కలను, కన్నీటి ఆవేదనను తెలంగాణ ఉద్యమ కాలంలో సగర్వంగా చాటిచెప్పిన ప్రజాకళాకారుడు అధికారం పేరుతో ప్రభుత్వం ఆహ్వానిస్తే కండువా కప్పుకోవడానికి సిద్ధపడితే ఇంతకాలం నమ్ముకున్న ప్రజలను ఏం చేసినట్లు?
గత రెండు సంవత్సరాల క్రితం ఉపాధ్యాయుల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్సీ పార్టీలకతీతంగా ఉద్యమ భావజాలంతో విద్యా రంగ ప్రగతి కోసమే పని చేస్తాం అని డాంబికాలు పలికి చివరికి ముఖ్యమంత్రి పాదాలు తాకిన సందర్భం అధికారం కోసం అమ్ముడు బోయిన వైనం మనకు తాజా ఉదాహరణ. ఈ విధంగా ప్రజలు, ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్ల ఓట్ల ద్వారా గెలుపొందిన వారు పవిత్రంగా ప్రత్యేకంగా ఆ వర్గ ప్రయోజనం కోసమే పని చేస్తే తప్పు లేదు కానీ రాజకీయ పార్టీలలో అందునా అధికార పార్టీ ప్రలోభాలకు గురి అయితే వారి ప్రత్యేకత ఏముంది ? పవిత్ర నదీ జలం ఉప్పునీటి సముద్రంలో చేరినట్లే కదా?
మేధావులు ,విద్యావంతులు, కవులు, కళాకారులు, ప్రజా గాయకులకు ప్రభుత్వ నిర్వహణలో పాలనలో వారి సహకారాన్ని తీసుకొని మరింత ఉన్నతంగా పరిపాలించాలి కానీ ఆశలు చూపి కొనకూడదు.
ఇక ప్రజా కళాకారులు కానీ మేధావులు కాని ఆశతో ప్రభుత్వాలకు పార్టీలకు అమ్ముడుపోతే తిరిగి ఏ ముఖంతో ప్రజల వద్దకు రాగలరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది.
ప్రజా కళాకారుడుగా మామూలు స్థాయిలో బ్రతికి ప్రజల కష్టసుఖాలను తన మాట పాట ద్వారా జనంలోకి ప్రభుత్వాలు రాజకీయ పక్షాల దృష్టికి తీసుకు వచ్చిన కళాకారులు అధికార విలాసాలు భోగలాలసత కు క్షణిక సుఖాల కోసం అమ్ముడుపోతే శాశ్వతంగా ప్రజలకు దూరం అయినట్లే ప్రజలకు ద్రోహం చేసినట్లే. ఎందుకంటే సాహిత్య సాంస్కృతిక రంగాలు పాలకులను ఆలోచింపజేసే పెద్ద సాధనాలు.
ఆ సాధనాలే అమ్ముడుపోయి నిశ్శబ్దం గా మారితే ఇక ప్రజలకు చక్కటి పాలన దొరుకుతుందని నమ్మకమే లేదు. అంతేకాదు ఇలాంటి వారు ప్రజల నిరసనకు ఈసడింపు లకు గురి కాక తప్పదు. కాలం ఇచ్చే తీర్పు కు అందరం కట్టుబడి ఉండాల్సిందే.
ప్రజా కళాకారులకు విజ్ఞప్తి:-
*******************************
దయచేసి తాత్కాలిక పదవీ వ్యామోహా లకు బలి కావద్దు. ఇప్పటికీ మించినది లేదు.
ధిక్కార స్వరాన్ని వినిపించిన కాలోజి పురస్కార గ్రహీత గా ఉండి అధికారాన్ని వదిలితే ఎలా? ఆదర్శంగా ఉన్నట్లు నటిస్తూ తీయని మాటలు చెప్పి సదస్సులో ప్రసంగించిన అంతమాత్రాన ప్రజలు మనలను పరిశీలించరని అనుకోవద్దు. మన మాటలు చేష్టలు సిద్ధాంతం ఆచరణ నిరంతరము సమాజము పరిశీలనలోనే ఉంటుంది.
అందుకే ప్రజాభిప్రాయాన్ని ఈ వ్యాసము ద్వారా మీ దృష్టికి తీసుకు వస్తున్నాం. మీలో నిబిడీకృతమైన కళ బలమైనది ప్రజల పక్షంగా నిలిచేది .నిలిచినది. ఆ కళ ముందు అధికార పదవులు ఆస్తులు క్షణికమైన వి.
మనసు మార్చుకుని పెద్దమనసు చేసుకొని ప్రజల పక్షపాతిగా నిలిచిపోవడానికి చివరి అవకాశం. ప్రజల విజ్ఞప్తిని మన్నిస్తే పెద్ద పీట వేస్తారు. లేకుంటే ఉన్న పీట తీస్తారు.
ఇది కేవలం తెలంగాణా ఒక్క రాష్ట్రంలో ఉన్న జరుగుతున్న విషయం కాదు కేంద్రంలోనూ దేశంలోని అనేక రాష్ట్రాలలో కవులు కళాకారులు మేధావులను గొంతు నొక్కే ప్రయత్నంలో అధికార పార్టీ లకు ప్రభుత్వాలు ఆహ్వానిస్తున్న విషయాన్ని ఒక కంట ప్రజలు కనిపెట్టాలి. ప్రాంతము రాష్ట్రము ఏదైనా నష్టం జరిగేది సామాన్య ప్రజానీకానికి కనుక సకల ప్రజానీకం మద్దతు ఉండడం ఇలాంటి సందర్భాల్లో చాలా అవసరం. ప్రభుత్వాల కూడా విజ్ఞప్తి. మా కవులు కళాకారులు మేధావులు విద్యావంతులను విద్యావేత్తల ను పరిపాలన మరింత ఉన్నతంగా రూపకల్పన కోసం వినియోగించుకోండి. కానీ అధికార ప్రలోభాలకు ఆహ్వానిస్తే నమ్ముకున్న ప్రజా రంగము నిర్వీర్యమై పోతుంది.
నైతిక విలువలు పతనమైన ఈ రోజుల్లో న్యాయం అందక ఆవేదన నుండి ప్రజల ఆర్తనాదం ఈ విజ్ఞాపన.
( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ,కవి, రచయిత, ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు, అధ్యక్షులు జాగృతి కళాసమితి హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)
[11/16, 00:33] వడ్డేపల్లి మల్లీశం గారు: నేటి మాట 230/15.11.20 ఆదివారం
దీపాల వరుస మాత్రమే దీపావళి కాదు, ప్రజల జీవితాల్లో వెలుగు రేకలు అసలైన దీపావళి..
- వడ్డేపల్లి మల్లేశము,901426412
*****************************************
పాఠక మిత్రులకు, పెద్దలకు ,సర్వ ప్రజానీకానికి దీపావళి శుభాకాంక్షలు!!!!!
50 ఏళ్ల క్రితం చిన్ననాడు చదువుకున్న పుస్తకాలలో దీపావళి అనగా దీపాల వరుస అని అర్థం అని రాసి ఉండేది. ఆనాడు అంతే కావచ్చు అనుకున్నాం. కానీ నేడు దీపాల వెలుగు లకే పరిమితం చేస్తే ప్రజల దీపావళి సంతోషించదు. కనుక ప్రజల కోణంలో, కష్టసుఖాలను, చీకటి వెలుతురు గా భావించి
ప్రజల జీవితాల్లో సమగ్రమైన మార్పు వచ్చిన రోజే నిజమైన దీపావళి గా జరుపుకోవడం అలా భావించడం నేటి తక్షణ కర్తవ్యం.
అసలైన దీపావళి ( కవిత)
*************(((((((((((**************
దీపాల వరుస దీపావళి అని
వెలుగులు వెలుతురు జ్యోతి
శుభాలకు చిహ్నమని మురిసి పోతున్నాము.
ప్రజల జీవితాల్లో రాని మార్పు
వెలుగులు జిగేలు అంటేనే వస్తుందా?
ఆర్తుల కన్నీటి బాధలు పెరుగుతుంటే,
వర్ణ ,కుల వివక్షత వర్ధిల్లుతూ ఉంటే,
అంతరాలు అసమానతలకు అంతే లేకుంటే,
పేదరికానికి పాలకులు పెద్దపీట వేస్తే,
అత్యాచారాలకు సభల బలే అవుతుంటే,
మూలాలు ఎక్కడో వెతికి...
తగిన గాలాలు వేసిన రోజే దీపావళి!
కన్నీరు బదులు పన్నీరు ఒలికితే,
ప్రజా ప్రతినిధులు ప్రజల కోసమే పని చేస్తే,
అక్రమార్కుల గుట్టురట్టయిన రోజే
ప్రజా దీపావళి! ప్రకృతి దీపావళి!
ప్రలోభాలు పక్కనపెట్టి,
ప్రజల కోసమే నిజమైన పాలన సాగితే,
పార్టీ ఫిరాయింపుల నీచత్వాన్ని వదలి,
ప్రజా కవులు కళాకారులను,
ప్రజల కోసమే పని చేయిస్తే. దీపావళి!
చట్టసభల్లో ని నేరగాళ్లను ఉరి తీసి
ప్రజల మనుషుల బందీఖానాలో నుంచి విడుదల చేస్తేనే,
అసలైన దీపావళి !అందమైన దీపావళి! అందరి దీపావళి!
(ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు అధ్యక్షులు జాగృతి కళాసమితి హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట)
[11/17, 23:15] వడ్డేపల్లి మల్లీశం గారు: నేటి మాట 232/17.11.20 మంగళవారం
సమ సమాజ నిర్మాతలు ,నవసమాజ నిర్ణేతలు---- విద్యార్థులు. విద్యార్థి శక్తి భవితకు యుక్తి.
- వడ్డేపల్లి మల్లేశం,9014206412
*********************************************
సమ సమాజ నిర్మాతలు, నవ సమాజ నిర్మాతలు విద్యార్థులు. అని నేను రాసుకున్న పాట సాక్షిగా సమాజం యొక్క బాధ్యత కూడా విద్యార్థులను ఆ రకంగా గుర్తించవలసిన అవసరం ఉన్నది. అంతేకాదు శక్తియుతులు, యుక్తి పరులు తాము నేర్చిన విద్యాగంధం ద్వారా జ్ఞాన ప్రభలను విశ్వవ్యాప్తం చేయగలరు. అయితే కాలానుగుణంగా సామాజిక మార్పులు కారణంగా సమకాలీన సమాజాన్ని నడిపిస్తున్న అనేక ఇతర శక్తులుఉదా":-
యాంత్రికీకరణ, పారిశ్రామికీకరణ, ప్రపంచీకరణ, మీడియా ప్రభావం, కనుమరుగవుతున్న మానవ సంబంధాలు, పెరుగుతున్న స్వార్థ చింతన ,నడుస్తున్న చరిత్ర పట్ల సోయి లేనితనం కూడా విద్యార్థులను చెడు వైపు తీసుకెళుతున్నయి.
వీటన్నింటికీ తోడు గమ్యము, గతి, దిశా, లక్ష్యం లేని సినిమా టీవీ సీరియల్ రంగాలు కొంత మందికి ఉపాధి చూపవచ్చు ఏమో కానీ ఆ ముసుగులో సమాజం యావత్తూ వ్యతిరేక ఆలోచనలు వైపు పయనించడం ఆందోళనకరమే.
విద్యార్థులు సామాజిక బాధ్యత:-
******(*****(*******************(
విద్యార్థులకు సామాజిక బాధ్యత ఉన్నది. ఆ క్రమశిక్షణ పాఠశాలలో గురువ్ద్వారా ,ఇంటిదగ్గర తల్లిదండ్రుల ద్వారా, సమకాలీన సమాజము, కాలానుగుణంగా, సమవయస్కుల ద్వారా కూడా విద్యార్థులు ప్రభావితులవుతారు. మంచి ఎక్కువ ఉంటే ఉన్నతులవుతారు. కుటుంబ సమస్యలను పట్టించుకోవడం, చదివించిన తల్లిదండ్రులకు సమాజానికి బాధ్యత వహించడం, నడుస్తున్న చరిత్రను అధ్యయనం చేయడం, ప్రాంత జాతీయ విముక్తి ఉద్యమాలను ,స్వాతంత్ర పోరాటాలను, జ్ఞప్తికి తెచ్చుకొని కృతజ్ఞతాపూర్వకంగా వ్యవహరించడం, చదువులో సామాజిక రుగ్మతలను చొరబడకుండా జాగ్రత్త వహించి ఉన్నత ఆశయంతో లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో.. విద్యార్థులు చాలా జాగ్రత్తగా వ్యవహరించడమే కాకుండా, బహు పాత్రాభినయం చేయవలసి ఉంటుంది.
సామాజిక రుగ్మతల పట్ల సమరభేరి మోగించి ఉద్దేశ్యంతో నినదించే అగ్గిపిడుగు లై విద్యార్థి ఉద్యమాన్ని కూడా నిర్మించవలసి ఉంటుంది. అందులో నుండి విద్యార్థి నాయకుడిగా ఎదిగిన వాళ్ళు రాజకీయ పక్షాల వైపు, రాజకీయాలను నీతి వైపు మళ్ళించ వలసిన అవసరం మరింత గా ఉన్నది.
విద్యార్థులపై సమాజము ఆకాంక్షలు పెంచుకుంటుంది*:-
*************************
వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులు సామూహికంగా సమాజపరంగా సమాజానికి చెందిన ఉమ్మడి ఆస్తిగా విద్యార్థులను ఈ సమాజము బహుళ ఆకాంక్షలు కలిగిఉంటుంది. ఒక దశలో విద్యార్థులు రాజకీయాలవైపు మల్ల కూడదని తద్వారా వారి చదువు నాశనమవుతుందని అనుకుంటారు. కానీ విద్య లక్ష్యాలకు అనుగుణంగా విద్యార్థిని చేస్తూనే bhabhi సవాళ్లను అధిగమించే క్రమంలో సమకాలీన అంశాల పట్ల స్పందించవలసిన అవసరం ఎంతో ఉన్నది .అది విద్యార్జనకు ఉన్నత ఉద్యోగాలకు లక్ష్యసిద్ధి కి అడ్డు రాకూడదు.
భారతదేశంలో దాదాపుగా 40 శాతం పైగా యువత ఉన్నదనేది అంతర్జాతీయ గణాంకాలను బట్టి తెలుస్తుంది. శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, సాహిత్యపరంగా విద్యార్థి వయసులో ఉన్న యువత అనేక రకాల ఒత్తిళ్లు, అవాంతరాలు అధిగమించడానికి సిద్ధంగా ఉంటారు. ఇదే వయసులో అటు ఉపాధ్యాయులు, విద్యారంగం ,తల్లిదండ్రులు
వారిని సక్రమ దారుల నడిపించి నట్లయితే ఈ దేశాన్ని ఎల కలిగే పరిపాలకులు, అధికారులు, ఉన్నతోద్యోగులు, శాస్త్రవేత్తలు,
రాజనీతిజ్ఞులు, ఆర్థిక నిపుణులు, విద్యారంగ నిపుణులు, కాగలుగుతారు.
ఈ మార్పులను సమాజం మాత్రమే ఆశించడం కాకుండా మన దేశంలో ఉన్న రాజకీయ యంత్రాంగం కూడా దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యువజన విధానాన్ని అవలంబించి నప్పుడు సరైన యువజన విధానాన్ని ప్రకటించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ఆవిర్భావం అనంతరం నుండి నేటి వరకు కూడా స్పష్టమైన యువజన విధానం లేకపోవడం వలన నిరుద్యోగం, అల్ప ఉపాధి విద్యా రంగంలో పలు సమస్యలు ,విద్యార్థుల ఆత్మహత్యలు నిరాశా నిస్పృహలకు లోను కావడం జరుగుతున్నది. వీటిని పాలకులు తల్లిదండ్రులు, విద్యారంగ నిపుణులు, మానసిక శాస్త్రవేత్తల తో, బహుళ పక్షాలతో చర్చలు జరిపి సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించి వారి శక్తిని జాతీయ శక్తి గా గుర్తించి దేశాభివృద్ధిలో వినియోగించుకోవాలి ఇది ప్రభుత్వాలకు ఉండవలసిన నైతిక బాధ్యత.
అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవ నేపథ్యం:-
*************************
అన్ని అంశాల పట్ల అంతర్జాతీయ స్థాయిలో జరిగిన చర్చల సారాంశం గానే అంతర్జాతీయ దినోత్సవాలు ప్రాముఖ్యత చరిత్రలో మనకు కనబడుతుంది. అదే క్రమంలో అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం కూడా చారిత్రక నేపథ్యాన్ని కలిగి ఉన్నది. ఈ అంశాన్ని తెలుసుకోవడం ద్వారా విద్యార్థులు, యువత లో గల దుందుడుకు లక్షణాలను, రౌడీయిజాన్ని, నిష్క్రియాత్మక తను సరి చేసుకోవలసిన అవసరం అన్ని వర్గాల పై ఉన్నది. ప్రస్తుతం దేశం యొక్క చారిత్రక అవసరం కూడా.
చరిత్రలోకి వెళితే జర్మనీ నియంత హిట్లర్ తన నాజీయిజాన్ని సామ్రాజ్యవాద కాంక్ష ప్రపంచ దేశాలతో పంచుకోవడానికి తన నాజీలను చాలా దేశాలకు ఉసిగొలిపే పంపించినాడు. ఆ క్రమంలో 1939లో ఆర్ దుండగులు ఆక్రమించిన మొదటి దేశం జకె స్లోవేకియ. ఆ దేశంలోని అతి ప్రాధాన్యత కలిగిన ఫ్రాగ్ నగరంలోని విశ్వవిద్యాలయంలో కి నాజీ సేనలు ప్రవేశించి విద్యార్థులను చెల్లాచెదురు చేశారు. వీరి ఆగడాలను అడ్డుకున్న విద్యార్థులపై నాజీలు అత్యంత క్రూరంగా కాల్పులు జరిపి పదిమంది విద్యార్థి నాయకులను చంపి, మరో పన్నెండు వందల మందిని "కాన్సెంట్రేషన్ క్యాంప్ "అనే నిర్బంధంలోకి పంపి వారిని నరకయాతనకె గురిచేశారు. ఈ సంఘటన జరిగినది 17 వ నవంబర్. 1942లో ఇంగ్లాండ్ దేశంలోని లండన్లో జరిగిన అంతర్జాతీయ విద్యార్థుల సమైక్య మండలి సమావేశంలో నాజీల ఊచకోతపై సమగ్రంగా చర్చించారు. భవిష్యత్తులో అలా జరగకుండా అడ్డుకోవాలని ప్రపంచంలోని అన్ని దేశాలను కోరుతూ నాటి బలిదానానికి గుర్తుగా ప్రతి సంవత్సరం 17వ నవంబర్ ను అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం గా జరపాలని ఆ సమావేశం తీర్మానించింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం నిర్వహించబడుచున్నది.
ప్రతి విద్యా కేంద్రం పైన " విద్యకై రమ్ము విశ్వ సేవకై పొమ్ము" అనే వాక్యం తరచుగా కనపడుతూ ఉంటుంది. అలాగే దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ సూక్తిని ఆదర్శంగా తీసుకొని తోటి మనిషిని సాటి మనిషిగా చూడగలిగితే, బాధ్యతలను గుర్తించగలిగితే, సకాలంలో సమయస్ఫూర్తిని ప్రదర్శించగలిగితే రాబోయే కాలమంతా విద్యార్తి లో కానిదే. ఆ వైపుగా అందరం తలా పిడికెడు బాధ్యతను పంచుకుందాం. ఉన్నత విలువలు గల భారతావనిని నిర్మించుకుందాం. అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాలను ఉన్నతీక
రించుకుందాం.
( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు, కవి ,రచయిత ,అధ్యక్షులు జాగృతి కళాశాల హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)
[11/18, 23:24] వడ్డేపల్లి మల్లీశం గారు: నేటి మాట 233/18.11.20 బుధవారం
ప్రజా సాహిత్యాన్ని పదిల పరుచుకుని
పరివ్యాప్తం చేద్దాం- ఇది కవులకు మాత్రమే కాదు సమాజం మొత్తానికి బాధ్యత.....
******************************************
- వడ్డేపల్లి మల్లేశము,9014206412
ఒకనాడు ఉపాధ్యాయ కేంద్రంగా పనిచేసిన విద్యావ్యవస్థ నేడు విద్యార్థి కేంద్రంగా పని చేస్తూ ఆలోచింపజేస్తుంది. కాలానుగుణంగా నే కాదు, అవసరానుగుణంగా, పరిశోధనల మేరకు భావి సవాళ్లను అధిగమించడానికి విద్యార్థి కేంద్రమైన విద్య నేడు తెరపైకి వచ్చింది.
విద్యార్థి అవసరాలు ఏమిటి? తల్లిదండ్రుల ఆకాంక్షలు, రేపటి సవాళ్లను అధిగమించడానికి ఏ రకమైన సంసిద్ధతను అందించాలో విద్యార్థి కేంద్రీకృత విద్య తగు సూచనలు చేసి వ్యక్తి నిర్మాణానికి తోడ్పడుతుంది. తద్వారా వ్యక్తిలో ఉన్న అంతర్గత శక్తులను బయటకు తీసి వ్యక్తిత్వం ఉన్న మానవునిగా తయారు చేస్తుంది.
ఇదే క్రమంలో మనిషిని తీర్చిదిద్దడానికి, సమాజానికి హితం చేకూర్చడానికి, సకల సమస్యలకు పరిష్కారాలను చూపడానికి తోడ్పడే రంగమే సాహిత్యం. అదే నిజమైన ప్రజాసాహిత్యం. వర్ణనలతో ,బావ వాదంతో ప్రజలను కేంద్రము చేయని, ప్రజల అభ్యుదయానికి తోడ్పడని సాహిత్యాన్ని కొంతకాలం పక్కన పెడదాం. నిజమైన ప్రజా సాహిత్యాన్ని ఆదరిద్దాం! పదిల పరచుకొని పరివ్యాప్తం చేద్దాం!
- ప్రజా సాహిత్యం అంటే ఏమిటి:-
*********************************
మనిషి పుట్టుక ను, ధర్మాన్ని, కర్తవ్యాన్ని, విలువలను, అవసరాన్ని, సాధనలో ఆటంకాలను గుర్తించి తన చుట్టూ జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టి ప్రజల మేలుకోరే సాహిత్యమే ప్రజా సాహిత్యం అవుతుంది. స్వతంత్ర కార్యాచరణతో, మానవతా విలువలు పునాదిగా, వ్యక్తి స్వేచ్ఛ ,సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రాతిపదికగా ప్రశ్నించడం ద్వారా సమాధానాన్ని రాబట్టి ధిక్కార స్వరాన్ని వినిపించడం ద్వారా ఆధిపత్యాన్ని అంతం చేసి వివక్షత లేని అంతరాలు కానరాని ఉద్యమ భావజాలాన్ని అందించే సాహిత్యం ప్రజా సాహిత్యం అవుతుంది.
ప్రజా సాహిత్యాన్ని అందించే కవులు, కళాకారులు, మేధావులు, రచయితలు, విమర్శకులు ,వ్యాసకర్తలు ముందుగా తాము ప్రజల కోసం మాత్రమే పనిచేసే వాళ్ల0అని గ్రహించి ప్రజల కోణంలో దృక్పధాన్ని అలవర్చుకొని తార్కిక ,తాత్విక దృష్టితో హేతుబద్ధత ప్రాతిపదికగా రచనలు సాగించవలసి ఉంటుంది. ఇక్కడ రచయితలకు వ్యక్తులక న్నా వ్యవస్థలు ముఖ్యం.. వ్యక్తిగత ప్రలోభాల కన్నా సామూహిక ప్రయోజనాలు ముఖ్యం.. సిద్ధాంతము కన్నా ఆచరణ ముఖ్యం.
ప్రజా సాహిత్యం అందరినీ ఎందుకు ఆకర్షించ దు:-
*************************************
ప్రజల కోసం పని చేసిన వాళ్ళు, కుటుంబాలను పక్కకుపెట్టి జీవితాలను పణంగా పెట్టి చరిత్రలో నిలిచిన యోధులు, వీరులు, ధన్యజీవులు, కవులు మేధావులు తత్వవేత్తలు కొద్ది మంది మాత్రమే ఉన్నారు.
కారణం ప్రజల పక్షాన నిలబడాలి అన్న నిజాయితీకి కట్టుబడి ఉండాలి, విలువల ప్రాతిపదికగా స్వార్థాన్ని త్యజించి, సమాజం కోసం నిస్వార్థంగా పని చేయవలసి ఉంటుంది. ఈ నిబంధనలు కట్టుబాట్లు అందరికీ రుచించవు. ఈ విలువల పట్ల విశ్వాసం కూడా అందరికీ ఉండదు. కొందరికి ప్రశ్నించడం అంటే పెద్ద నేరం చేసినట్లు, ఇతరుల కోసం మాట్లాడడం పని చేయడం అంటే ఏదో పోగొట్టుకున్నట్లు ఇరుకైన ఆలోచనతో ఉంటారు కనుక అందరినీ ప్రజా సాహిత్యము ఆకర్షించలేదు. బాధ్యతల నుండి తప్పుకునే వారికి, సోమరిపోతులు, నిబద్ధత లేని వాళ్ళు, మూఢ అంధకారములో నలిగిపోయే వారికి ఈ సామాజిక మార్పును కోరే దృక్పథం రుచించదు.
కేవలం కవి మాత్రమే కాదు ప్రజానీకంలో మెజారిటీ ప్రజలు మార్పుకు, ఆలోచించడానికి ప్రశ్నించడానికి సామాజిక చింతన కు దూరంగా ఉంటారు. ఆసంఘటితమైన ఆలోచన ప్రజానీకాన్ని ఐక్యం కాకుండా అడ్డుకోవడంతో పాటు ఉన్నత వర్గాలు పెట్టుబడిదారులు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు , ప్రలోభాలు మనిషిని చైతన్యం కాకుండా చూస్తుంటాయి. ఈ దుర్భర పరిస్థితుల్లో నుండి మనిషిని చైతన్యపు అంచు వరకు తీసుకువెళ్లడానికి ఉపయోగపడే సాహిత్యం ప్రజా సాహిత్యం .ఆ సాహిత్యాన్ని సృష్టించే కవులు ప్రజాకవులు.
ప్రజా సాహిత్యం అవసరం సామాజిక మార్పు- కవులు రచయితల బాధ్యతలు:-
****************************************
సాహిత్యం యొక్క ప్రయోజనం సంఘ శ్రేయస్సు అని నన్నయ్య అంటే, కష్టజీవికి ఇరువైపులా ఉండే వాడే కవి అని శ్రీశ్రీ వర్ణించాడు. జాషువా, గురజాడ, శ్రీశ్రీ, kaloji,
బోయి భీమన్న, కుసుమ ధర్మన్న వంటి కొంతమంది కవులు ప్రజా సాహిత్యానికి బాటలు వేస్తే నేటి తరం అభ్యుదయ రచయితలు ఆ సాహిత్యాన్ని పదిల పరుచుకుని విశ్వవ్యాప్తం చేసే దిశగా ఆలోచిస్తున్నారు పనిచేస్తున్నారు. అయితే వారికి ఆటంకాలు కల్పించే శక్తులు అనేకం.
ఇటీవలికాలంలో పౌర హక్కులు మానవ హక్కులు వ్యక్తి స్వేచ్ఛ నిర్బంధాన్ని వ్యతిరేకించే క్రమంలో పనిచేస్తున్న హక్కుల కార్యకర్తలు వరవరరావు, ప్రొఫెసర్ హరగోపాల్, ఆ ఉద్యమంలో ప్రజలను భాగస్వాములను చేసి సామాన్య జీవితం గడిపిన కీర్తిశేషులు బాలగోపాల్ వంటి అనేక మంది రచయితలు, ప్రముఖులు, మేధావులు ఇప్పటికీ ప్రజాసాహిత్యం, ఈ ప్రజా దృక్పథాన్ని ,ప్రజా ప్రయోజనాన్ని కేంద్రంగా చేసుకునే పని చేస్తున్నారు. ప్రజా పాలనలో మేధావుల సహకారాన్ని తీసుకోవాల్సిన ప్రభుత్వాలు ప్రజలకు శత్రువులుగా చూచి నిర్బంధాలకు గురి చేస్తుంటే నిజమైన నేరగాళ్లు చట్ట సభల్లోనూ ,స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే ఇది ఏమి ప్రజాస్వామ్యం అని జనం ముక్కున వేలేసుకుంటున్నవేళ, ప్రజా సాహిత్యాన్ని కాపాడుకోవడానికి, ప్రజా కవులు కళాకారులు మేధావులు నిర్బంధాలను అదుపు చేయాల్సిన బాధ్యత సమాజంపై బుద్ధి జీవుల పై రాజకీయ పక్షాల పై ఎక్కువగా ఉన్నది.
ఇక కవులు స్వార్థచింతన మానుకొని సమాజమే క్షేత్రంగా తమదైన శైలిలో సామాజిక మార్పు కోసం రచనలు చేస్తూ ఉద్యమంలా ప్రజలను చైతన్యం చేయవలసిన అనివార్యమైన పరిస్థితి నేడు దేశంలో కొనసాగుతున్నది. శాంతియుతమైన, సమానత్వం తో కూడిన వివక్షత లేని తోటి మనిషి సాటి మనిషిగా చూసే మరో ప్రపంచం కోసం మనుషులుగా కవులుగా కళాకారులుగా మేధావులుగా చేస్తున్న కృషిని సమాజము స్వాగతిస్తూనే వారికి మద్దతు చేయవలసిన అవసరం ఎంతో ఉన్నదని వ్యాసరచన సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి.
కోడి పెట్ట తన పిల్లలను కాపాడుకున్న ట్లు ప్రభుత్వం తన ప్రజానీకాన్ని కంటికి రెప్పవలె కాపాడు కోవలసిన అవసరం ఉన్నది. సంక్షేమము అభివృద్ధితో కూడిన ఆ బాధ్యతను ప్రభుత్వం మరిచిన్నప్పుడే
ప్రజా సాహిత్యము అనివార్యమవుతుంది. ఈ చారిత్రక వాస్తవాన్ని ప్రభుత్వము, ప్రజలు, రాజకీయ పక్షాలు, మేధావులు అందరూ గుర్తిస్తే అదే నిజమైన ప్రజాస్వామ్యం. ప్రజల భాగస్వామ్యం.
( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు కవి రచయిత అధ్యక్షులు జాగృతి కళాసమితి హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)
[11/20, 00:15] వడ్డేపల్లి మల్లీశం గారు: నేటి మాట 234/19.11.20 గురువారం
జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఇందిరాగాంధీ- సామాజిక రాజకీయ ఆర్థిక కోణాలు పరిపాలన- విజయాలు వైఫల్యాలు
************((((((**************************
-- వడ్డేపల్లి మల్లేశము,9014206412
విజయాలు వైఫల్యాలు ఎన్ని ఉన్నా అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ స్త్రీ జాతికి ఒక సజీవమైన చరిత్ర సృష్టించిన ఘనత ఇందిరాగాంధీ కే దక్కుతుంది. మహిళలను అబలలు అని నిర్వహిస్తూ అతి హీనంగా చూస్తూ అసలు మనిషి గానే లెక్కించలేని కాలంలో ఉన్నత కుటుంబంలో పుట్టినప్పటికీ తనదైన శైలిలో ప్రజా పాలనా రంగంలోకి అడుగుపెట్టిన ఇందిరాగాంధీ విమర్శలు వైఫల్యాలను మూసుకొని వెళ్ళవచ్చు కానీ స్త్రీలు కూడా పరిపాలించ గలరు ఉన్నత స్థానాలను అలంకరించ గలరు చరిత్రను తిరగ రాయగల రని తేల్చి చూపింది ప్రపంచానికి.
గత చరిత్ర నుండి వర్తమాన కాలానికి భవిష్యత్ సవాళ్లను అధిగమించడానికి ఉపయోగపడే చారిత్రక అవసరమైన ఇందిరా గాంధీ జీవిత చరిత్రను నేటి రాజకీయ నాయకులు ముఖ్యంగా మహిళా లోకం గుర్తించి తదనుగుణంగా నడుచుకొని తమదైన శైలిలో అవసరమైన చోట ప్రశ్నించడం లేకుంటే ఆలోచించడం పాలనలోని అంతరంగాల ను గుర్తించడం చేయాల్సిన అటువంటి అవసరం ఉన్నది.
ఒక గ్రంథం అంత విశాలమైన జీవనయానాన్ని ఒక్క వ్యాసములో పొందుపరచడం అసాధ్యం ఇబ్బందికరం కూడా. అయినా ప్రయత్నించి ముఖ్య ఘట్టాలను నెమరు వేసుకోవడం ద్వారా ఇందిరా గాంధీ జయంతి అయిన 19 నవంబర్ రోజును మహిళా లోకం తన ఆశయాలలోకి మరల్చుకుంటుందని ఆశిద్దాం!
బాల్యం నేర్పిన రాజకీయం:-
****************************
కుటుంబ పరిస్థితులు, ఆనాటి జ్ఞానము, సంస్కృతి ,సమాలోచనలు, వచ్చిపోయే వాళ్లతోని కూడా ఆ కుటుంబ సభ్యులు జ్ఞానసముపార్జన ఆచరణ చేసే అవకాశం ఉంటుంది .అలాంటి అవకాశమే ఇందిరాగాంధీకి బాల్యంలో దక్కింది.
ఇందిరాగాంధీ భారతదేశపు మొట్టమొదటి ఏకైక మహిళా ప్రధానమంత్రి అంతేకాదు 66 నుండి 77 వరకు వరుసగా 3 పర్యాయాలు 1980లో నాలుగవ పర్యాయం ప్రధాన మంత్రిగా పనిచేసి ప్రపంచాన్ని నివ్వెరపరిచింది మహిళాలోకానికి భరోసా అందించినది. 1917 నవంబర్ 19వ తేదీన అలహాబాదులో జవహర్లాల్ నెహ్రూ కమలా నెహ్రూ లా ఏకైక పుత్రికగా ఆనంద భవన్ లో జన్మించిన ఆమెకు తమ ఇంటికి వచ్చిన వారితో గడపడం చూడడం వినడం వలన అనేక విషయాలు తెలిసేవి. జలియన్వాలాబాగ్ సంఘటన జరిగిన తర్వాత సోమ విలాసాలను మానుకున్న మోతిలాల్ గద్దర్ వస్త్రాలను ధరించడం తో పాటు తమ పిల్లలకు కాన్వెంట్ స్కూళ్ళు కూడా మానిపించిన కాలమది. అలాంటి పరిస్థితుల్లో గాంధీ మోతిలాల్ ఇంటికి వచ్చినప్పుడు నెహ్రు తో చాలా సేపు మాట్లాడిన మాటలను విని ప్రేక్షకులుగా ఉండడంతోపాటు తన తల్లి తండ్రి ఇద్దరూ కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొని కళ్లారా చూసింది. స్వాతంత్ర పోరాట వ్యూహాలకు తమ ఇల్లు ఒక వేదికగా మారడాన్ని కళ్లారా చూసిన ఇందిరాగాంధీ తన విదేశీ బొమ్మలను వదలి ,భోగభాగ్యాలతో అలవాటుపడిన నెహ్రూ కష్టాల కైనా సిద్ధపడడం ని గమనించి రేపటి రాజకీయాలకు సంసిద్ధులు అయినది బాల్యంలోనే ఇందిరా. ఆనాడు ఆంగ్లేయుల పాలన కు వ్యతిరేకంగా సర్వత్ర గల వ్యతిరేకతను సమైక్యంగా తీసుకురావడానికి చేసిన కృషిలో భాగంగా తన తల్లి తండ్రి జైలుకు వెళ్లారు. తాతగారు కూడా జైలుకు వెళ్లిన సమయంలో ఒంటరిగానే ఆత్మ నిబ్బరంతో గడిపింది ఇందిరా.
స్వాతంత్ర పోరాట కాలంలో ఎప్పుడూ పోలీసుల చర్యలు దాడులు చేస్తారో అరెస్టు చేస్తారో తెలుగు నటువంటి కఠోర పరిస్థితిలో ఆ సమాచారాన్ని నాయకులు చేరవేయడానికి ఇందిర తన నాయకత్వంలో స్నేహితులతో కలిసి వానరసేనను ఏర్పాటు చేసి భవిష్యత్ రాజకీయ పార్టీ నిర్మాణానికి ఆనాడే నాంది పలికింది.
పూణే విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్ పరీక్షలో ఉత్తీర్ణులైన తర్వాత రవీంద్రనాథ్ స్థాపించిన శాంతినికేతన్ లో చేరి క్రమశిక్షణతో జీవితాన్ని గడిపి అనేక విషయాలను ఆకళింపు చేసుకున్నది కాని తల్లి అనారోగ్యం కారణంగా ఆమెను కుంగదీసింది. అంత నికృష్ట పరిస్థితుల్లోనూ తండ్రి ఆశయానికి అనుగుణంగా లండన్ లో ఎక్కువ రోజులు గడిపింది ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ని సోమర్విల్ కళాశాలలో స్థాపించిన ఇండియా లీగ్లో చేరడమే కాకుండా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం లో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకునే సమయంలో జర్నలిస్ట్ ఫిరోజ్ గాంధీ తో ఏర్పడిన స్నేహం ఒంటరితనాన్ని పోగొట్టడానికి కాకుండా జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. పార్సీలు అయినా ఫిరోజ్ గాంధీ తో ఇందిరాగాంధీ ప్రేమను మొదట్లో అంగీకరించని నెహ్రూ గాంధీ మధ్యవర్తిత్వంతో వీరి ప్రేమను అర్థం చేసుకోమని కోరగా
అంగీకరించిన నెహ్రూను గాంధీ ఒప్పించడంతో 1942లో ఇందిర ఫిరోజ్ ల వివాహానికి మార్గం సుగమం అయ్యింది.
క్విట్ ఇండియా ఉద్యమము, తేజ్ పూర్ యాత్ర- రాజకీయ జీవితం ప్రారంభం:-
***********************************
తాత తో పాటు తండ్రి నెహ్రూ కూడా క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్టయ్యారు.
అరెస్టులకు నిరసనగా దేశమంతా సమ్మెలు హర్తాళ్లతో ధర్నాలు ప్రకటించారు జరిగినప్పటికీ బ్రిటిష్ వారు పోలీసు బలంతో సభ్యులను అణచివేశారు. ఇదంతా కళ్లారా చూసిన ఇందిరా తన 27 ఏళ్ళ వయసులోనే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్టయి జైలుకు వెళ్లి జైలులో ఉండగానే మగ పిల్లవాడికి జన్మనిచ్చింది అతడే రాజీవ్గాంధీ. ఆ అరెస్టుతో ఆమెతో జాతీయ భావం పెరిగి జాతీయ ఉద్యమంలో పని చేయాలనే కాంక్ష బలం అయింది.
క్రమంగా జిజ్ఞాస అవసరానుగుణంగా తన పట్టుదల చొరవ రాజకీయ జీవితానికి ప్రారంభమయ్యింది. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలోనూ అనేక సభలలో మాట్లాడడంతో ఆమె కంఠస్వరం అందర్నీ ఆకట్టుకుని కార్యకర్తలు, ప్రజల సమీకరణకు బహుళంగా ఉపయోగపడింది. ఇది గమనించిన కాంగ్రెస్ కార్యకర్తలు 1959 ఫిబ్రవరి 2వ తేదీన భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా చేయగా అదే సంవత్సరం భర్త ఫిరోజ్ గాంధీ మరణించడంతో ఆమె లో నెలకొన్న భద్రతా భావం ఒంటరితనం వైపు దారి తీసినప్పటికీ జీవితం పట్ల అవగాహనను ఆత్మస్థైర్యాన్ని కూడా పెంచింది. పదవిరీత్యా నెహ్రూగారి స్నేహితులతోనూ ప్రముఖ నాయకులను కార్యకర్తలను సంభాషించడం ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినది.
1962లో చైనాతో జరిగిన యుద్ధ సమయంలో అస్సాంలోని తేజ్పూర్ పై చైనా దాడికి పాల్పడిన ప్పుడు ఆర్మీ చీఫ్ హెచ్చరిక గాని స్నేహితులు తండ్రి మాటలను గాని పార్టీ మాటలను కూడా ధిక్కరించి అస్సామీ లకు ధైర్యాన్ని ఇచ్చి వారి కష్టాలకు భరోసా ఇవ్వడం కోసం తేజ్పూర్ వెళ్లిన ఆమె చైనా వారు వెనక్కి తగ్గితే దాకా వదలను అని అక్కడి ప్రజలకు ధైర్యం చెప్పి అండగా నిలిచింది.
