రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.
6 / 01 /2021.
పాశురము 22.
శీర్షిక :
ఏ పుార్వ పుణ్యమొా ఏ నోము ఫలమొా
రేపల్లె వాసుల మైతిమొా క్రిష్ణయ్య
విరిసిన కలువల రేకు కన్నులవాడ
ఒకపరి మము జుాడ మరుగేలనయ్యా..।॥
ఉభయ శరీరాల ఉన్మాదాకృతితో
ఉరికిన రంగా శ్రీ నారసింహా
ధర నుద్ధరించిన దానవారివి నీవు
అరమొాడ్పు కన్నుల అలసి పరుండేవ...॥
రణరంగ ధీరులౌ రాజాధిరాజులు
పణమొడ్డి పోరాడి ఓడి దర్పము వీడి
క్షణమైన నిను విడక నీ దాసులౌ రీతి
వేల నుతులను వేడి నిను జేర నిలచితిమి ॥
డెప్పరములౌ నీదు నామ కీర్తన తోడ
పులకరింతల మేని నిన్ను కొలిచేము
సుార్య చంద్రుల పోలు కాంతి కన్నుల విప్పి
పాపాలు మడియించి మ మ్మేల రావయ్య.. ॥
కరుణతో మమ్మేల కన్నడించగనేల
ప్రహ్లాద వరదా ప్రభు పాండురంగా...
అతులితమౌ నీదు బల అవతారముల
శాప పాపము గాల్చ మేల్గాంచుమయ్యా ॥
No comments:
Post a Comment