చైనా యుద్ధ సందర్భంగా వ్యవహరించిన తీరుపై నెహ్రూ విమర్శలు ఎదుర్కొనగా ఇందిర తండ్రి పరిస్థితిని గమనించి తన వద్దకు వచ్చే వారి సమస్యల పరిష్కారానికి కఠిన నిర్ణయాలకు తీసుకోవడాన్ని నెహ్రూ ఆనాటి నుండి ప్రారంభించాడు. పార్టీ అధ్యక్షురాలిగా ఉంటూ తీసుకున్న చర్యలు, వ్యూహాలు, ఎత్తుగడలు పార్టీకి, నెహ్రూకి బలాన్ని ఇవ్వగా నెహ్రూకు ఆమె పై నమ్మకం ఏర్పడింది.
ఇందిర ఎదుగుదల- కామరాజ్ ప్లాన్.
కేంద్రమంత్రిగా ప్రధానిగా ఇందిరాగాంధీ :-
********???**************************
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కామరాజ్ పథకం ప్రకారం వయసు భయపడిన వారు రాజీనామా చేయాలని ప్రతిపాదించగా దానికి నెహ్రూ ముందుగా స్పందించి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు కానీ అతనిని ప్రధానిగా కొనసాగాలని కోరడంతో పాటు 1963 ఆగస్టు 25 న 11 మంది సీనియర్ నేతలు పార్టీ నుండి వైదొలగి గారు. ఈ సందర్భంలో యుక్తవయసులో ఉన్న ఇందిరా నెహ్రూకి సలహాదారు గానే కాకుండా తన యుక్తితో తన శక్తిని నిరూపించిన గొప్ప మేధావి రాజకీయవేత్త రాజనీతి గుర్రాలు ఇందిరాగాంధీ. దీనితో ఆమె నాయకత్వాన్ని సమర్థించేవారు చాలా రాష్ట్రాలలో ఉండటం ఆమెకు కలిసి వచ్చిన అవకాశం.
1964 మే 27న జవహర్లాల్ నెహ్రూ అనారోగ్యంతో మరణించగా లాల్ బహదూర్ శాస్త్రి ఆ పదవిని అధిష్టించి నప్పటికీ ఇందిరా గాంధీని ప్రధానిగా ఉండమని కోరినప్పుడు సున్నితంగా నిరాకరించిన ఇందిరాగాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికై సమాచార ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ది. ఇదే సమయంలో దక్షిణ భారత దేశం పై హిందీని బలవంతంగా రుద్దడం నిర్ణయించిన నేతల నిర్ణయాన్ని దక్షిణాది ప్రజలు సమ్మెతో వ్యతిరేకించిన ప్పుడు ఇంద్ర స్వయంగా వెళ్లి దక్షిణాది వారిపై బలవంతంగా రుద్ది మని ఇష్టమైన భాష నేర్చుకోవచ్చని ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చి సమయస్ఫూర్తిని ప్రదర్శించిన ది.
ప్రధానిగా ఇందిరా:-
*****((***********(((
1964లో ప్రధానిగా నియమించబడిన శాస్త్రి గుండెపోటుతో మరణించిన గా గుల్జారీలాల్ నందా కొద్దికాలం తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేశాడు. శాస్త్రి తర్వాత ప్రధాని ఎవరు అన్న ప్రశ్న పార్టీలో తలెత్తినప్పుడు మొరార్జీ గుల్జారీలాల్ మొదలైన మహామహులు ఇందిరాగాంధీకి ప్రత్యర్థులుగా ప్రధాని పదవికి పోటీలో ఉండగా అప్పటికే పార్టీ అధ్యక్షుడు కామరాజ్ ఇందిరాగాంధీకి తన మద్దతు
తెలపడం లో ఉద్దేశం ఆమె స్వాతంత్ర సమరయోధుల తో పాటు అనేక దేశాల్లో పర్యటించి నా అనుభవం ప్రపంచ నేతలతో ఉన్న పరిచయాలు నవీన భావాలు దేశ పరిస్థితులకు అవసరమని భావించడమే.
ప్రధానమంత్రి పదవికి జరిగిన పోటీలో 355- 165 ఓట్ల తేడాతో ఇందిరాగాంధీ మురార్జీ దేశాయ్ ఓడించి ప్రధాని గా నిలిచిన బాధ్యతలు స్వీకరించిన కొత్తలోనే అధికార యంత్రాంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి యువతరానికి మద్దతు పలికింది.
సామాన్య ప్రజానీకం అంటే పార్టీకి ఎంత ముఖ్యమో తెలిసిన ఇందిరా తన సందర్శనకు వచ్చే ప్రజలతో మాట్లాడి విజ్ఞాపన పత్రాలు స్వీకరించి తన ఆదేశాల ద్వారా వారి సమస్యలను పరిష్కరించే ది.
అంతర్జాతీయ స్థాయిలో ఇజ్రాయిల్ అరబ్బు దేశాల మధ్య తగవులు వచ్చినప్పుడు అమెరికా తదితర అగ్రదేశాలు ఆగ్రహం వ్యక్తం చేసినా ఆమె మాత్రం తన మద్దతును అరబ్బుల కే తెలియజేసి క్ర ఆసియా ఖండంలో, భారత దేశంలో శాంతి సుస్థిరత అవసరమని ప్రజలనుద్దేశించి సందర్భోచిత ప్రసంగం చేసి ఆలోచింపజేసింది. అంతర్గత కుమ్ములాటలు దారితీస్తున్న సందర్భంలో మురార్జీ నుండి ఆర్థికశాఖ వెనక్కి తీసుకోవడమే కాకుండా దేశంలోని ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేసి ఎన్ని అవాంతరాలు వచ్చినా ప్రజల పక్షాన నిలిచింది. బ్యాంకుల జాతీయకరణ గిట్టని మరొక వర్గం ఇందిరాగాంధీని వ్యతిరేకించడమే కాకుండా కాకుండా కాంగ్రెస్ రెండు పార్టీలుగా చీలిపోయింది. ఇందిరా వర్గానికి మెజారిటీ తగ్గడంతో అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టినప్పటికీ పార్లమెంటులోని చిన్న పార్టీలు ఇండిపెండెంట్ సభ్యులు మద్దతు ఇవ్వడం ద్వారా ప్రధానిగా తిరిగికొనసాగారు.
జమీందారీ వ్యవస్థ రద్దు కై ప్రవేశపెట్టిన బిల్లు లోక్సభలో నెగ్గిన రాజ్యసభలో వీగి పోవడంతో రాష్ట్రపతి ద్వారా జమీందారీ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు అధికార ప్రకటన చేయించి తన పట్టు నిలుపుకుంది. ఇది సహించలేని జమీందార్లు కాంగ్రెసు నేతలు వ్యాపారులు పెట్టుబడిదారులు కలిసి వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించడంతో తిరిగి ఓట్లతోనే తన సామర్థ్యాన్ని రుజువు చేసుకోవాలని లోక్ సభను రద్దు చేయవలసిందిగా నూ 1977 ఫిబ్రవరి లో ఎన్నికలు నిర్వహించాలని ఫార్వర్డ్ చేసింది.
గరీబీ హటావో పథకం:*
***************************
1971 మధ్యంతర ఎన్నికల సందర్భంలో ఇందిరాగాంధీని పదవి చిత్రాలను చేయడం కోసం ప్రత్యర్థి వర్గం ఏందిరా హటావో అనే నినాదం ఎత్తుకో గా ఎత్తులకు పై ఎత్తులు వేయగల నేర్పరి మేధావి ఇందిరాగాంధీ గరీబీ హటావో అనే నినాదంతో తన ప్రచారాన్ని నిర్వహించింది. 43 రోజుల పర్యటనలో 36 వేల మైళ్ల ప్రయాణం మూడు వందల సభలు నిర్వహించి లక్షలాది ప్రజానీకాన్ని ఆకట్టుకునే రీతిలో పేదరిక నిర్మూలన కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకురానున్నట్లు ప్రచారం చేయడం ద్వారా ఎన్నికల్లో ప్రభావితం చేసి గెలవగలిగింది.
తూర్పు పాకిస్తాన్కు పశ్చిమ పాకిస్తాన్ బలగాలు సృష్టించే అల్లర్లను అదుపు చేయడంతో పాటు తూర్పు పాకిస్తాన్ విముక్తికై పోరాడుతున్న mukti bahini కి మద్దతుగా మన దేశ సైన్యానికి అండగా పంపించి పశ్చిమ పాకిస్తాన్ ను ఓడించడం ద్వారా బంగ్లాదేశ్ ఆవిర్భావానికి ఇందిరాగాంధీ పరోక్షంగా సహకరించింది. ఇదే కాలంలో రాజభరణాల రద్దు 369 బ్యాంకుల జాతీయకరణ వంటి నిర్ణయాలతో పాటుగా పంటల ఉత్పత్తిని పెంచడానికి హరిత విప్లవం పేదరిక నిర్మూలనకై గరీబీ హటావో నినాదం 20 సూత్రాల పథకం వంటి ప్రజాకర్షక పథకాలు ఇందిరాగాంధీకి పేరు తెగ ప్రజానీకంలో కొద్దోగొప్పో మార్పులకు ఉపయోగపడిన వి. 1971 పాకిస్తాన్ తో యుద్ధంలో నిర్ణయాత్మక విజయం ప్రపంచ దృష్టిని ఆకర్షించిన గా 74 లో రాజస్థాన్ ఎడారిలోని పోక్రాన్ అణు పాటవ పరీక్ష భారత శక్తిని విశ్వవ్యాప్తం చేసింది. ఈ చర్యను అనుకూల వర్గం తోపాటు వ్యతిరేకులు కూడా పార్లమెంటులో ఆమోదించడం చప్పట్లతో స్వాగతించడం ఇందులో మనోధైర్యాన్ని మరింత పెంచింది.
అప్పటికి నాలుగవ పంచవర్ష ప్రణాళిక నడుస్తున్నప్పటికీ ఆర్థిక వ్యవస్థలో పెద్దగా మార్పు లేకపోవడం, పెరిగిన లంచగొండితనం
పేదరిక నిర్మూలన జరగకపోవడంతో ప్రజల అసహనం ఇందిరాగాంధీ పై పడింది.
భారత దేశంలో ఎమర్జెన్సీ -చీకటి రోజులు- ఇందిరాగాంధీ:-
****************************************
1971లో ఆమెకి నియోజకవర్గం నుండి గెలిచిన ఇంద్ర ఎన్నిక చెల్లదని రాజనారాయణ పిటిషన్పై స్పందించిన అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇస్తూ తర్వాత ఆరు సంవత్సరాల వరకు కూడా ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొన్న రాదు అని హెచ్చరించింది. ఈ తీర్పుపై సుప్రీం కోర్టులో స్టే తెచ్చుకున్న ఇందిరాగాంధీ. అయినప్పటికీ గిట్టనివారు వ్యతిరేకులు ప్రతిపక్ష నాయకులు పెద్ద ర్యాలీ నిర్వహించి అసమ్మతిని ప్రకటించడంతో దిగజారుతున్న శాంతిభద్రతలను కాపాడడం కోసం కఠినమైన చర్య అని నిరూపిస్తూ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని 1975 జూన్ 25న ప్రకటించింది. నాటి రాష్ట్రపతి అలీ అహ్మద్ రాజ్యాంగంలోని 356వ అధికరణం ఉపయోగించుకొని ఈ ప్రకటన చేశాడు. మొరార్జీ దేశాయ్ జయప్రకాష్ నారాయణ వంటి అనేక మంది నేతలను అరెస్టు చేయడంతో పాటు స్వాతంత్ర సమరయోధులు సీనియర్ నాయకులను కూడా చట్టపరంగా కఠిన శిక్షలు విధించారు. జైల్లో పెట్టకుండా గృహనిర్బంధం భావించడం అసాంఘిక శక్తులు అరాచక శక్తులు ఉద్భవించే అవకాశమున్నదని అరెస్టు చేసి జైలులో పెట్టి అన్ని పౌరహక్కుల రద్దు చేసి వేలకొలది ప్రతిపక్ష నాయకులను జర్నలిస్టులను జైలుపాలు చేసింది ఇందిర ప్రభుత్వం.
ఎమర్జెన్సీ కాలంలో ప్రభుత్వ కార్యాలయాలు చక్కగా నడిచాయని, లంచగొండితనం లేదని, ఉద్యోగులు సమయ పాలన పాటించడం ద్వారా యంత్రాంగానికి ఎంతో మేలు జరిగిందని ప్రచారం జరిగినప్పటికీ అంతకుమించి దేశంలోని ప్రజల పౌర హక్కులను రద్దు చేయడంతోపాటు ప్రజల స్వేచ్ఛకు ప్రత్యేక రంగంపై తీవ్ర నిర్బంధాలు విధించడంతో పాటు పలు అకృత్యాలకు కారణమైన ఎమర్జెన్సీని భారతదేశ చరిత్రలో ఇందిరాగాంధీ చీకటి పాలన గా ఇప్పటికీ విమర్శిస్తూ ఉంటారు ఇది ఇందిరకు పెద్ద కళంకం తెచ్చిన నిర్ణయం సంఘటన.
1980 లో జరిగిన ఎన్నికల్లో ఏపీ లోని మెదక్ నుంచి గెలుపొందిన ఇందిరాగాంధీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి తన మంత్రివర్గంలో కాంగ్రెస్ యువజన నాయకులకు చోటిచ్చి మార్పులు చేసినప్పటికీ దేశంలో పరిస్థితులు చక్కబడ లేదు. 1979లో వచ్చిన కరువు బంగ్లాదేశ్ నుండి వచ్చిన కాందిశీకులు అస్సాంలో స్థిర పడి పోవడంతో పాటు వ్యతిరేక పరిస్థితులు ఉన్నకారణంగా ఇంకా కొన్ని రాష్ట్రాలు జనతాపార్టీ పాలనలో ఉండడాన్ని పసిగట్టిన ఇందిరా 1980 ఫిబ్రవరి 13న ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది. పరిపాలన లో భాగంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పినప్పటికీ ఇది ప్రతిపక్షాలను వ్యతిరేకించడమే కాకుండా ప్రజాస్వామ్యం పై చేసిన దాడిగానే భావించవలసి ఉంటుంది ఇలాంటి కొన్ని అక్రమ చర్యలకు పాల్పడ్డారని ఆమె జీవితంలో గ్రహించవచ్చు.
భూసంస్కరణలకు కొంత ప్రాధాన్యతనిచ్చి అమలు చేసినప్పటికీ సమగ్రంగా నిర్వహించకపోవడం తదనంతర కాలంలో వచ్చిన ప్రభుత్వాలు ఎత్తకపోవడం తో భూసంస్కరణల సమస్య నేడు మొదటికే వచ్చింది. భూసంస్కరణల అమలు విషయంలో ఇందిరను కొంత అభినందించ వచ్చు. ఈసారి ఇందిర ప్రధానిగా పనిచేసిన కాలంలో ఖలిస్తాన్ ఉద్యమం బలోపేతమై పంజాబ్ లోని స్వర్ణ దేవాలయం నుండి bindran వాలే నాయకత్వంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ బ్లూస్టార్ పేరుతో నిర్వహించిన పోరాటంలో bindran వాలే తోపాటు అనేక మంది మరణించారు స్వర్ణ దేవాలయం దెబ్బతిన్నది దీనితో కోపానికి ఇందిరా తన అంగరక్షకులతో నే 1984 అక్టోబర్ 31న
బలై పోయినది.
ప్రపంచ స్థాయిలో అయిన ఉద్యమం బలంగా నెలకొన్న కాలంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న 1983లో అలీనోద్యమ దేశాల శిఖరాగ్ర సమావేశాన్ని భారత్లో నిర్వహించారు.
కామన్వెల్త్ దేశాల సమావేశాన్ని కూడా భారతదేశంలో నిర్వహించడం ద్వారా భారత దేశ కీర్తి ప్రపంచ స్థాయి కి చేరుకొన్నది.
మరి కొన్ని నిర్ణయాల ద్వారా ప్రపంచ స్థాయి గుర్తింపు:-
*******************************
చివరి దశలో పేదరికాన్ని నిర్మూలించడానికి నడుము కట్టి కొన్ని పథకాలను ప్రవేశపెట్టడం కాకుండా దేశంలో కరువు కాటకాలు నివారించడానికి ఆహారధాన్యాల దిగుబడి పై దృష్టి సారించి తన రాజనీతిజ్ఞతను చాటుకుంది. శివ దేశాల సహాయంతో ప్రపంచ బ్యాంకు సహాయం తో దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి అమెరికాతో పాటు ఫ్రెంచ్ రష్యా ప్రపంచ బ్యాంకు అధికారులతో అంతర్జాతీయ ద్రవ్య నిధి అధికారులతో చర్చలు జరిపి తనమాట నెగ్గించుకున్న ది. ఫ్రెంచ్ అధ్యక్షుడు చార్లెస్ స్త్రీల శక్తి సామర్థ్యాలపై నమ్మకం లేని తాను ఇంతటి శక్తిసామర్థ్యాలు ఉంటాయని నేను ఊహించలేదని ఇందిరాగాంధీని ప్రస్తావిస్తూ ప్రశంసించడం అమెరికా అధ్యక్షుడు జాన్సన్ రష్యా ప్రధాని కోసి గిన్ తో చర్చలు జరపడం వంటి కీలక అంశాలు భారతదేశానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడానికి కారణమైన వి.
ముగింపు:- కేంద్ర మంత్రిగా పార్టీ అధ్యక్షురాలిగా ప్రధానిగా ఎన్నో బాధ్యతలను స్వీకరించిన ఇందిరాగాంధీ అంతర్గత కుమ్ములాటలు సందర్భంలోనూ పార్టీని గొప్పగా నడిపించి తన చాతుర్యాన్ని చాటుకోవడం గమనించవలసి ఉంటుంది.
1971 లో భారత ప్రభుత్వపు అత్యున్నత అవార్డు భారతరత్నను స్వీకరించిన మొట్టమొదటి మహిళగా ప్రథమ ప్రధానిగా ఈ దేశంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. శాంతి సామరస్యాలు కృషి చేసినందుకు గాను 83 84 లో రష్యా దేశపు శాంతి బహుమతిని కూడా పొందడంతోపాటు పనుల 71 లో బంగ్లాదేశ్ విమోచనాన్ని విజయవంతంగా సాధించిన సందర్భంలో ప్రతిపక్ష నేత అటల్ బిహారీ వాజపేయి ఆమెను శక్తివంతురాలు గా కీర్తించడానికి కూడా మనం గమనించాలి.
అయితే తను నమ్మిన సిద్ధాంతం కోసం సుస్థిర పరిపాలన పేరుతో రాజ్యాంగబద్ధ సంస్థలను కూడా విస్మరించడమే కాకుండా నిర్వీర్యం చేసినది అనే విమర్శ సర్వత్రా ఉన్నది. సుదీర్ఘమైన ఇందిరాగాంధీ సామాజిక, రాజకీయ, ఆర్థిక జీవితాన్ని మననం చేయడం ద్వారా నేటి పాలకులు, మహిళా నాయకులు, వివిధ రాజకీయ పక్షాల నేతలు తమను తాము సవరించుకోవడం ద్వారా ప్రజా పాలకులుగా పేరు గడించడానికి, ఇందిరా గాంధీ కి వచ్చిన విమర్శలను రాకుండా చూసుకోవడానికి , సుపరిపాలన అందించడానికి వీలవుతుంది. అదే చరిత్ర
ద్వారా మనకు లభించే ఘనత.
( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు కవి ,రచయిత, విమర్శకులు, అధ్యక్షులు జాగృతి కళాసమితి హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)
[11/20, 21:41] వడ్డేపల్లి మల్లీశం గారు: నేటి మాట 235/20.11.20 శుక్రవారం
బాలల హక్కులు పరిరక్షించబడాలి. బాలల దినోత్సవాలు అందుకు సమాజాన్ని పురికొల్పాలి.
*******************************************
-- - వడ్డేపల్లి మల్లేశము,901426412
బాలలు ప్రతిదేశంలోనూ ఆ జాతి సంపద. నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదం శతాబ్దాలుగా ఈ ప్రపంచాన్ని ఒక్కటి చేయడమే కాకుండా ఆలోచింపజేస్తుంది. ప్రాంతాలు వేరు కావచ్చు. కష్టాలు వేరు కావచ్చు. ఖండాలు వేరు కావచ్చు. కానీ ప్రపంచం ఒకటే కదా! మౌలికమైన ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక కోణాలను బాలలకు అన్వయిస్తే ఆయా దేశాలలో గల ఆర్థిక అంతరాలు, అసమానతలు బాలల హక్కుల ను ప్రభావితం చేస్తాయి. బాలల జీవితాలు వికసించిన, వాడిపోయిన ఆదరించే కుటుంబ సభ్యులు, సమాజం, విద్య , ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. స్థల, కాల పరిస్థితులకు అనుగుణంగా బాలల రూప ,వికాసాలు మార్పుచెందవచ్చునేమో కానీ అంతర్జాతీయస్థాయిలో ఎక్కడున్నా బాలలు బాలలే .ప్రపంచ బాలలే.
ఈ నేపధ్యంలోనే ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ దినోత్సవాలకు ప్రధానంగా బాలల దినోత్సవ లకు సంబంధించి పోషించిన పాత్ర క్రియాశీలక మైనది.
అంతర్జాతీయ స్థాయిలో బాలల దినోత్సవ లక్ష్యాలు;-
********************************************** లక్ష్యాలు, ఆశయాలను నిర్ధారించు కుంటే తప్ప ఒక వ్యవస్థలో అనుకున్న స్థాయికి చేరుకోలేము. లక్షలు మనిషి చిత్తశుద్ధిని అంకిత భావాన్ని ఆలోచనా సరళిని సానుకూలంగా నిర్దేశించడమే ఇందుకు గల ప్రధాన కారణం.
పిల్లలు తమ భావాలను, సమాచారాన్ని, అభిప్రాయాలను, ఆలోచనలను, వ్యక్తిగత, సామూహిక కోరికలను పరస్పర అవగాహనను పెంచుకోవడానికి ప్రోత్సహించే దిశగా ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ బాలల దినోత్సవానికి రూపకల్పన చేసినది.
ఈ మౌలిక విషయాలను దృష్టిలో ఉంచుకొని ప్రపంచమంతటా అన్ని దేశాలలో పిల్లల సంక్షేమాన్ని, అభివృద్ధిని పెంపొందించేందుకు
అనేక చర్యలు తీసుకోవడానికి ఈ దినోత్సవాలు ఒక వేదిక అవుతాయి. అంతే కాదు సమాజం లోని పెద్దలను, తల్లిదండ్రులను ,మేధావులను, పిల్లల కోసం ఆలోచింప చేయడానికి ఈ దినోత్సవం ఎంతో తోడ్పడుతుంది..
అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం నేపథ్యం:-
*******************************************
విద్య, వైద్యము, బాలలు ,అభివృద్ధి, సంస్కృతి, ఆర్థికాభివృద్ధి, వాణిజ్య రంగ అభివృద్ధి, ప్రపంచ శాంతి తదితర అంశాలను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించడానికి వీలుగా 1945 అక్టోబర్ 24న ఏర్పడిన ఐక్యరాజ్యసమితి అనుబంధంగా ఎన్నో అంతర్జాతీయ సంస్థలను ఏర్పాటు చేసినది. ఇందులో భాగంగా యునెస్కో అనే సంస్థ విద్యా, శాస్త్రీయ, సాంకేతిక విషయంలో కృషి చేస్తుండగా, యూనిసెఫ్ అనే సంస్థ అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి అనే పేరుతో బాలల అభివృద్ధికి ప్రత్యేకంగా ఏర్పడిన మరో సంస్థ. 1946లో ఏర్పడిన ఈ సంస్థ మానవతా విలువలు పునాదిగా బాలల హక్కులను పరిరక్షించడం లోనూ, వారికి పురోభివృద్ధి రక్షణ విషయంలోనూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ అహర్నిశలు బాలలకోసం శ్రమిస్తూనే ఉన్నది. ప్రస్తుతం 155 దేశాలకు విస్తరించిన ఈ సంస్థ బాలల విషయంలో చేసిన కృషికి గానూ 1965 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతిని పొందినది.
1948 డిసెంబర్ 10వ తేదీన ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రకటనను అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేసినది. అనంతరం అనేక దేశాలు ఆ ప్రకటనపై సంతకాలు చేయడం జరిగినది. ఈ క్రమంలో భాగంగా 1959 నవంబర్ 20వ తేదీన ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ బాలల హక్కుల ప్రకటనను రూపొందించినది. ఈ సందర్భంగా 59 నుండి ఏటా నవంబర్ 20వ తేదీన ప్రపంచమంతటా బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అంతేకాదు బాలల హక్కుల దినోత్సవం గా కూడా దీనిని పాటిస్తున్నాము.
బాలల గూర్చి హక్కుల గురించి అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న కృషి:-
*******************************************
తేదీలు వేరైనా నవంబర్ నెలలోనే ఆయా దేశాల జాతీయ బాలల దినోత్సవాలతో పాటు అంతర్జాతీయ దినోత్సవం కూడా నవంబర్ నెలలోనే జరగడం ఒక విశేషం.
జాతీయ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు, బాలల హక్కుల ప్రకటనలు కార్యక్రమాలు నవంబర్ నెల మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా బాలలకు పండుగ రోజులే.
చాలా దేశాల్లో బాలల హక్కులు ప్రాథమిక హక్కుగా చేసినప్పటికీ వారి హక్కులు కాపాడడం అనేది ఆచరణ సాధ్యం కాకుండా వెళ్లిపోయినట్లు అనేక సందర్భాలు సంఘటనలు బట్టి తెలుస్తున్నది. బాలల హక్కుల కోసం ఉద్యమాలు చేపడుతూ పరి రక్షిస్తున్న ట్లు చెబుతున్న స్వచ్ఛంద సంస్థలు కొన్ని నిజాయితీగా పనిచేస్తే చాలా సంస్థలు వసూళ్లకు పాల్ప డి బాధ్యతను దుర్వినియోగ పరుస్తున్నారు అనే అపవాదు ఉన్నది.
బాల కార్మిక చట్టాలు బాలల హక్కుల చట్టాలు ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో చేయబడినప్పటికీ ఆచరణలో అవి కలవారికి చుట్టం గానే కనబడటం శోచనీయం. ముఖ్యంగా బాలలు ప్రమాదకరమైన పనుల్లో కనిపించడం, బాలకార్మికులుగా వివిధ పనులు, కర్మాగారాలలో బంగారు బాల్యాన్ని కోల్పోతూ కుటుంబ పోషణకు విధిలేని పరిస్థితిలో శ్రామికులుగా పని చేస్తున్నప్పటికీ యజమానులపై చేసిన కేసులు నామమాత్రంగానే మిగిలిపోయి పేదరికము వెక్కిరిస్తూ ఉంటే ప్రభుత్వాల మొక్కుబడి చర్యల వలన కోటానుకోట్ల బాలలు పాఠశాల కడప దాటక పోవడం విచారకరం.
కాగా చైనాలో జూన్ 1వ తేదీన పాకిస్తాన్లో నవంబర్ 20వ తేదీన, జపాన్లో మే 5వ తేదీన, దక్షిణ కొరియాలో మే 5వతేదీన, పోలాండ్లో జూన్ 1వ తేదీన ,శ్రీలంకలో అక్టోబరు 1వ తేదీన జాతీయ బాలల దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీ అయినప్పటికీ నవంబర్ 20 వ తేదీన మాత్రం ప్రపంచంలోని అన్ని దేశాలు దాదాపుగా అంతర్జాతీయ బాలల దినోత్స వాన్ని జరుపుకుంటున్నాయి
1989లో పిల్లల హక్కులపై నవంబర్ 14వ తేదీన ఒక బిల్లును ఐక్యరాజ్యసమితి ఆమోదించింది. ఈ బిల్లుపై సంతకాలు చేయడం ద్వారా 191 దేశాలు ఆమోదించి బాలల హక్కుల కోసం తదనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చేపడుతున్న వి.
భారత దేశంలో బాలల దినోత్సవం కొన్ని విషయాలు:-
***************************************(
బాల్యం ప్రతి వ్యక్తికి అనివార్యం అభం శుభం తెలియని ఆ పసి మనసులు పూతోటలో పరిమళిస్తున్న రంగురంగుల పుష్పాలు. భారతదేశంలో తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జన్మదినమైన నవంబర్ 14వ తేదీని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం .దానికి కారణం నెహ్రూ కు పిల్లలతో ఉన్న బాంధవ్యం ని ప్రేమానురాగాలను తెలపడం కోసం ఈ సందర్భం. పిల్లలు నెహ్రూను చాచా నెహ్రూ అని ప్రేమగా పిలిచే వారు. ఈ బాలల దినోత్సవం సందర్భంగా ఇప్పటికీ ప్రతి సంవత్సరం భారత తపాల శాఖ ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేస్తూ బాలల పట్ల తన మక్కువ చాటుకుంటున్న ది.
నెహ్రూ తన జీవితంలో ఎక్కువ భాగం జైలులో గడపవలసి రావడంతో తన ఏకైక కూతురు ఇందిరా ప్రియదర్శిని తో ఎక్కువకాలం గడపలేక పోయారు కానీ దేశంలోని బిడ్డలని కన్నబిడ్డలుగా ప్రేమించే స్వభావం gala నెహ్రూ అన్న మాటలు ఈ సందర్భంగా మనం చేసుకోవలసి ఉంటుంది."
" పిల్లలతో ఉన్నప్పుడు నా మనసు హాయిగా ఉంటుంది నాకు ఏ పవిత్ర స్థలంలో నేను కూడా అంతటి శాంతి సంతృప్తి లభించదు.
పిల్లలను జాతి సంపదగా భావించి అందరూ వారి భవితవ్యానికి కృషి చేయాలని "నెహ్రూ తరచుగా నొక్కి చెబుతూ అందరి బాధ్యతలను గుర్తు చేసేవారు. భారత దేశ వ్యాప్తంగా ఆరోజు బాలలు నెహ్రూను స్మరించుకుంటూ నే పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం వివిధ పండుగలు సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించుకోవడం ఇప్పటికీ ఆనవాయితీగా వస్తున్నది.
కుటుంబ పేదరికం వల్ల అనేక మంది పిల్లలు చదువుకు దూరం కావడమే కాకుండా పూర్తిస్థాయిలో పోషకాహారం అందక అనారోగ్యంగా ఉండి బలహీనంగా చిక్కిపోవడం కూడా భారత దేశ దౌర్భాగ్యం గా భావించవచ్చు. బాలల భవితవ్యం విషయంలో న్యాయ వ్యవస్థ అనేకసార్లు ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ ఇప్పటికి అనేక మంది పారిశ్రామిక అధిపతుల నిర్బంధాల లో చిక్కి
దుర్భర జీవితం గడుపుతున్నారు. చిత్తశుద్ధి కలిగిన ప్రభుత్వం అయితే ఆ కుటుంబాలకు ఆర్థిక పరిస్థితులను మెరుగు పరచడంతో పాటు నిరుద్యోగాన్ని నిర్మూలించడం, ఉపాధి బహుగా కల్పించడం , పోషక ఆహారాన్ని సరఫరా చేయడంతోపాటు మానవాభివృద్ధి దేశవ్యాప్తంగా ప్రతి కుటుంబంలో సాధ్యమై
తేనే అంతర్జాతీయ బాలల దినోత్సవానికి బాలల హక్కుల పరిరక్షణకు బాలల వికాసానికి రేపటి భవిష్యత్తుకు అర్థం ఉంటుంది. ఇక అనారోగ్యంతో పాటు కుల పరమైన వివక్షత కూడా బలవుతున్న అనేక మంది చిన్నారులను చూడవలసిన బాధ్యత అటు ప్రభుత్వాలది ఇటు స్వచ్ఛంద సంస్థలు తల్లిదండ్రుల పైన ఎంతో ఉన్నది.ఆప్పుడు మాత్రమే భారతదేశంతో పాటు ప్రపంచంలోని అన్ని దేశాల్లో నేటి బాలలే రేపటి పౌరులు అనే సూక్తినిజం అవుతుంది.
( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు కవి రచయిత అధ్యక్షులు జాగృతి కళాసమితి హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)
[11/20, 23:43] వడ్డేపల్లి మల్లీశం గారు: నా వ్యాసాలు చదువుతున్నారా మేడం. ఎలా
ఉన్నాయి.మీ స్పందన........
[11/22, 00:45] వడ్డేపల్లి మల్లీశం గారు: నేటి మాట 236/21.11.20 శనివారం
భిన్నత్వంలో ఏకత్వం ప్రజాస్వామ్యానికి ఒక ప్రాతిపదిక. అట్లని రాజీపడి బ్రతకడం దాని ఉద్దేశం కాదు.
**********************************************----- వడ్డేపల్లి మల్లేశము,9014206412
ఒక సమూహంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతాయి కానీ చివరిగా ఒక నిర్ణయానికి వస్తాము. అది ఎలా సాధ్యం అయింది అంటే చర్చల ద్వారా పరస్పర అవగాహన ద్వారా సమకాలీన రాజకీయ సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోవడం ద్వారా చివరికి సమయస్ఫూర్తిని ప్రదర్శించి పరిస్థితులను ప్రజా అనుకూలంగా చక్కబెట్టడం ద్వారా మాత్రమే అది సాధ్యం అవుతుంది. ఇటువంటి భిన్న ధోరణి భిన్నత్వంలో ఏకత్వం అని ప్రధానంగా చెప్పుకుంటాము. భారత ప్రజాస్వామిక లక్షణాలలో భిన్నత్వంలో ఏకత్వం అనేది చాలా ముఖ్యమైన, కీలకమైన అంశం.
భిన్నత్వంలో ఏకత్వం అనేది ఒక భావన:-
********************************************** కుటుంబంలోనూ వ్యవస్థలోనూ కులం లోనూ కమ్యూనిటీ లోనూ సమాజంలోనూ చివరికి దేశ స్థాయిలో ప్రజానీకం లోనూ భిన్న అభిప్రాయాలు నిరంతరం కనబడుతూ ఉంటాయి. అంతేకాదు విస్తారంగా చర్చించబడి, ఘాటైన పదాలతో పరస్పరము
దూషించు కుని చివరికి ఒక నిర్ణయానికి రావడం అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటాం. పెళ్లి అయిన సందర్భంలో గాని పంచాయతీల
తీర్మానంలో కానీ చివరికి పాలనలో కూడా ఈ విధానమే కొనసాగుతూ ఉంటుంది.
వారు పెరిగిన ప్రత్యేక పరిస్థితులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు, కట్టుబాట్లు సంప్రదాయాలు జీవన విధానము ఎంచుకున్న నిబంధనలు జీవనశైలి కారణాలు ఏవైనా ఒకే కమ్యూనిటీ లోపల భిన్నాభిప్రాయాలు ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. కానీ భిన్నత్వం అనేది పరిస్థితుల చేతుల్లోనే ఉంటుంది. అలాంటి పరిస్థితి నుండి ఏకత్వ భావన కు రావడానికి, ఏకత్వాన్ని సాధించడానికి వ్యక్తులుగా, వ్యవస్థలుగా, పాలకులుగా, ప్రభుత్వాలుగా, నాయకులుగా చాలా కృషి చేయవలసి ఉంటుంది.
భిన్నత్వంలో ఏకత్వాన్ని ఎందుకు సాధించాలి:-**************************
భిన్నత్వం అనివార్యం కనుక ఒక ముగింపు రావడానికి, లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, సక్రమ పాలన కొనసాగించడానికి ,ప్రజల ఆశలు ఆకాంక్షలు ఆశయాలను నెరవేర్చడానికి, పాలకులు ప్రభుత్వాలు, రాజకీయ మంత్రాంగం, రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, చివరికి కుటుంబ పెద్దకు కూడా ఈ పరిజ్ఞానం చాలా అవసరం.
భిన్నత్వంలో ఏకత్వం ప్రజాస్వామ్యానికి ఒక ప్రాతిపదిక:-
********************************
ప్రజాస్వామ్యం అంటే పాలన విధానమే కాకుండా ,జీవన విధానంగా కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు భిన్నమైన పరిస్థితుల నుండి, భావనలు భాషలు ,లింగ, మత, స్థల కాలాలకు సంబంధించిన వ్యత్యాసాల నుండి ఏకత్వాన్ని సాధించడానికి చర్చలు, పరస్పర అవగాహన, విమర్శలు, అంతరార్ధాన్ని వివరించడం ద్వారా ఇచ్చి పుచ్చుకునే పద్ధతిలో కొనసాగే అందరూ ఆమోదించే ముగింపుకు రావలసి ఉంటుంది. ఈ విధానము కుటుంబంలోనూ, వ్యవస్థలోనూ, పాలనలోనూ భిన్నాభిప్రాయాలు ఉన్న ప్రతి చోట అనివార్యమైన దే..
సుపరిపాలన ద్వారానే ఇది సాధ్యం:-
*********************************(*******
విభిన్న వర్గాల ప్రజానీకానికి వారి ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలు, ఆసక్తుల మేరకు అసమానతలు అంతరాలు లేని, వివక్షత కానరాని మానవ అభివృద్ధి సాధించే ప్రజా పరిపాలన నే సుపరిపాలన అని అంటారు.
కనీస అవసరాలు తీరని వారు, దారిద్ర్యరేఖకు దిగువన నివసిస్తున్న అనేకమంది అట్టడుగు వర్గాలు, వలస కార్మికులు, వెట్టిచాకిరి, ఆధిపత్య వర్గాల కింద మగ్గుతున్న ఆ బాధ్యులు ఈ దేశంలో ఉన్నంత వరకు ఇది భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించినట్లు కానేకాదు.
భారత రాష్ట్రపతిగా జ్ఞాని జైల్ సింగ్ కొనసాగిన కాలంలో స్వాతంత్ర ఉత్సవాల్లో పాల్గొంటూ చేసిన ప్రసంగాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించక తప్పదు. "ఈ దేశంలో ఇప్పటికీ అనేక రకాల వివక్షత కొనసాగుతున్నది. స్వాతంత్ర ఫలాలు మెజారిటీ ప్రజానీకానికి అందడం లేదు. అట్టడుగు వర్గాలకు న్యాయం జరిగిన రోజే అంతరాలు అసమానతల తొలగింపు సమానత్వం సాధించిన రోజే ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్లు లెక్క" అన్న రాష్ట్రపతి మాటలను నేటి నాయకులు ప్రభుత్వాలు పాలకులు ఒకసారి ఆలోచించాలి. భిన్నాభిప్రాయాలకు కాల్ ఇవ్వడం ద్వారా ఏకాభిప్రాయాన్ని సాధించే క్రమంలో నాయకత్వం యొక్క చిత్తశుద్ధి అంకితభావం ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పిలువబడుతున్న భారతదేశంలో ఈ అపరిపక్వత అంతటా కనిపిస్తే రాజ్యాంగానికి ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకు విఘాతం కలిగినట్లే. రాజ్యాంగాన్ని గురించి ఒక సందర్భంలో అంబేద్కర్ ప్రస్తావిస్తూ" రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన వాళ్లంతా దేశద్రోహులు" అని అంటాడు కానీ నేడు ప్రజల కంటే పాలకులే ఎన్నోసార్లు చట్టాలను, న్యాయాన్ని, రాజ్యాంగాన్ని ,న్యాయవ్యవస్థను ఉల్లంఘించిన సందర్భాలు అనేకం.
ప్రజాస్వామ్య మౌలిక సూత్రమైన భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడానికి ఎవరూ వ్యతిరేకం కాదు . అది అనివార్యం కూడా కానీ ఆయా వర్గాల ఆకాంక్షలకు అద్దం పట్టే విధంగా పరిపాలన లేకుంటే ప్రశ్నించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. పాలకులు మరింత దారి తప్పే అవకాశం ఉంటుంది.
ఇప్పటికీ ప్రణాళికల రూపకల్పనలో కానీ బడ్జెట్ అంచనాల్లో కానీ 70 శాతానికి పైగా ఉన్న సామాన్య ప్రజానీకాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదనే చేదు నిజాన్ని పాలకులు మేధావులు సంఘసంస్కర్తలు రాజకీయ ప్రతినిధులు గుర్తించకపోతే ప్రజాస్వామ్య మౌలిక సూత్రానికి ప్రమాదం మాత్రమే కాదు పరోక్షంగా అది జాతి విచ్ఛిన్నానికి కారణం అవుతుంది.
ఇంత సమగ్రంగా చర్చించిన మీదటనే రాజ్యాంగ రూపకర్తలు భిన్న పరిస్థితులకు ఆలవాలమైన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనే దానిని ప్రజాస్వామ్యానికి ఒక ప్రాతిపదికగా తీసుకోవడం జరిగిన విషయాన్ని పాలకులతో పాటు సమాజం యావత్తూ గుర్తించాలి. అప్పుడే అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది.
( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు కవి రచయిత అధ్యక్షులు జాగృతి కళాసమితి హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)
[11/23, 00:40] వడ్డేపల్లి మల్లీశం గారు: నేటి మాట 237/22.11.20 ఆదివారం
ప్రభుత్వాలు బాధ్యత నుండి క్రమంగా తప్పుకోవడం- ప్రైవేటీకరణకు పెద్దపీట..
సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి.
కేంద్ర ప్రభుత్వాన్ని ఆలోచింప చేయాలి-1
*******************************************
- వడ్డేపల్లి మల్లేశము,9014206412
అధికారం మాత్రం కావాలి. తమ నాయకత్వంలోనే ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి. తమ పార్టీని గెలిపించాలి ప్రతిపక్షాలకు ఓట్లు వద్దు సీట్లు వద్దు.
ఇది నేడు అధికార పార్టీ యొక్క ఆలోచనా సరళి. కేంద్ర రాష్ట్రాల పరిధిలో ఒక్క ఉప ఎన్నిక జరిగిన అధికార పార్టీ తన అధికార బలాన్ని పోలీసు బలగాలను అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం మామూలైపోయింది. ఆ ఒక్కటి ప్రతిపక్షాలకు పోతే సహించలేని ప్రభుత్వాలు, బాధ్యతల నిర్వహణలో మాత్రం క్రమంగా తట్టుకుంటూ అధికార బాధ్యతలను ప్రైవేటు రంగానికి అప్పచెప్పి చేతులు దులుపు కుంటున్న వి.
ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఒరవడిని సృష్టించి తే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే ఒరవడిలో కొనసాగుతున్నాయి.
సార్వత్రిక సమ్మెకు దారితీసిన పరిస్థితులు:-
****************************************
1991లో పీవీ నరసింహారావు ప్రధాని గా కొనసాగిన కాలంలో అనివార్యమైన ఆర్థిక సంక్షోభ పరిస్థితిలో ప్రపంచీకరణ నేపథ్యంలో ఆర్థిక సరళీకృత విధానాలు దేశంలో ప్రవేశపెట్టి ప్రభుత్వ కనుసన్నల్లో ఆర్థిక కార్యకలాపాలు కొనసాగితే, గత దశాబ్దకాలంగా మరింత దిగజారి ప్రభుత్వ రంగాన్ని యావత్తూ ప్రైవేటుకు అప్పజెప్పిన పని కొనసాగుతున్నది. గత 10 సంవత్సరాల క్రితం ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు అప్పజెప్పడం కోసమే కేంద్రంలో ఒక మంత్రి శాఖను ఏర్పాటు చేసినారు అంటే దేశ పరిపాలన ఎంత స్థాయిలో దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.
రైతులకు సంబంధించిన విషయంలో సరైన గిట్టుబాటు ధరలు పెట్టుబడి సాయం కావాలని డిమాండ్ చేస్తుంటే అరెస్టు చేయడం బేడీలు వేయడం లాంటి అక్రమ చర్యలకు పాల్పడిన ప్రభుత్వాలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మూడు రకాల చట్టాలను తెచ్చి రైతులకు ఊరట లేకుండా చేసినవి.
కరోనా నేపథ్యంలో చిన్న సన్నకారు పరిశ్రమలు చిరు వ్యాపారులు రైతులు వలస కార్మికుల పరిస్థితులు దుర్భరంగా మారిన వి. వీరికి నామమాత్రంగా కేటాయించిన కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక వర్గాలకు మాత్రం కోటాను కోట్లు కేటాయించడం దేనికి సంకేతం?
జీవిత బీమా ను ప్రైవేటుకు అప్పజెప్పే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు కార్మిక హక్కులను కాలరాస్తూ రైల్వేలను ఇప్పటికే ప్రైవేటుపరం చేసింది. విమానాలు రక్షణ రంగం అంతరిక్ష రంగంలో కూడా ప్రైవేటు రంగం చొరబడి సామాన్య ప్రజానీకానికి ఉద్యోగులకు రక్షణ హక్కులు రిజర్వేషన్ సౌకర్యం లేకుండా ఉద్యోగ భద్రత లేని దుస్థితి దాపురించింది.
పెట్టుబడిదారులు పరిశ్రమలు పనిగంటలు పెంచడంతోపాటు వేతనాలను తగ్గించి ఉపాధి పని భద్రతను కల్పించక కొత్త చట్టాలతో నిర్బంధకాండ కొనసాగుతున్నది.
ప్రజల మధ్య ఉండాల్సిన మేధావులు జర్నలిస్టులు సంపాదకులు రచయితలు కవులు కళాకారుల జైలుపాలు చేసిన ప్రభుత్వాలు కారాగారాల్లో ఉండవలసిన నేర చరిత్ర కలిగిన వాళ్లు నేరస్థులు నేడు చట్టసభల్లో రాజ్యమేలుతున్నారు.
ప్రభుత్వ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ పేదరిక నిర్మూలన ఉపాధి కల్పన లు లేని కార్మికుల కొనుగోలు శక్తిని తగ్గించే ప్రజా వ్యతిరేక విధానాలు సర్వత్రా కొనసాగుతు
న్నవి.
ఒకవైపు మూక హత్యలు మతఘర్షణలు ఎన్నికల కోసం మాత్రమే పని చేస్తున్న ప్రభుత్వాలు పాలనను ప్రైవేటుపరం చేయడానికి వ్యతిరేకంగా దేశంలోని కవులు కార్మికులు మేధావులు ఉద్యోగులు ప్రజా సంఘాలు కలిపి నవంబర్ 26వ తేదీన సార్వత్రిక సమ్మె చేయడానికి ఇచ్చిన పిలుపును ప్రజానీకం ముక్తకంఠంతో మద్దతు పలకగా వలసిన అవసరం ఉంది.
అందుకే ఈసమ్మె సార్వత్రిక సమ్మె( కవిత)
******************************************
జీతాల పెంపుదల కు కాదు
అనగారిన జీవితాలపై ప్రైవేటీకరణ
ఉక్కుపాదం మోపుతున్న 0దుకు
" సార్వత్రిక సమ్మె!
బ్రిటిష్ నల్ల చట్టాలను తిరగ దోడి
కార్మిక హక్కుల హననానికి
కొత్త చట్టాలు చేస్తున్నందుకు
ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేసి
ఉద్యోగ కార్మికుల హక్కులను కాలరాస్తూ,
రైతుల హక్కుల పై రెక్కల పై
నయా చట్టాలు మోపుతున్న అందుకు
" సార్వత్రిక సమ్మె"
భద్రత లేని ప్రజలు స్త్రీలుఆదివాసీల రక్షణకై
పూనుకొమ్మని హెచ్చరించడం కోసం....
వలస కూలీల నువ్ అంచులను చేసి,
కార్పోరేటర్ జేబులు నింపే
అనాలోచిత చర్యలు అడ్డుకోవడానికి...
" సార్వత్రిక సమ్మె"
దిగజారుతున్న శాంతి భద్రతలు,
పెరుగు మూక హత్యలు, అఘాయిత్యాలు,
మేధావుల పైనిర్ బంధాలనుండి
ప్రభుత్వాలను మేల్కొలపడానికి....
మత ఘర్షణ ముసుగులో మానవత్వాన్ని,
ఆత్మ నిర్భరత పేరుతో అమ్ముతున్న ప్రభుత్వ ఆస్తులు,
ప్రజలకే దక్కాలని ప్రతిఘటించడానికి...
" సార్వత్రిక సమ్మె"
ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ,
పేదరిక నిర్మూలన ,ఉపాధి కల్పనలు లేని,
కార్మికుల కొనుగోలు శక్తిని దెబ్బ కొట్టే,
ప్రజా వ్యతిరేక విధానాలను,
ప్రజల్లోకి తీసుకెళ్లి అడ్డుకోవడానికి....
" సార్వత్రిక సమ్మె"
( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు కవి రచయిత అధ్యక్షులు జాగృతి కళాసమితి హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)
[11/23, 19:10] వడ్డేపల్లి మల్లీశం గారు: నేటి మాట 238/23.11.20 సోమవారం
ఎల్ ఆర్ ఎస్ లోని అంతరార్థం ఏమిటి?
ప్రభుత్వ రాబడి కోసమేనా ఈ పథకం?
క్రమబద్ధీకరణ పేరుతో ప్రజలను మోసం చేయడం సరికాదు..
*********************************************
---- వడ్డేపల్లి మల్లేశము,9014206412
ఇప్పటికీ ఈ దేశంలో సొంత ఇల్లు కట్టుకోవడం కోసం అరగంట జాగా లేని అభాగ్యులు కోటానుకోట్ల మంది ఉన్నారంటే ఆశ్చర్యం కాదు. అదే క్రమంలో దేశములోని 72 శాతం సంపద ఒక శాతం సంపన్న చేతిలో ఉన్నది అంటే కూడా ఆశ్చర్యపోనక్కరలేదు.
చాలా వ్యత్యాసంతో కూడుకున్న ఈ రెండు విభిన్న అంశాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు మన దేశంలో పాలన ఎటువైపు వెళ్తుందో గమనించవచ్చు.
సామ్యవాద తరహా ప్రభుత్వాలకు తొలినాళ్లలో నెహ్రూ ,ఇందిరాగాంది దారులు
వేసినప్పటికీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ముఖ్యంగా నేటి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను పెట్టుబడిదారులకు కారుచౌకగా అమ్ముతూ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడ డమే కాక పేదవాళ్లకు మరీ ద్రోహం చేస్తున్నారు. రైల్వేలు, జీవిత బీమా ఇటీవల ప్రైవేటు వాళ్ళకు భారత ప్రభుత్వం అప్పగించే నిర్ణయం తీసుకోవడం మరీ దారుణం.
ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలకు తెలంగాణ రాష్ట్రం ఏమి మినహాయింపు కాదు. గత సంవత్సర కాలంగా కరోనాతో తెలంగాణ రాష్ట్రంలోని పేదలు, కార్మికులు, రైతులు ,అట్టడుగు వర్గాలు కొనుగోలు శక్తిని కోల్పోయి మరి పేదవాళ్లు గా మారితే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ పథకం మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు కాదు కదా! ఏకంగా తాటి చెట్టు పడ్డట్టే అయింది.
ఎల్ ఆర్ ఎస్ అంటే ఏమిటి ఉద్దేశ్యాలు అంతరార్థం:-
*********************************************
గతంలో పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఎల్ఆర్ఎస్ పథకం ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తరించడంతో పాటు ఇందులో గతంలో ఏడు స్లాబులు ఉండగా వాటిని తగ్గించడం ద్వారా ప్లాట్లు కలిగి ఉన్నవారిపై అధిక భారం పడే ప్రమాదం ఉంది. అనాదిగా కొనుగోలు చేసిన ఇళ్ల ప్లాట్లు సంబంధిత అధికారుల అనుమతి లేకుండా కొనుగోలు చేయడం వలన అక్రమమని వాటిని క్రమబద్దీకరించడం ద్వారా మాత్రమే అమ్మకానికి దానం చేయడానికి కుదువ పెట్టడానికి వీలుంటుందని ద్వారా వసూలు చేసిన డబ్బుతో సౌకర్యాలు కల్పించడానికి ఉపయోగపడుతుంది అనేద ప్రభుత్వ ఉత్తర్వుల సారాంశంగా తెలుస్తున్నది. 131 జీవో నెంబర్ తో 31 ఆగస్టు 2020naa వెలువరించిన ఉత్తర్వు ప్రకారముగా నవంబరు 1 నాటికి దీన్ని గడువు ఇవ్వడం జరిగింది. గడువు దాటితే క్రమబద్దీకరణ జరగదని ప్రభుత్వం చెప్పడం విడ్డూరమే కాకుండా బాధ్యతారాహిత్యం కూడా అవుతుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం గా ప్రజలు ఎలా రేసును ఆహ్వానిస్తారని కానీ ప్రస్తుతం వ్యతిరేకించడంలో ఆర్థిక భారాన్ని పెంచడంతోపాటు lrs కు క్రయవిక్రయాలకు లింకు పెట్టడం వలన ప్రజలకు ఇబ్బందులు జరుగుతున్నది. పేదవారు గృహనిర్మాణం చేసుకోవాలన్న అమ్ముకోవాలి అన్న lrs భారం అదనంగా పడుతున్నది. చాలా మంది పేద వర్గాల వారు కష్టపడి అప్పులు చేసి సంపాదించుకున్న ప్లాట్ల విషయంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం నిర్మాణము చేసిన ఇళ్లకు సంబంధిత అధికారులతో అనుమతి పొందడం జరిగినప్పటికీ ఇవి అక్రమం ఎలా అవుతాయి?
lrs తో తలెత్తుతున్న సమస్యలు:-*****
***************************************
దాదాపుగా 70 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఆయా సందర్భాలలో కొనుగోలు చేసిన ప్లాట్లు అనుమతులు లేని అని అంటున్నారు. గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ స్థాయిల్లో సంబంధిత అధికారులు ఆమోదంతోనే కదా రియల్టర్లు ప్లాట్లు చేస్తే కొనుగోలు చేసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్న ది. రిజిస్ట్రేషన్ ఆఫీసులకు అధికారం లేదా? పెద్దలు మాత్రమే అపరాధం చేసినట్లు అధికారులు రియల్టర్లు బాధ్యులు కాదా వారికి ఎలాంటి జరిమానా విధిస్తారు?
బహిరంగ స్థలం లేకపోతే 14 శాతం పండు కట్టాలని నిబంధన పన్ను కట్టినట్లయితే స్థలాన్ని పెంచగలరా? అది సాధ్యం కానప్పుడు ప్రజల వద్ద నుండి ముక్కుపిండి వసూలు చేయడం దేనికి?
lrs ను ప్రభుత్వం ఒక ఆదాయమార్గంగా లోటును భర్తీ చేసుకోవడానికి దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయలకు పైగా ప్రజల ముక్కుపిండి వసూలు చేయాలని నిర్ణయం తీసుకోవడం ప్రజా వ్యతిరేక చర్య కాదా?
డబ్బులు పెట్టి కొనుగోలు చేసి చట్టబద్ధంగా కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకుని అనుమతి పొంది నిర్మాణాలు చేస్తే అక్రమం ఎలా అవుతుంది. ప్రభుత్వాలు పునరాలోచించాలని ప్రజలు కోరుకుంటున్నారు. అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
స్వతంత్ర అనంతరం 70 సంవత్సరాలుగా ప్రభుత్వాలు చట్టాలు లేవా? అప్పుడే ఎందుకు కట్టడి చేయలేదు. నాటి ప్రభుత్వాల ప్రకారంగా చట్టబద్ధంగా కొనుగోలు చేసినటువంటి ప్లాట్లకు ప్రస్తుత ప్రభుత్వాలు ఆటంకం కల్పించడం అర్థరహితమని ప్రజలు వాపోతున్నారు. కరోనా నేపథ్యంలో చిరు ఉద్యోగులు వ్యాపారాలు పనులు కోల్పోయి ఉపాధి లేక కొనుగోలు శక్తి తగ్గి భూములు ఆస్తులను అమ్ముకొని బ్రతుకుతున్న కటిక ఇబ్బందుల్లో ప్రభుత్వము అదనంగా భారం వేయడం సందర్భోచితం కాదు.
lrs లోని శాస్త్రీయత ఎంత:
************************************** ఇక పన్ను మదింపు కు సంబంధించిన అంశం సామాన్యులకు తికమక పడే విధంగా నిపుణులచే అర్థం కావడం లేదని అనేక మంది అధికారులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. బేసిక్ రెగ్యులరైజేషన్ ఛార్జీలను ఆనాటి రేట్ల ఆధారంగా ,టేబుల్ 2 ప్రకారంగా ప్రస్తుతం మార్కెట్ ధరల ప్రకారం లెక్కించి, బహిరంగ స్థలం లేకపోవడంతో పది శాతం అదనంగా పాత మార్కెట్ రేట్ల ప్రకారం గా పన్ను వేయడం మొత్తము కలిపితే చారానా కోడికి barana మసాలా అన్న చందంగా మారిపోతుందని ప్రజలు వాపోతున్నారు.
dtcp హెచ్ఎండిఏ వ్యవస్థలు ఆమోదించని లే అవుట్ అయిన అక్రమ నేనని ప్రభుత్వము తన వాదన చేస్తున్నది. పై రెండు సంస్థలు ఆమోదించిన ఇది కేవలం 10 శాతం మాత్రమే ఉండగా 90% గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల పరిధిలోని వే కావడంతో ప్రస్తుతము ఇవన్నీ అక్రమంగా మారిపోయినవి. గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు క్రమబద్ధీకరించే అధికారం లేదు అని ప్రభుత్వం ఈ జీవో ద్వారా వాటిని అక్రమ లే అవుట్ గా గుర్తించడంతో అరకొరగా జీవితాలు గడుపుతున్న పేదవాళ్లకు పెద్ద చిక్కు వచ్చి పడింది.
ఆచరణలో ఉన్నది చట్టం అయినట్లు ఇంతకాలంగా అనుభవిస్తున్న ఈ ఫ్లాట్ లకు సంబంధించిన వ్యవహారాన్ని నామమాత్రపు ఫీజు తో క్రమబద్దీకరించడం ద్వారా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాలని నిపుణులు రాజకీయ పక్షాల వాళ్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నిజాం రాజుల కాలంలోనూ ఆంగ్లేయుల పరిపాలన లోను ఇంత దారుణానికి పాల్పడిన పరిస్థితులు లేవని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగిన వాటిని అక్రమ అనే పేరుతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం సంక్షేమం కాదని ప్రజల గూర్చి ఆలోచించడం ద్వారా సవరించడం ద్వారా దీనికి ముగింపు పలకాల్సిన అవసరముంది.
ఫీజు చెల్లిస్తే లోపాలు సవరించబడి పోతాయా?
************************
ఒకవైపు అధీకృత అధికారుల నుండి అనుమతులు లేవని చెబుతుంటే మరోవైపు విశాలమైన రోడ్లు ఖాళీ స్థలం లేకపోవడం కూడా అక్రమమని ప్రభుత్వం వాదిస్తుంటే న్యాయ నిపుణులు రిటైర్డ్ అధికారులు ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు ప్రజల పక్షాన.
డబ్బులు కట్టి క్రమబద్ధీకరించు ఉంటే అధిక వసతులు కల్పిస్తారా? లే అవుట్ చేసిన కాలంలో 10 ఫీట్లు 23 సీట్లు ఉన్నటువంటి రోడ్లను ప్రస్తుత నిబంధనల మేరకు 33 సీట్లకు మార్చగలరా? గత దశాబ్దాలుగా ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న రియల్టర్లు అధికారులు కార్యాలయాలు ప్రభుత్వాలను బాధ్యులను చేయగలరా? అని డిమాండ్ చేస్తున్నారు.
మిలిటరీ నివాసాలు నా దగ్గర 500 మీటర్ల లోపు ఏ నిర్మాణము ఉండకూడదని ప్రభుత్వ అధికారులు నిర్బంధ నిబంధన పెడుతున్నారని తెలుస్తున్నది. ఆ విషయంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం 10 మీటర్లకు తగ్గించింది కనుక రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రజల ఆర్థిక పరిస్థితులు ప్రభుత్వ పునరాలోచన:-*
********************************
కరోనా పరిస్థితులతో పేద వర్గాలకు ఇబ్బందులు ఉండదని భావించిన ప్రభుత్వం ఉచిత బియ్యం తో పాటు నగదు సహకారాన్ని కూడా అందించిన విషయం తెలిసిందే. కానీ అంతకంటే ఎక్కువగా అప్పులు చేసి ప్రభుత్వం అనుమతించిన మద్యం దుకాణాల వైపు ప్రజలు జైత్రయాత్ర చేస్తూ ప్రభుత్వ ఖజానా నింపుతుంటె
ప్రజల అనారోగ్యాన్ని అప్పులను ఆలో
చించని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజల మానవాభివృద్ధి ని మరచి నిధుల వసూలుపై పాల్పడడం ప్రతి పక్షాలు ప్రజా సంఘాలు ప్రజలు ఎంత వ్యతిరేకించినా పునరాలోచన చేయకపోవడం తప్పనిసరిగా ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం పడుతుంది ఈ విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలి.
అనాధగా కష్టపడి కూలినాలి చేసుకొని సంపాదించుకున్న 1,2 ప్లాట్లకు తిరిగి వేలాది రూపాయలు చెల్లించాలంటే ప్రజలు మళ్లీ అప్పులపాలు అవుతారనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి.
కొన్ని ప్రత్యామ్నాయాలు:-
**********************************
2009లో చేసిన విద్యాహక్కు చట్టం 2010 ఏప్రిల్ నుండి అమలులోనికి వచ్చింది.
చట్టం ఏదైనా చట్టం చేసిన నాటి నుండి అమలులోనికి వస్తూ ఉంటుంది. కానీ lrs కు సంబంధించి ప్రభుత్వం 2020 ఆగస్టు 31న జీవో విడుదల చేస్తే గత కాలాలలో కొనుగోలు చేసిన ప్లాట్లకు వర్తిస్తాయి అనడం అసమంజసం ఈ విషయాన్ని రాజకీయ పక్షాలు ప్రజలు ప్రభుత్వాలు అందరూ గ్రహించాలి. ఈ ఉత్తర్వు ప్రకారం గా ఇప్పటి నుండి నిబంధనలు వర్తిస్తాయి అని చెప్పడంలో అర్థం ఉంది. ముందు హెచ్చరికలు లేకుండానే ఘట్టానికి సంబంధించి వర్తింప చేయడం దారుణం.
పరిపాలనకు సంబంధించిన అంశం కనుక నామమాత్రపు రుసుము తో క్రమబద్దీకరించడం ద్వారా ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నట్లు అవుతుంది.
లేకుంటే తీగ లాగితే డొంకంతా కదిలినట్లు గత పాలకులు అధికారులు ప్రభుత్వాలు వ్యవస్థలు కూడా ఆ క్రమంలో భాగం పంచుకోవలసి ఉంటుంది. అయినా దొంగతనంగా సాధించినది కాదు. సాంకేతికంగా నిర్ణయించబడిన అధీకృత అధికారుల అనుమతి లేకపోయినా అంతమాత్రాన ప్రజలను కొనుగోలుదారులను దొంగలు గా చిత్రీకరించడం ఆ పని అక్రమమని అంటగట్టడం రాజకీయ ప్రజాస్వామ్య చరిత్రలో ఏనాడు కనపడలే.
ఇక పన్ను చెల్లించే విధానానికి సంబంధించి అతి గందరగోళం పద్ధతిలో ఉత్తర్వులు జారీ చేసి lrs కు అప్లై చేసే సందర్భంలో దాదాపు ఎనిమిది డాకు
మెంట్లు సమర్పించాలని దరఖాస్తు ఫీజు రూపంలోనే దాదాపుగా కోటి రూపాయలు వసూలు చేయడం దీని వెనుక గల ప్రభుత్వం యొక్క అంతరార్థం మనకు తెలిసిపోతుంది..
డబ్బులు వసూలు చేసే కార్యక్రమం గాక ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజల ఆస్తులకు భద్రత తో పాటు చట్టబద్ధతను కల్పించే సామాజిక బాధ్యతను నిర్వహించడం ద్వారా ఈ ఎల్ఆర్ఎస్ పథకాన్ని సవరించి అమలు చేయవలసిన అవసరం ఉన్నది.
ఇందులో మరొక ప్రమాదం ఏమిటంటే, పన్ను మదింపు చేసే సందర్భంలో తికమక తో పాటు అవినీతిమయమైన వ్యవస్థను మరింత అవినీతి పాలు చేయడానికి కార్యాలయాల చుట్టూ తిరిగి కాలయాపన తో ప్రజలు విసిగిపోయి పరిస్థితులు రాకుండా సులభతరంగా గజానికి నామమాత్రంగా నిర్ణయించడం ద్వారా మాత్రమే దీనికి పూర్తి పరిష్కారం దొరుకుతుంది. అలాగే ఇకనుండి చేసే లేఅవుట్ నిబంధనలు ముందుగానే పెడితే రియల్టర్లు పూజ మానులు కొనుగోలుదారులు అందరూ కూడా బాధ్యులు అవుతారు. చట్టం సమర్థవంతంగా అమలు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది.
ఏ ఉత్తర్వు ద్వారా నైతే ప్రజలు కొనుగోలు చేసిన ప్లాట్లు అక్రమమని
ప్రకటించిన దో అదే ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా విధానాన్ని సవరించి ప్రజల మీద భారం పడకుండా నామమాత్రపు క్రమబద్ధీకరణ ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వడం ద్వారా ఈ సమస్యకు ముగింపు పలకాలి.
ఇటీవల జరిగిన ఉప ఎన్నిక తోపాటు త్వరలో జరగనున్న హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి హైదరాబాదులో ఉన్న లక్షలాది ప్లాట్లకు పేద ప్రజానీకానికి సంబంధించినవి ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ప్రజల డిమాండ్కు అనుగుణంగా ప్రభుత్వం స్పందించి lrs ను రద్దు చేసి వీలైతే ఉచితంగా క్రమబద్దీకరించడం ద్వారా ప్రభుత్వం తన రాజనీతిజ్ఞతను సందర్భోచితంగా ప్రదర్శించాలి.
గతంలో జరిగిన ప్రభుత్వ చర్యలపై ప్రశ్నిస్తే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు ఉండదు కూడా. కొనుగోలు అమ్మకాలు బేరాలు రిజిస్ట్రేషన్లు అనుమతులు అన్ని
చీకట్లోనో, దొంగతనం గానో, లంచాల తో రహస్యంగాజరిగినవి కావు. అలాంటప్పుడు గత పాలకుల అధికారుల ప్రభుత్వాల నిర్ణయాలను నేటి ప్రభుత్వం తప్పుపట్టడం లో ఔచిత్యం లేదేమో!
ఫీజులు చెల్లిస్తే లోపాలు సవరించబడ
యి కనుక, ఇంతవరకు ఆ సాగినది అంతా అక్రమమని నిర్ధారించలేము కనుక, సంక్షేమ ప్రభుత్వానికి ప్రజలను తిప్పలు పెట్టి ఖజానా నింపుకోవడం కలదు కనుక, కరుణ కష్ట కాలపు, ఇబ్బందుల ఛాయలు ప్రతిఫలిస్తున్న వేళ ప్రజలను పీడించటానికి సరి కాదు కనుక,
lrs రూపంలో వసూలు చేయడం ద్వారా క్రమబద్ధీకరణ దృవీకరణ పత్రము వస్తుందేమో కానీ సాంకేతిక లోపాలను సవరించి అదనపు సౌకర్యాలను కల్పించడం కుదరదు కనుక ఉత్తర్వును సవరించి నామమాత్రపు ఫీజు లేదా ఉచితంగా క్రమబద్ధీకరణ చేయడం ద్వారా ప్రభుత్వం ప్రజల మెప్పు పొందడమే కాదు ఒక సంక్షేమ ప్రభుత్వ చర్య నిర్వహించినట్లు అవుతుందని
విజ్ఞులు అభిప్రాయపడుతున్నారు.
రెవెన్యూ ,భూ, సాంకేతిక నిపుణులతో,
మేధావులతో ప్రజా సంఘాలతో చివరికి రాజకీయ పక్షాలతో ఉన్నత సమావేశాన్ని నిర్వహించడం ద్వారా మౌలికమైన నివాస స్థలాలు, లే అవుట్ లకు సంబంధించిన వివాదాన్ని సున్నితంగా పరిష్కరించడం ద్వారా ప్రభుత్వం తన సమయస్ఫూర్తిని చాటుకోవాలని విజ్ఞప్తి.
[11/24, 21:26] వడ్డేపల్లి మల్లీశం గారు: నేటి మాట 239/24.11.2౦ మంగళవారం
జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రజల మౌలిక సమస్యలు- రాజకీయ పక్షాల ప్రలోభాలు.
-- వడ్డేపల్లి మల్లేశము,9014206412
*********************************************
ఎన్నికల వేళ రాజకీయ పార్టీల సందడి అగ్రరాజ్యాలకు తీసుకోని స్థాయిలోనే మనదేశంలో కొనసాగుతుంటుంది. ఆర్థిక పరిభాషలో చెప్పుకుంటే భారతదేశం మూడవ ప్రపంచ దేశం, లేదా అభివృద్ధి చెందుతున్న దేశం ,లేదా వెనుకబడిన దేశంగా చెప్పుకుంటారు. పేదలు ఎక్కువగా ఉన్న సంపన్న దేశంగా పేరొందిన భారతదేశంలో సంపద లేక కాదు కానీ కొద్ది మంది చేతిలో ఉండడము వల్లనే పేదరికం బాగా పెరిగిపోవడంతో వెనుకబడిన దేశంగా, అభివృద్ధి చెందుతున్న దేశంగా దిగజారిపోయింది.
అయితే చెప్పదగిన విషయమేమిటంటే ఎన్నికల సందర్భంలో మాత్రం రాజకీయ పార్టీలు వెనుకాడకుండా వాగ్దానాలు చేయడం, ప్రలోభాలకు గురి చేయడం, డబ్బు మద్యం పంపిణీతో పాటు అవసరం కోసం మాత్రమే ఓటర్ల దరిచేరే దుష్ట సంస్కృతి భారత రాజకీయాలలో రోజురోజుకు మించిపోతున్న ది. ఎన్నికలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కానీ వాగ్దానాల కోసం కాదు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాలన లో భాగంగా ప్రజా సమస్యలు పరిష్కరించాలి. ఎన్నికలప్పుడే ప్రజల సమస్యలు జ్ఞాపకం వచ్చినాయి అంటే అక్కడ సక్రమమైన పాలన జరగలేదని కదా అర్థం.
ఈ క్రమంలోనే హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికలు రావడం తక్కువ సమయంలో గెలవాలని ఆశతో చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఇతరులకు అవకాశం లేకుండా చేయడం ఇటీవలి కాలంలో అధికార పార్టీ లకు మామూలైపోయింది.
జిహెచ్ఎంసి చిత్రము ఒక అంచనా:-
***********************************((
1.67 లక్షల జనాభా హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో ఉన్నదని ప్రభుత్వ లెక్కలు చెబుతుంటే ఆ జనాభాకు అనుగుణంగా ప్రాథమిక సౌకర్యాలు క్రమంగా కల్పించవలసిన అవసరం ఉంటుంది. రోడ్లు, మంచినీటి సౌకర్యం, విద్యుత్ దీపాలు, బస్సు వాహన సౌకర్యం, గృహనిర్మాణ సౌకర్యం ఇళ్ల స్థలాల పంపిణీ, వాతావరణం కలుషితం కాకుండా స్వచ్ఛమైన పరిస్థితులు కల్పించడం, ప్రభుత్వ రంగంలోని విద్యా వైద్య సౌకర్యాలను ప్రజలకు ఉచితంగా అందించడం ఇవన్నీ కనీసంగా ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా అందించవలసి ఉన్నది.
ఉన్న జనాభాకు అనుగుణంగా పాఠశాలలు ఎన్ని ఉన్నాయి ఎన్ని అవసరం ఉన్నది? వైద్యశాలలఅవసరం ఎంత? ఇళ్ల స్థలాలు లేని వారు మొత్తానికే ఇల్లు లేని వారు తలనుండి ఇల్లు కట్టుకోవడానికి సహకారాన్ని ఆశిస్తున్న వారు అంచనా ప్రభుత్వం దగ్గర ఉండి ప్రభుత్వం ఆయా వర్గాలకు ఆ సౌకర్యాలను ఉచితంగా కల్పించాలి. ఈ రకమైన ప్రాథమిక సౌకర్యాలు మానవాభివృద్ధికి సంబంధించిన సౌకర్యాలు కల్పించబడినవి ఆలోచించాలి. ఇప్పటికి కనీస సౌకర్యాలు లేకుండా మురికి కూపాల సమీపంలో వంతెనలు రోడ్ల పక్కన ఆరుబయట సామాన్యుడు నివసిస్తుంటే ప్రభుత్వం సాధించిన ఘనత ఏమని చెప్పుకుంటారు? ఒకవైపు ఆకాశాన్ని అంటే భవనాలు, కోటాను కోట్ల సంపద కొద్దిమంది చేతుల్లోనే ఉండి పేద వాళ్లను వెక్కిరిస్తూ ఉంటే సమానత్వ సాధన కోసం పేద వాళ్లకు అండగా నిలవడం కోసం ప్రభుత్వాలు చేసిన పనులు ఏమిటో చెప్పగలగాలి. రోడ్ల పక్కన ఇప్పటికీ పంది గుడిసెల్లో బస చేస్తున్న ప్రజానీకం అభివృద్ధి అంటే ఎట్లా? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా మని చెప్తే సామాన్య బ్రతుకు మారిందా? మెట్రో రైలు, ఓవర్ బ్రిడ్జ్ హోర్డింగ్ లు మెరుపు లైట్లు మాత్రమే అభివృద్ధి కాదు పేదవాడి ఆర్థిక స్థితిని మెరుగుపరిచి ఉపాధి కల్పించి పేదరిక నిర్మూలన చేసిన రోజే హైదరాబాద్ మహానగర పరిధిలో పేదలు లేకుండా పరిస్థితులు మారిన రోజు అభివృద్ధి.
ప్రలోభాలు వద్దు ప్రజా ప్రగతి ముద్దు:-
********************???****************
ప్రతి ఇంటికి నెలకు 20 వేల లీటర్ల మంచినీటిని ఉచితంగా అందిస్తానని అధికార పార్టీ అంటే 30 వేల లీటర్లు ఉచితంగా అందిస్తామని బిజెపి పార్టీ హామీ ఇస్తుంది. అయితే మంచి నీళ్లు కూడా ఉచితంగా ఇప్పటివరకు ఇవ్వడం లేదా? ఓన్లీ రాష్ట్రాలలో కరెంటు బిల్లు మంచినీటి సరఫరా ఉచితంగా ఇస్తున్నట్లు తెలుస్తుంది. 45 వేల కోట్లతో మిషన్ భగీరథ ప్రారంభించిన ప్రభుత్వం ప్రజలు డిమాండ్ చేయకుండా సరఫరా చేయడం వలన ఆ మంచినీటిని ఎవరు వాడడం లేదు తిరగడం లేదు. పైగా పచ్చగా నాచు వస్తున్నదని ఆరోపణ. ఏది ఏమైనా మంచి నీటి సరఫరా వాగ్దానం ప్రజల దృష్టిలో సరైనది కాదు అది ఎప్పుడో కల్పించవలసిన కనీస బాధ్యత.
ఉపాధి లేక ఉద్యోగాలు పోయి కనీస జీవన ప్రమాణానికి దూరంగా బతుకుతూ లక్షలాదిమంది ఇల్లు ఇళ్లస్థలాలు పిల్లల చదువులు అన్నింటికీ దూరంగా బతుకుతున్నా రే వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం ప్రభుత్వం బాధ్యత ఆ విషయంలో ఎంతైనా ఛాలెంజ్ చేయండి. అన్ని పార్టీలు పోటీపడి నిధులు కేటాయించిన ప్రజలు ఆహ్వానిస్తారు. అంతే కాకుండా ఇటీవల ఎల్ఆర్ఎస్ ను ప్రభుత్వం ప్రజలపై భారంగా
రుద్దుతున్న వేల ప్రభుత్వం పునరాలోచన చేసి ఇళ్ల స్థలాలు కొనుక్కోవడమే అప్పులతో సతమతమౌతున్న ఇంటి వర్గాలకు నామమాత్రపు లేదా ఉచితంగా క్రమబద్ధీకరణ చేయడం ద్వారా ప్రభుత్వం ప్రజల మనసులను చూరగొనాలి. ఈ ఎన్నికల ప్రచార వేల ప్రతిపక్షాలు కూడా తాము అధికారంలోకి వస్తే ఉచితంగా నివేశన స్థలాల క్రమబద్ధీకరణ చేస్తామని lrs ను ప్రభుత్వం మానుకోవాలని హెచ్చరించకలగాలి. అప్పుడు రాజకీయ పార్టీల నిజమైన హామీలను ప్రజలు హర్షిస్తారు.
సమస్యల పరిష్కారం తో పాటు మానవాభివృద్ధి సాధించగలిగే నూతన ఆర్థిక వ్యవస్థ రూపొందడం లో ,అంతరాలు, వివక్షత తొలగించడంలో శ్రద్ధచూపాలి కానీ మాటకు మాట గాలి మాటలు గా నీటిమీద రాతలు గా మిగిలిపోతాయి.
రాజ్యాంగబద్ధంగా పాలన సాగితే వాగ్దానాలు అవసరమే లేదు:-
రాజ్యాంగ రచన సందర్భంలో అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతలు ప్రభుత్వాలు చేయవలసినవి ఆదేశ సూత్రాల లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఎన్నికల విధానం, ప్రజల భాగస్వామ్యం, పరిపాలన నిర్వచనం,
రాజ్యాంగ ప్రవేశిక లో స్పష్టంగా ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన అన్ని అంశాలు పేర్కొనబడ్డాయి. రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగాలని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన ఎవరైనా దేశద్రోహులు అవుతారని అంబేద్కర్ చేసిన హెచ్చరికను మనం సీరియస్ గా పరిశీలించాలి.
అంటే రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగినట్లు అయితే అభి స్థానిక సంస్థలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వం అయినా ఎన్నికైన ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనలో ఎంచుకున్న లక్ష్యాలను సాధించడానికి కృషి చేయాలి తప్ప ప్రలోభాలతో కాలయాపన చేయడం కాదు అని దీని అర్థం. కేంద్రము నుండి రాష్ట్రాల గ్రామపంచాయతీ స్థాయి వరకు కూడా ఎన్నికల వాగ్దానాలు, ప్రలోభాలు, ప్రచార ఆర్భాటాలతో ప్రజల చైతన్యాన్ని, ప్రజల దృష్టిని మళ్ళించే ప్రయత్నాల పట్ల ప్రజలు అప్రమత్తమై రాజ్యాంగబద్ధమైన హక్కుల సాధన కోసం ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను ప్రశ్నించడం ద్వారా సాధించుకోవాలి.
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ లో సమస్యలు అపారం. దారిద్ర్య రేఖ దిగువన గల వారు పేదవారి పట్ల మాత్రమే ఈ ఎన్నికలు కేంద్రీకృతం అయినప్పుడు ప్రభుత్వాలు కూడా పేద వర్గాలకు మేలు చేస్తాయని ప్రజలు నమ్ముతారు. అందుకే ఈ ఎన్నికల వేళ తమ సమస్యల పైన ప్రభుత్వం గాని ప్రతిపక్షాలు గాని స్పష్టమైన హామీ ఇచ్చి పరిష్కరిస్తారని ఆశిస్తున్నారు. ఎల్ ఆర్ యస్ రూపంలో ఆర్థిక భారం మోపి విధానాన్ని మానుకొని ఉచితంగా క్రమబద్ధీకరణ చేయాలని ప్రజలు మెజారిటీ వర్గాలు కోరుతున్నాయి.
(. ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు, కవి, రచయిత ,అధ్యక్షులు జాగృతి కళా సమితి హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ).
[11/25, 21:57] వడ్డేపల్లి మల్లీశం గారు: నేటి మాట 240/25.11.20 బుధవారం
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పై- --విశ్లేషణ
సమ్మె కు దారితీసిన పరిస్థితులు ---2
*********************************************
-- వడ్డేపల్లి మల్లేశము,9014206412
పరిపాలన అంశము శాఖ లను బట్టి పాలనా అంశాలను 3 జాబితాలు గా నిర్ణయించడం జరిగింది. రక్షణ ,అంతరిక్షం, కరెన్సీ, విదేశ వ్యవహారాలు, రైల్వేలు, విమానాలు నౌకాయానం వంటి శాఖలు కేంద్ర జాబితాలో కలవు. చట్టాలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. రాష్ట్ర పరిధికి సంబంధించిన పాలన అంశాలు రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు చేస్తుంది. అయితే విద్య వైద్యం వ్యవసాయము వంటి అంశాలపై ఇటు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా చట్టాలు చేసే అధికారం ఉంది. ఈ అంశాలనే ఉమ్మడి జాబితా అని అంటారు.
రాజ్యాంగము దేశ పాలనకు సూచనలు:-
****************************************
భారత రాజ్యాంగము నిర్వచించిన ప్రకారంగా కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలు నిర్ణయించే అంశాలు పాలించే పాలన స్పష్టంగా రాయడమే కాకుండా పాలకులకు తగు సూచనలు ఆదేశిక సూత్రాల లోనూ, ప్రాథమిక హక్కుల తో సహా ఇతర అధికరణము లలోనూ పొందుపరచడం జరిగినది. ప్రజల సంక్షేమమo,అభివృద్ధి ప్రధాన ఎజెండాగా ప్రజలకు అనుగుణంగా పరిపాలించ వలసిన ప్రభుత్వాలు అప్పుడప్పుడు గాడి తప్పుతూ ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న సందర్భాలు ప్రభుత్వ సంస్థ అయిన" కాగ్" హెచ్చరికలు, న్యాయవ్యవస్థ మందలింపు లను మనము చూసి ఉన్నాము.
కేంద్ర ప్రభుత్వ పాలన ప్రైవేటు వైపు మొగ్గు*
***************************************
1991లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న కాలంలో నాటి గడ్డు పరిస్థితుల నుండి దేశాన్ని రక్షించడానికి అని సరళీకృత ఆర్థిక విధానాల పేరుతో ప్రారంభమైన ప్రైవేటీకరణ ఛాయలు నేటి బిజెపి కేంద్ర ప్రభుత్వం రైల్వేలు, విమానాలు, నౌకాశ్రయాలు, బొగ్గు గనులు, జీవిత బీమా సంస్థ, రక్షణ రంగము, తో సహా అనేక రంగాలను ప్రైవేట్ పరం చేయడానికి పూను కోవడం ఆందోళన కలిగించే విషయం. నేడు కొనసాగుతున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక చర్యలను కార్మిక సంఘాలు సమ్మె ద్వారా వ్యతిరేకించింది. బొగ్గుగని కార్మికులు, ఆయుధ కర్మాగారాల కార్మికులు, రైల్వే ప్రొడక్షన్ యూనిట్ లో కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, చమురు రంగ కార్మికులు, నౌకాశ్రయం కార్మికులు సిమెంట్ కర్మాగారాలు కార్మికులు, ఉత్తర ప్రదేశ్ విద్యుత్ శక్తి కార్మికులు మరియు ఇంజనీర్లు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన నిరవధిక సమ్మె ద్వారా ఆంధ్ర ప్రభుత్వం కొంతవరకు దిల్ వచ్చినప్పటికీ భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున నిరసన కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. దానికే ఈ సార్వత్రిక సమ్మె.
1966 లో కొటారి సూచించిన కామన్ స్కూల్ విధానం, ప్రభుత్వ రంగంలోనే విద్యను గత ప్రభుత్వాలలాగే ఈ ప్రభుత్వం అమలు చేయకపోగా ప్రైవేటీకరణ పెంచే దిశగా పేదవారిని వివక్షకు గురి చేసే ధోరణి తో ప్రవేశపెడుతున్న నూతన విద్యా విధానం రాజ్యాంగాన్ని పక్కనపెట్టి సొంత ఎజెండా అమలు చేసినట్లు గా ఉన్నది.
కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ రంగంలోనే విద్యను కొనసాగించే నూతన విధానం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అందుకే ఈ సమ్మె.
ప్రభుత్వ రంగ సంస్థలైన బొగ్గు గనులు 41 రక్షణరంగ ఆయుధ కర్మాగారాలు ఎయిర్ ఇండియా రోడ్డు రవాణా విద్యా సంస్థల ప్రైవేటీకరణ దారితీసి బిఎస్ఎన్ఎల్ లో 86 వేల మందిని బలవంతంగా పదవీవిరమణ చేయించిన ప్రభుత్వ చర్యలతో అనేక కంపెనీల్లోని లక్షలాది మంది ఉద్యోగులు వీధిన పడ్డారు. కాకుండా ప్రభుత్వ వ్యవస్థ లైన ఆర్బిఐ, ఎల్ఐసి, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను డబ్బు కోసం మాత్రమే ఉపయోగించుకోవడం తో ఎల్ఐసి కూడా ప్రైవేటు పరం కానున్నది. తద్వారా ఉద్యోగులు ఉపాధి కోల్పోవడమే కాకుండా చట్టబద్ధంగా రాజ్యాంగ బద్ధంగా ఉన్న హక్కులను కోల్పోవడం ప్రైవేటీకరణ లోని పెద్ద మోసం అందుకే ఈ సమ్మె.
కేంద్రం ఇటీవల చేసిన చట్టాలపై వ్యతిరేకత విమర్శ:-
************************************
ప్రభుత్వం అవలంబిస్తున్న ఆర్థిక విధానాల కారణంగా ఉపాధి కోల్పోయి పేదరికం మరింత పెరిగి ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోవడమే కాకుండా దారిద్ర్య రేఖ దిగువన గల వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ దేశ సంపద కొద్దిమంది చేతిలోనే కేంద్రీకృతం కావడం రాజ్యాంగ ఉల్లంఘన కిందికే వస్తుంది. ఎందుకంటే రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాదం అనే పదాన్ని రాజ్యాంగంలో ప్రవేశపెట్టి ధన్యవాదాలు తరహా ప్రభుత్వాన్ని సాధించాలనే లక్ష్యాలు నీరుగారి పోతున్నవి. ఈ క్రమంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పేదలకు ఉచిత బియ్యము నామమాత్రపు నగదుతో పూర్తిచేసి కార్పోరేట్ లకు మాత్రం పన్ను తగ్గించడమే కాకుండా వ్యవస్థలు నిలదొక్కుకోవడానికి అనే పేరుతో కోటాను కోట్ల రూపాయలను అందజేశారు. ఈ చర్య మరింత అసమానతలు పెరగడానికి దారితీస్తుంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కోట్లాది మంది వలస కార్మికుల బాధలు ప్రపంచ ముఖచిత్రం మీద అందరము చూడడం జరిగింది. ఈ దుస్థితి నుండి తట్టుకోవడానికి ఈ సార్వత్రిక సమ్మె.
2020 విద్యుత్ శక్తి సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టకుండానే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యతిరేకించినా పట్టించుకోకుండా విద్యుత్ పంపిణీ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఎవరి ప్రయోజనం కొరకు?
అసంఘటిత రంగంలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు ,బీడీ కార్మికులు, నిర్మాణరంగ కార్మికులు, ఆటో రిక్షా కార్మికులు, వంటి అనేక రంగాల కార్మికులకు సమ్మె హక్కులను హరించే విధంగా, కార్మికులకు రక్షణ లేకుండా చేసే మూడు కార్మిక వ్యతిరేక చట్టాలను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించి కార్మికుల గొంతు నొక్కినట్లు విజ్ఞులు మేధావులు అభిప్రాయపడుతున్నారు. చిత్రమైన విషయం ఏమిటంటే ఈ మూడు చట్టాలను ఆమోదించినప్పుడు పార్లమెంటులో లేకపోవడం విడ్డూరం.
కార్పొరేటు, మరియు కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని, విదేశీ కార్పొరేట్ సంస్థల ప్రోత్సహించే విధంగా రాజ్యాంగ రక్షణలను ఉల్లంఘిస్తూ 3 వ్యవసాయ బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం పట్ల వ్యవసాయరంగ నిపుణులు, మేధావులు నిరసన తెలిపారు.
అనివార్యమైన సమ్మె:-
*************************
కార్మికులు రైతులు ప్రజల జీవన ప్రమాణం అడుగంటి ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోతున్న నేపథ్యంలో ప్రభుత్వ సంస్థలు విచ్ఛిన్నం కావడం, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం, బలవంతంగా ఉద్యోగులను పదవీ విరమణ చేయించి, రైతు కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు చట్టబద్ధత కల్పించడం పట్ల అనివార్యమైన పరిస్థితుల్లో ప్రజానీకం తమను తాము రక్షించుకోవడం కోసం తలపెట్టిన సమ్మెను విజయవంతం చేయడంతోపాటు సంపూర్ణంగా మద్దతు ఇవ్వడం అన్ని వర్గాల బాధ్యత.(
( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు కవి రచయిత అధ్యక్షులు జాగృతి కళాసమితి హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)
[11/26, 17:12] వడ్డేపల్లి మల్లీశం గారు: చేనేత రంగాన్ని శాసించిన ప్రజా ఉద్యమకారుడు ప్రగడ కోటయ్య.
-- వడ్డేపల్లి మల్లేశము,9014206412
*********************************************
దేశంలో చాలామంది వ్యక్తిగత స్వార్థం కోసం ,అక్రమార్జన కోసం, రాజకీయాలను కూడా స్వార్థ ప్రయోజనాల కోసమే వాడుకుంటూ ఉంటారు. తాత్కాలికంగా వాళ్లు తెరమీద కనపడినప్పటికీ అధికారం కోల్పోయిన తర్వాత చరిత్ర ద్రోహులుగా మిగిలిపోతారు. కానీ కొంతమంది తమ జీవితాన్ని పణంగా పెట్టి లక్ష్యశుద్ధి గా నమ్మిన సిద్ధాంతం కోసం పని చేస్తూ ఉంటారు. అలాంటివాళ్లు సమకాలీన సమాజంలో అంతగా గుర్తించక పడకపోయినా తరవాతి తరాలు వారిని స్మరించుకుంటారు కీర్తించు కుంటారు. వారి చరిత్రను లిఖించి భావితరాలకు అందిస్తారు.
అలాంటి ప్రజా ఉద్యమకారుడు, ప్రముఖ జాతీయ ఉద్యమ నాయకుడు, చేనేత రంగం పరిరక్షణ కోసం అహర్నిశలు ఆరాటపడి ఉద్యమ భావజాలంతో చేనేత రంగాన్ని నూతన పుంతలు తొక్కించిన చేనేత రంగం, నాటి సమకాలీన సమాజము, ప్రభుత్వంతో చేనేత రంగ పితగా గుర్తించబడిన ప్రగడ కోటయ్య గారు ప్రజల కోసం పని చేసిన ధన్యజీవి. రెండవ వర్గానికి చెందిన వీరి యొక్క వ్యక్తిత్వము, సామాజిక చింతన, చేనేత రంగానికి చేసిన పోరాటం, ఆటుపోట్లు, ప్రభుత్వంతో రాజ్యం చేసి సాధించిన మరణం చేసుకోవలసిన బాధ్యత వారి యొక్క వర్ధంతి సందర్భంగా మనందరిపైనా ఉంది.
చేనేత రంగం ప్రగడ కోటయ్య సేవలు:-
*************************************
చేనేత కుటుంబంలో పుట్టిన వీరు భారతీయ చేనేత పరిశ్రమ పై పరిశోధన జరిపిన ఆచార్య ఎన్జీరంగా సలహామేరకు మద్రాసులోని టెక్స్టైల్స్ ఇన్స్టిట్యూట్లో చదివి అక్కడ సూపర్ వైజర్ గా పనిచేశాడు. ఆ రకంగా పొందిన అనుభవం 1935లో ఏర్పడిన మద్రాసు రాష్ట్ర చేనేత పారిశ్రామిక సహకార సంఘం లో ప్రొడక్షన్ ఇన్ఛార్జిగా ఉద్యోగంలో చేరి ,సర్కారు జిల్లాల్లో ప్రాథమిక చేనేత సహకార సంఘాలను ఏర్పాటు చేసి విశేష కృషి చేయడానికి తోడ్పడింది.
1945లో ఏర్పడిన ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ వీవర్స్ కాంగ్రెస్ సంస్థకు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి ఆ రంగంలోని కార్మికుల సమస్యల పరిష్కారం లో విశేషంగా కృషి చేశారు.
భారత ప్రభుత్వ చేనేత రంగ ప్రతినిధిగా నియామకమైన కోటయ్య గారు శ్రీలంక, బ్రిటన్, చైనా ,హాంకాంగ్ వంటి తదితర దేశాలలో
పర్యటించి చేనేత రంగంలోని అనుభవాలను పరస్పరం పంచుకోవడం చేనేత రంగం పట్ల వారికి గల అవగాహనకు, పరిణతికి తార్కాణం. ప్రముఖ నాయకులు హాజరైన 1937 నిడుబ్రోలు గుంటూరు జిల్లా చేనేత మహాసభ విజయవంతం కావడం ఆయన సారథ్యం వహించడం వల్లనే. చేనేత సంఘం ఎన్నికల్లో డైరెక్టర్గా ఆ రంగముతో సంబంధం లేని వారు కాకుండా 1939 లో జరిగిన మద్రాసు రాష్ట్ర కేంద్ర చేనేత సహకార సంఘం ఎన్నికల్లో చేనేత నాయకులు ఎన్నికయ్యే విధంగా కృషి చేసి సాధించాడు.
బ్రిటిష్ ప్రభుత్వ కాలం 1941లో దేశవ్యాప్త చేనేత రంగం స్థితిగతులను అధ్యయనం చేసేందుకు నియమించబడిన "థామస్ కమిటీని" గుంటూరు జిల్లా కు ఆహ్వానించి వంద పేజీల మెమోరాండం కార్మికుల సమస్యలపై ఆ కమిటీకి అందజేసి
ప్రాతినిధ్య ధోరణికి తెరతీశాడు. 1942లో మద్రాస్ రాష్ట్ర చేనేత పారిశ్రామిక సంఘాన్ని చైతన్యవంతం చేయడంలో ప్రధాన కార్యదర్శిగా నియమించబడి వీరు చేసిన కృషి అభినందనీయం. ఆ సందర్భంలో నూలు కొరతను అధిగమించేందుకు, నూలు ధరలు తగ్గించి స్థిరీకరణ చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా చేనేత రక్షణ యాత్రలు నడిపి చరిత్ర సృష్టించారు. ప్రగడ కోటయ్య గారి నాయకత్వంలో చేనేత పరిశ్రమకు నూలు సరఫరా చేయాలని, నూలు ధరలు అదుపులో ఉంచాలని, నూలు కొరతకు కారణమైన ఎగుమతులను ఆపాలని ఆందోళన చేసినా 1950 వరకు ఎలాంటి మార్పు రాలేదు.
ఆ పరిస్థితులకు నిరసనగా 1950 ఏప్రిల్ 16 నుండి జూన్ 30 వరకు 75 రోజులు సత్యాగ్రహం చేసి పదివేల మంది చేనేత కార్మికులతో ప్రదర్శన నిర్వహించడం తో కేంద్ర చేనేత పరిశ్రమల మంత్రి మద్రాసు వచ్చి చేనేత నాయకులతో చర్చలు జరిపి హామీ ఇస్తే కానీ సత్యాగ్రహాన్ని విరమించని పోరాటయోధుడు , చేనేత నాయకుడు ప్రగడ కోటయ్య గారు.
1953లో చేనేత వర్గ కార్మికుల కోసం రేపల్లె లో సత్యాగ్రహం చేపట్టి జైలు శిక్ష అనుభవించాడు. చేనేత రంగం పై ఏర్పడిన కమిటీ ప్రజావ్యతిరేక సిఫార్సులకు నిరసనగా ఉద్యమించడం మే కాకుండా చేనేత కార్మికులకు ప్రయోజనం కలగడం కోసం సహకార సంఘాలు మాత్రమే పరిష్కారమని నమ్మి ఆ వైపుగా కృషి చేశాడు.
ఆయన ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రాంతంలో ఆనాడు 200కు పైగా చేనేత సహకార సంఘాలు ఏర్పడి అసంఘటిత రంగ చేనేత కార్మికులు వారు నేసిన బట్టలకు సరైన గిట్టుబాటు ధర లభించడానికి, చేనేత రంగంలో విప్లవాత్మక మార్పులకు తన జీవితాంతం కృషి చేసిన ధన్యజీవి ప్రగడ కోటయ్య. ఆనాడు పెంపొందించిన చైతన్యం ప్రభుత్వానికి సూచనలు పునాదిగా నేడు దేశ వ్యాప్తంగా చేనేత కార్మికులకు సంబంధించిన విధానం కొనసాగుతూ కాలానుగుణంగా నూతనత్వాన్ని సంపాదించుకోవడానికి ప్రగడ కోటయ్య గారి కృషిని పునాదిగా విశ్వసించాలి.
రాజకీయ రంగం, ప్రజలు ,ప్రగడ కోటయ్య;:-
**************************
సుమారుగా రెండు దశాబ్దాల పాటు చేనేత రంగంతో పాటు వివిధ రంగాల శ్రామికుల కోసం చేసిన ఈ కృషిలో భాగంగా 1952 నుంచి 62 వరకు వరుసగా రెండు పర్యాయాలు, 57 నుండి 72 వరకు ఎమ్మెల్యేగా, 1974 నుంచి 80 వరకు ఎమ్మెల్సీగా, తరువాత 1990వ నుంచి 95
లో మరణించేవరకు రాజ్యసభ సభ్యునిగా పనిచేసి విభిన్న రంగాల్లో ప్రజలకు తనదైన శైలిలో సేవలు అందించారు. ప్రభుత్వాలను ఒప్పించారు.
52 లో మద్రాసు శాసనసభ ఎన్నికల్లో కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ అభ్యర్థిగా చీరాల నుంచి ఎన్నికై శాసనసభ్యునిగా నే 53 లో చేనేత వర్గాల ప్రయోజనం కోసం వేరే పనిలో సత్యాగ్రహం చేయడాన్ని వారి చిత్తశుద్ధికి నిదర్శనం గా మనం భావించవలసి ఉంటుంది.
చేనేత వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రయోజనం కోసం తన శాసన సభ్యునిగా, ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యునిగా కొనసాగినంత కాలం చీరాల వద్ద 17 వేల ఎకరాలకు పైగా బంజరు భూములను పేద ప్రజలకు పంపిణీ చేసే విషయంలో కాని, సముద్రతీర ప్రాంతంలో సేద్యపు నీటి సౌకర్యం కల్పించడంలో కానీ, చీరాల నెల్లూరు రాజమండ్రి పట్టణాలలో సహకార నూలు మిల్లులు ఏర్పాటు చేయడంలో కానీ వీరు చూపిన కృషి ప్రజా ప్రతినిధిగా ఎన్నైనా సేవలు అందించవచ్చని అట్టడుగు వర్గాల కోసం ప్రజా ప్రతినిధి ఏమైనా చేయవచ్చునని ప్రగడ కోటయ్య గారు రుజువు చేశారు నేటి రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచారు.
వీరి రాజకీయ పరిణతికి, సేవాతత్పరత కు నిదర్శనంగా మెడికల్ సెలక్షన్ కమిటీ సభ్యునిగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా, ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యునిగా పదవీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించిన వీరి చిత్తశుద్ధి నిదర్శనం.
ప్రగడ కోటయ్య జీవితము ,వ్యక్తిత్వం:-
**************************************
ప్రగడ కోటయ్య గుంటూరు జిల్లా నిడుబ్రోలు పట్టణంలో 1915 జూలై 26 వ తేదీన చేనేత వృత్తి చేసుకునే మధ్యతరగతి కుటుంబంలో ప్రగడ వీరభద్రుడు కోటమ్మ దంపతులకు రెండవ కుమారునిగా జన్మించాడు. ఇద్దరికీ ఐదుగురు సోదరులు, ఇద్దరు సోదరిలు. 1931లో ఎస్.ఎస్.ఎల్.సి స్కూల్ ఫైనల్ పాసై కొంతకాలం బాపట్ల తాలూకా బోర్డులో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. వీరి భార్య ఇందిరాదేవి కాదా వీరికి ఆరుగురు కుమార్తెలు ఒక కుమారుడు జన్మించినారు.
వీడు 70వ జన్మదినం సందర్భంగా
చీరాల సభ లో నాటి ఉత్తర ప్రదేశ్ గవర్నర్గా బెజవాడ గోపాలరెడ్డి వీరికి" ప్రజాబంధు" బిరుదును ఇచ్చి సత్కరించడం, వీరి మరణానంతరం వెంకటగిరి లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రగడ కోటయ్య పేరు పెట్టడం వీరి శ్రామిక దృక్పథానికి ,ప్రజా దృక్పథానికి నిదర్శనంగా భావించవచ్చు.
చేనేత రంగం అభివృద్ధికి వీరికి గల స్పష్టమైన అభిప్రాయాలు, సూచనల పట్ల తోటి పార్లమెంటు సభ్యులే కాక, ఉప రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ కూడా ఆసక్తి కనబరచడం నిజమైన ప్రజా నాయకునిగా మనం గుర్తించవచ్చు.
1952లో ఉమ్మడి మద్రాసు శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ప్రగడ కోటయ్య ప్రకాశం పంతులు స్థాపించిన కృషికార్ లోక్ పార్టీ ద్వారా ఎన్నికకాగా శాసనసభలో వీరి చతురతను చూసిన నాటి ముఖ్యమంత్రి రాజాజీ కాంగ్రెస్ పార్టీలో చేరితే మంత్రి పదవి ఇస్తానని మాటిచ్చిన నైతిక విలువలకు ప్రాముఖ్యతను ఇచ్చిన ఆయన ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించి రాజకీయాలంటే పదవుల కోసం కాదని మరోసారి రుజువు చేసిన తెలుగింటి పులి బిడ్డ గుర్తించవచ్చు.
చివరికి అనారోగ్యంతో 1995 నవంబర్ 26 వ తేదీన 80 ఏళ్ల వయసులో రాజ్యసభ సభ్యుడిగా మరణించి ప్రజాసేవలో మిగిలిపోయిన ప్రగడ కోటయ్య గారి వ్యక్తిత్వము, జీవితము, రాజకీయాలు, ప్రజా సేవ, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రత్యేకించి చేనేత రంగాన్ని ఉద్ధరించిన విధానం నేటి ప్రజానీకానికి, సమాజానికి ,రాజకీయ పక్షాలకు, ప్రభుత్వాలకు మార్గదర్శనం కావడమే కాక కనువిప్పు కలిగిస్తుందని వారి పోరాట పటిమను నేటితరం గుర్తించి ఆదరించి ఆచరిస్తుంది అని మనసారా కోరుకుందాం. అప్పుడే వారికి నిజమైన నివాళి అర్పించి నట్లు. అమరుడు ప్రగడ కోటయ్య గారికి చేనేత రంగం ప్రజా రంగం ఉద్యమ జోహార్లు!
( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు, కవి ,రచయిత, విమర్శకులు, వక్త,
అధ్యక్షులు జాగృతి కళాసమితి హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)
[11/26, 20:08] వడ్డేపల్లి మల్లీశం గారు: రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలతో
- వడ్డేపల్లి మల్లేశం అధ్యక్షులు జాగృతి కళాసమితి హుస్నాబాద్.
రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలము వదిన అంబేద్కర్ నాయకత్వంలోని డ్రాఫ్టింగ్ కమిటీ ప్రపంచంలోని వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి తయారుచేసిన రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ కు అప్పగించిన రోజు నేడు. 1949 నవంబర్ 26వ తేదీన అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తు అప్పగిస్తూ ప్రస్తావించిన విషయాన్ని అందరు గమనించ వలసినదిగా విజ్ఞప్తి.
" రాజ్యాంగ యంత్రం పరిధిలో ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కులు రాజ్యాంగ రక్షణ నేపథ్యంలో పాలకులు ప్రభుత్వాన్ని కొనసాగించాలి. సామ్యవాద వ్యవస్థ దిశగా ఓటర్లు ప్రజల మనోభావాలు ఆకాంక్షలకు అనుగుణంగా మెజారిటీ ప్రజానీకం పక్షాన పరిపాలన చేసినంతకాలం ప్రజాస్వామ్య మనుగడకు డోకా లేదు. ఎప్పుడైతే ప్రభుత్వాలు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతూ ప్రజలను నిర్లక్ష్యం చేసి ఉన్నత వర్గాల కొమ్ముకాసిన రోజు ప్రజలు తమ భవిష్యత్తు గురించి ఆలోచించు కుంటారు తమకు హాని కలిగించే వ్యవస్థను విచ్ఛిన్నం చేసి అనుకూలమైన నూతన రాజ్యాంగ వ్యవస్థను ఆవిష్కరించుకుంటారు."
ఇది ప్రజాస్వామిక ప్రభుత్వాలకు చేసిన పెద్ద హెచ్చరిక.
గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వాలు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతూ రాజ్యాంగాన్ని పక్కనబెట్టి తమ జెండాని రాజ్యాంగంగా పరిపాలన చేస్తున్న ఆనవాళ్లు అనేకం. ఇవాళ బీజేపీ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలలో కార్మికుల హక్కులను కాలరాసే మార్పులు చేసి రైతుల హక్కులను కాలరాసే కొత్త బిల్లులను ప్రవేశపెట్టి రైల్వేలు రక్షణ రంగం విమానాశ్రయాలు నౌకాశ్రయాల చివరికి జీవిత భీమాను కూడా ప్రైవేటు పరం చేయడానికి సిద్ధపడ్డారు కేంద్ర ప్రభుత్వ విధానానికి నిరసనగా రాజ్యాంగ దినోత్సవం అయిన నేడే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరగడాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేయాలి.
రైతుల కార్మికుల అట్టడుగు వర్గాల సామాన్య ప్రజానీకం హక్కులకు భంగం కలిగిన రోజు ఇలాంటి సార్వత్రిక సమ్మె ల రాబోయే కాలంలో అనేకము జరుగుతాయి.
ప్రజల కొనుగోలు శక్తి నశించి ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి నెట్టబడిన నేడు కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసి అన్ని వర్గాల రాజ్యాంగపరమైన హక్కులను పరిరక్షించే దిశగా నష్ట నివారణ చర్యలు చేపట్టడం ద్వారా రాజ్యాంగాన్ని ప్రజల ఆకాంక్షను గౌరవించాలి.
- వడ్డేపల్లి మల్లేశం అధ్యక్షులు జాగృతి కళాసమితి సామాజిక విశ్లేషకులు.
కవి వ్యాస కర్త విమర్శకులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ9014206412
[11/27, 21:19] వడ్డేపల్లి మల్లీశం గారు: నేటి మాట 242/27.11.20 శుక్రవారం
కరోనా విస్తరిస్తున్న వేళ జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారానికి జనసమీకరణ అవసరమా? మరింత ప్రమాదం కాదా?
*********************************************
---- వడ్డేపల్లి మల్లేశము,9014206412
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ కు ప్రస్తుత పాలకమండలికె మరింత గడువు ఉన్నప్పటికీ ముందుగానే ఎన్నికలు నిర్వహించడం ప్రభుత్వ ప్రతిపాదనకు ఎన్నికల సంఘం ఆమోదించడం వరుసగా సాగి పోయినప్పటికీ ఎన్నికల ప్రచారంలో మాత్రం పార్టీలు ఒకరికి మించి ఒకరు మరింత రెచ్చిపోయే విధంగా వ్యవహరించడం ముఖ్యంగా జనసమీకరణ భారీగా చేయడం
కరోనా విస్తరిస్తున్న కాలంలో సరైనది కాదు.
హైదరాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో గల ప్రజలు మెజారిటీగా చదువుకున్న వాళ్ళే కావడం చైతన్యం కలిగిన వాళ్లు కావడంతో రాజకీయ పార్టీలు ముఖ్యంగా ప్రజల మౌలిక సమస్యల పైన దృష్టి పెట్టి ప్రజలకు చేరువ కావడానికి కృషి చేయాలి. తమ విధానాలను టీవీల ద్వారా పత్రికల ద్వారా చివరికి పరిమిత సంఖ్య తో కూడుకున్న ప్రచార రథం ద్వారా మాత్రమే నిర్వహిస్తే బాగుండేది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలకు బాగా తెలుసు. అంతకుమించి బాగా తెలిసిన పార్టీలు ప్రజల కోణంలో ఆలోచించి సరైన హామీ ఇవ్వడం ద్వారా కరోనా ను కట్టడి చేయడమే కాకుండా మరింత విస్తృతం కాకుండా ఆపవచ్చు.
మౌలిక సమస్యలు పరిష్కారాలు పై శ్రద్ధ:-
********************************************
ఈ స్థానిక ఎన్నికలు హైదరాబాదులోనే జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రజానీకం యొక్క సమస్యల స్వరూపము కూడా మనకు అవగతమవుతుంది. రాజకీయ పార్టీలు ఎలా కల్లబొల్లి కబుర్లతో ప్రచారం చేస్తాయి. రెచ్చగొట్టే ప్రకటనలతో లబ్ధి పొందుతాయి అనేది మనకు అవగతం అవుతున్నది.
ఒక కోటి 67 లక్షల జనాభా ఈ పరిధిలో ఉన్నట్లుగా గణాంకాలు చెబుతుంటే మౌలిక సమస్యలు ఏ మేరకు పరిష్కారమైన ఎంతవరకు పరిష్కరించవలసిన ఉందో ఎన్నికల సమయంలో నైనా ఆ సర్వే చేయడం ద్వారా ప్రజల మనసులను చూడవచ్చు. ప్రచారానికి ప్రత్యామ్నాయము అదే. లక్ష ఇల్లు నిర్మాణం చేస్తున్నట్లు ప్రకటిస్తే 11,000 మాత్రమే అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తుంది. ఇటీవలి వర్షాల వలన మౌలిక సమస్యల పరిష్కారం కాకపోవడం వల్లనే పెద్ద ముప్పు వాటిల్లింది అన్న విషయాన్ని ప్రజలు ప్రతి పక్షాలు పాలకపక్షం గుర్తించాలి.
రోడ్లు లేని కాలనీలు ,మంచినీటి సరఫరా సరిగా లేని ప్రాంతాలు, ఇంటి స్థలం, ఇల్లు లేని పేద కుటుంబాల పై సమగ్ర సర్వే జరగాలి అది నిజమైన ప్రచారం. ప్రజల చెంతకు వచ్చేది ఎన్నికల సమయంలో ఆ ప్రచారంలో వాగ్దానాలకు సరిపోతే ప్రజల సమస్యలు అడిగేది ఎప్పుడు ?అవగాహన చేసుకునేది ఎప్పుడు? అందుకే ఎన్నికలకు కనీసం ఆరు మాసాలు ముందుగానైనా ప్రజల వద్దకు వెళ్లి తెలుసుకుంటేనే ఎన్నికల సమయంలో ప్రజలకు ఏదైనా మేలు చేయగలుగుతారు లేకుంటే ఆర్బాటాలు ప్రచార హోరు వాగ్దానాలు మిగిలిపోతాయి.
ఎన్నో ప్రాంతాలు చెరువులు అక్రమ కబ్జాకు గురికావడం, నగరానికి పొలిమేరల్లో గల భూములను ఉచితంగా నామమాత్రపు ధరలతో అప్పగించిన వాటిని తీసుకొని పేదవారికి పంపిణీ చేస్తేనే పేదలందరికీ ఇళ్ల స్థలాలు సమకూరుతాయి ఆ మౌలిక సమస్యలను ప్రభుత్వాలు మరచి పోతున్నాయి. అక్రమ నిర్మాణాలు, ప్రణాళికాబద్ధంగా లేని కట్టడాలు, పంది గుడిసెల వంటి నిర్మాణాలలో రోడ్లపై నివసిస్తున్న పేదల సమస్యలు పరిష్కారం అయితేనే ఎన్నికలకు నిజమైన అర్థం. మత విద్వేషాలు రెచ్చగొట్టే బదులు ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించాలని బాధ్యత ఉన్నట్లు పాలకులు ప్రతిపక్షాలు గుర్తించాలి.
జనసమీకరణ కరోనా విస్తరణకు కారణం కాదా:-
*******************((***(
రెట్టించిన ఉత్సాహంతో ఒకరికంటే ఒకరు పైచేయిగా జెండాలు హోర్డింగ్లతో రెచ్చగొట్టే ప్రకటనలతో వేలాదిమంది తరలిరాగా డబ్బు మద్యం ఆశ చూపి ప్రజల వ్యక్తిత్వాన్ని చెడగొట్టే విధానానికి స్వస్తి పలకాలి. రెండవ
విడతగా కరోనా తిరిగి విస్తరిస్తున్న ట్లుగా ముఖ్యమంత్రి గారు ప్రజలను హెచ్చరిస్తూ తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. మరి ఎన్నికల వేళ రాజకీయపక్షాలు ఏమో ఆ నిబంధనను సూచనను పక్కనపెట్టి వేలాది మంది ప్రజానీకంతో ఊరేగింపులు ప్రచారాలు చేయడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లు కాదా!. జన సమీకరణకు సంబంధించిన సినిమా హాలు హోటల్ మిగతా వాటిని అదుపులో ఉంచినప్పుడు రాజకీయ ప్రచారాలకు మాత్రం మినహాయింపు ఇవ్వడంలో అర్థం ఏమిటి? పాలకులే నిబంధనలు ఉల్లంఘిస్తే ఇక ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకునే వారు ఎవరు?
కరోనా నేపథ్యంలో వేలాది మంది చనిపోయిన ఎంతోమంది పేదలు లక్షలాది రూపాయలు ప్రైవేట్ ఆస్పత్రిలో ఖర్చు చేసిన ప్రభుత్వం మాత్రం ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చకపోవడం తో ఎంతో మంది పేదలు వీధిన పడ్డారు. ప్రైవేట్ ఆస్పత్రిలో దోపిడీకి అంతే లేకుండా పోయింది. ప్రజలు కొనుగోలు చేసిన ప్లాట్లను అక్రమ లేఅవుట్లు అని ప్రచారం చేస్తూ కోట్లాది రూపాయలను ముక్కుపిండి వసూలు చేయడానికి సిద్ధంగా ఉన్నది. కరోనా ను ఆరోగ్యశ్రీలో చేర్చడంతో పాటు నామమాత్రపు ఖర్చుతో క్రమబద్ధీకరణ చేయడం ద్వారా పేదల పై పడే ఆర్థిక భారాన్ని తగ్గించే పార్టీలకే ఓటు వేస్తామని ప్రజలు డిమాండ్ చేయవలసిన అవసరం చాలా ఉన్నది. ఎన్నికల వేళ అయినా ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టకపోతే పాలకులు రాజకీయ పార్టీలు ప్రజల చేతిలో చిక్కే అవకాశం తక్కువ.
ఇటీవల బతుకమ్మ దసరా పండుగ సందర్భంలో కరోనా వ్యాపించిన విషయాన్ని గుర్తించి అయినా జిహెచ్ఎంసి ఎన్నికలలో ప్రచారం పరిమితము చేయవలసిన అవసరం ఉంది. మౌలికమైన ప్రజల ఆరోగ్యాన్ని మార్చిన రాజకీయ పార్టీలు ప్రజలను జనసమీకరణ ను ఓట్ల కోసం వాడుకోవడం పట్ల ఎన్నికల సంఘమైన ఆంక్షలు విధిస్తే బాగుండేది.
ఇక ప్రజా ఎన్నికల యుద్ధం ఆసన్నమైనది కనుక తమ సమస్యల పరిష్కారానికి కట్టుబడిన వారికి ఓటు వేయడం ద్వారా ఎన్నికలకు కొత్త నిర్వచనము ఇవ్వవలసిందిగా ప్రజలకు
విజ్ఞప్తి చేస్తున్నారు బుద్ధిజీవులు మేధావులు ప్రజాసంఘాలు.
( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు కవి రచయిత అధ్యక్షులు జాగృతి కళాసమితి హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)
[11/28, 12:53] వడ్డేపల్లి మల్లీశం గారు: L.r.s.,మానవాసంబంధాలు పై పత్రిక ,నినాధం,నమస్తే లలోప్రచురితమైన నా వ్యాసాలు.
వడ్డేపల్లి మల్లేశము9014206412
[11/28, 18:40] వడ్డేపల్లి మల్లీశం గారు: నేటి మాట 243/28.11.20 శనివారం
అసమానతలపై ధిక్కార స్వరం, కులాధిపత్యం పై ఎగరేసిన బావుటా, సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే.
*********************************************
--- వడ్డేపల్లి మల్లేశము,9014206412
తరతరాలుగా పరాయి పాలన కు గురైన భారత దేశంలో సంస్కృతి, సాహిత్య, సామాజిక, ఆర్థిక రంగాలు సంఘర్షించు
కున్న కారణంగా అనేక సంక్షోభాలకు గురైన సమాజం అనివార్యంగా సంస్కరించుకోవాలి సిన అవసరం ఏర్పడినది. ఆంగ్లేయులు, మొగల్ చక్రవర్తులు , ఆర్యులు పాలకులు ఎవరైనా ఈ దేశాన్ని వలస ప్రదేశంగా ఒక మార్కెట్ గా ప్రయోగాత్మక కేంద్రంగా వాడుకోవడం వలన దేశంలోని రాజ్యాల మధ్య ఐక్యత లేని సందర్భంలో భారతదేశంలోని భౌగోళిక రాజ్యాలన్నీ చాలా నష్టానికి గురైన వి.
ఈ క్రమంలో కులం మతం వర్ణం వర్గం భాష లింగ భేదాల లో అనేక అంతరాలు ఏర్పడి వర్గ సంఘర్షణకు , కులాధిపత్యం కి దారితీయడంతో తదనంతర కాలంలో ఈ అపసవ్య లను సంస్కరించు కొనవలసిన అవసరం ఏర్పడింది. ఆధునిక కాలానికి సంబంధించి 19వ శతాబ్దములో పూలెతో ఈ సంస్కరణ ప్రారంభమైనట్టుగా విజ్ఞులు చెబుతుంటారు.
భారతీయ సామాజిక విప్లవకారుడు
పూలే:-*
*****************************************
జ్యోతిరావు గోవిందరావు పూలే గా పిలువబడే జ్యోతిబాపూలే మేధావి, కుల వ్యతిరేక సామాజిక సంస్కర్త ,సామాజిక రచయిత. అంటరానితనం ,కుల వ్యవస్థ నిర్మూలన తో పాటు, అట్టడుగు వర్గాలకు సమాన హక్కులు సాధించడానికి 1873 సెప్టెంబరు 24న సత్యశోధక సమాజాన్ని స్థాపించి అన్ని మతాలు, కులాల ,వర్గాల కోసం సేవ చేశారు. భారతదేశంలో మహిళా విద్యను ప్రారంభించడానికి భార్య సావిత్రిబాయి పూలే తో కలిసి పాఠశాల 1848లో పూనాలో ఏర్పాటుచేసి వితంతువుల కోసం ప్రత్యేక సంస్థను స్థాపించి విద్య యొక్క ఆవశ్యకత ను గుర్తించిన మొదటి సంస్కర్త పూలే.
భారత ప్రథమ సామాజిక తత్వవేత్త:-
***************************₹₹₹₹₹**
చిన్నప్పటి నుండి మానవ హక్కుల ప్రాథమిక సూత్రాలపై జ్ఞానాన్ని సంపాదించిన పూలే కు శివాజీ అంటే అభిమానం ఎక్కువ.
శివాజీ జార్జ్ వాషింగ్టన్ లజీవిత చరిత్రలు ప్రభావితం చేయడం వల్ల దేశ భక్తి నాయకత్వ లక్షణాలు సామాజిక చింతన అలవడిన వి.
థామస్ రచించిన మానవ హక్కులు అనే పుస్తకం అతని ఆలోచనలను తీవ్రంగా ప్రభావితం చేసినది. అమెరికా స్వాతంత్ర్య పోరాటం ఇతర జాతుల పోరాటాలు ఆయనను మానవత్వపు విలువలు అయిన స్వేచ్ఛ సమానత్వం గురించి లోతుగా ఆలోచింప చేయడంతోపాటు గులాంగిరి సత్యశోధక సమాజ నివేదిక తృతీయ రత్న చత్రపతి శివాజీ వంటి అనేక రచనలు చేయడానికి దారి తీసింది.
1948లో జరిగిన తన బ్రాహ్మణ స్నేహితుడి వివాహంలో పూలే బిసి మాలి కులానికి చెందినవాడు అవడంవల్ల కుల వివక్షకు గురై నాటి నుండి కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడాలని నిశ్చయించుకున్నాడు. కుల విధానంలో బ్రాహ్మణులను విమర్శించడమే కాకుండా సమాజంలో వారి ఆధిపత్యాన్ని వ్యతిరేకించాడు జ్ఞాన సంపదకు అందరికీ అవకాశం ఇవ్వక పోవడానికి ఆయన అభ్యంతరం తెలిపాడు. బాలికల పాఠశాలలో అంటరాని వారికి కూడా బోధించవలసి రావడంతో బోధించడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో తన భార్య సావిత్రిబాయి కి విద్య నేర్పి ఆమెనే ఉపాధ్యాయులు గా నియమించి చదువు చెప్పించడం మే కాకుండా బ్రిటీష్ ప్రభుత్వం విద్య నిర్లక్ష్యం చేయడాన్ని పూలే సగర్వంగా విమర్శించాడు
సామాజిక అంశాలు పూలే భావనలు
*****************************?*????
సమాజ కట్టుబాట్లను నిరాకరించిన పూలే స్వయంగా వితంతువులకు వివాహాలు జరిపించాడు. వితంతువైన గర్భిణీ స్త్రీలకు అండగా నిలవడంతో పాటు వారి కోసం స్థాపించిన కేంద్రంలో జన్మించిన ఒక బ్రాహ్మణ వితంతువు కుమారుని పూలే దత్తత తీసుకుని పెంచుకున్నాడు. సత్యశోధక సమాజం స్థాపన దేశంలోనే మొట్టమొదటి సంస్కరణోద్యమం. శూద్రులను బ్రాహ్మణ చెర నుండి కాపాడటమే ఈ ఉద్యమం యొక్క లక్ష్యం అని ప్రకటించి కులమత వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి సభ్యత్వం కల్పించారు. వేదాలను పవిత్రంగా భావించడాన్ని పూలే వ్యతిరేకించడంతో పాటు విగ్రహారాధనను ఖండించాడు స్త్రీ పురుషుల మధ్య లింగ వివక్షతను పూలే విమర్శించి సమానత్వం స్వేచ్ఛ ఐకమత్యంతో కూడిన సమసమాజాన్ని ఆకాంక్షించాడు.
సాహిత్య రంగంలో కృషి:-
*************************
1869 లో పౌరోహిత్యం యొక్క బండారం అనే పుస్తకం రాసి 1977లో సత్యశోధక సమాజం తరఫున దీనబంధు పత్రికను ప్రారంభించాడు. 1980లో భారత ట్రేడ్ యూనియన్ ఉద్యమ పితామహుడు లోకం తో కలిసి రైతులు కార్మికులు చేతివృత్తుల వారిని సంఘటితం చేసేందుకు ప్రయత్నించి నాడు. 1873లో ఆనాటి పరిస్థితులకు అద్దం పట్టే సామాజిక చిత్రాన్ని గులాంగిరి అనే పుస్తకం పేరు తో ప్రచురించాడు
పూలే కొన్ని సూచనలు:-
**********************************
ప్రతి గ్రామంలోనూ శూద్రులకు పాఠశాలలు కావాలి కానీ వాటిలో బ్రాహ్మణ ఉపాధ్యాయులు ఉండరాదు అన్నాడు దుర్మార్గమైన కులవ్యవస్థ సమూలంగా నిర్మూలన కావాలని ప్రచారం చేస్తూనే భారతదేశంలో కులం గురించిన సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా రూపొందించిన తొలి దార్శనికుడిగా పూలే చరిత్రలో మిగిలిపోయాడు. దేశమనే దేహానికి శూద్రులు ప్రాణం రక్తనాళాల వంటి వాళ్లని, హిందూ సమాజంలో అగ్రకులాల వారికి బానిసలుగా బ్రతుకుతున్న కింది కులాల వారిలో తమ బానిసత్వం పట్ల ఆయన చైతన్యం రగిలించి భారతదేశానికి సామాజిక ప్రజాస్వామ్యం అందించడమే తక్షణ కర్తవ్యమని సందేశాన్ని ఇచ్చాడు. సమాజంలోని వెనుకబడిన వర్గాల ప్రజలు మహిళల అభివృద్ధి కోసం అనంతరం చేసిన సేవలకు గాను ఆయనకు ప్రజలు మహాత్మా బిరుదును సగౌరవంగా అందించారు.
పూలే జీవిత నేపథ్యం:-
*******((*****(((*************
జ్యోతిరావు గోవిందరావు పూలే మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని kanhawadi ప్రాంతంలో తోటమాలి కులానికి చెందిన గోవిందరావు కుటుంబంలో జన్మించారు. కూరగాయలు అమ్మే వీరు పీష్వా కాలంలో పూలు అమ్మడం వల్ల ఇంటి పేరు పూలే గా మారినట్లు చెబుతున్నారు. సంవత్సరం వయసులోనే తల్లి చనిపోవడంతో స్థానిక మరాఠీ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించాడు. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో చదువును మధ్యలో చాలించి తండ్రికి ఆసరాగా పనికి పోయేవాడు. ఆయన ఆసక్తిని గమనించిన ఇంటి ప్రక్కన ఉండే క్రైస్తవ పెద్దమనిషి జ్యోతి రావు పూణే లో మిషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలో తండ్రిని ఒప్పించి చేర్పించారు. విద్యార్థిగా ఉన్న టుడే పలు పుస్తకాలు అధ్యయనం చేయడం గురువుల సహచర్యం వలన వీరిలో సామాజిక చింతన సంఘసంస్కరణ అభిలాష పెరిగింది. 13 ఏళ్ల ప్రాయంలో జ్యోతిరావు కి తొమ్మిది సంవత్సరాల సావిత్రి తో వివాహం జరిగింది.
సత్యశోధక్ సమాజ్ నిర్వహణలో సంఘసంస్కరణ కార్యక్రమంలో పూలేకు సావిత్రిబాయి తోడుగా నిలవడంతో మహిళా పాఠశాలలను మహిళా సంస్థలు నెలకొల్పడంలో సావిత్రిబాయి కృషి కూడా ఎనలేనిది. మహిళలకు ఏర్పాటుచేసిన పాఠశాలలో తొలి ఉపాధ్యాయురాలిగా సేవలందించిన సావిత్రిబాయి అని నేడు తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా దేశం గుర్తించవలసిన అవసరం ఎంతో ఉన్నది.
సమసమాజ స్థాపన కోసం అంతరాలు లేని వ్యవస్థ కోసం నిమ్న వర్గాల సాధికారత కోసం మహిళల కోసం అనేక పాఠశాలలు ఏర్పాటు చేసి వితంతువులను ప్రోత్సహించి ఆత్మస్థైర్యాన్ని నింపిన పూలే దీర్ఘకాలిక వ్యాధితో అనారోగ్యం పాలై 1890 నవంబర్ 28వ తేదీన తనువు చాలించాడు.
వందల 91 లో జన్మించిన అంబేద్కర్ పూలే జీవితము సాహిత్యము అధ్యయనం చేసిన అనంతరం కుల నిర్మూలన లోను బ్రాహ్మణ ఆధిపత్యాన్ని దిక్కరించి లోనూ సమసమాజ స్థాపన లోనూ ఆదర్శ నిలిపిన జ్యోతిబాపూలే తనకు తానే స్వయంగా ప్రకటించుకోవడం ని మనము ఇక్కడ గమనించ వలసి ఉంది. పూలే అంబేద్కర్ ఆశయాలు సేవలు జీవిత చరిత్రను ఏ మేరకైనా మనము పాటించడం ద్వారా సమసమాజ స్థాపన లో మన వంతు పాత్రను పోషించాల్సిన అవసరం ఉంది కావలసింది మనలో స్పందన స్వార్ద చింతన లేని సామాజిక జీవితం.
( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు కవి రచయిత అధ్యక్షులు జాగృతి కళాసమితి హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం).
[11/29, 22:37] వడ్డేపల్లి మల్లీశం గారు: నేటి మాట 244/29.11.20 ఆదివారం
సామాజిక రుగ్మతల నిర్మూలనలో కవులు కళాకారులు-- సమాజం గురించి ఆలోచించే వారంతా కవులు సామాజిక కార్యకర్తలే....
********************************************
--- వడ్డేపల్లి మల్లేశము,9014206412
సమాజము చలనశీల మైనది. భిన్న ఆకాంక్షలు, విభిన్న రుచులు, సంస్కృతులు, సాంప్రదాయాలు, అలవాట్లు తత్వాలు కలిగి ఉన్న మనుషులతో మానవ సమాజం నిర్మితమవుతుంది. ఇక కులమతాల విషయం భారతదేశంలో మరీ ప్రత్యేకమైనది. చిన్నతనంలో ఏకత్వాన్ని సాధించే క్రమంలో అంతరాలు, అసమానతలు, వివక్ష ,పేదరికం, నిరుద్యోగం ,ఆకలిచావులు ,ఆత్మహత్యలు,
పాలకుల నిర్లక్ష్యం పెట్టుబడిదారుల అక్రమ ఆర్జన స్వార్థ ప్రయోజనము పేద వర్గాలకు అట్టడుగు వర్గాలకు శాపంగా పరిణమిస్తోంది.
ఈ క్రమంలోనే అనేక సామాజిక రుగ్మతలు, సామాజిక సంక్షోభాలు తారసపడుతున్నవి. ఈ క్రమంలో సమాజాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకొని తమదైన శైలిలో సామాజిక చింతన తో త్యాగ పూరితంగా ఆలోచించినప్పుడు సమాజానికి అదనంగా కొంత మేలు జరిగే అవకాశం ఉంది . ఇక ఉన్నత వర్గాలు ప్రభుత్వాలు ప్రజలను పూర్తిగా పట్టించుకుంటే ప్రజల ఇబ్బందులు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. ఇక్కడ కావలసినది సామాజిక బాధ్యతతో పని చేసే ప్రభుత్వాలు, వ్యక్తులు, samuhalu, సమాజము, ప్రజాసంఘాలు, రాజకీయ పక్షాలు.
నేరాలు-ఘోరాలు సామాజిక రుగ్మతలు- నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి....
*******************************************
// సమాజంలోని బుద్ధిజీవులు, మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, కవులు, కళాకారులు, రచయితలు సమాజాన్ని నిరంతరం పరిశీలిస్తూ ఉండాలి. పేద ప్రజలకు అట్టడుగు వర్గాలకు అండగా ఉన్నప్పుడు ప్రభుత్వాలు కూడా దిగి వచ్చి ప్రజలను పట్టించుకుంటాయి. ఉన్నత వర్గాలు పెట్టుబడిదారుల ఆధిపత్యము దోపిడీ పీడన కూడా తగ్గుతుంది. పార్లమెంటు రాష్ట్రాల చట్టసభలు ఎన్ని చట్టాలు చేసినా అవి ఉన్న వర్గాలకే చుట్టాలుగా మారిపోవడంతో సామాన్యులు రాజ్యాంగ పరంగా రక్షణలు ఎన్నునా వంచించబడుతున్నారు
సామాజిక చింతన సర్వరోగనివారిణి:-
******************************************
తరచుగా సామాజిక రుగ్మతల పైన సమరభేరి మ్రోగించిన ఇది కవులు కళాకారులు అని వారి రచనల ద్వారా పాఠకులు అధ్యయనం చేయడం ద్వారా సమాజం చైతన్యవంతమై మూలాలను వెతికి పరిష్కారానికి చేరువ అవుతారని సాహిత్యము కవుల గురించి సమాజంలో పెద్ద ప్రచారం ఉన్నది దానిని కాదనలేము. కవులు తమ రచనల ద్వారా కళాకారులు తమ ప్రదర్శన ద్వారా ప్రజలను జాగృతం చేయడంలో ముందుంటారు. అయితే సమాజాన్ని నిశితంగా పరిశీలించి సమాజం కోసం తమ వంతు త్యాగం చేయడానికి సిద్ధపడే ప్రతివారు కవులు కళాకారులు సామాజిక కార్యకర్తలు అవుతారు. ఈ అవగాహన సమాజంలో పెంపొందించ వలసిన అవసరం చాలా ఉన్నది. కవులు తమ ఏదో ప్రత్యేక వర్గం అని తాము మాత్రమే ఈ సమాజంలో ఉన్నతంగా పనిచేసి సమాజ మార్పు దోహదపడతాము అనే భావన నుండి సమాజంలోని భిన్న వర్గాలను కూడా కలుపుకుపోయే దిశగా కృషి చేయాలి. మార్పును కోరడం సమాజము ఉన్న స్థితి నుండి మరింత ఉన్నత స్థాయికి చేరడానికి ఆరాటపడడం ఆ వైపుగా చట్టాల అమలులో గాని న్యాయం అమలు లో గాని అట్టడుగు వర్గాలకు అండగా భరోసాగా నిలబడే వారంతా రచయితలు కవులు సామాజిక కార్యకర్తలే అవుతారు. అంటే సమాజంలోని ఉత్సాహవంతులైన కార్యకర్తలు కవులు కళాకారుల తోని కలుపుకు పోవడం కవులు సమాజ చైతన్యం కోసం మార్పు కోసం సామాజిక కార్యకర్తలను తమ స్రవంతిలో కలుపుకోవడం ద్వారా మాత్రమే సామాజిక రుగ్మతలను నేరాలు-ఘోరాలు ను అదుపు చేయడంతో పాటు సమసమాజ స్థాపన దిశగా సమాజాన్ని తీసుకెళ్ల గలుగుతాము.
( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు కవి రచయిత ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు అధ్యక్షులు జాగృతి కళాసమితి హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)
[11/30, 21:47] వడ్డేపల్లి మల్లీశం గారు: నేటి మాట 245/30.11.20 సోమవారం
ఢిల్లీలో రై-తుల నిరసన ఆగ్రహ ప్రదర్శన ఢిల్లీ దిగ్బంధం- షరతులను నిరాకరించిన రైతాంగం రైతు వ్యతిరేక చట్టాలు విరమించుకోవాలని విజయవంతమైన చలో ఢిల్లీ.
*****************************************
ఒకనాడు అసంఘటిత రంగం గా పేదవారి కోపం పెదవికి చేటు అనే విధంగా చూడబడిన రైతాంగం యొక్క అగ్రహావేశం
కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలను దిక్కరించి స్థాయికి భారత రైతాంగ జనం ఎదగడం హర్షనీయం అభినందనీయం. కేంద్ర ప్రభుత్వ రైతు కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు ఇటీవలనే దేశ వ్యాప్తంగా నవంబర్ 26వ తేదీన సార్వత్రిక సమ్మె జరిగిన విషయం మీకందరికీ తెలిసిందే. నేడు భారత దేశాన్ని పాలిస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం పిట్టలను కొట్టి రాబందుల కడుపు నింపే, కార్పొరేట్ల కొమ్ముకాసే విధానానికి చరమగీతం పాడడానికి భారతదేశంలోని అన్ని వర్గాలు ఒక తాటి పైకి రావడం శుభసూచకం.
కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ధిక్కరిస్తూ గత అనేక సంవత్సరాలుగా సార్వత్రిక సమ్మె కార్మికులు. వామపక్షాల ఆధ్వర్యంలో కొనసాగుతున్నది. గత ఆరు సంవత్సరాలుగా బిజెపి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ లాభాల్లో ఉన్న సంస్థలను కూడా కార్పొరేట్ల విషకౌగిలి కెచేర్చడాన్ని భారత దేశ ప్రజానీకం తో పాటు ప్రపంచం యావత్తూ ఒక కంట కనిపెడుతూనే ఉన్నది.
చమురు సంస్థలు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, ఇన్సూరెన్స్ కంపెనీలు, బొగ్గు గనులు, రైల్వేలు, రక్షణ రంగం అంతరిక్ష రంగం తోపాటు అన్ని రంగాలలో కూడా క్రమంగా నేటి కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుకు ధారాదత్తం చేసి సామాన్యులు పొట్టి కొట్టే విషమ పరిస్థితుల నుండి ఛాలెంజ్గా సవాల్ విసిరిన టువంటి సార్వత్రిక సమ్మె మొదటిది అయితే, రైతు వ్యతిరేక చర్యల పై అమీతుమీ తేల్చుకోవడానికి, రైతు వ్యతిరేక చట్టాలను విరమించుకునేలా ఒత్తిడి చేయడానికి 32 రైతు సంఘాలు ఏకమై నిర్వహిస్తున్న ప్రజా పోరాటం రెండవ మహాసంగ్రామం గా చెప్పుకోవచ్చు.
చలో ఢిల్లీ రైతాంగ పోరాటం ఎందుకు:-
********************************
గతంలో గిట్టుబాటు ధర కోసం రైతు సాయం పెట్టుబడి వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని గతంలో కొనసాగించిన చరిత్ర భారత రైతు సంఘాలకు ఉన్నది. ఈసారి ముఖ్యంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకంగా 3 బిల్లులను ఆమోదించిన విషయంలో విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఏకైక డిమాండ్ తో గత గురువారం నుండి దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ముఖ్యంగా హర్యానా పంజాబ్ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల నుండి వేలాదిగా తరలివచ్చిన రైతులు ఢిల్లీ శివార్లలోని సింగ్ , టిక్రీ సరిహద్దుల్లో బైఠాయించి తమ డిమాండ్లు నెరవేర్చే వరకు కదిలే ప్రసక్తి లేదని సవాల్ విసరడం దేశమంతా గమనిస్తున్న విషయం. ఢిల్లీలోని సంత్ నిరంకారీ మైదానానికి వెళ్లి నిరసన వ్యక్తం చేసినట్లు అయితే చర్చలు జరపడానికి కేంద్ర మంత్రివర్గం సిద్ధమని హోం శాఖ మంత్రి తో పాటు హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ బల్ల నిరసన లో పాల్గొంటున్న 32 రైతు సంఘాల ను ఉద్దేశించి లేఖన పంపించగా నిరంకారీ మైదానం ఒక జైలు తలపిస్తుందని ఇక్కడే నిరసన వ్యక్తం చేయడం ద్వారా కేంద్రం దిగివచ్చి బిల్లులను ఉపసంహరించుకోవాలని భేషరతుగా అంగీకరించాలని డిమాండ్ చేస్తున్నారు.
పిల్ల జిల్లా ముసలి వాళ్ళ తో సహా ట్రాక్టర్లు ఇతరత్రా వాహనాలలో తినుబండారాల తో సహా వచ్చిన మని ఎన్ని రోజులైనా నిరసనకు సిద్ధమని చెప్పడం రైతు లోని ఆత్మ విశ్వాసానికి ప్రతీకగా భావించాలి. ఈ రైతాంగ సమ్మెకు మద్దతుగా ఉత్తరప్రదేశ్ రైతులు కూడా సంఘీభావం ప్రకటించారు. నిరంకారీ మైదానం కాదని జంతర్మంతర్ వద్ద ధర్నాకు అనుమతి ఇవ్వాలని మైండ్ చేయడంతోపాటు ఒకవైపు nirankari గ్రౌండ్లో రైతులు నిరసన కొనసాగుతుండగా మరోవైపు రైతుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 3వ తేదీన రైతు సంఘాలు చర్చలకు ఆహ్వానించింది.
మరొకవైపు సార్వత్రిక ఉద్యమంగా రూపుదిద్దుకుంటున్న తరుణంలో హర్యానా లోని పలు కుల సంఘాలు రైతుల నిరసన కు మద్దతు ప్రకటించడంతో పాటు ఢిల్లీ సిల్క్ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ ఆహారము అందజేసి రైతుల నిరసన లకు మద్దతు తెలుపుతున్నది. మరొక వైపు పంజాబ్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత అమరేందర్ సింగ్ రైతులకు దగ్గరుండి అన్ని రకాల సౌకర్యాలు సమకూర్చుకున్న గా రైతుల ఆందోళనకు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట కూడా మద్దతు తెలపడం రోజురోజుకు రైతుల పోరాటానికి మద్దతు తెలుపుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం వెన్నులో చలి పుట్టింది.
ఒకవైపు ప్రధానమంత్రి సాగు చట్టాలతో రైతులకు లాభం ఉంటుందని, దశాబ్దాల సమస్యలకు కొద్ది సమయంలోనే పరిష్కారం చూపిన ఘనత తమ బీజేపీ ప్రభుత్వానిదేనని, గత ఎన్నో ఏళ్లుగా రైతులు చేస్తున్న డిమాండ్లు, సమస్యలను ఈ చట్టంతో ప్రభుత్వం నెరవేర్చి నట్లు అయిందని ప్రధానమంత్రి అనడం రైతాంగాన్ని తప్పుదోవ పట్టించడమే నని పలు రైతు సంఘం నాయకులు విమర్శిస్తున్నారు.
ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఢిల్లీలోనే ఉంటామని ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు ట్రాక్టర్లు ట్రాలీలు వాహనాల్లోనే నిదురిస్తున్నట్లు చెబుతున్న రైతు సంఘం నాయకులు పోలీసులు హెచ్చరిస్తునప్పటికీ వారిని ఖాతరు చేయడం లేదు సరికదా ఆదివారం సమావేశమైన రైతు సంఘం నాయకులు తదుపరి ఉద్యమ కార్యాచరణను ఖరారు చేస్తామని భారతీయ కిసాన్ యూనియన్ నేత బల్ జిత్ సింగ్ మహల్ ఉద్యమ విజయం పట్ల ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఆమోదించిన చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, పేదలు రైతుల మెడలకు ఉరితాళ్లు గా మారనున్న వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
- రైతు ఖర్చులు అన్నింటికీ 50 శాతంగా అదనంగా కలిపి దేశవ్యాప్తంగా ఒకే మద్దతు ధర ఉండే విధంగా ప్రభుత్వం నిర్ణయించాలని ఆదర్శ రైతుకు అందేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.
- కార్పొరేట్ రాబందులు వ్యవసాయ రంగం లోకి వచ్చినట్లయితే తమ భూమి లో రైతులు కూలీలుగా మారవలసి ఉంటుందని కార్పొరేట్ వ్యవసాయం రాకుండా రైతు చేతుల్లోనే ఉండేవిధంగా రక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
రైతు చట్టాలు రైతులకు వ్యతిరేకమా ఎలా?
************************************
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టాలు గా మార్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలు రైతుల పాలిట గుదిబండలా మారిన నేపథ్యంలో రాబోయే ప్రమాదాలను అడ్డుకోవడానికి ముఖ్యంగా ఈ చలో ఢిల్లీ రైతాంగ పోరాట కార్యక్రమం రూపుదిద్దుకున్నది.
- చట్టం నెంబరు 1:-
*********************
ఈ చట్టం ప్రకారం గా రైతులు కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవాలని ఉంటుంది ఏటా ఒప్పందాన్ని పొడిగించుకుంటూ ఐదు సంవత్సరాలు కొనసాగించే దీని ప్రకారం బయటి మార్కెట్లో ఒప్పందానికి మించిన ధరలు ఉన్నాకూడా బయట అమ్ముకోవడానికి వీలు లేదు కార్పొరేట్ లకే వాళ్ళు పెట్టిన ధరకే అమ్మాయి ఉంటుంది అనేక సాకులతో మన్యం ధరను తగ్గించుకున్న రైతులు నష్టపోవాల్సి ఉందే కానీ ప్రభుత్వం, అధికారులను అడిగే అవకాశం ఉండదు. ప్రజల రైతుల సంక్షేమాన్ని చూసే ప్రభుత్వం తన పాత్ర కోల్పోయి నందున కోర్టుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి రైతులకు దాపురించే వచ్చు. అప్పులు కూడా కార్పొరేట్ సంస్థలే ఇస్తాయి తాకట్టు పెట్టిన ఆస్తులు ఆ సంస్థ తీసుకొని అప్పులు తీర్చలేక పోతే భూములను కోల్పోవలసి ఉంటుంది.
అంతేకాకుండా ఏ పంట వేయాలో కార్పొరేట్ సంస్థ నిర్ణయించే దుస్థితి దాపురించ డంతో
అనివార్యంగా ఒక రైతు తన పొలంలో తానే కూలీగా పని చేయవలసిన దౌర్భాగ్యం దాపురిస్తుంది. దీని ప్రకారం రైతుల యొక్క పరిస్థితి ఎంత దారుణంగా దిగజారుతాయి మనం అర్థం చేసుకోవచ్చు అందుకే ఈ పోరాటం.
చట్టం నెంబర్ 2:-
*****************
రైతులు తమ ఉత్పత్తులను ప్రైవేటు రంగంలో దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు అని చెబుతున్నప్పటికీ, వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని ఈ చట్టం చెప్పడం ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించి పూర్తిగా ప్రైవేటుకె తాకట్టు పెట్టడమే. ఇక ప్రభుత్వం మార్కెట్లు పక్కదారి పట్టి ప్రైవేటు రంగం మార్కెట్ యాడ్ లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా చేసే కొనుగోళ్లపై ప్రభుత్వ నియంత్రణ ఏమాత్రం ఉండదు. కొనుగోలు అమ్మకం విషయంలో ప్రైవేటు రంగం పాత్ర పోషిస్తుంది కనుక రైతులకు ప్రభుత్వం ద్వారా పొందే మద్దతు ధర, రక్షణలు, ప్రయోజనాలు రైతులు కోల్పోవలసి ఉంటుంది. అంతేకాకుండా రైతుల వద్ద నుండి కొనుగోలు చేసినందుకు ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం నుండి రాయితీలు వస్తాయి. మార్కెట్ యార్డ్ ల తో పని లేని కారణంగా హమాలీలు, ఉద్యోగులు తమ పదవులను కోల్పోయి నిరుద్యోగులుగా మారుతారు ఇది ఈ రెండవ చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు చేస్తానన్న మేలు. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వమేనా? 2006లోనే బీహార్ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలోని వ్యవసాయ మార్కెట్ లను రద్దు చేయడం ద్వారా అనేక మంది ఉపాధి కోల్పోవడంతో పాటు అక్కడి రైతులు కార్పొరేట్ల వలలో చిక్కి శల్యమై పోతున్నారు. ఈ దుస్థితిని మనం గమనించే పోరాడవలసిన అవసరం అనివార్యంగా రైతులకు ఏర్పడింది
చట్టం నెంబర్ 3
********************
ప్రభుత్వ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు ధరల నియంత్రణకు సంబంధించిన 1955 చట్టానికి చేసిన సవరణ చట్టం ఇది.
ఈ చట్టం ప్రకారం బియ్యం, గోధుమలు, జొన్నలు, రాగులు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు ఆలుగడ్డలు, ఉల్లిగడ్డ నిత్యావసర సరుకులు ప్రభుత్వ నియంత్రణ నుంచి తొలగించబడినవి. అంటే వీటి ధరలను ప్రభుత్వం ఇక ఏ మాత్రం నియంత్రించలేదు.
కార్పొరేట్ కంపెనీలు కాంట్రాక్టర్లు వీటి ధరలను ఇష్టమున్నట్టు గా పెంచి ఎక్కువ ధరలకు అమ్ముకొని వినియోగదారులను మోసం చేసే ప్రమాదం ఉండగా తక్కువ ధరలకు ఉత్పత్తులను కొని రైతులను కూడా మోసం చేసే ప్రమాదం ఉన్నది.
ఇంతవరకు వెబ్సైట్ గోదాములలో కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు నిల్వ ఉంచే అవకాశం ఆ బాధ్యతను ప్రభుత్వం నిర్వహిస్తున్నది . ఈ చట్టం ప్రకారం ఎఫ్సీఐ సంస్థను ఎత్తివేసే ఆలోచన ఉండడంతో ఇప్పటికే కోట్ల మంది అర్ధాకలితో మాడి పోతుండగా ఇక నిల్వ చేసే సామర్థ్యం లేక ఎఫ్సీఐ మూతపడి ప్రభుత్వం దగ్గర నిలబడి ఉండగా ప్రైవేటు రంగం ప్రజల గురించి పట్టించుకోని కారణంగా క్రమంగా ప్రజాపంపిణీ వ్యవస్థ రేషన్ షాపులు కనుమరుగై పూర్తిగా ప్రైవేటు రంగంలో కొనుగోలు చేయాల్సిన దుస్థితి దాపురించే అవచ్చు అప్పుడు రైతులకు వినియోగదారులకు ఇరువర్గాలకు ఇబ్బందే.
ఇంత బాధ్యతారాహిత్యంగా కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రజలను, రైతులను, కొనుగోలుదారులను కార్పొరేట్లకు అప్పజెప్పి దుష్ట సంప్రదాయానికి నిర్ణయానికి ఒడి కట్టడంతో, ప్రభుత్వ రంగంలో ప్రపంచంలోనే అత్యున్నత సంస్థ గా పేరుగాంచిన జీవిత బీమా సంస్థలు కూడా ప్రైవేటు అమ్మడానికి కేంద్రం నిర్ణయం తీసుకున్న ఈ వేళ ఈ దేశము లోని ప్రజల సంపద కనుమరుగయ్యే ప్రమాదం ఉండటంతో నేడు రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా అన్ని వర్గాల ప్రజలు ప్రజా సంఘాలు రాజకీయ పక్షాలు మద్దతు ఇవ్వడం ద్వారా ఈ పోరాటంలో విజయం సాధిస్తేనే రైతు చట్టాలను ఉపసంహరించుకునే విధంగా ఒత్తిడి చేసి ప్రభుత్వాన్ని ఒప్పిస్తే భవిష్యత్తు ప్రజలది. ఈ పోరాటంలో ఓడిపోయి మామా ప్రతి రంగాన్ని ప్రైవేటుపరం చేస్తే రాబోయే పరిణామాలకు ప్రజలందరూ కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది. కనుక పాలకులు ప్రజలకు సేవకులుగా ప్రజలను ప్రభువులుగా చూసే ప్రభుత్వాలకే మద్దతు ఇద్దాం ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడే ప్రభుత్వాలను వ్యతిరేకిద్దాం.
ఈ సందర్భంగా అంబేద్కర్ రాజ్యాంగం గూర్చి అన్న మాటలు శిరోధార్యం. "రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పాలకుడైన ప్రజలైనా దేశద్రోహు లే". ఈరోజు ప్రభుత్వం రాజ్యాంగాన్ని పక్కనపెట్టి సొంత ఎజెండాను అమలు చేయడం ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నవేళ దేశ ప్రజానీకం జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంది. ప్రజా వ్యతిరేక విధానాలను న్యాయస్థానాల్లో, ఉద్యమాల ద్వారా తిప్పి కొట్టడం ద్వారా నిజమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అనివార్యంగా ఏర్పడింది.
"రైతు కార్మిక ప్రజా ఉద్యమాలకు మద్దతు ఇద్దాం"
"ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించు కుందాం".
" ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏర్పడిన ప్రమాదాన్ని తిప్పికొడదాం".
( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు అధ్యక్షులు జాగృతి కళాసమితి కవి రచయిత సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)
[12/1, 19:52] వడ్డేపల్లి మల్లీశం గారు: తెలుగు సాహిత్య క్షేత్రాన్ని సుభిక్షం చేసిన మానవతావాది గురజాడ అప్పారావు
-----------------------------------------------
------ వడ్డేపల్లి మల్లేశము,9014206412
చారిత్రక పరిణామ క్రమంలో సమాజము ద్వారా అనేది సమాజం కోసం మేలు చేసిన వారు చరిత్రకు ,ప్రజలకు కృతజ్ఞతలు గా ఉండాల్సిందే. గురజాడ వర్తమానానికి భవిష్యత్తుకు అడుగుజాడ. కేంద్రం గా తీసుకొని ప్రజాస్వామ్య భావాలను ముందుగా కనిపెట్టి ఖర్చుపెట్టిన వైతాళికుడు గురజాడ వెంకట అప్పారావు.
సామాజిక సాహిత్య సారథి గురజాడ:-
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
సెప్టెంబర్ 21 1862 లో విశాఖపట్నం లో జన్మించిన గురజాడ వెంకట అప్పారావు 30 నవంబర్ 1915 రోజున విజయనగరంలో
మరణించారు. ఆయన 19వ శతాబ్దంలో జన్మిస్తే తన రచనలు మాత్రం 20 21వ శతాబ్దం లోని ప్రజల కోసం అని 1962 సెప్టెంబర్ 21 గురజాడ శతజయంతి ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో నాటి సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావు రాసిన మాటలు ఆలోచించదగినది.
గురజాడ రచనల లోని అర్థాన్ని ఆయన సమకాలికుల్లో కాదు అనంతర కాలంలో వచ్చిన సాహిత్యకారులు సామాజిక కార్యకర్తలు కూడా అంతగా గ్రహించలేదు స్పందించలేదని విమర్శ ఉంది. తెలుగు నేలలో తెలుగు సాహిత్య రంగంలో ఇంకా గురజాడను పూర్తిగా అర్థం చేసుకోలేక పోయింది అంటే అతని అసాధారణ ప్రతిభ కు ఆనంద పడడం కాదు . గురజాడ లోతుగా అధ్యయనం చేయడం ద్వారా ఆయన సృజనాత్మక నుంచి నేర్చుకోవడానికి నేటి తరాలు ముఖ్యంగా సాహిత్య రంగం కృషి చేయవలసిన అవసరం ఉన్నది. రవికి ఉన్నట్లే ఆయన కూడా కొన్ని పరిమితులు లోపాలు ఉండవచ్చు. వాటిపై కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉండదని మేధావులు అంగీకరిస్తున్నారు.
కన్యాశుల్కం ,సాహిత్య సృజన:-
---------------------------------------
నాటి సామాజిక అంశమైన కన్యాశుల్కం, దానివల్ల వృద్ధులకు చిన్నపిల్లలను అమ్ముకునే దురాచారం నేపథ్యంగా నాటకం రాసినప్పటికీ అందులోని పాత్రలచర్చ జీవితము, ఘర్షణ కూడా ముఖ్యమైనవే. కన్యాశుల్కం ముగింపులో గిరీశానికి కథ అడ్డం తిరగడంతో నాటకీయత మాత్రమే అతను ప్రాతినిధ్యం వహించిన ప్రగతిశీల ప్రాబల్యంలో మిగులుతుందని నాటక గమనం సూచిస్తూనే ఉంటుంది. రాజకీయాలను సామాజిక పరిస్థితులను విమర్శించడానికి, వ్యతిరేకించడానికి అరుదుగా లభించిన రచన కన్యాశుల్కం నాటకం. ఈ సందర్భంగా కొందరి అభిప్రాయం ప్రకారం జనాభాలో 0.01 శాతం కూడా లేని ఒక దురాచారం మీదనే గురజాడ పోరాటం కానీ ఈ దేశంలో దాదాపు సగం మందికి అంబేద్కర్ దారి చూపాడు స్త్రీల విషయాన్ని కూడా తీసుకుంటే 85 శాతం మందికి దిక్కు చూపిన చుక్కాని అయినా అంబేద్కర్ ఏ ఒక్క కమ్యూనిస్టు పత్రిక గాని ప్రగతి పత్రికలు ప్రత్యేక సంచికలు ప్రకటించిన దాఖలాలు లేకపోవడం పట్ల అంబేద్కర్ ఇష్టులు
ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కుల బేధాలను, కుల వివక్షత ,మత వివక్ష ను, నిరసించి ప్రశ్నించిన గురజాడ
దళితులను ఆలింగనము చేసుకోలేని వారికి జాతీయత గురించి ,ఐక్యత గురించి, అస్పృశ్యత గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఆయన జీవిత కాలం నాటికే చరిత్ర రచనలో తొంగిచూస్తున్న మతతత్వ
దూరాన్ని నిరసించిన ప్రజా డా బుద్ధుడిని దేశం నుంచి తరిమివేసి దేశం చాలా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అంటే బౌద్ధమతము ప్రతిపాదించిన మానవులంతా సమానమే అనే భావనను గురజాడ అంగీకరించినట్లే కదా! అంత విశ్వాసాలను మతతత్వాన్ని నిరాకరించిన గురజాడ ఆధునిక స్త్రీ చరిత్రను తిరిగి రాయాలని భార్యాభర్తలు స్నేహితులుగా కొనసాగాలని ఆకాంక్షించాడు.
" మతములన్నియు మాసిపోవును జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును" ఉన్న తన గేయము ద్వారా శాస్త్రీయ విజ్ఞానమే భవిష్యత్తుకు సోపానం అని అంగీకరించాడు.
"మన కష్టసుఖాలు చెప్పుకోవడానికి ఒక భాష గ్రంథ రచనకు మరో భాషా? అని ప్రశ్నించిన గురజాడ మాట్లాడుకునే భాషలోనే రచనలు ఉంటే ఎక్కువమందికి అర్థమవుతుందని వ్యవహారిక భాషలోనే రచనలు రావాలని గిడుగు రామమూర్తి తో చేతులు కలిపి ఆ ఉద్యమంలో పాలుపంచుకున్నాడు. విద్యారంగము గురించి తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ విద్య సార్వత్రికమైన అంశమని జనం మాట్లాడుకునే భాష లోనే బోధనాభ్యసన జరగాలని ఆకాంక్షించాడు. సాహిత్యంలోనూ సమాజంలోనూ కొత్తపాతల కలయిక ద్వారా సమగ్ర చర్చ సంఘర్షణ జరగాలని కోరారు.
కన్యాశుల్కం నాటకం దిద్దుబాటు కథ ద్వారా సాహిత్యరంగంలో కొనసాగిన అప్పారావు సాహిత్య రంగంలో చేసిన కృషి తక్కువేమీ కాదు. వ్యాసాలు, చరిత్ర, కథలు, డైరీలు, నాటికలు, పుస్తకాల పై రాసుకున్న నోట్లు, పుస్తకాల కమిటీలో పాఠ్య భాషపై సమర్పించిన పత్రాలు సంక్షిప్తంగా వీర్ సాహిత్యానికి ఆనవాళ్లు.
దాదాపుగా 150 ఏళ్ల క్రితమే సమాజము ని ప్రేమించే తత్వం, భావుకత
దేశభక్తి సృజనాత్మకత కలిగి ఉండడం ప్రపంచ స్థాయిలో చర్చ జరిగి ఉండవచ్చు.
గురజాడ ఠాగూర్ జీవితాల సామ్యం:-
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
ఒకే కాలంలో వేరు వేరు ప్రాంతాలలో జీవించిన ప్పటికీ వేర్వేరు కవుల ఆలోచనలు భిన్నంగా నూ అభ్యుదయం గానూ ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఆలోచనా ధోరణి ని బట్టి సాంప్రదాయంగా గిరి గసుకున్న రచనలకే పరిమితమయ్యే అవకాశం కూడా లేకపోలేదు. వీరిద్దరూ 1862 లోనే జన్మించారు. 2012లోనే 150 ఉత్సవాలు జరిగినవి. సమకాలికులు పరస్పరము తెలిసినవారు. అయితే ఠాగూర్ అంత విస్తృతంగా గురజాడ రచనలు చేయక పోవచ్చు కానీ రాశిలో లేకున్నా వాసుల్లో ఉన్నదనే వాస్తవాన్ని మహాకవి శ్రీశ్రీ నే అంగీకరించాడు. జాతీయ ఉద్యమాలలో, సాహిత్య సాంస్కృతిక కృషిలో బెంగాలీలకు ప్రత్యేక స్థానం ఉన్నది. మానవతా వాదానికి ఊపిరిపోసిన గురజాడ 150వ ఉత్సవాల సందర్భంగా జరిగిన ఉత్సవాల స్థాయికన్నా ఠాగూర్ ఉత్సవాల స్థాయి ప్రధాని పాల్గొనడంతో గణనీయంగా పెరిగి పోయింది.
తెలుగునేలపై సాహిత్యానికి వాఙ్మయానికి నాయకులకు అవినాభావ సంబంధం అంతగా లేని కారణంగా సాహిత్యం రాజకీయం దృష్టిలో తెలుగునేలపై కొంత తక్కువ ప్రభావాన్ని చూపిందని విమర్శకులు అంటున్నారు. కవి జీవించు ప్రజల నాలుకల యందు అన్న జాషువా మాటను నిజం చేయాలంటే తెలుగు సాహిత్యాన్ని సంస్కృతిని వినీలాకాశంలో నిలిపిన సాహితీవేత్తల జీవితాలను సంబంధించిన స్మృతి విషయాలను మెంతులు వర్ధంతులు సందర్భంలో సామాజిక అంశంగా ప్రజల మధ్యనే ఉత్సవాలు జరగాల్సిన అవసరం ఉంది. వీటికి ప్రభుత్వాలు నాయకత్వం వహించిన అప్పుడే సాహిత్యం పాలన పరస్పరం ప్రభావితమై నూతన వ్యవస్థ ఆవిష్కరణకు మార్గం సుగమమవుతుంది.
[12/2, 22:04] వడ్డేపల్లి మల్లీశం గారు: నేటి మాట 247/2.12.20, బుధవారం
పుస్తక పఠనము పిల్లల ఆసక్తి- ఇష్టమైన పుస్తకం-- పిల్లలు . తల్లిదండ్రులు పాఠకులు అయితే పిల్లలు పాఠకులు అయ్యే అవకాశం ఎక్కువ.
**********************************************--- వడ్డేపల్లి మల్లేశము,9014206412
పుస్తకం పుట్టుపూర్వోత్తరాల కు సంబంధించి, దాని ప్రయోజనాలు, చరిత్ర గురించి చరిత్ర పుటల్లో చాలానే దాగి ఉంది.
అయితే బాలలకు పుస్తకపఠనం పట్ల ఆసక్తిని కలిగించే చర్యలు ముమ్మరం చేయాల్సిన ప్రస్తుత తరుణంలో పుస్తకం యొక్క ప్రాధాన్యత పిల్లల ఆసక్తులను ప్రధానంగా చర్చించడానికి ఈ వ్యాసాన్ని పరిమితం చేసుకుందాం. గతంలో పుస్తకం ప్రతి వాళ్ల చేతిలో కనబడుతూ ఉంటే హస్తభూషణం అనే ప్రచారం భారీగా సాగేది. సాంకేతికత, పారిశ్రామికీకర,ణ యాంత్రికీకరణ, అంతర్జాలంలో సంభవించిన పురోగమనం వలన ఇవాళ మొబైల్ ఫోన్ హస్తభూషణం అన్న రోజులు వచ్చాయి.
అయితే మనిషి ఎదుగుదల ఏ స్థాయిలో ఉన్నప్పటికీ ప్రస్తుతం మనం చేరుకున్న తీసుకురావడానికి పుస్తకం ఎంతగానో ఉపయోగపడే విషయాన్ని మర్చిపోకూడదు. మనిషి ఆటవిక దశ నుండి ఆధునిక మానవుడి దశకు చేరుకోవడానికి పుస్తకము నిర్వహించిన పాత్ర ఎనలేనిదని మనం అంగీకరిస్తేనే పుస్తకం పట్ల శ్రద్ధ, ఆసక్తి, అధ్యాయన అభిరుచి పిల్లలతో సహా పెద్దలు పెరుగుతాయి. ఆ వైపుగా మానవ గమనాన్ని
నిర్దేశించు కోకపోతే పుంఖానుపుంఖాలుగా పుట్టుకొస్తున్న సాహిత్యం కనుమరుగయ్యే ప్రమాదం ఉంటుంది.
పుస్తక పఠనము పిల్లలు- పిల్లలకు ఆసక్తి గల పుస్తకాలు:-
******************************
పుస్తకం అంటే అక్షరాలు కూర్చున్న పేజీల సముదాయం మాత్రమే కాదు .అది మేధావుల శాస్త్రవేత్తల కవులు కళాకారులు రచయితల ఆలోచనల సమాహారం. పుస్తక పఠనం అంటే పుస్తకాన్ని రాసిన రచయిత పాఠకుల మధ్య జరిగే సంభాషణ అని అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంగా ప్రముఖ తెలంగాణ కవి సాహిత్యవేత్త డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు పుస్తకపఠనం పై చేసిన వ్యాఖ్యలు గమనించవలసి ఉన్నది". ప్రస్తుతము లుక్ కల్చర్ పెరిగిపోయింది . బుక్ కల్చర్ క్రమంగా తగ్గిపోయింది". దీనిని సమాజము ఒక హెచ్చరికగ భావించి పిల్లలు పెద్దలు అందరూ తమకిష్టమైన పుస్తకాలను చదివే సంస్కృతిని గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉంది.
ఇక ఇష్టమైన పుస్తకం అయితేనే పూర్తిగా చదవడానికి పిల్లల్లో ఆనందం ఆసక్తి ఉంటుంది. ఒక పుస్తక పఠనం మరో పుస్తకాన్ని చదివేటట్లు ప్రోత్సహిస్తుంది ఆసక్తి రేకెత్తిస్తుంది. తమకిష్టమైన పుస్తక ప్రపంచం లో పిల్లలను స్వేచ్ఛగా సంచరించని వ్వాలి.
గురు gaan అనే పట్టణంలో భారీ పుస్తకాల దుకాణానికి నడుపుతున్నాడు విక్రేత తన అనుభవాన్ని జోడించి అన్న ఈ మాటలు విద్యా వార్తలను సైతం ఆశ్చర్య పరుస్తున్నాయి." ఈ పుస్తకాన్ని తేలికగా తీసుకోవద్దు జీవితాన్ని మార్చగల శక్తి కలిగిన సాధనం కేవలం పుస్తకమే." అనేకమంది తల్లిదండ్రులు తరగతి పుస్తకాలు తప్ప ఇతర పుస్తకాలు మా పిల్లలు పట్టుకోరు వాళ్లతోనే ఈ పుస్తకాలు చదివే కష్టమవుతుంది అని అంటూ ఉంటారు." తరగతి పుస్తకాలు కేవలం సిలబస్ ను మాత్రమే అందించి పరిమిత జ్ఞానాన్ని ఇస్తే ఇతర పుస్తకాలు ప్రపంచాన్ని తరగతిగదిలో చూపించగలిగే శక్తి ఉంటుంది. అందుకే పాఠశాలలో తరగతి పుస్తకాలతో పాటు గ్రంథాలయంలోని ఇతర పుస్తకాలను కూడా చదివించడం లో గురుతర బాధ్యత పాఠశాల నిర్వహించవలసి ఉంటుంది అలాగే తల్లిదండ్రులు కూడా ఇంటి వద్ద తాము చదువుతూ పిల్లలచేత నచ్చిన పుస్తకాలను చదివించే సంస్కృతిని అలవరచాలి. ఎంతసేపు పిల్లలనే అనేక పుస్తకాలను చదువని ఇతర పుస్తకాలు కొని తెచ్చి పెట్టి ఒత్తిడి చేసినా తల్లిదండ్రుల వైఖరిని కూడా పిల్లలు గమనిస్తారు. అదే తల్లిదండ్రులు కూడా ఇతర పుస్తకాలను చదువుతూ ఉంటే పిల్లలు అనుకరిస్తారు ఆదర్శంగా తీసుకుంటారు.
ఇక పుస్తకాల ఎంపికలో చిత్రాలు, కార్టూన్లు, కవితలు, గేయాలు, సంభాషణలు నాటికల వంటివి పిల్లలు ఇష్టపడేలా ప్రోత్సహించడమే కాకుండా పాఠ్య పుస్తకాలను కూడా చదవడానికి ఈ పటనం పిల్లలకు తోడ్పడుతుంది. శవాన్ని పరిమితంగా ఉపయోగించడంతో పాటు అనివార్యమైతేనే అందుబాటు ఉంచాలి.
కరోనా నేపథ్యంలో ఇటీవల ఆన్లైన్ తరగతులు దేశవ్యాప్తంగా నడుస్తున్నవేళ
పుస్తక సంస్కృతి కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నప్పటికీ దీనిని తల్లిదండ్రులు గమనించి పుస్తకాలను అందుబాటులో ఉంచాలి. కథల పుస్తకాలు, నీతి శతకాలు పెద్ద అక్షరాలతో ప్రచురించబడిన పుస్తకాలను ప్రధానంగా ఎంపిక చేసుకొని క్రమంగా పదవ తరగతి చేరే వరకు బాల సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలను చదివేలా ప్రోత్సహించాలి.
తల్లిదండ్రులు కూడా కవులు, కళాకారులు, శాస్త్రవేత్తలు, మేధావులు, సామాజిక వేత్తలు సాహిత్యవేత్తలు రచించిన చారిత్రక, సామాజిక, స్వాతంత్ర పోరాట ప్రజా ఉద్యమాలకు సంబంధించిన గా తలతో పాటు సమాజ నిర్మాణము సామాజిక అసమానతలు అంతరాలు పరిపాలనకు సంబంధించిన విషయాలను కూడా నేర్పే పుస్తకాలు చదవడంతో తల్లిదండ్రులు సామాజిక చింతన బలపడుతుంది. అప్పుడు మాత్రమే తమ పిల్లలను కూడా సామాజిక బాధ్యత గల పౌరులుగా తల్లిదండ్రులు తయారు చేయ గలరు. ఇంటి దగ్గర తల్లిదండ్రులు కష్ట పడే ఈ వ్యవహారమంతా తరగతిగదిలో పాఠశాలలో ఉపాధ్యాయులు అదనపు సామాజిక బాధ్యతగా నిర్వహించాలంటే ముందుగా ప్రశ్నించడం ప్రశ్నింప నేర్పడం అనే లక్షణాలు ఉపాధ్యాయులకు ఉంటేనే సాధ్యమవుతుంది.
పిల్లలు దేశ భవిష్యత్తు:-
***********************
నేటి బాలలే రేపటి పౌరులు అనే సూక్తి నిజం చేయాలంటే, ఈ వ్యవస్థ మరింత ఉన్నతంగా రూపుదిద్దుకోవాలి అంటే దాని మూలం అంతా సాహిత్యం లోనే ఉంది. అది అధ్యయనంపై మాత్రమే ఆధారపడి
ఉంటుంది. అక్షరాలు వచ్చిన ప్రతి పిల్లవాడి లోను చదవాలనే అభిలాష ఖచ్చితంగా ఉంటుంది. ఆ అభిలాషను సంతృప్తిపరిచే పుస్తకం అందించి ఆసక్తిని రేకెత్తించే వాతావరణాన్ని ఇంటి దగ్గర తల్లిదండ్రులు, పాఠశాలలో ఉపాధ్యాయులు కల్పిస్తే అటు పిల్లలను ఇటు పెద్దలు పాఠకులుగా మహా పాఠకులుగా చివరికి రచయితలు కవులు గా తయారు కావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. రచయితలు అనే వారు ఎక్కడి నుండి వూడి పడలేదు పాఠకుల యినవారే మహా పాఠకులు రచయితలు గా మారిన సాంస్కృతిక సాహిత్య నేపథ్యాన్ని నేటి సమాజం గుర్తించి ఆచరించ వలసిన అవసరం ఉంది అది ఒక చారిత్రక బాధ్యత.
( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం).
[12/3, 20:34] వడ్డేపల్లి మల్లీశం గారు: నేటి మాట 248/3.12.20 గురువారం
ప్రపంచ వికలాంగుల దినోత్సవం వేళ- వికలాంగుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి-
వారి ఆత్మస్థైర్యానికి జేజేలు పలుకుదాం!
*********************************************
--- వడ్డేపల్లి మల్లేశము,9014206412
వికలాంగులు -వివరణ- గణాంకాలు:-
*************************************
పుట్టుకతో అనేకమందికి సహజంగానే వైకల్యం ఇబ్బంది కలిగిస్తుంటే, అనేక ప్రమాదాలలో, విషమించిన అనారోగ్య కారణాల వల్ల కూడా ఏటా లక్షలాది మంది వికలాంగులుగా మారుతున్న పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా కనపడుతున్నవి. ప్రతి సంవత్సరం డిసెంబర్ మూడవ తేదీన ప్రపంచ వికలాంగుల దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా భారతదేశానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొన్ని మౌలిక అంశాలను చర్చించుకుందాం.
వైకల్యం అనేది అదృష్టం గానూ దురదృష్టం గానూ దౌర్బల్యం గానూ దౌర్భాగ్యం గానూ వర్ణిస్తూ తృప్తి పడడం కోసం ఆరాటపడుతుంటారు. అందుకే ఇది సహజంగా నూ అనివార్యంగా కృత్రిమంగా నువ్వు ఏర్పడుతున్న వైకల్యం గా భావించి ఆ ఆగస్టు నుండి బయటపడడానికి తగు మార్గాలను వెతకడమే ఇవ్వాళ ప్రభుత్వాలు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు మనసున్న ప్రతి వారి పని.
ఒక అంచనా ప్రకారం గా దేశ జనాభాలో 22.4 శాతం భారత దేశ వ్యాప్తంగా అంగవైకల్యంతో బాధపడుతున్నారని 2011 జనాభా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 11 లక్షల మంది వైకల్యంతో బాధపడుతున్న ట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం జన్మించిన శిశువుల్లో కనీసం 20 శాతం మంది ఏదో ఒక లోపంతో అంగవైకల్యంతో పుట్టడంతో ఇవాళ దేశవ్యాప్తంగా అంగవైకల్యం కలిగిన వారి సంఖ్య గణనీయంగా రోజురోజుకు పెరుగుతూ ఉన్నది. 2016 లో కేంద్ర పార్లమెంటు దివ్యాంగుల హక్కుల చట్టం తీసుకురావడం ద్వారా వారిది సదుపాయాలు అవకాశాలు హక్కులు సమగ్ర అభివృద్ధికి చర్యలు చేపట్టడానికి మార్గం సుగమం అయ్యింది. ఇక చట్టం ప్రకారం గా ప్రభుత్వానికి కావాల్సింది చిత్తశుద్ధి అప్పుడే చట్టం అమలుతో పాటు ఆ వర్గానికి సంబంధించిన ప్రజలందరూ ఆత్మగౌరవంతో బ్రతికి అన్ని రకాల హక్కులకు దూరం రాకుండా అనుభవించే అవకాశం ఉంటుంది అది ప్రభుత్వాల మౌలిక బాధ్యత.
ఇక తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 5 లక్షల మందికి వయసుతో సంబంధం లేకుండా ఏటా పింఛన్ల కోసమే 860 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలుస్తున్నది.
ప్రభుత్వాలు, సమాజ బాధ్యత:-
************************************ అనేక రకాల అంగవైకల్యం కలిగిన కారణంగా జీవన గమనానికి సంబంధించి అనేక అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉన్నది. ఈ దుస్థితిని పసిగట్టి ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవడంతో పాటు ఆర్థిక సహకారాన్ని అందిస్తే ఇంట్లో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు బంధువులు సమాజంలోని విభిన్న వర్గాల వారు వారిలో ఆత్మస్థయిర్యాన్ని నింపి తోటి మనిషిగా చూడడం ద్వారా ఆత్మగౌరవాన్ని కాపాడవలసిన గురుతర బాధ్యత సమాజం యావత్తు పైన ఉన్నది.
చట్టాలను పూర్తిస్థాయిలో అమలు చేయడంతోపాటు వీరిలో భరోసాను నింపాలి. వీధి సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వాలు పౌరసమాజం వీలు ఉన్న అవకాశాలను అందుబాటులోకి తీసుకురావాలి. హక్కులను పరిరక్షించడం, చట్టాలను అమలు చేయడం, అవరోధాలను అధిగమించటం ద్వారా ప్రజాజీవితంలో వీరికి కూడా సంపూర్ణ భాగస్వామ్యాన్ని కల్పించడంతోపాటు సమాజం వీరి పట్ల పెద్దరికాన్ని ప్రదర్శించాలి.
ప్రపంచ వికలాంగుల దినోత్సవం నేపథ్యం:-
****************************************
- లక్ష్యాలు
వికలాంగుల పట్ల వారి ఎదుగుదలకు సంబంధించి రాజకీయ సామాజిక ఆర్థిక సాంస్కృతిక పరంగా వారిని ప్రోత్సహించేలా ఈ దినోత్సవ లక్ష్యాన్ని నేపథ్యాన్ని ఐక్యరాజ్యసమితి ఆలోచించింది. ఈ లక్ష్యంతోనే 1976లో ఐక్యరాజ్యసమితి వికలాంగుల సమస్యలను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లడానికి 1981 సంవత్సరాన్ని అంతర్జాతీయ వికలాంగుల సంవత్సరంగా ప్రకటించింది. అంతేకాకుండా 1983 నుండి 1992 వరకు ఈ 10 సంవత్సరాల కాలాన్ని వికలాంగుల దశాబ్దంగా ప్రకటించితన చారిత్రక బాధ్యతను చాటుకుంది. అంతటితో ఆగకుండా 1992లో ఐక్యరాజ్యసమితి డిసెంబర్ మూడవ తేదీ ని ప్రపంచ వికలాంగుల దినోత్సవం గా ప్రకటించింది అప్పటికీ 1998 నుండి మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని నిర్వహించడం క్రమంగా జరుగుతున్నది.
వికలాంగుల దినోత్సవం కార్యక్రమాలు:-
************************************
ఈ దినోత్సవ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలతోపాటు అటు ప్రభుత్వ ఇటు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో వినికిడి యంత్రాలు, ట్రై సైకిళ్లు తదితర అవసరాలను పంపిణీ చేయడం ద్వారా దినోత్సవ ప్రాధాన్యత ను గుర్తిస్తారు.
- అలాగే పాఠశాలలు కళాశాలలు విశ్వవిద్యాలయ స్థాయి వరకు కూడా వారికి అందుబాటులో ఉండే క్రీడాపోటీలు వివిధ రకాల సహపాఠ్య కార్యక్రమాలకు సంబంధించిన పోటీలను నిర్వహించి బహుమతులను అందజేయడంతో పాటు ఆత్మస్థైర్యాన్ని నింపుతూ ఉన్నారు
- వికలాంగులు అయినటువంటి వారు ఆయా రంగాలలో ఎదిగిన వారి గురించి అవగాహన కల్పించడం ద్వారా వారి పట్ల గౌరవభావాన్ని ప్రదర్శిస్తున్నారు ఇదంతా కూడా మన బాధ్యత.
ప్రపంచ స్థాయిలో పేరుగాంచిన వివిధ రంగాలలోని వికలాంగులు:-
*****************************
మనసులో చిత్తశుద్ధి పట్టుదల అంకితభావం ఉండాలి కానీ అసాధ్యమైన విషయాలను కూడా సుసాధ్యం చేస్తూ పత్రికలు ఎక్కడ మీతోపాటు టీవీ ప్రసారాలు మనకు ఎంతో మంది వికలాంగులు కనబడుతున్నారు వారందరికీ జేజేలు.
వికలాంగుల లోని లక్షణాలను పరిశీలిస్తే అంధత్వం తక్కువ కంటిచూపు, కుష్టు వ్యాధిగ్రస్తులు, వినికిడి లోపం ఉన్న వాళ్లు, చరణ శక్తికి సంబంధించిన వికలాంగత, బుద్ధిమాంద్యం, మొదలైన రకాలు మన కళ్ళముందు నిత్యం కనపడుతూ ఉంటారు. వీలున్న మేరకు సహకరించడం మనుషులుగా చూడడం మన కనీస బాధ్యత.
ప్రభుత్వపరంగా అందిస్తున్న కొన్ని సహకారాలు- విద్యావకాశాలు కల్పించడం, శిక్షణ, ఉపాధి అవకాశాలు ,స్వయం ఉపాధి కల్పన, పరికరాలు యంత్రాలు అందజేత సాంఘిక భద్రత, ప్రయాణ తదితర రాయితీలు కల్పించడం ఆర్థిక సహకారం పెన్షన్లు అందించడం గృహ వసతి తదితర అవకాశాలను ప్రభుత్వాలు కల్పిస్తున్నవి.
- బ్రిటిష్ కవిగా మనందరికి తెలిసిన జాన్ మిల్టన్ 1652 144 వ యేట కంటి చూపు కోల్పోయిన తర్వాత ప్యారడైజ్ లాస్ట్ అనే అద్భుత కావ్యం రాశాడు.
- ప్రాచీన గ్రీకు మహాకవి హోమర్ కూడా అందుడే.
- అమెరికాకు చెందిన హెలెన్కెల్లర్ పుట్టిన తర్వాత 19 నెలలకు జబ్బు చేయడంతో చెవుడు, మూగ, గుడ్డితనం వచ్చి ఏకాకిగా మారిన ఆత్మస్థైర్యాన్ని కోల్పో లేదు సరికదా!
బ్రెయిలీ లిపి నేర్చుకుని అద్భుత గ్రంథాలు రచించి ప్రపంచమంతా పర్యటించి వికలాంగులకు ఎన్నో పాఠశాలలు ఏర్పాటు చేసిన వీరవనిత.
- అమెరికాకు చెందిన జేమ్స్ తర్జర్ న్యూయార్క్ పత్రికకు వ్యాసాలు రాయడం తోపాటు పుస్తకాలు నాటకాలు కూడా రాసి పేరుగాంచాడు.
- ఇక భారత దేశానికి చెందిన భరత్ రాజ్ అనే వ్యక్తి రెండు చేతులు లేకపోయినా కాళ్ళతోనే అని పనులు చేస్తాడు అంతేకాదు ప్రింటింగ్ ప్రెస్ లో ఉద్యోగం చేస్తూ తనను తాను పోషించుకుంటూ తల్లికి వంటచేసి పెడుతున్నాడు. ఇది పట్టుదలకు, ఆత్మవిశ్వాసానికి నిదర్శనం కాదా!
ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత రచయిత బెంజిమెన్ డిజిరెళి" లక్ష్యాన్ని మరువక పోవడమే విజయానికి కీలకం" అంటాడు. ఈ మాటను అక్షరాలా పాటిస్తున్నారు కనుకనే వికలాంగులైన ఇంతకుముందు ప్రస్తావించిన వంటి అనేక వేలాదిమంది అన్ని రంగాలలో మన తోని పోటీ పడుతున్నారు అంటే మనలోని బద్ధకస్తులు, సోమరిపోతులు సిగ్గు పడాల్సిన అవసరం ఎంతో ఉన్నదని ఈ సంఘటనలు రుజువు చేస్తున్నాయి.
నేటి యువత సమాజము ఈ వాస్తవాలను గ్రహించడం ద్వారా వికలాంగుల కు సంబంధించి మన చేయూతను అందివ్వడానికి సర్వత్ర సిద్ధంగా ఉండాలని ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజునైనా మనం పిలిపిద్దాం. అంతే కాదు ఆచరించి చూపుదాం.
( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు, కవి, రచయిత హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్ర)
[12/4, 22:36] వడ్డేపల్లి మల్లీశం గారు: నేటి మాట 249/4.12.20 శుక్రవారం
జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలు.. ప్రజా ఎజెండాకు దూరంగా పార్టీలు. ప్రజా సమస్యల పునాది- పార్టీల భవిష్యత్తు
*****************************************
---- వడ్డేపల్లి మల్లేశము,9014206412
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల ఫలితాలు కొందరిని ఆశ్చర్యానికి, మరికొందరిని ఆవేశానికి, అధికారంలోని పార్టీని ఆత్మ పరిశీలనకు గురిచేసినవి.
నిజమైన ప్రజా సమస్యలను గాలికి వదిలి
కోటాను కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి అసలు ప్రజా సమస్యలను చర్చించకుండా ఎన్నికల్లో ప్రజలను భాగస్వాములను చేయడం దేనికి సంకేతం.
:
ఎన్నికలంటే గెలుపు అనుకోవద్దు-
**************************
150 డివిజన్ల గాను అధికార పార్టీకి 57 భారతీయ జనతా పార్టీ కి 48, ఎంఐఎంకు 43, కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల్లో గెలుచుకోగా ఇతర పార్టీలు ఒక్క చోట కూడా గెలవకపోవడం ని మనం గమనించాలి. కొన్ని పార్టీలు గెలుపే ప్రధాన అనుకుంటే మరికొన్ని పార్టీలు ప్రజా ఎజెండాను ప్రజల్లోకి తీసుకు పోవడం ద్వారా పాలక పక్షాలను ఆలోచింపజేసింది కూడా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లోనే అధికారంలో ఉన్న పార్టీ తన విధానాలను అవసరమైన మేరకు సవరించుకునే అవకాశం ఉంటుంది.
రాజకీయ పార్టీలు ఎన్నికల వేళ తమ మేనిఫెస్టోను విడుదల చేసిన సందర్భంలో lrs సరళతరం చేయడం వరద బాధితులు ఇతరత్రా స్థానిక సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చినట్లు మనమందరం విన్నాం.
అధికార టీఆర్ఎస్ పార్టీ lrs ద్వారా కనీసం 12 వేల కోట్ల రూపాయలు ప్రజల నుండి వసూలు చేయాలని నిర్ణయంతో ఉన్నట్లు పత్రికలలో చదివి నాము.
ఎన్నికలంటే ప్రజలతో కలిసి పోవడం:-
*************************
ఈ ఎన్నికలలో ప్రధాన పార్టీలు మత విశ్వాసాల పునాదిగా ప్రచారం చేయడం ప్రజా ఎజెండా కంటే విశ్వాసాలకు ప్రాధాన్యతనివ్వడం, సమస్యల పరిష్కారంలో ప్రజల పక్షాన ఉండటానికి భరోసా ఇచ్చినట్లు అంతగా కనిపించదు. మరి అలాంటప్పుడు ప్రజలు ఎందుకోసం ఓటు వేయాలి. బహుశా అందుకేనేమో పోలింగ్ శాతం 50 శాతాన్ని కూడా చేరకపోవడం రాజకీయపక్షాలకు ప్రజల సమస్యల మీద ఆరాటం లేని విషయాన్ని తెలియజేస్తున్నది. ఆచరణ సాధ్యం కాని హామీలు కంటే ప్రధానమైన మౌలిక సమస్యల పరిష్కారంలో, ఆయా డివిజన్లో పాల్పడిన అవినీతి గురించి ప్రజల సొమ్ము ఎలా దుర్వినియోగం అయిందో దాని గురించి చర్చ జరిగి నీతివంతమైన కార్పోరేటర్ లను ఎన్నుకోవడానికి కృషి జరగవలసి ఉండే. ఇక్కడ రాజకీయ ప్రయోజనాలను ఆశించి అటు అధికార పార్టీ ప్రతిపక్షాలు ఒకరిని మించి మరొకరు ప్రజల మౌలిక విషయాలను విస్మరించి చేసిన ప్రచారం కారణంగా ప్రజలకు అంతగా ఒరిగేది ఏమీ ఉండదు.
గెలుపు ఓటములను స్వీకరించాలి:-
*******************
టిఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో తన టార్గెట్ ను చేరుకోలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ వంటి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న జాతీయ పార్టీ రెండు సీట్లకే పరిమితం కావడం ఆందోళన కలిగించే విషయం. లౌకిక సామ్యవాద దృక్పథం కలిగి తొలినాళ్లలో ప్రాజెక్టులు పరిశ్రమలు స్థాపించి ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేసిన కాంగ్రెస్ పార్టీ క్రమంగా నాయకత్వ లేమితో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకోవడంలో విఫలం కావడం అధికార పార్టీ కూడా పార్టీ ఫిరాయింపుల ప్రోత్సహించిన కారణంగా ఈ ఎన్నికలలో అనూహ్యమైన పరిణామం ఏర్పడింది. ప్రజా ఎజెండా పునాదిగా పని చేస్తేనే ఈ ఎన్నికలకు అర్థం ఉంటుంది. కానీ వాదప్రతివాదాలు ఈ గెలుపును ఉపయోగించుకుంటే ఈ ఎన్నికల ఫలితాలతో ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండదు.
ఈ సంధ్యా సమయం లో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం తన మౌలిక విధానాలను కేవలం జిహెచ్ఎంసి పరిమితం చేయకుండా రాష్ట్ర వ్యాప్త సమస్యలను ఉద్యోగులు నిరుద్యోగ సమస్య lrs వంటి ఆర్థిక భారం మోపే సమస్య ప్రధానంగా దృష్టి పెట్టి సమస్యలను పరిష్కరించడం ద్వారా ప్రజల మనసులను చూరగొనాలి ప్రజలపై భారం మోపకుండా ఉన్నప్పుడే ప్రజలు ప్రభుత్వాన్ని ఆదరిస్తారు.
ప్రభుత్వాలు ఆర్ధిక విషయంలో పంతానికి పోయినట్లయితే ఇదే అదనుగా ప్రతిపక్షాలు ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాయి.
గతంలో ప్రజలు ప్రజా సంఘాలు ఉద్యోగుల సంఘాలు ప్రభుత్వాలను ఆలోచింపచేసేవి ప్రభుత్వాల తప్పుడు విధానాలను మార్చుకునేలా దోహదపడిన వి.
కాని నేటి దౌర్భాగ్యం ఏమిటంటే ప్రజావ్యతిరేక విధానాలను మార్చుకోవాలంటే ఉద్యమాల ద్వారా కాకుండా ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఓడించి నట్లయితేనే తమ విధానాలను సమీక్షించుకుంటూ ఉన్న పద్ధతులు కొనసాగుతున్నాయి. ఇటీవలి దుబ్బాక ఎన్నికలతో పాటు జిహెచ్ఎంసి ఎన్నికలలో వైఫల్యంపై అధికార టీఆర్ఎస్ పార్టీ తమ విధానాన్ని లోతుగా సమీక్షించుకుంటూ అని పత్రికా ప్రకటన చేయడం ఈ సందర్భంగా గమనించదగినది.
రెచ్చగొట్టడం భయబ్రాంతులకు గురి చేయడం పార్టీలకు తగదు:-
************************
గత 2018 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టికెట్పై గెలుపొందిన శాసనసభ్యులను 13 మందిని అధికార టీఆర్ఎస్ పార్టీ తనలో కలుపుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీని బలహీనం చేసినట్లు దాని పర్యవసానంగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలు కావడం ప్రత్యామ్నాయంగా మరో పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించే స్థితికి ఎదగడాన్ని అధికార పార్టీ ఆలోచించాలని రాజకీయ విశ్లేషకులు మాట్లాడడం గమనించదగినది.
సమ్మతమైన జీవన విధానమే మతమని నిఘంటువు ఒకవైపు చెబుతుంటే కేవలం విశ్వాసాల ప్రాతిపదికమీద ప్రజా ఎజెండాను పక్కన పెట్టి భయబ్రాంతులకు గురి చేసే ప్రకటనలు హెచ్చరికలు ప్రజాస్వామ్యంలో ప్రజలకు మేలు చేయకపోగా ప్రజలు అభద్రతా భావానికి లోనవుతారు. రాజ్యాంగం మేరకు రక్షణలు హక్కులను ప్రతి పౌరునికి అందించడానికి అటు ప్రభుత్వాలు ఇటు ప్రతిపక్షాలు ప్రజలను ప్రభువులుగా చూడవలసిన అవసరం ఉన్నది. ఎన్నికలు ఉన్నా లేకున్నా రాజకీయ పార్టీల జీవితము ప్రజలతోనే కనుక ప్రజలతో మమేకం కావడం ద్వారా మాత్రమే రాజకీయ పార్టీలు ప్రజా జీవితాన్ని అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రభావితం చేయవలసిన అవసరం ఉంటుంది. జిహెచ్ఎంసి కి జరిగిన ఎన్నికలలో తేలిన ఫలితాల ద్వారా రాజకీయ పార్టీలు రాజ్యాంగబద్ధంగా సమీక్షించుకోవలసిన అవసరం ఉన్నది ఇది ఆయా రాజకీయ పార్టీల చారిత్రక బాధ్యత.
( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు కవి రచయిత సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు అధ్యక్షులు జాగృతి కళాసమితి హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)
[12/5, 20:51] వడ్డేపల్లి మల్లీశం గారు: నేటి మాట 250/5.12.20 శనివారం
జిహెచ్ఎంసి ఎన్నికలు ఫలితాల నేపథ్యంలో ప్రభుత్వం ఆలోచించవలసిన అంశాలు. -
అనుసరించవలసిన ప్రజా దృక్పథం
*******************************************
---- వడ్డేపల్లి మల్లేశము,9014206412
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికలలో అధికార పార్టీని పక్కకు తోసి బిజెపి పార్టీ అధిక సీట్లను గెలుచుకోవడం కి సంబంధించి జరిగిన తంతు కథాకమామీషు ప్రభుత్వం సీరియస్గా ఆలోచించవలసిన అవసరం ఉంది. గతంలో ప్రజా సంఘాలు ఉద్యోగ సంఘాలు ప్రజా ఉద్యమాల ద్వారా ప్రభుత్వాలు తమ ప్రజావ్యతిరేక విధానాలను మార్చుకుని ప్రజలకు అనుకూలంగా పరిపాలన చేసిన సందర్భాలు అనేకం.
కానీ ఇటీవల తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత టిఆర్ఎస్ పరిపాలనలో ప్రజా నిరసన కు సంబంధించిన ఇందిరా పార్క్ ప్రభుత్వం నిషేధించిన తర్వాత ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకునే విషయంలో కొత్త ఒరవడి ప్రారంభమయ్యింది.
అదే ఉప ఎన్నిక కాని సార్వత్రిక ఎన్నికల్లో కానీ ప్రతిపక్షాలు శక్తికి మించిన స్థానాలలో గెలిచినప్పుడు ప్రభుత్వము దానిని ఓటమి గా భావించి తన విధానాలను సమీక్షించుకోవడం గత ఐదారు సంవత్సరాలుగా రాష్ట్రంలో ప్రారంభమయ్యింది. ఇటీవల దుబ్బాక లో జరిగిన ఉప ఎన్నిక ఫలితం అనంతరం జిహెచ్ఎంసి ఎన్నికలలో బిజెపి దూసుకుపోవడం టిఆర్ఎస్ పార్టీని ప్రభుత్వాన్ని ఆత్మ పరిశీలనకు గురి చేసినది ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి స్వయంగా కేటీఆర్ గారు లోపాలను సవరించు కుంటామని చెప్పడంతో రాష్ట్ర ప్రజానీకం లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
పార్టీ ఫిరాయింపులు టిఆర్ఎస్ ప్రభుత్వం:-
****************
2014 సంవత్సరంలో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారానికి వచ్చినప్పటినుండి కాంగ్రెస్ పార్టీని దాని ఉనికిని ప్రశ్నార్థకం చేయడంతోపాటు 2018 శాసనసభ ఎన్నికల్లో గెలిచిన 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన ఖాతాలో వేసుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఉనికిని ప్రశ్నార్థకం చేయడం క్రమంగా నేడు జిహెచ్ఎంసి ఎన్నికల్లో నామరూపాలు లేకుండా పోవడానికి, అంతో ఇంతో లౌకిక భావజాలం కలిగిన పార్టీని నామరూపాలు లేకుండా చేయడానికి టిఆర్ఎస్ పార్టీ బాధ్యత వహించాలని అనేకమంది విశ్లేషకులు అభిప్రాయపడడంలో ఎంతో వాస్తవం ఉంది.
ఈ తంతు కొనసాగుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మీద వేసిన ఓట్లతో గెలిచిన వ్యక్తి ఇతర పార్టీ లో బలవంతంగా చేరడంతో ఆత్మ పరిశీలన చేసుకున్న ప్రజానీకం క్రమంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడాన్ని మరిచి పోయినారు. అది ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా పోవడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణం అయ్యింది. ఇక దానికి పెంచి పోషించిన అధికార పార్టీ కూడా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం భవిష్యత్తులో చాలా ఉన్నది. అంతో ఇంతో విలువలు కలిగిన పార్టీని ప్రతిపక్షంలో లేకుండా చేయడం తో ప్రతిపక్షంగా ఎదిగిన మరో ప్రత్యామ్నాయ పార్టీ తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు గా ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగడానికి తను కారణాన్ని గా టిఆర్ఎస్ పార్టీ అంగీకరించడమే కాకుండా ప్రత్యామ్నాయ ఆలోచించవలసిన అవసరం ఉంది.
ప్రభుత్వ అసంబద్ధ విధానాలను ఇకనైనా మార్చుకోవాలి*:-
********************
రైతుబంధు పథకం ద్వారా ఉన్నత వర్గాలను పెంచి పోషిస్తున్న తన విధానాన్ని ఇకనైనా మార్చుకోవాలి. పంట పొలం తో సంబంధం లేకుండా విలాసాల ఊరేగుతున్న వారి అకౌంట్ లో కోట్ల రూపాయలు జమ అవుతుంటే పంట పొలంలో పనిచేస్తున్న అనేకమంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే పట్టించుకోకపోవడం రైతుబంధు వారికి వర్తింప చేయకపోవడం నిజంగా ప్రజా వ్యతిరేక మే. వందలాది ఎకరాలు ఉన్న వారి అకౌంట్లో జమ కావడం, రాళ్ల భూములు గుట్టలకు రైతుబంధు వర్తింపజేయడం అసంబద్ధ విధానాలు కాదా?
రిజర్వు బ్యాంకు నుండి కోట్ల రూపాయలను అప్పుగా తీసుకొని ఉన్నత వర్గాలకు చెల్లించడం లోని ఉచిత ఏమిటి? ఈ దుర్భర పరిస్థితుల్లో ఈ విషయాలను నెమరువేసుకోవాలి. గుట్టల విధ్వంసం, ప్రకృతి విధ్వంసం, అడవుల విధ్వంసాన్ని అధికారానికి రాకముందు విమర్శించిన ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆ వైపుగా చర్యలు తీసుకోకపోవడం బాధాకరమే.
ఇక నామినేటెడ్ పోస్టుల లో పనిచేస్తున్న పార్టీ కార్యకర్తలకు లక్షలాది రూపాయలను ఇతర సౌకర్యాలను అప్పనంగా కట్టబెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కూడా బాధాకరమే. రాష్ట్రంలో రహదారులు అధ్వాన స్థితిలో ఉండి ప్రజల కళ్ళల్లో మట్టి కొడుతుంటే ప్రజలు కోరని మిషన్ భగీరథ 45 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా ప్రభుత్వం చెబుతుంటే ఆ నీటిని తాగిన వాళ్ళు వాడుకున్న వాళ్లు లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి నెలకొంటే ఎవరి కోసం ఈ పథకం? ప్రజల డిమాండ్ లేకుండా ఏ కార్యక్రమం చేపట్టినా ఆ నిధులు, నిర్మాణాలు దుర్వినియోగమే కదా!.
మాట తప్పిన హామీలను నెరవేర్చాలి:-
******************************
ఎన్నికల సమయంలో కులాల పేరున సమావేశాలు ఏర్పాటు చేసి మద్యం డబ్బులతో ప్రలోభపెట్టి ప్రతి ఎన్నికల్లోనూ కామెడీ గెలవాలని దుష్ట సంప్రదాయానికి చరమగీతం పాడి భవిష్యత్తులో అవకాశం ఉంటుంది. ఇంటికొక ఉద్యోగం అని నెరవేర్చకపోగా విజ్ఞులు ప్రతిపక్షాలు చెబుతున్నట్లుగా రెండున్నర లక్షల ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తుంటే ఆ వైపుగా ప్రభుత్వ చర్యలు లేవు.
ఉద్యోగులకు ఇచ్చిన హామీలు గానీ పిఆర్సి తదితర సౌకర్యాలను చట్టబద్ధంగా కొనసాగాల్సిన వాటిని కూడా నిర్లక్ష్యం చేసి ఉద్యోగులను దూరం చేసుకున్న సందర్భంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా స్వయం ఉపాధి పథకాలను ముమ్మరంగా ప్రోత్సహించి అట్టడుగు వర్గాలు బడుగు బలహీన వర్గాల వారికి అధిక ప్రయోజనం చేకూర్చే స్వయం ఉపాధి పథకాలను నిధులను మంజూరు చేయడం ద్వారా వారి జీవితాల్లో వెలుగు నింపడం ప్రభుత్వం ముందున్న ఏకైక మార్గం.
కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ తప్ప ఏ ఇతర రంగాల్లోని ఉద్యోగులను నియామకము చేయలేదని అపప్రద నుండి ప్రభుత్వం తప్పించుకోవాలంటే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఈ కఠోర సమయంలో ఎక్కువగా ఉన్నది.
పేదరిక నిర్మూలన, ఆర్థిక పరిస్థితులు మెరుగు పరచడానికి చర్యలు:-
*****************
లక్షల కోట్ల రూపాయలను బడ్జెట్లో ప్రతిపాదించిన అప్పటికీ క్షేత్రస్థాయిలో దారిద్ర్యరేఖ దిగువన కలిగిన వారి సంఖ్య రోజురోజుకు పెరగడమే కాకుండా పేద వాళ్ళు మరీ పేదలు అవుతున్నారు. గృహవసతి కనీస సౌకర్యాలు ప్రాథమిక సౌకర్యాలు లేని కారణంగా కోట్లాది ప్రజానీకం దుర్భర దారిద్ర్యంతో మురికివాడల్లో జీవితాలు కొనసాగిస్తుంటే ఈ దేశంలో బంగారు తెలంగాణ అంటే ఇదేనా?
మరొకవైపు మద్యం మత్తు పానీయాలు యువతను నిర్వీర్యం చేస్తుంటే ప్రభుత్వమే వాటిని పెంచి పోషిస్తుంటే ఈ దుర్భర పరిస్థితి కారకులెవరు ప్రభుత్వం కాదా! ఇక ప్రభుత్వాన్ని హెచ్చరికలు చేసే స్థాయిలో కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదని సగటు మనిషి నమ్మే స్థితిలో లేడు. సామాన్య ప్రజానీకానికి రక్షణ కల్పించడం ద్వారా అసాంఘిక శక్తులు, ప్రభుత్వాన్ని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వారిపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.
ఎల్ ఆర్ ఎస్ ప్రభుత్వ విధానం:-
************************
నివేశన స్థలాల కు సంబంధించిన ప్లాట్ల విషయంలో అక్రమం అంటూ ఇంత కాలంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగిన అనుమతులు లేఅవుట్ విషయాలను క్రమబద్ధీకరించే పేరుతో ప్రభుత్వము దాదాపుగా 12 వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపిన పత్రికల్లో వచ్చిన కథనాలు ప్రభుత్వానికి కొంత వ్యతిరేకంగా పని చేసినట్లుగా ప్రభుత్వం ఆలోచించాలి . జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ మిగతా రాజకీయ పార్టీలు ఎల్ఆర్ఎస్ విషయంలో పల ఎలాంటి రుసుము వసూలు చేయకుండా క్రమబద్ధీకరణ ఉచితంగా చేస్తామని హామీ ఇవ్వడాన్ని కూడా అధికార పార్టీ పునరాలోచన చేసుకోవలసిన అవసరం ఉన్నది. ఈ ఎన్నికలలో అధికార పార్టీకి సీట్లు తగ్గడం విషయంలో ఎల్ఆర్ఎస్ కూడా ప్రధాన కారణమని ప్రభుత్వం ఆలోచించి పునరాలోచన చేసుకోవాలి.
ఉద్యోగులకు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు పిఆర్సి తదితర సౌకర్యాలను కల్పించడంతోపాటు భూస్వాముల కొమ్ముకాసే రైతుబంధు పరిమిత భూమికి వర్తింప చేయడం ద్వారా వాస్తవంగా క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న కౌలు రైతులకు రైతుబంధు రైతు సాయాన్ని పెట్టుబడి సహాయాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం తన పథకాలను మార్చుకుంటేనే రాబోయే కాలంలో ప్రజల మన్ననలు పొంది అవకాశం ఉంటుంది లేకుంటే ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు ఎప్పుడైనా ఆలోచిస్తారు. అనుకూలమైన ప్రభుత్వాలకే ఓటు వేయడం ద్వారా తమ ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి ప్రజలు ఎప్పుడూ కూడా వెనుకాడరు ఈ విషయాన్ని అధికారపార్టీ గ్రహించాలి. జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాల వేలం అయినా అధికార పార్టీ ప్రభుత్వం తన విధానాలను మార్చుకుంటేనే రాబోయే కాలంలో ప్రజలకు ఏమైనా సేవ చేయడానికి అవకాశం ఉంటుంది లేకుంటే ప్రజలు ప్రతిపక్షాలు పునరాలోచన చేసుకుంటాయని ఈ ఎన్నికల ఫలితాల ద్వారా తెలుస్తున్నది
( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు, కవి, రచయిత ,అధ్యక్షులు జాగృతి కళా సమితి హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)
[12/6, 22:26] వడ్డేపల్లి మల్లీశం గారు: నేటి మాట 251/6.12.20 ఆదివారం
అంబేద్కర్ వర్ధంతి వేళ పూలమాల కు పరిమితం కావడం కంటే లక్ష్యం వేరే ఉండాలి.
వివిధ పాత్రల్లో అంబేద్కర్- అందరివాడు.
**********************************************----- వడ్డేపల్లి మల్లేశము,9014206412
మహానుభావుల జయంతులు వర్ధంతులు వేళ పూలమాలలు వేసి నివాళి అర్పించి స్మరించుకోవడం తోనే సరిపెట్టుకునే సాంప్రదాయము నుండి బయట పడాల్సిన అవసరం నేటి దేశ ప్రజానీకం పై ఎంతగానో ఉన్నది. మామూలు కార్యకర్త నుండి ప్రజాసంఘాలు రాజకీయ పార్టీలు చివరికి అత్యున్నతస్థాయి రాష్ట్రపతి గారి వరకు కూడా వారి సేవలను స్మరించుకోవడం తోనే సరిపెట్టుకుంటున్నాము కానీ జీవిత ఆచరణలో వారి ఆశయాలను నెమరువేసుకోవడం లేదు.
అంబేద్కర్ వర్ధంతి వేళ అటువంటి నిష్క్రియాత్మక మైన విధానము నుండి బయటపడి కృతజ్ఞతా భావాన్ని పెంచుకుని వారి భావజాల వ్యాప్తిని పెంపొందించడానికి కృషి చేస్తూనే అంబేద్కర్ ఎందుకు అందరివాడు? కొందరి వాడిగానే ఎందుకు చూడ పడుతున్నాడు? వారి కృషి పట్టుదల సామాజిక చింతన వలన లబ్ధి పొందిన ప్రజానీకం ఎందుకు కృతజ్ఞతలు తెలపడం లేదు అనే మౌలిక అంశాలను ఈ సందర్భంగా చర్చించుకోవాలి. గత అనేక దశాబ్దాలుగా విస్మరణకు గురవుతున్న ఈ ముఖ్య విషయాన్ని సమీక్షించుకుంటే రాబోయే కాలంలో యువత ప్రజానీకం ప్రజాసంఘాలు గురుతరమైన పాత్ర పోషించే అవకాశం మెండుగా ఉన్నది.
అంబేద్కర్ జీవితము ప్రజా దృష్టి:-
***********************************
1891 ఏప్రిల్ 14 వ తేదీన నేటి మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందిన "మౌ" అనే సైనిక స్థావరం ప్రదేశంలో మలోజీ సాక్వాల్,
భీమాబాయి దంపతులకు పద్నాలుగవ సంతానంగా జన్మించిన అంబేద్కర్ చిన్న నాడు అనేక రకాల ఇబ్బందులకు గురై మెహర్ అనే అస్పృశ్యత కుటుంబంలో జన్మించిన కారణంగా నాటి సామాజిక పరిస్థితుల వలన పాఠశాలలోనూ సర్వత్ర వివక్షతకు గురైన అనుకూలించని పరిస్థితులు బరోడా మహారాజు సహకారంతో ఉన్నత విద్యాభ్యాసం చేసి న్యాయవాదిగా ఆర్థికవేత్తగా సంఘసంస్కర్తగా సామాజిక తత్వవేత్త గా రాణించిన అంబేద్కర్ జీవితాన్ని అధ్యయనం చేయడం ద్వారా సర్వ ప్రజానీకానికి ఏ విధంగా మేలు చేశాడో మనం అవగతం చేసుకోవాలి.
. ఇప్పటికీ అంబేద్కర్ అట్టడుగు వర్గాలు, దళితులు, ఎస్సీ వర్గాలకు మాత్రమే సంబంధించిన వాడని దురభిప్రాయం బలంగా ఉన్నది. దాని వెనుక కొందరు కుట్ర ఉంటే వెనుకబడిన తరగతులు అగ్రవర్ణాల వారు మైనారిటీ ప్రజానీకం అంబేద్కర్ ను సమగ్రంగా అధ్యయనం చేస్తే ఈ దురభిప్రాయాన్ని బద్దలు కొట్టవచ్చు అంబేద్కర్ను అందరి వారిగా గుర్తించవచ్చు అది నేటి తక్షణ కర్తవ్యం. ఒక వర్గం మిగతా వర్గాలను కలుపుకుని పోకపోవడం వలన కూడా అంబేద్కర్ ఒక వర్గానికి మాత్రమే పరిమితమైన దురభిప్రాయం బలంగా నాటుకుంది. ఈ దురభిప్రాయాన్ని తక్షణమే తొలగించాలి. ఈ చైతన్యముతో నేటి ప్రజానీకం, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, బుద్ధి జీవులు, మేధావులు, అంబేద్కర్ స్టులు, అన్ని వర్గాల ప్రజలు కులమతాలకు అతీతంగా ప్రజల మనిషిగా చూడవలసిన చారిత్రక సందర్భం ఇది.
వివిధ పాత్రల్లో అంబేద్కర్ క్రియాశీలక పాత్ర--- అందుకే అందరివాడు:-
********************************
రాజ్యాంగ పరిషత్ లో సభ్యుడై తదనంతరం మంత్రివర్గంలో మొదటి న్యాయ శాఖ మంత్రి గా కొనసాగిన అంబేద్కర్ దళితులు ఆదివాసీలు అట్టడుగు వర్గాల వారి కోసం చేసిన కృషి, పడిన ఆరాటం సాధించిన విజయాలు అపూర్వం అనితరసాధ్యం. తదనంతర కాలంలో రిపబ్లికన్ పార్టీ లోనూ ఇండియన్ లేబర్ పార్టీ లోనూ తనదైన శైలిలో రాజకీయాలను నడిపిన అంబేద్కర్ సమాంతరంగా ఏకకాలంలో విభిన్న పాత్రలను పోషించడం ద్వారా సమకాలీన రాజకీయ ఆర్థిక సామాజిక జీవితాలను ప్రభావితం చేసిన సామాజిక విప్లవకారుడిగా అంబేద్కర్ను గుర్తిస్తే ఆయన ఎందుకు అందరి
వాడో తెలుస్తుంది.
- అంబేద్కరిజం అంటే ఎస్సీల వాదం అనుకుని పరిమిత వ్యక్తులకు అంబేద్కర్ ఆచరించిన సిద్ధాంతాలు నిర్వహించిన పాత్రను గుర్తించవలసిన దిగా విజ్ఞప్తి.
అంబేద్కర్ గొప్ప లౌకికవాది. మత ప్రసక్తి లేని రాజ్యం ఆదర్శాన్ని నమ్మిన వ్యక్తిగా మతం ఉచ్చులో రాజ్యం ఉండరాదని అభ్యుదయవాదిగా అంబేద్కర్ను చూడవచ్చు ఆ క్రమంలోనే రాజ్యాంగ రచన కొనసాగినది.
- ఒక ప్రజాస్వామిక వాదిగా అంబేద్కర్ రాజ్యాంగం పట్ల పూర్తి విశ్వాసంతో పాలకులు ఎవరైనా రాజ్యాంగమే ఇరుసుగా గల పాలనా యంత్రాంగంలో పనిచేయాలని దిశానిర్దేశం చేసిన అభ్యుదయవాది.
- అంబేద్కర్ భారతదేశపు గొప్ప ఆర్థిక వేత్త. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవిర్భావానికి భారతదేశంలోని మౌలికమైన రంగాలు పరిశ్రమలు, భూములు మౌలిక రంగాల్లో అన్ని కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగాలని ఆశించిన వారి కథలకు భిన్నంగా నేటి ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపుగా కొనసాగుతున్నది.
-- అంబేద్కర్ కేవలం రాజ్యాంగ రచన చేయడమే కాకుండా ఒక సామాజిక తత్వవేత్త గా రాజ్యాంగ రచన క్రమములో రాజు పేద కు ఒకే ఓటును కల్పించడం ద్వారా ఓటు హక్కు విషయంలోనైనా సమానత్వాన్ని సాధించడంతోపాటు ఓటు ద్వారా ప్రజా రాజకీయాలను శాసించే చాలని బానిసలుగా
బ్రతక రాదని సామాన్య ప్రజానీకాన్ని హెచ్చరించాడు.
- 12 వ ఆర్టికల్ నుండి 39 వ ఆర్టికల్ వరకు ప్రాథమిక హక్కులకు సంబంధించి మౌలికమైన అధికరణలను రాజ్యాంగంలో ప్రవేశపెట్టడం ద్వారా సర్వమానవాళికి పౌర హక్కులను ప్రాథమిక హక్కులను కల్పించి అందరివాడు అయినాడు.
- స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ఆత్మగౌరవం వంటి అంశాలను రాజ్యాంగంలోని పీఠికలో ప్రవేశపెట్టి భరోసా కల్పించిన ఘనత రాజ్యాంగ రచన శిల్పి.
- శతాబ్దాలుగా అనగారిన వర్గాలు వివక్షకు గురైన వారికి కల్పించిన రాజ్యాంగ రక్షణ ల ఆధారంగా రిజర్వేషన్లు ప్రత్యేక సౌకర్యాలు పొందిన ప్రజానీకం ,ఉద్యోగులు, కార్మికులు తమ వంతుగా ఆర్థిక సహకారాన్ని అందించాలని హెచ్చరించిన సామాజిక తత్వవేత్త .సామాజిక విప్లవకారుడు.
- మనుషులందరూ సమానమేనని కుల నిర్మూలన ద్వారా సమానత్వ సాధన దిశగా ప్రజానీకము కృషిచేసి దేశములో అంతరాలు లేని వ్యవస్థను సమ సమాజాన్ని స్థాపించాలని కలలుగన్న ధన్యజీవి అంబేద్కర్. మహిళలు కార్మికులు వారి హక్కుల కోసం చివరికి తన మంత్రి పదవిని త్యాగం చేసిన విశాల హృదయం ఉన్న అంబేద్కర్ అందరివాడు కాక ఏమవుతాడు?
- రిజర్వేషన్ల సౌకర్యం ద్వారా లబ్ధి పొందడంతోపాటు ఉద్యోగాలు సాధించుకున్న ఉద్యోగులు ఆర్థికంగా ఎదిగిన సామాజిక వర్గాలు ఏ మేరకు సమాజానికి మేలు చేస్తున్నారో అంబేద్కర్ కార్యక్రమాలలో, ఆచరణలో పాలుపంచుకుంటున్నారో ఆత్మవిమర్శ చేసుకొని మార్పు చెందవలసిన అవసరం ఎంతగానో ఉన్నది.
అటు రిజర్వేషన్ల సౌకర్యం ద్వారా లబ్ధి పొందినవారు ఇటు రాజ్యాంగము ఇతరత్రా సౌకర్యాలను జనానికి అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మేలు పొందుతున్న ప్రజానీకం అంబేద్కర్ ఉమ్మడి నాయకునిగా సంఘసంస్కర్తగా రాజనీతిజ్ఞుడిగా మేధావిగా గుర్తించవలసిన అవసరం ఇప్పటికైనా ఉంది.
రాజ్యాంగ రచన- కీలకాంశాలు వ్యాఖ్యలు:-
*******************************
రాజ్యాంగ రచన కమిటీలో ఏడుగురు సభ్యులు నియమించగా కొందరు రాజకీయాలలో వెళ్లడం మరికొందరు ఇతర దేశాలకు పోవడంతో పాటు ఇతరత్రా వాళ్లందరూ కూడా ఏదో కారణం వల్ల పాల్గొనకపోతే చివరికి అంబేద్కర్ ఒక్కడే డ్రాఫ్టింగ్ కమిటీ లో ఇతర దేశాలు పర్యటించి సమగ్రమైన భారత దేశ పరిస్థితులకు అనుకూలమైన రాజ్యాంగాన్ని రాయడంలో కృతకృత్యుడయ్యాడు అని నాటి కేంద్ర మంత్రి టి టి కృష్ణమాచారి చేసిన వ్యాఖ్యలను బట్టి సర్వ ప్రజానీకం మేలుకోరి ఏ రకంగా కృతకృత్యుడయ్యాడు రాజ్యాంగ రచనలో మనం గుర్తించ వలసి ఉన్నది.
అంబేద్కర్ జీవించిన కాలంలో ఉన్న పరిస్థితులే ఇప్పటికీ ఉన్నాయనడానికి అంబేద్కర్ ను ఉన్నత వర్గాల వారు గుర్తించకపోవడం బట్టి అంచనా వేయవచ్చు.
ఆ దుర్మార్గ భావజాలం నుండి ఆయా వర్గాలు బయట పడవలసిన అవసరం ఉంది.
1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్కు రాజ్యాంగాన్ని అప్పగిస్తున్న సందర్భంలో అంబేద్కర్ చేసిన క్రియాశీలక వ్యాఖ్య గుర్తించతగిన ది. ఈ హెచ్చరిక ప్రభుత్వాలకు కనువిప్పు గాను, దేశ ప్రజలకు చైతన్య సంకేతం గానూ తోడ్పడుతుంది.
" రాజ్యాంగబద్ధంగా ఏర్పడే ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన కొనసాగించాలి. బానిసలుగా చూసిన, సామాన్య ప్రజానీకాన్ని పరిగణనలోకి తీసుకోక పోయినా ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి , ప్రస్తుతం కొనసాగుతున్న వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి వెనుకాడరు. అప్పుడు ప్రభుత్వాల బాధ్యత వహించవలసి ఉంటుంది" అని అన్నారు.
మరొక సందర్భంలో రాజ్యాంగం గురించి మాట్లాడుతూ" రాజ్యాంగములో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ చిత్తశుద్ధి గల ప్రజా పాలకులు ప్రజలకు అనేక రెట్లు మేలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. రాజ్యాంగము సమగ్రంగా ఉండి అనేక రక్షణలు ఉన్నప్పటికీ పాలకులు నియంతలు, ప్రజలను బానిసలుగా చూసేవారు అయితే ఆ ప్రభుత్వంలో ప్రజలకు రక్షణ కానీ సంక్షేమ అభివృద్ధి గాని పొందలేరు". అంటూ పాలకుల చిత్తశుద్ధి ,పరిపాలన దక్షత, సామాజిక చింతన ప్రభుత్వాలకు, పాలకులకు ముఖ్యమని హెచ్చరించారు.
మరొక సందర్భంలో" రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన ప్రజలు కానీ పాలకులు గాని దేశ ద్రోహులు అవుతారు" అంటూ రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలను ఎవరు విస్మరించరాదు అని రాజ్యాంగబద్ధంగానే పాలన కొనసాగించాలని ప్రభుత్వాలకు ప్రజలకు మార్గనిర్దేశం చేశారు.
1956 డిసెంబర్ 6వ తేదీన 65 సంవత్సరాల వయసులో మరణించిన అంబేద్కర్ పైన ఇచ్చిన వివరణ ప్రకారం గా తన జీవితాన్ని ఏ వర్గాలకు అంకితం చేశాడు మనం గమనించవచ్చు. గుడ్డిగా ఒక కులానికి అంటగట్టే దుష్ట సంప్రదాయము నుండి బయటపడి ప్రజా జీవితంలో వారు పోషించిన పాత్రను మన నిజ జీవితంలో ఏ మేరకైనా ఆచరించడానికి పూనుకోవడం తోపాటు రాజ్యాంగాన్ని రాజ్యాంగ నిర్మాత జీవిత చరిత్ర లోని పుటలను అధ్యయనం చేయడం ద్వారా ఈ దేశ బాధ్యతాయుతమైన పౌరులుగా కొనసాగవలసి అవసరం నేటి తరం పై ఉన్నది. ముఖ్యంగా యువత ,విద్యావంతులు, ప్రజా సంఘాలు, మేధావులు, కుల మతాలకు అతీతంగా ఈ కృషిని కొనసాగించడం ద్వారా ప్రశ్నించే తత్వాన్ని మనకు నేర్పిన అంబేద్కర్ను ,ఆయన భావజాలాన్ని ఈ దేశంలో అంతరాలు, అసమానతలు, జాతి కుల వివక్ష ఉన్నంతకాలం సజీవ చైతన్యముతో ఉండటం ద్వారా రాజ్యాధికారానికి దూరమైన వర్గాలను అధికార పీఠంపై నిలబెట్టడమే సవాలుగా లక్ష్యంగా ముందుకు వెళ్లవలసిన అవసరం , బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది.
( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు కవి రచయిత సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు అధ్యక్షులు జాగృతి కళాసమితి హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం).
[12/7, 23:31] వడ్డేపల్లి మల్లీశం గారు: నేటి మాట 252/7.12.20 సోమవారం
నేటి రాజకీయాలు ప్రచార, ఆర్భాట, ప్రజావ్యతిరేక మైనవి... అవునంటారా? కాదంటారా? అయితే మరి ఏమంటారు?
*********************************************
---- వడ్డేపల్లి మల్లేశము,9014206412
గతంలో ఒక సినిమాల రాజకీయం అంటే రాక్షసత్వం తో జనానికి కీడు చేసే యంత్రాంగం అని నిర్వహించడం జరిగింది. అంత స్థాయిలో రాజకీయం గురించి వ్యాఖ్యానించిన ఏ రాజకీయ పార్టీ కూడా స్పందించకపోవడం రాజకీయ పార్టీలన్నీ కూడా ఆ నిర్వచనాన్ని అంగీకరించినట్లే కదా! అనిపిస్తుంటుంది.
ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగబద్ధంగా రాజకీయాలకు ఒక ప్రత్యేక స్థానం ,నిర్వచనం, విశ్లేషణ ఉన్నది. ప్రజా సమస్యల పరిష్కారంలో తాము నమ్మిన విశ్వాసాలు ప్రజల జీవన అంతరార్థాన్ని కనుకూలంగా ప్రజాశేయస్సే లక్ష్యంగా పని చేసే ఉమ్మడి అభిప్రాయాలు కలిగిన సమూహమే రాజకీయ పార్టీ. ఆ పార్టీకి నిబంధనలు పరిధి ఎన్నికల సంఘం ఆమోదం తదితర వివరాలన్నీ ఉండాల్సి ఉంటుంది. అయితే ప్రజా సంక్షేమం అభివృద్ధి ప్రాథమిక లక్ష్యం అనే విషయాన్ని ఏ రాజకీయ పార్టీ విస్మరించకూడదు
ఆర్భాటాలు ప్రచారాలకు పరిమితమైన ప్రజావ్యతిరేకమైనవి - నేటి రాజకీయాలు:-
******************************************
- ఎన్నికల కోసం మాత్రమే నేటి రాజకీయ పక్షాలు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ స్వప్రయోజనాలకు, అనేక అక్రమాలకు, మద్యం, డబ్బు పట్ల ప్రజలను ఓటర్లను బానిసలుగా చేసే దుష్ట సంప్రదాయాలకు పాల్పడుతున్నవి.
- పార్టీ ఫిరాయింపల పాల్పడడం, సమస్యల ప్రాతిపదికన కాకుండా, ప్రతిపక్ష పార్టీలు అసలే ఉండకూడదని దుష్ట ఆలోచనతో, నిస్సిగ్గుగా ఆచరణ సాధ్యం కాని ప్రలోభాలు, ఆకర్షణ పథకాలు, వాగ్దానాలతో ప్రజల శక్తిని ఆలోచనను నిర్వీర్యం చేసి బానిసలుగా చూసే మనస్తత్వం రాజకీయ పార్టీలు వదిలిపెట్టాలి.
- కరోనా నేపథ్యంలో కూడా ఇటీవలి జిహెచ్ఎంసి ఎన్నికలలో జనసమీకరణ చేయకూడదని స్పష్టమైన వైద్యశాఖ ఆదేశాలు ఉన్నప్పటికీ వేలాది మంది సమీకరించి బహిరంగ సభలు పెట్టినటువంటి ప్రభుత్వ,
ప్రతిపక్షాల సభలను ఎన్నికల సంఘం న్యాయ వ్యవస్థ పట్టించుకొని జరిమానా విధించి, చర్యలు తీసుకోవలసిన బాధ్యత న్యాయవ్యవస్థ ఎన్నికల సంఘం పైన ఉన్నది ఆ చర్చ జరగలేదు. చర్య తీసుకోలేదు.
- చిన్న కార్యక్రమాలు జరిగినా, ప్రమాణ స్వీకారోత్సవం లు పార్టీ ప్రచార కార్యక్రమాలకు పుట్టిన రోజులకు ప్రైవేటు విద్యా వైద్య తదితర సంస్థల ప్రారంభోత్సవాలకు అధికార ప్రతిపక్ష సభ్యులు శాసనసభ్యులు మంత్రులు ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు వేలాది సంఖ్యలో ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టి పర్యావరణ పరిరక్షణకు విఘాతం కలిగించే అక్రమ చర్యలకు కట్టడి ఏది? కంచే చేను మేస్తే కాపాడేది ఎవరు?
-- రహదారులు, గుంతలు బడి దుమ్ము రేపుతూ ప్రమాదాలకు గురి అవుతుంటే పట్టించుకోకుండా మిషన్ భగీరథ పేరుతో ఉన్న రోడ్డును సర్వనాశనం చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లను దుమ్ముకె అంకితం చేసిన ఈ ప్రభుత్వానికి ఏం శిక్ష విధిస్తారు?
- గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి లో పూర్తి వివక్షకు గురై కనీస అభివృద్ధి కానరాగలదు సౌకర్యాలు లేక ఆదివాసీలు వెనుకబడిన ప్రాంతాల వైపు కన్నెత్తి చూడని రాజకీయ పక్షాలు శాసనసభ్యులు ప్రజాప్రతినిధుల బాధ్యతారాహిత్యం పై చర్యలు ఎవరు తీసుకోవాలి? ఇదంతా దిగజారుడు, ప్రచార రాజకీయం కాదా?
-- ఇప్పటికీ అనేక గ్రామాల్లో చేపట్టిన కార్యక్రమాలకు స్థానిక సర్పంచులు వార్డు సభ్యులు పెట్టిన ఖర్చులకు ప్రభుత్వం నిధులు మంజూరు కాక అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడం అప్పులపాలు కావడం రాజకీయాల నుండి నిష్క్రమించి దుస్థితి దిగజారడం వంటి చర్యలకు ప్రభుత్వం బాధ్యత లేదా?
- ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలకు ఏక మొత్తంలో నిధులు ఉచితంగా ఇస్తామని ప్రకటించి ఇవ్వకపోవడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా?
--- ఎన్నికల సంఘం నిబంధనల మేరకు కాకుండా ప్రచార కార్యక్రమాలలో ఎన్నికల ఖర్చును ఎక్కువగా చేసి ప్రజాధనాన్ని దుబారా చేసి, అధికార పక్షం పోలీసు తదితర యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడాన్ని ఎలా అరికట్టాలి?
- శాసన సభ్యులతో పాటు ప్రజాప్రతినిధులు పర్యటనకు వచ్చినప్పుడు పోలీసు యంత్రాంగాన్ని భారీగా మోహరించి అధికార దుర్వినియోగానికి పాల్పడటం ఎవరి రక్షణ కోసం ఎవరి ప్రయోజనాల కోసం? అంతేకాకుండా వాహనాలు వెళ్తూ ఉంటే పోలీసులు పరిగెత్తడం, పోలీసులు ఎదురేగి స్వాగతం పలికి తిరిగి గ్రామం పొలిమేర వరకు సాగనంపడం రాచరిక పరిపాలన
కంటే హీనమైన సంప్రదాయం కాదా?
-- విభిన్న వర్గాలకు చెందిన ప్రజల మౌలిక సమస్యల పరిష్కారాన్ని పక్కనపెట్టి, ఖాయిలా పడిన పరిశ్రమలను తెరవకుండా, అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమను ప్రైవేటు పరం చేస్తూ, ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద్వ వైఖరిని ఖండించి వ్యతిరేకించని అంతకాలం ఈ ఏకపక్ష రాజకీయాలు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కొనసాగితే ఈ దేశంలో పెట్టుబడిదారులకు తప్ప పేదలకు భవిష్యత్తు ఉండదు.
- కారాగారాల్లో ఉండవలసిన నేరగాళ్లు ఉగ్రవాదులు తీవ్రవాదులు ప్రజలమధ్య ఉంటూ ప్రజా జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటే, చట్టసభలలో నేర సామ్రాజ్యం విస్తరించి కనీసం 40 శాతానికి పైగా ఉన్నారని ప్రభుత్వ గణాంకాలే చెబుతుంటే, ప్రజల కోసం జీవితాన్ని ధారపోసిన అనేక మంది మేధావులు, బుద్ధిజీవులు, సంపాదకులు, కవులు, కళాకారులు, ప్రజాసంఘాల కార్యకర్తలను నిర్బంధించే నియంత్రించే పత్రికా స్వేచ్ఛపై దాడులకు పాల్పడడం హేయమైన చర్య కాదా? ఇదంతా రాజకీయ పక్షాలు ప్రభుత్వాల కనుసన్నల్లో జరగడం లేదా?
ఆలోచించండి స్పందించండి:-
**************************
పైన తెలిపిన ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వాలు రాజకీయ పక్షాలకు తగిన గుణపాఠం నేర్పాల్సిన అవసరం ఆసన్నమయింది. కేంద్ర ప్రభుత్వం అయితే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు
పరం చేస్తూ రైతు వ్యతిరేక చట్టాలను అమలు చేసే క్రమంలో రైతు పోరాటం ఒక చారిత్రాత్మక సన్నివేశం. ఇలాంటి ప్రతి ఘటన ప్రజలు కార్మికులు రైతులు విభిన్న వర్గాల నుండి లేకుంటే ప్రభుత్వాలు ఎంతకైనా దిగజారుతారు ప్రజల జీవితాల్లోకి ప్రవేశిస్తాయి.
పైన తెలిపిన రాజకీయ పార్టీలకు సంబంధించిన కొన్ని అంశాల పట్ల మీ అభిప్రాయాన్ని ప్రకటించండి. స్పందించండి. ఆలోచించండి. మన ప్రతిఘటన, ఆలోచన.,
భవిష్యత్తు తరాలకు రాచబాట అవుతుందనే విశ్వాసంతో మీతో నా విజ్ఞప్తి. అవునంటారా? కాదంటారా? మరి ఏమంటారు?.
( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు కవి రచయిత అధ్యక్షులు జాగృతి కళాసమితి హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట, తెలంగాణ)
[12/9, 00:33] వడ్డేపల్లి మల్లీశం గారు: నేటి మాట 253/8.12.20 మంగళవారం
క్రియాశీల రాజకీయాలకు రాజకీయ పక్షాలు
చిత్తశుద్ధితో ప్రజల పక్షాన పూనుకోవాలి..
క్రియాశీల రాజకీయాలను ప్రజలు డిమాండ్ చేయాలి#
************************************
-- వడ్డేపల్లి మల్లేశము 9014206412
రాజకీయాలు ఎవరికోసం అని ఎవరైనా ప్రశ్నిస్తే సూటిగా సమాధానం చెప్పాలి ప్రజల కోసమని. అటు రాజకీయ పక్షాలు ఇటు ప్రజలు ఎవరు చెప్పిన సమాధానం ఒక్కటే/
అలాంటప్పుడు రాజకీయాలు కేవలం అధికారపక్షం కే కాదు ప్రతిపక్షాలకు కూడా రాజకీయాలు ఉంటాయి. ప్రజలు కేంద్రంగా రాజకీయ పార్టీలు నిర్వహించే కార్యక్రమాలు, చేసే డిమాండ్లు, తీర్మానాలు ,నిర్ణయాలు, ప్రాతినిధ్యాలు, సిఫారసులు అన్నింటినీ కలిపి రాజకీయాలు అని అంటారు.
తరచుగా అనే మాట రాజకీయాలు చేస్తున్నావా అని పరస్పరం అనుకుంటూ ఉంటారు. అంటే రాజకీయాలు అనే పదానికి విస్తృతమైన అర్థం ఉందని పై నిర్వచనము ద్వారా తెలుస్తున్నది. కావున రాజకీయాలు
అంటే అసందర్భం అని లేదా చులకనగా చూడవలసిన అవసరం లేదు. పైగా రాజకీయాలకు మరొక విస్తృత అర్థం సామాజిక రాజకీయ ఆర్థిక వ్యవస్థను మరింత ఉన్నత స్థితికి తీసుకొని వెళ్ళడానికి రాజకీయ పార్టీల ద్వారా చేపట్టే చర్యలు అని అర్థం. అందుకే క్రియాశీల రాజకీయాల ద్వారా విలువల కోసం కట్టుబడే రాజకీయ రంగంలోని నిపుణులు రాజనీతిజ్ఞుడు అని గౌరవంగా పిలుస్తారు.
క్రియాశీల రాజకీయాలు అంటే#
++++++++++++++++++++++++
నిన్నటి వ్యాసంలో ప్రచార ఆర్భాట రాజకీయాల గురించి మాట్లాడుకున్నాము.
ఆ రాజకీయాలకు పూర్తిగా భిన్నంగా* ప్రజల పక్షాన విలువలకు కట్టుబడి సేవాభావం ధ్యేయంగా వ్యవస్థను ఉన్నత స్థితికి తీసుకొని వెళ్ళడానికి చిత్తశుద్ధి అంకితభావంతో చేసే రాజకీయాలను కుట్రలు కుతంత్రాలు ప్రలోభాలు లేని రాజకీయాలను క్రియాశీల రాజకీయాలని*, అంటారు
- అధికార దుర్వినియోగం, పోలీసుల అతిగా వినియోగించుకోవడం, స్వార్థానికి పాల్పడడం, అక్రమ సంపాదన కోసం దేనికైనా సిద్ధపడటం, కేవలం ప్రచారానికి రాజకీయాలను వాడుకోవడం, నీతిమాలిన చేష్టలు, ఉన్నత వర్గాల కొమ్ము కాయడం,
వంటి నీచ రాజకీయాలు లేని నిర్మలమైన రాజకీయాలను మాత్రమే క్రియాశీల రాజకీయాలుగా చెప్పుకోవచ్చు.
- అది అధికార పక్షమైన ప్రతిపక్షమైన రాజ్యాంగబద్ధంగా నడుచుకొని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించకుండా చట్టాలు, శాసనాలను, చట్టసభలను గౌరవిస్తూ అవకాశవాదానికి పాల్పడకుండా ఉన్న రాజకీయాలను క్రియాశీల రాజకీయాల అంటారు.
- ప్రజలను నిర్వీర్యం చేయడం, బానిసలుగా చూడడం, మద్యాన్ని మత్తుపదార్థాలను ప్రోత్సహించడం, ప్రలోభాలకు గురి చేయడం,
ఎన్నికలలో పావులుగా వినియోగించుకోవడం, కులతత్వాన్ని, మతతత్వాన్ని ప్రోత్సహించడం వంటి చర్యలకు పాల్పడని రాజకీయాలు క్రియాశీల రాజకీయాలు అవుతాయి.
- సమాజంలో గల సామాజిక వర్గాల దామాషాలో స్థానిక సంస్థల తో సహా చట్టసభలకు సభ్యుల ఎంపికలో ఆర్థిక పరిస్థితి తో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రతిభకు ఆయా వర్గాలకు పెద్దపీట వేసే చర్యలు క్రియాశీల రాజకీయాలు అవుతాయి.
-- నేర చరిత్ర కల వాళ్ళు, పెట్టుబడిదారులకు కాకుండా సేవా దృక్పథంతో పనిచేసే నైతిక విలువలకు కట్టుబడిన వారికి మాత్రమే ఎన్నికలలో అభ్యర్థిత్వం ఇచ్చే రాజకీయ పక్షాల చర్యలు క్రియాశీల రాజకీయాలు అవుతాయి.
క్రియాశీల రాజకీయాల ను ప్రజలు డిమాండ్ చేయాలి#
******************
క్రియాశీల రాజకీయాలకు అమలు చేయడం రాజకీయ పార్టీలకు ఎంత ముఖ్యమో అవసరము పైన తెలుసుకున్నాం.
ఆ రకంగా క్రియాశీల రాజకీయాలనుండి వక్ర దారి పట్టే రాజకీయపక్షాలకు గుణపాఠం నేర్పడం ద్వారా ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా, అనేక ఇతరత్రా డిమాండ్ల ద్వారా రాజకీయ పక్షాలను సవాల్ చేయవలసిన అవసరం ఉన్నది. ప్రభుత్వంలో ఉన్న అధికార పక్షం ప్రతిపక్షాలతో ప్రజా సంఘాలతో మేధావులతో చర్చించి నిర్ణయం తీసుకునే మంచి సంప్రదాయం కొనసాగాలని ప్రజలు భావిస్తారు. ప్రస్తుత టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎన్నికల సందర్భంలో కీలక నిర్ణయాల సమయంలో ప్రతిపక్షాలు ప్రజా సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని గతంలో ఇచ్చిన హామీని ఏనాడు కూడా నెరవేర్చలేదు.
ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వలన, ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు పాల్పడడంతో ప్రతిపక్షాలు, ప్రజలు, ప్రజా సంఘాలు తల పెట్టి ప్రతి ఘటన ప్రభుత్వాలకు తలనొప్పిగా మారక తప్పదు. అదే సామరస్యపూర్వక వాతావరణంలో చర్చలద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. కానీ ఆ చిత్తశుద్ధి, పెద్దరికం అధికార పార్టీకి ప్రభుత్వాలకు ఉండక పోవడం వల్లనే ప్రభుత్వాలు అబాసుపాలు కావడంతోపాటు న్యాయస్థానాలలో వాటికి చుక్కెదురు అవుతున్నది
కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతము తీసుకున్న రైతు వ్యతిరేక నిర్ణయాలు చేసిన చట్టాల వలన సంఘటితమైన రైతులు వివిధ ప్రజా సంఘాలు ఉవ్వెత్తున కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన నేడు ప్రభుత్వాన్ని తలకిందులు చేస్తున్నది. ఇది రైతుల, ప్రతిపక్షాలను సంప్రదించకుండా చేసిన నిర్వాకానికి మచ్చుతునక. కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ దేశంలోని అనేక రాష్ట్రాల్లోనూ ప్రజా వ్యతిరేక చర్యలు తీసుకుంటున్న వేళ ప్రజలు ప్రజా సంఘాలు మిగతా రాజకీయ పార్టీలు సంఘటితమై పోరాడి వ్యతిరేకించడం ద్వారా తప్పుడు రాజకీయాలు చేసే రాజకీయ పార్టీలను క్రియాశీల రాజకీయాల వైపు మళ్ళించే వలసిన బాధ్యత ఈనాడు సమాజంపై, ప్రజలపై, మేధావుల పై , ప్రజా సంఘాల పై, ఇతర రాజకీయ పార్టీల పై ఎంతగానో ఉన్నది.
ఒకవైపు సమగ్రమైన రాజ్యాంగము, మరొకవైపు న్యాయవ్యవస్థ, ఇంకొక వైపు దాడి చేయడానికి ప్రతిపక్షాలు, నిరంతరం ప్రజలు, ప్రజాసంఘాల నిఘా ఉన్నప్పటికీ
రాజకీయ పార్టీలు తమ చిత్తశుద్ధిని వదిలిపెట్టి అవినీతి, అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతూ కార్పొరేట్ శక్తుల కొమ్ము కాయడానికి ఆరాట పడుతూ ఉంటాయి. అందుకే ఇవాళ ప్రజల మనుషులుగా కొనియాడబడుతున్న అనేకమంది కవులు, కళాకారులు, సంపాదకులు, పౌరహక్కుల నాయకులు మేధావులపై నిర్బంధకాండ కొనసాగుతుంటే అధికార పక్షాలతో పాటు ప్రతిపక్షాలు కూడా మౌనం దాల్చడాన్ని ఆయా రాజకీయ పార్టీల
డొల్లతనంగా, బాధ్యతారాహిత్యంగా చూడవచ్చు. పార్టీ ఫిరాయింపుల ను ప్రోత్సహిస్తున్న రాజకీయ పార్టీలు, చట్టసభలలో 40 శాతానికి పైగా ఉన్న నేరస్తులనుఏనాడు కూడా వ్యతిరేకించని రాజకీయ పార్టీలను నమ్మడానికి ప్రజలు ఇంకా సిద్ధంగా లేరు. అందుకే క్రియాశీల రాజకీయాల వైపు ప్రజలు ఆరాటపడుతున్నారు ఆ వైపుగా దేశంలో మార్పు రావాలని కోరుతున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రాజకీయ పార్టీలు మంచి మార్గంలో నడిస్తేనే వాటికి భవిష్యత్తు లేకుంటే ప్రశ్నార్థకమే/
#ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు కవి రచయిత సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు అధ్యక్షులు జాగృతి కళాసమితి హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం#
[12/10, 00:35] వడ్డేపల్లి మల్లీశం గారు: నేటి మాట 254/9..12..20 బుధవారం
అవినీతి పరిణామాలతో పాలకులు గుణపాఠం తెచ్చుకోవాలి- -ప్రజలు నీతివంతమైన పాలన కై డిమాండ్ చేయాలి.
*******************************************
-- వడ్డేపల్లి మల్లేశము,9014206412
అవినీతి అంటే ఏమిటి=
*****************************
సరళంగా చెప్పుకోవాలంటే నీతికి వ్యతిరేకమైనది అవినీతి. నీతి అంటే మంచి మాట నిజాయితీ అంటే ఆచరించి చూపడం.
అంటే నీతి లో నైతిక విలువలు ప్రధాన పాత్ర పోషిస్తాయి అది కేవలం సిద్ధాంతానికి సంబంధించినది కాక ఆచరణ కు సంబంధించిన మౌలిక అంశం. సాధారణంగా ఆర్థికపరమైన విషయానికి అవినీతిని ముడిపెడుతూ ఉద్యోగులు రాజకీయ నాయకులు చివరికి పాలకులకు సంబంధించిన లంచాలు అక్రమార్జన ను అవినీతి గా చెప్పుకుంటున్నాము. కానీ దీనిని విశాల అర్థం లో చూడవలసిన అవసరం ఉన్నది. ఆడిన మాట తప్పడం, మించిన వాగ్దానాలను కుమ్మరించ డము, ఉన్నత వర్గాల కొమ్ము కాయడం, పేద వర్గాలకు అన్యాయం చేయడం, అసమానతలు, అంతరాలు, వివక్షతను ప్రోత్సహించడం, కుల మతాలను రెచ్చగొట్టి కులతత్వం మతతత్వాన్ని పెంచి పోషించడం, ప్రజా సేవా కార్యక్రమాల ద్వారా కాకుండా ప్రలోభాలు ఆకర్షణ పథకాలతో మద్యం డబ్బు ఎరగా
చూపి ఓట్లు గుంజే ప్రయత్నాలను కూడా అవినీతిలో ప్రధాన భాగంగా చూడవలసి ఉంటుంది అప్పుడే సమగ్రమైన అవినీతి వ్యతిరేక విధానాన్ని రూపొందించడానికి, అవినీతి వ్యతిరేక సమాజాన్ని స్థాపించడానికి వీలవుతుంది.
అయితే ప్రధానంగా పేదలను సామాన్య ప్రజానీకాన్ని ఉద్యోగులు, రాజకీయ నాయకులు పనులు చేసిపెట్టే నెపంతో లంచాల రూపంలో దోచి అరాచక పాలన తోపాటు అకృత్యాలు అవినీతికి పాల్పడడం చట్ట వ్యతిరేక మే కాదు. శిక్షార్హమైన నేరం.
అవినీతి కొన్ని పరిణామాలు=
*********************************
ఈ దేశంలో అయితే అవినీతి చోటు చేసుకుంటుందో అక్కడ అసమానతలు, అంతరాలు, వివక్షత విచ్చలవిడిగా పెరిగి సమాజం నిలువునా రెండుగా చీలి పోతుంది.
ఉన్న వాళ్ళని లేని వాళ్ళని, కోటీశ్వరులు పేదవాళ్లు అనే తారతమ్యాలతో విచ్చిన్నకర పోకడలకు దారితీస్తుంది.
అవినీతి ప్రబలి పోయినట్లయితే అట్టడుగు వర్గాలు దారిద్ర్యరేఖ దిగువన గల ప్రజల జీవన ప్రమాణాలు మరింతగా దారుణంగా దిగజారుతాయి. పాలకుల పై వ్యతిరేక ప్రభావం పాలకులు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఏర్పడటంతో పాటు ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడుతుంది. ప్రజలకు ఉద్యోగిస్వామ్యం రాజకీయ నాయకుల పైన విశ్వాసం సన్నగిల్లుతోంది.
మానవ పౌర హక్కుల ఉల్లంఘన లతోపాటు మానవ సంబంధాలు బలహీనపడడం, మార్కెట్లో హెచ్చుతగ్గులు, అధికార వికేంద్రీకరణ వంటి దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయి.
అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం నేపథ్యం లక్ష్యాలు =
*********************************
మానవ జీవితానికి సంబంధించి అన్ని రంగాలలో ఐక్యరాజ్యసమితి కృషి చేసినట్లుగానే విశ్వవ్యాప్తమైన అవినీతి జాడ్యాన్ని నిర్మూలించే దిశగా ఐక్యరాజ్యసమితి 2003 అక్టోబర్ 31వ తేదీన అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ దేశాలతో నిర్వహించిన సుదీర్ఘ సమావేశం లో అవినీతిని కట్టడి చేయాలంటే అంతర్జాతీయ స్థాయిలో వ్యతిరేక దినం ఉండాలని దానికి కొన్ని లక్ష్యాలను నిర్దేశిస్తూ ఆనాడు తీసుకున్న నిర్ణయం మేరకు 2003 డిసెంబర్ 9వ తేదీ నుండి నేటి వరకు వరుసగా ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవం నిర్వహించడం జరుగుతున్నది. అది ఒక ప్రేరణగా, లక్ష్యసాధనకు దిక్సూచిగా, అవినీతి నిర్మూలన కు వేదికగా పనిచేస్తుందని నిర్ణయించిన డిసెంబర్ 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఆ అంశాన్ని ప్రతిబింబించేలా సభలు, సమావేశాలు, ప్రోత్సాహకాలు, యువతలో చైతన్యం తీసుకు వచ్చే పోటీలు తదితర కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని, లంచాలను, తదితర అవినీతి ని నిర్మూలించే కార్యక్రమాలు ప్రేరణగా పనిచేస్తాయి.
ప్రజాస్వామ్యానికి అవినీతి చెదలు వంటిది=
***********************************
ఇటీవల ఆసియన్ లా ఇన్స్టిట్యూట్ 17వ సమావేశంలో ప్రధాన ప్రసంగం చేసిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి గౌరవ జస్టిస్ ఎన్వి రమణ గారు చేసిన వ్యాఖ్యలు సమాజము యావత్తు ఆలోచించవలసిన అవసరం ఉన్నది., ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్య సంస్థల వేర్లకు అవినీతి అనేది ఒక చెదలు వలె పట్టుకుందని, రాజ్యాంగ సంస్థల పై ప్రజల విశ్వాసం సన్నగిల్లడం తో పాటు చివరికి ప్రజాస్వామ్య విలువలను కోల్పోవాల్సి వస్తుందని, అవినీతి గురించి హెచ్చరించారు. చట్టానికి న్యాయానికి మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయని దేశంలో చట్టం న్యాయం అనేవి రాజ్యాంగబద్ధంగా నడవాలని వారు అన్నారు.
అవినీతి నిర్మూలనకు సంబంధించి మాట్లాడుతూ,+ భారత రాజ్యాంగం న్యాయాన్ని సంకుచిత దృక్పథంతో చూడలేదని రాజ్యాంగ పీఠిక లోని సామాజిక, ఆర్థిక, రాజకీయ మొదలైన అన్ని రకాల న్యాయం గురించి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని , న్యాయస్థానాల తీర్పులు అన్ని న్యాయం పట్ల రాజ్యాంగ దృష్టిని స్పష్టీకరి
స్తాయని, రాజ్యాంగంలోని 38 వ అధికరణం ప్రకారం రాజ్యానికి కూడా సుస్థిరమైన సమాజం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉన్నదని వారు గుర్తు చేయడాన్ని అవినీతి రహిత పాలన ను ఆకాంక్షించే మనమందరం కూడా ఈ సందర్భంగా హర్షించ డంతో పాటు చట్టబద్ధమైన పాలన కోసం అవినీతికె వ్యతిరేకంగా ప్రభుత్వాలను డిమాండ్ చేయవలసిన అవసరం ఉన్నదని సమాజం యావత్తూ గుర్తించవలసిన అవసరం ఉన్నది.
అవినీతి నిర్మూలన పై కొన్ని సూచనలు#
*************************************
పాలనా క్రమంలో భాగంగా ప్రభుత్వం చేసిన ఖర్చులను ప్రభుత్వ సంస్థ అయిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ + కాగ్+
అనేక సార్లు ప్రభుత్వాలను తప్పుపట్టిన ఈ విషయాన్ని ఈ సందర్భంగా మననం చేసుకోవాలి .అయినా ఆ ప్రభుత్వాలకు న్యాయ వ్యవస్థ కాని, ఎన్నికల సంఘాలు తదితర సంస్థలు ఎలాంటి శిక్ష విధించిన దాఖలాలు లేకపోవడం బాధాకరం.
కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయడం, మానవ హక్కుల కమిషన్ ను బలోపేతం చేయడం, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా బలంగా పని చేయడం, సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ అధికారుల తప్పుడు పనులు అవినీతికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం ద్వారా దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయడం, తెలంగాణ ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం అని ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి చేయకపోవడాన్ని కూడా నిలదీయడం కోర్టులలో ప్రశ్నించడం అవినీతి నిర్మూలనకు కొంతవరకు పనిచేస్తాయి.
ఇప్పటికే అవినీతి వ్యతిరేక సంస్థలు పని చేస్తున్నప్పటికీ ప్రభుత్వం చెప్పుచేతుల్లో నడవడం వలన కూడా అవినీతిని ప్రశ్నించ
లేక పోతున్నవి. ఇప్పటికీ చట్టసభలలో 40 శాతానికిపైగా నేరచరిత్ర కలిగిన వాళ్ళు ఉన్నప్పటికీ పార్లమెంటు రక్షణ వలన వాళ్లను అధికారానికి దూరంగా ఉంచ లేక పోతున్నాము. తద్వారా అవినీతిపరులైన నాయకుల పాలనలో బ్రతుక వలసి వస్తున్నది. దీనికి ప్రజలు తమ ఓట్ల ద్వారా బుద్ధి చెప్పడమే అత్యంత పరిష్కారం.
ఎన్నికల నేరాలకు సంబంధించి ఎన్నికల కమిషన్, ఆర్థిక పాలనాపరమైన నేరాలు మాట తప్పడం లొసుగులు లోపాలు లోపాయికారీ ఒప్పందాలు ను న్యాయ వ్యవస్థ పరిష్కరించి దోషులకు శిక్ష వేయాలి.
అధికారం కేంద్రీకృతమై ఉండడం కూడా అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోవడానికి కారణం అవుతున్నది. అధికారాన్ని వి కేంద్రీకరించడంతో పాటు ప్రజలు చైతన్యమై ఎక్కడికక్కడ ప్రశ్నిస్తేనే ఒకప్పుడు విధానాలకు పాల్పడడం లంచాలు తీసుకోవడం మాట తప్పడం వంటి విషయాలలో అధికారులు నాయకులను బోనులో నిలబెట్ట వచ్చును.
ఇక చివరిగా అంబేద్కర్ అన్న మాటలతో ఈ వ్యాసాన్ని ముగించడం సందర్భోచితం అని భావిస్తూ రాజ్యాంగం ఎంత మంచిదయినా అప్పటికీ దానిని అమలు చేసే వారు చెడ్డవారైతే అప్పుడు ప్రజలకు మేలు కంటే కీడే జరుగుతుందని,
అది రాజ్యాంగం ప్రజల పక్షాన సమగ్రంగా లేకపోయినా పాలకులు పనిచేసేవారు నిపుణులు నీతిమంతులు అయినప్పుడు ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పిన విషయాన్ని పాలకులు గమనిస్తే నే ప్రజలకు రాజ్యాంగ ఫలాలు అందుతాయి. 73 ఏళ్ల
స్వాతంత్రం ఇప్పటికీ నీతి వంతులైన పాలకులను తయారు చేసుకో లేకపోవడం మన దౌర్భాగ్యం కానీ దానిని దేశ ప్రజానీకం యొక్క అసమర్థత గానే భావించాలి. చైతన్యవంతులై జాగరూకులై నా ప్రజా వలి ఉన్న ఈ దేశంలో రైతులకు మేధావులకు
బేడీలు వేస్తున్నారు. కానీ అవినీతిపరులైన ప్రజల ఆస్తులను కొల్లగొట్టే ,ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించే పాలకులకు బేడీలు వేసిన రోజున ఈ దేశంలో నీతివంతమైన పాలన సర్వత్రా వ్యాపించి సుసంపన్నం అవుతుంది.
/ +ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు కవి రచయిత అధ్యక్షులు జాగృతి కళాసమితి హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం+/
[12/10, 22:52] వడ్డేపల్లి మల్లీశం గారు: నేటి మాట 255/10.12.20, గురువారం
మానవ హక్కుల ఉల్లంఘన పరిరక్షణ ఆవశ్యకత-- చట్టము న్యాయము
**************************************
-- వడ్డేపల్లి మల్లేశము,9014206412
----- ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కు లను సామాన్య ప్రజానీకం ప్రభుత్వాలు, పెట్టుబడిదారులు, మార్కెట్ మాయాజాలం వలన క్రమంగా కోల్పోతూ దుర్భర దారిద్ర్యాన్ని , దయనీయ పరిస్థితులను గడుపుతున్నారు. భారతదేశంలో 1984లో భోపాల్ విషవాయు దుర్ఘటన ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. రక్షణ సౌకర్యం లేని కారణంగా ఆ పరిశ్రమలో చెలరేగిన వాయువు వేలాది మంది ప్రాణాలను బలిగొన్న గా అనేక మంది వికలాంగుల గా మారడం ఆస్తులను కోల్పోవడం ఆరోగ్యాన్ని కోల్పోవడం జరిగింది
ఇటీవల విశాఖ పట్టణంలోని పరిశ్రమలోనూ అలాంటి దుర్ఘటన జరిగి అనేక గ్రామాలకు విషవాయువు విస్తరించి జనాన్ని దయనీయస్థితిలో కి నెట్టివేసింది. ప్రజలు ఉద్యమాలు లే వహిస్తే మొక్కుబడిగా ప్రకటన చేసి పెట్టుబడిదారులు కొమ్ముకాసే ప్రభుత్వాలు పేద ప్రజలకు చేసింది ఏమీ లేదు పైగా అందులో పనిచేసే కార్మికుల తో సహా పరిసర గ్రామాలలోని ప్రజలు జీవించే హక్కును కోల్పోవడం ఆందోళన కలిగించే విషయం. అయినా ప్రభుత్వాలు గాని పెట్టుబడిదారులు గాని రక్షణ చర్యలు చేపట్టాలని కారణంగా ఆ పరిసర ప్రాంతాలన్నీ
పర్యావరణ కాలుష్యానికి గురి కావడం ఆందోళన కలిగించే విషయం.
ఇటీవలి కరోనా నేపథ్యంలో ఉపాధి అవకాశాలను కోల్పోయి అసమానతలు అంతరాలు మరీ తీవ్రమైనయి. జీవనోపాధి కోల్పోవడంతో పాటు వలస కార్మికులు బాధలు ఆకలి నిరాశ చేయము సామాజిక బహిష్కరణ తోపాటు సమాజ జీవితాన్ని కుటుంబ జీవితాన్ని కల్లోల పరచి ప్రజా జీవితంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ విషయంలో కూడా పేదవారికి మొక్కుబడి సహాయాన్ని ప్రకటించి పెట్టుబడిదారులకు మాత్రం లక్షల కోట్లను ప్యాకేజీగా అందించడం పేద వారి యొక్క హక్కులను కాలరాయడమే అవుతుంది.
అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం నేపథ్యం#
********************************
ప్రపంచ దేశాలలో పాలకుల వలన పెట్టుబడిదారుల వలన తోటి హింసాప్రవృత్తి గల వారితో ని కూడా అనేక మంది తమ జీవితాలే ఉనికిని కోల్పోయిన సందర్భంలో అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల పరిరక్షణకు గానూ 1948 డిసెంబర్ 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజానీకానికి సంబంధించి విశ్వ మానవ హక్కుల ప్రకటన కావించిన ది. కొంచము లోని చాలా దేశాలు ఈ ప్రకటనపై సంతకాలు చేయడంతో పాటు మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడం కోసం ప్రత్యేక కోర్టులు మానవ హక్కుల కమిషన్ లను ఆయాదేశాలలో ఏర్పాటు చేయడం జరిగింది.
1998లో సార్వత్రిక హక్కుల ప్రకటన కావింపబడింది 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ఒక ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేయడంతో పాటు తైవాన్లో మానవ హక్కుల ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది ఇవి ప్రపంచంలోని ఇతర దేశాలకు ప్రేరణగా పనిచేసినవి.
2008 డిసెంబర్ 10వ తేదీన మానవ హక్కుల ప్రకటన జరిగి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నాటి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆ ఏడాది అంతా మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన ప్రణాళికా రచన ఉపన్యాసాలు సభలు సమావేశాలతో ప్రపంచ దేశాలను మేల్కొలిపే ప్రయత్నం జరిగినది. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ రూపొందించిన డాక్యుమెంటు 360 భాషల్లోకి అనువాదమై ప్రపంచ రికార్డు సాధించిన ట్లుగా తెలుస్తున్నది.
1948 డిసెంబర్ 10వ తేదీన ఫ్రాన్స్ లోని ప్యారిస్లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం తీర్మానం 217 మేరకు ఈ సార్వత్రిక మానవహక్కుల ప్రకటన ను అప్పటి 58 మంది సభ్యులలో 48 మంది అనుకూలంగా ఓటు వేయడం ద్వారా మానవ హక్కుల ప్రకటన విశ్వవ్యాప్తమైన ది.
భారతదేశంలో మానవ హక్కుల చరిత్ర#
*************************************
1215 లో ఇంగ్లాండ్ ను పరిపాలిస్తున్న అప్పటి రాజు జాన్ విడుదలచేసిన హక్కుల పత్రం మాగ్నాకార్టా ప్రపంచంలోనే తొలిసారిగా ఆమోదించిన మానవ హక్కుల పత్రం. ఆ పత్రం ఆమోదించిన ముసాయిదా లోని అంశాలనే మానవ ,పౌర హక్కులు గా స్వాతంత్రం అనంతరం భారతదేశంలో సుదీర్ఘకాలం రూపొందించిన భారత రాజ్యాంగంలో చోటుచేసుకున్నాయి.
రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు సంబంధించిన అధికరణలను ఆధారంగా మానవ హక్కుల పరిరక్షణ కోసం న్యాయస్థానాల తో పాటు ప్రభుత్వాలను కూడా బాధ్యులను చేస్తూ 1993 లో మానవ హక్కుల పరిరక్షణ చట్టం భారత దేశంలో రూపొందించబడినది. దీని ప్రకారంగా రాష్ట్రాలు జాతీయస్థాయిలో మానవ హక్కుల కమిషన్ లు ఏర్పడటంతో పాటు ఈ చట్టం 1994 జనవరి 8 నుండి అమలులోనికి వచ్చినది.
మానవ హక్కుల ఉల్లంఘన పరిరక్షణ#
**********************
ఇవ్వాళ భారతదేశంలో ప్రజల మానవ, ప్రాథమిక, పౌర హక్కులు అనేక సందర్భాలలో విస్మరణకు గురవుతున్నాయి.
రాజ్యాంగబద్దంగా ఏర్పడిన చట్టాలను అమలు చేసే సందర్భంలో చట్టం ఉన్నవాడికి చుట్టం అవుతే లేని వారి పాలిట యమ పాశం గా మారుతున్న ది. ఒకవైపు న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం, కాగ్ వంటి ప్రభుత్వ సంస్థలు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన కారణంగా ప్రజల హక్కులు కూడా ఉల్లంఘనకు గురి అవుతున్నవి. ప్రభుత్వాలు పోలీసు వ్యవస్థను ఇష్టం ఉన్నట్టుగా వాడుకోవడం, శాంతి భద్రతల పేరుతో సామాన్య ప్రజానీకం పై నిర్బంధకాండ కొనసాగించడం, పత్రికా స్వేచ్చపై, మేధావులు కవులు కళాకారులు సంపాదకుల పైన నిర్బంధం విధించడం ద్వారా నోరు నొక్కే ప్రయత్నం చేయడం బహుశా ప్రపంచంలోనే మన దేశం మొదటి వరుసలో ఉన్నట్లుగా భావించవలసి ఉన్నది.
దాని ఫలితంగానే ఒకవైపు బుద్ధిజీవులు ప్రజలకు దూరమై చెరసాలలో బందీలయితే
నేరచరిత్ర ఉన్నవాళ్లే పార్లమెంటు చట్టసభల్లో తమ అధికార ప్రాబల్యం చూపుతుంటే మానవ హక్కుల ఉల్లంఘనకు కాక మరేం అవుతాయి#.
భారత ప్రభుత్వం చట్టం చేయడంతో పాటు జాతీయ రాష్ట్ర స్థాయిలో మానవ హక్కుల కమిషన్ ఏర్పడినప్పటికీ నిరుద్యోగం, పేదరికం ,అసమానతలు, అంతరాలు, వివక్షత వంటి అనేక రంగాలలో పేదలు, అనగారిన వర్గాలు తమ హక్కులను కోల్పోతు బానిసలు గానే బ్రతుకుతున్నారు.
ఒకవైపు దేశంలోని ప్రభుత్వ సంపదను ప్రైవేటు పరం చేయడం, ఖాయిలా పడిన పరిశ్రమలను తిరిగి ప్రారంభించక ప్రైవేటు రంగానికి బార్లా తెరిస్తే నేడు దేశంలోని సంపద 73% కేవలం ఒక్క శాతం సంపన్నుల చేతుల్లో ఉన్నది అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ప్రజాస్వామ్యం అమలులో నికృష్ట స్థాయి మానవహక్కుల స్థితిని తెలియజేస్తుంది.
ప్రజా పోరాటాలు ఉద్యమాలు, మేధావుల సూచనలు, ప్రజాసంఘాల కార్యాచరణ, ప్రతిపక్ష రాజకీయ పార్టీల ప్రోత్సాహంతో మానవ హక్కులను కాపాడుకోవడానికి సమగ్రమైన కార్యాచరణ చేపట్టవలసిన అవసరం ఉంది అప్పుడు మాత్రమే ప్రభుత్వాలు దిగజారుతున్న మానవ విలువలను కాపాడే ప్రయత్నం చేస్తాయి. తద్వారా మానవ హక్కులు పరిరక్షించ
బడతాయి.
# ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు కవి రచయిత అధ్యక్షులు జాగృతి కళాసమితి హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ#
[12/11, 23:46] వడ్డేపల్లి మల్లీశం గారు: నేటి మాట 256/11.12.20 శుక్రవారం
నేటి రాజకీయాలను ఎలా చూడాలి?..
ప్రక్షాళన అవసరమా? అయితే రాజకీయ ప్రక్షాళన ఎలా సాధ్యం?
******************************************-
- వడ్డేపల్లి మల్లేశము,9014206412
నేటి రాజకీయాలు ఎలా చూడాలి:-
*****************************
ఇటీవలి కాలంలో దేశంలో కొనసాగుతున్న రాజకీయాలను క్షుణ్నంగా పరిశీలించ వలసిన అవసరం ఉన్నది. పరిశీలించ కపోతే మంచిని చెడుని బేరీజు వేయలేం. రాజకీయాల పట్ల సరైన దృక్పథాన్ని అలవరచుకోలేము. దానితో అంచనా వేయడంలో రాజకీయనాయకుల నైతిక విలువలను అధ్యయనం చేయడంలో విఫలం అవుతాము.
ప్రస్తుత రాజకీయాలను ఎవరెవరు అధ్యయనం చేయాలి:-
ఉపాధ్యాయులు, మేధావులు, యువజన సంఘాలు, ప్రజా సంఘాలు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు, సంపాదకులు, చివరికి అన్ని వర్గాల ప్రజలు, కార్మిక రైతు సంఘాలు, సమాజం యొక్క ఉన్నతిని కాంక్షించే, వ్యవస్థ మరింత ఉన్నతంగా ఉండాలని కోరుకునే ప్రతి అభ్యుదయవాది కూడా నడుస్తున్న రాజకీయాలను పరిశీలించవలసి నదే.
రాజకీయాలను పరిశీలించడం ద్వారా రాజకీయ నాయకుల విధానాలను, ప్రవర్తన, ఆకాంక్షలు, ఆశయాలు, విధానాలు, వైఖరులు, దృక్పథాలను ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ప్రశ్నలు-జవాబులకు దారితీసి తమ విధానాలను సవరించుకోవడానికి తోడ్పడతాయి.
ఇక ప్రస్తుత రాజకీయాలను ఎలా చూడాలి అన్నప్పుడు స్థూలార్థంలో మూడు రకాలుగా పక్కదారి పడుతున్నట్లు అంచనా వేయవచ్చు
-- నైతిక విలువల పరంగా చూసినప్పుడు నీతిమాలిన రాజకీయాలు సర్వత్రా కొనసాగుతున్నాయి. మాటలకు చేతలకు పొంతన లేని స్వార్ధ పరమైన ఆలోచనలతో లాభాపేక్ష ప్రధానంగా తన సహచరులను కూడా అప్పుడప్పుడు మోసగించే రాజకీయాలకు పాల్పడుతూ ఉండడం గమనించవచ్చు. ప్రలోభాలు, ఆకర్షణ పథకాలు, ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలతో రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం ద్వారా అంబేద్కర్ అన్నట్లు దేశ ద్రోహానికి పాల్పడుతున్న సంఘటనలు అనేకం.
--- ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించి కులాల వారీగా సమీకరణ లతోపాటు డబ్బు పంపిణీ మద్యం మత్తు పానీయాలకు బానిసలను చేయడం ద్వారా ప్రభువులుగా చూడాల్సిన ప్రజలు ఓటర్లు యాచకులుగా మిగిలిపోతున్న వైనం ఆందోళనకరం.
---- నేటి ఎన్నికలలో కులం ప్రధాన పాత్ర పోషిస్తుంది. చట్టసభలు స్థానిక సంస్థలలో ఎస్సీ ఎస్టీ వర్గాలకు కొంత వెసులుబాటు ఉన్నప్పటికీ మెజారిటీ ప్రజా అనేకమైన వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ సౌకర్యం లేకపోగా డబ్బుo డి గెలవ కలిగిన వారికే టికెట్ అనే సాకుతో ఉన్నత వర్గాలకు మాత్రమే టికెట్టు అనే సిద్ధాంతాన్ని అన్ని పార్టీలు పాటించడం వలన బీసీ వర్గాలు రాజ్యాధికారానికి దూరమవడం చాపకింద నీరులా గా కొనసాగుతున్న కుట్రగా భావించవచ్చు. అన్ని సామాజిక వర్గాల లో బీసీలు మెజారిటీ తో పాటు అన్ని రంగాలలో నైపుణ్యం ప్రతిభ ఉన్నప్పటికీ అధికారానికి దూరం కావడమే ఆ వర్గాలను ఆందోళనకు గురి చేస్తున్న సమస్య.
పైన తెలియజేసిన మూడు రకాలుగా రాజకీయాలు ప్రజా రాజకీయాలకు భిన్నంగా కొనసాగుతుండడం ని మనం అంచనా వేయవచ్చు.
రాజకీయ ప్రక్షాళన ఎలా జరగాలి:-
**************************
ప్రస్తుత రాజకీయాలను నిర్మాణాత్మక పద్ధతిలో మార్చడం ద్వారా మాత్రమే ప్రజా రాజకీయాలు గా చిత్రించవచ్చు. ప్రజా రాజకీయాలు మాత్రమే ఈ దేశ ప్రజల అవసరాలను తీర్చగల వు. "ప్రజలే కేంద్రంగా,
అట్టడుగు వర్గాలే ఆలంబనగా, సామాన్య ప్రజల జీవన ప్రమాణములో మార్పు సంకేతంగా నైతిక విలువలకు లోబడి ప్రజాసేవే పరమార్థంగా నిర్వహించే రాజకీయాలను ప్రజా రాజకీయాలు" అంటారు.
1) ప్రజా రాజకీయాలను అన్ని రాజకీయ పక్షాల వాళ్లు ఆచరించే రకమైన ఒత్తిడి ప్రజల ద్వారా జరిగినప్పుడే ఇది సాధ్యమవుతుంది..
2) ప్రజల్లో చైతన్యం ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేయడం ద్వారా రాజకీయాలలో ప్రక్షాళన స్వాగతించ వచ్చు. ఈ చైతన్యం ప్రశ్నించే తత్వం పాఠశాలలు విద్యాసంస్థల కేంద్రంగా యువతలో మార్పు తీసుకురావడం ద్వారా, సాహిత్య సామాజిక అధ్యయనం పరిశీలన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.
ఉపాధ్యాయులు, యువత ,యువజన సంఘాలు, రచయితలు, కవులు బుద్ధి జీవులు తమ సామాజిక బాధ్యతను ప్రజా చైతన్యానికి ఉపయోగించడం ద్వారా మాత్రమే నీతిమాలిన అవినీతిలో కూరుకుపోయిన రాజకీయాలు అభిమానంతో ప్రక్షాళన కాగలవు. ఒక చెంపమీద కొడితే మరో చెంప చూపమని గాంధీ సిద్ధాంతము పనిచేయక పోగా ఒత్తిడి, రాజకీయ నాయకుల ఆత్మవిమర్శ ద్వారా కూడా ఇది సాధ్యమవుతుంది. ఈ ప్రక్షాళన ఒక ఉద్యమంలా దేశవ్యాప్తంగా కొనసాగితేనే మానవతా విలువల పునాదిగా నూతన రాజకీయాలు పరిఢవిల్లు తాయి.
3) ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, పౌరహక్కుల, ఉద్యోగ సంఘాల ఉద్యమ స్ఫూర్తి కూడా పోరాట రూపం దాల్చితే రాజకీయాలు పాలకులు ప్రభుత్వాలు తమ అక్రమ మార్గాలను విడిచి వాస్తవ రాజకీయాలలోకి వచ్చే అవకాశం ఉన్నది.
4) రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు వాటిని వ్యతిరేకిస్తున్నా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు లేదా ఉద్యమాలను గమనించిన న్యాయవ్యవస్థ లోతైన అధ్యయనం ద్వారా, సుమోటోగా స్వీకరించడము ద్వారా ఇటీవల తెలంగాణ లో ఆర్టీసీ ఉద్యమ సందర్భంలో గాని, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సంఘానికి ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన తగాదాల సందర్భంలోనూ న్యాయవ్యవస్థ జోక్యం చేసుకున్నట్లు చెంపపెట్టు తగిలితేనే కానీ మారని రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు కొంత ప్రజలకు అనుకూలంగా మెత్తబడే అవకాశం ఉన్నది.
ఇక చివరి అస్త్రంగా ఎన్నికల్లో ఓటు వేయడం ద్వారా ప్రజలు ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించి నప్పుడు అధికార పార్టీని ఆలోచింప చేయడం ద్వారా దూకుడుకు కళ్లెం పడే అవకాశం ఉన్నది. ఇటీవలి తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ జిహెచ్ఎంసి ఎన్నికల్లోనూ ప్రభుత్వ వ్యతిరేకత బిజెపి పార్టీకి అనుకూల ఇచ్చినట్లుగా విశ్లేషకులు అంచనా వేయడాన్ని అధికార పార్టీ కొట్టి వేయడానికి వీలులేదు కాకపోగా lrs, ఉద్యోగాలు కల్పించకపోవడం, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోవడం, పేదరిక నిర్మూలనలో తగు చర్యలు తీసుకోకపోవడం, రైతుబంధు విషయంలో కౌలు రైతులకు కాకుండా ఉన్నత వర్గాలకు కొమ్ము కాయడం వంటి విధానాల నుండి ప్రభుత్వం ఇకనైనా మారకపోతే రాబోయే ఎన్నికల్లో గుణపాఠంగా మిగిలిపోతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు
ఇటు రాజకీయ పార్టీలు, అటు ప్రజలు ఓటర్లు ఉద్యమకారులు పై విశ్లేషణను అవగతం చేసుకుంటే ఈ దేశంలో మెరుగైన రాజకీయాలను సాధించవచ్చనే చిరు ఆశ మాత్రం ప్రజల్లో ఉన్నది.
**( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు కవి రచయిత సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు అధ్యక్షులు జాగృతి కళాసమితి హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం).
[12/12, 22:26] వడ్డేపల్లి మల్లీశం గారు: నేటి మాట 257/12.12.20, శనివారం
నేరమయ రాజకీయాలను నిలువరించడానికి ప్రజలు ప్రజా సంఘాలు ఉమ్మడిగా పోరాడాలి. న్యాయవ్యవస్థ పాత్ర కీలకమైనది.
********************************************
--- వడ్డేపల్లి మల్లేశము,9014206412
స్వాతంత్ర్యము సాధించిన తొలినాళ్లలో ఆశయాలు ఆకాంక్షల మేరకు నిర్మించుకున్న రాజ్యాంగాన్ని పాటించాలనే తపన, ఆరాటం ఆనాటి ప్రభుత్వాలకు కొంత ఎక్కువగా ఉండటం వలన సామ్యవాద తరహా ప్రభుత్వ పాలనకు బీజం వేయడంతోపాటు ప్రభుత్వ రంగంలో మౌలిక అంశాల నిర్వహణ, కొన్ని సమస్యలను జాతీయకరణ చేయడంతోపాటు ప్రభుత్వ రంగం దాదాపుగా 85 శాతం గా ఉండేది.
ఆ క్రమంలోనే దేశములో భారీ ప్రాజెక్టులు పరిశ్రమలు వ్యవసాయ రంగం బలోపేతం కావడం జరిగింది. క్రమంగా ప్రభుత్వం బాధ్యతారాహిత్యానికి పాల్పడటంతో పాటు ప్రణాళికా వ్యయం పెరగడం, ప్రణాళికా రచనలో పేదలకు ప్రాతినిధ్యం లేకపోవడం, బడ్జెట్ లు అన్నీ కూడా అంకెల గారడి లే అని ప్రతిపక్షాలు విమర్శించడం క్రమంగా రాజకీయాల్లో నేరప్రవృత్తి చోటుచేసుకోవడంతో గత నాలుగైదు దశాబ్దాలుగా భారత దేశంలో ప్రజాస్వామ్యం అబాసుపాలు అవుతూ వస్తున్నది.
నేరమయ రాజకీయాలు విశ్లేషణ:-
*****************************
తొలినాళ్ళలో అంతో ఇంతో రాజనీతిజ్ఞత ప్రదర్శించిన రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు క్రమంగా స్వార్థ చింతన పెరగడంతో అక్రమార్జన అతిగా అధికారాన్ని దుర్వినియోగం చేయడంతో నేరమయ రాజకీయాలు వైపు అనూహ్యంగా మద్దతు పెరిగింది. రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలు తదితర విషయాలలో డబ్బు మద్యం కులాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో కూడా నేరప్రవృత్తి అనూహ్యంగా మించిపోయింది
అయితే క్రమంగా అప్పటికే రాజకీయాల్లో కొనసాగుతున్న వారు అవకాశాలు స్వార్థం వలన నేరాలు చేసి నేరచరిత్ర మూటగట్టు
కుంటే, రాజకీయాలతోనే సంబంధంలేని పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు అప్పటికే నేరాలు-ఘోరాలు చేసినటువంటి వాళ్లు ఆత్మరక్షణ కోసం ఆశ్రయం కోసం రాజకీయాలకు రావడంతో రాజకీయంలో నేరగాళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.
రాజకీయాలు నేరపూరిత అవుతున్న దశలో న్యాయవ్యవస్థ కానీ ఎన్నికల సంఘం కానీ అంతగా పట్టించుకోని కారణంగా తొండ ముదిరి ఊసరవెల్లి అయిన చందంగా గోటితో పోయేదాన్ని గొడ్డలి కూడా లొంగని జాడ్యం గా మారడంతో ఇవ్వాళ రాజకీయాలను నేరచరిత్ర గలవారే శాసించడం ప్రమాదకరం మాత్రమేకాదు ప్రజాస్వామ్య సౌధానికి ప్రజలకు ఆందోళనకరం కూడా.
నేరమయ రాజకీయాలు కొన్ని దృష్టాంతాలు:-
******************
కొన్ని సర్వేల ప్రకారం గా 2009 లో ప్రారంభమైన 14వ లోక్సభలో 24 శాతంగా ఉన్న నేరచరిత్రుల సంఖ్య 15వ లోక్ సభలో 30% కి 16వ లోక్ సభ లో 34 శాతానికి క్రమంగా ప్రస్తుతం కొనసాగుతున్న 17 వ లోక్ సభ కాలానికి 43 శాతానికి పెరగడం మన రాజకీయాల ప్రజాస్వామిక ధోరణికి అద్దం పడుతుంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ అక్రమాస్తుల కేసులో జైలు నుండి రావడం, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుంభకోణాల చరిత్ర కారణంగా జైలు పాలు కావడం, ఇటీవల జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల్లో విజేతలైన చాలామందిలో అధికార పార్టీ టీఆర్ఎస్ బీజేపీ తో సహా అన్ని పార్టీలలో నేరచరితులు ఉన్నట్టు పత్రికల్లో రావడం ఇంకా అనేకమంది చట్టానికి దొరకక అధికార దుర్వినియోగంతో తప్పించుకుంటూ ఉన్నవాళ్లు అనేకమంది నేడు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఈ దేశంలో రాజకీయ అవినీతి నేరచరితులు ఉన్నంతకాలం పాలన సక్రమంగా ఉండకపోగా అట్టడుగు వర్గాలకు రక్షణ లేకపోవడమే కాక ఉద్యోగ యంత్రాంగం లోనూ ప్రబలంగా ఉన్నా అవినీతి లంచగొండితనం రూపుమాపడం అసాధ్యం .
ఎందుకంటే కంచే చేను మేసినట్లు ప్రజా నాయకులు అవినీతికి పాల్పడి నేరగాళ్లు అయితే ఉద్యోగ స్వామ్యం లోని అవినీతి ని ఎలా అరికట్టగలరు?
నేరమయ రాజకీయాలకు ఆజ్యం
పోసినది ఎవరు:-
***********************
నేరమయ రాజకీయాలను నుండి భారత ప్రజాస్వామ్యానికి వృత్తి కల్పించాల్సిన అవసరాన్ని ప్రజలు ప్రజా సంఘాలు న్యాయవ్యవస్థ గుర్తించిన సందర్భంలో 2014 ఎన్నికల్లో ప్రధాని పదవికి అభ్యర్థిగా ఉన్న మోడీ గారు" రాజకీయాల ప్రక్షాళన కోసమే నేను వచ్చాను" అని ప్రకటించినట్లుగా విశ్లేషకులు చెబుతుంటే గత ఆరు సంవత్సరాలుగా బిజెపి ప్రభుత్వంలో నేరమయ రాజకీయాలను
అదుపుచేయడంలో కార్యాచరణకు రాబట్టినట్లుగా మనకు తెలుస్తున్నది.
జైలులో ఉన్న వారు ఓటు హక్కు కోల్పోతారు కనుక అలాంటి వాళ్లకు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉండదని 2013లో సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చినప్పుడు నాడు అధికారంలో ఉన్న యూపీఏ సర్కారు సుప్రీం తీర్పు అనుకూలంగా చర్యలు తీసుకోక పోగా ఆ తీర్పును నీరుగార్చడానికి ఆరాట పడినట్లుగా తెలుస్తోంది.
ఈ విషయంపై సర్వే జరిపిన న్యాయ సంఘం" ప్రాథమిక సాక్ష్యాల పరిశీలన తర్వాత కోర్టులో అభియోగాలు నమోదు చేసినప్పటి నుండి ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటిస్తే నేరచరిత్రులను అడ్డుకునే వీలుందని" ముందుజాగ్రత్తలను తన నివేదికలో ప్రస్తావించింది.
2018 సెప్టెంబర్ లో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం" నేర రాజకీయాలు ప్రజాస్వామ్య సౌధానికి ప్రమాదకరమని, హేయమైన నీచమైన నేరాలకు పాల్పడ్డ వాళ్లు ఎన్నికల బరిలోకి రాకుండా పార్లమెంటు పటిష్ట చట్టం చేయాలని" సూచించినది.
పార్లమెంటు చట్టం చేయకపోవడం వలన జైలు నుంచి నేరుగా పోలీసు వాహనం లోనే వచ్చి నామినేషన్లు సమర్పించి ఎన్నికల్లో నెగ్గిన ఘరానా నేరస్తులతో పాటు 58 శాతానికి పైగా నేరచరితుల తో బీహార్ అసెంబ్లీ నిండి పోయింది అంటే ఆ చట్టసభ ఏ వర్గ ప్రయోజనాల కోసం పనిచేస్తుందో ఆ₹లోచించవచ్చు.
కొన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు న్యాయస్థానాలు:-
*********************
ప్రజా ప్రాతినిధ్య చట్టం8(3) నిబంధన ప్రకారం గా" రెండేళ్లు ఆపై శిక్ష పడగల కేసులో దోషిగా నిరూపణ జైలు శిక్షకు గురైన ప్రజాప్రతినిధికి ఆ రోజు నుంచి అనర్హత వర్తిస్తుందని విడుదల అయిన రోజు నుంచి ఆరేళ్లపాటు అది అమలులో ఉంటుందని "
చెబుతుంటే, ఐపీసీ ఇతర చట్టాల ప్రకారం శిక్షపడిన ప్రభుత్వ ఉద్యోగులు జీవితకాలం విధుల నుంచి బహిష్కరిస్తున్నప్పుడు
ప్రజాప్రతినిధులను మాత్రం నిర్ణీత కాల మే వెలివేయడం రాజ్యాంగంలోని 14వ అధికరణం ప్రకారం సరికాదని ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై వచ్చిన వాదన పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని సుప్రీంకోర్టు అడిగినది.
మరొక వైపు శిక్ష పడిన ప్రతినిధులకు జీవితకాల బహిష్కరణ సరైనదని ఎన్నికల సంఘం కూడా అభిప్రాయపడడం సంతోషకరం. చట్టం ముందు అందరూ సమానులే అని స్పందించిన కేంద్ర ప్రభుత్వం నిర్ణీత సర్వీసు నిబంధనలకు లోబడి కాకుండా శాసనకర్తలు దేశానికి పౌరులకు సేవ చేస్తామన్న ప్రమాణానికి కట్టుబడి ఉన్నారని కాబట్టి వారికి సవరించాల్సిన అవసరం లేదని నేరమయ రాజకీయాలను సమర్థిస్తూ వత్తాసు పలకడం విచారకరం.
ఇటీవల నేరమయ రాజకీయాలపైన ప్రజాప్రయోజనాలు దాఖలైన సందర్భంలో" నేరం రుజువైన నేతలను జీవితకాల బహిష్కరణ తోపాటు వాళ్లు పార్టీలు పెట్టకుండా పార్టీలో కీలక పదవులు చేపట్టకుండా చూడాలని కోరిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించి పక్కదారి పట్టించింది.
అధికారంలో ఉన్న పార్టీ తో పాటు అన్ని రకాల రాజకీయ పార్టీలకు నేర పూరిత రాజకీయాలకు అవకాశం ఇవ్వడం లో చూపిన శ్రద్ధ కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సమర్పించిన తాజా ప్రమాణపత్రం లో మాత్రం నేరమయ రాజకీయాలను కట్టడి చేయాలన్న స్పృహ లేకపోవడం పట్ల ఈనాడు న్యాయవ్యవస్థ, ప్రజలు, ప్రజా సంఘాలు ఉమ్మడిగా పోరాడి సాధించుకోవాల్సిన అవసరం ఉంది తద్వారా మాత్రమే నేరమయ రాజకీయాలను ప్రక్షాళన చేయడం సాధ్యమవుతుంది. రైతుల గురించి రైతులకు నష్టం చేసే చట్టాలను చేసిన కేంద్ర ప్రభుత్వం నేరమయ రాజకీయాలను కట్టడి చేయడానికి సమగ్ర చట్టం చేయడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నదో దేశ ప్రజలు ప్రభుత్వాలను నిలదీయాల్సిన అవసరం ఆసన్నమైనది. ఇందుకోసం ఉద్యోగులు ఉపాధ్యాయులు మేధావులు కార్మికులు పత్రికారంగ నిపుణులతో పాటు అన్ని వర్గాల సమైక్య ఉద్యమము మాత్రమే కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించగల దు.
( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు కవి విమర్శకులు అధ్యక్షులు జాగృతి కళాసమితి హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం).
No comments:
Post a Comment