Saturday, January 9, 2021

నవ విధ భక్తి మార్గాలు

నవవిధ భక్తి మార్గాలు.

రచన:శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
శీర్షిక .
నిష్ట- నియమం
--------------------
భగవంతుని పూజింపడానికి అనేక విధాలైన మార్గాలున్నాయి.

శ్లోకం :
శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనం
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం ॥

నవవిధ భక్తిమార్గాలు  : 1.శ్రవణము 2.కీర్తనము 3.స్మరణము 4.పాదసేవనము 5.అర్చనము 6.వందనము 7.దాస్యము 8.సఖ్యము 9.ఆత్మ నివేదనము  అన్నవి .

ఐతే వాస్తవానికి అవి తొమ్మిది మార్గాలు కాదు, ఒకే మార్గంలో వివిధ దశలు.

భ్రమరాన్నే చింతించిన కీటకం భ్రమరం అవుతుంది.
అలాగే నిత్యం భగవధ్యానం లో ఉన్న భక్తుడు
భగవత్  సాక్షాత్కారాన్ని పొందగలడనడం లో సందేహం లేదు.

భగవంతుని గూర్చిన గాథలు, భజనలు, కీర్తనలు వినడం 
భగవంతుని గుణగణములను కీర్తించడం అంటే 
పాడుకోవడం .
 భగవంతుని స్మరించడం - నిత్యం ధ్యానం చేయడం..
 దేవుని పాదములను పూజ చేయడం..
 గుడిలోగాని, ఇంటిలోగాని, హృదయములో గాని విధివిధానములతో అర్చనలు చేయడం..
 ప్రణామం చేయుట అంటే భక్తిగా నమస్కరించడం.
 భగవంతునకు దాసుడవడం..దాస్యం చేయడం...  
భగవంతుని తో సఖ్యత చేయడం 
 తనను పూర్తిగా దేవునకు సమర్పించుకోవడం అంటే
 ఆత్మ నివేదన చేయడం...
 ఇవన్నీ భక్తి మార్గాలే.

నియమబద్ధమైన జీవితానికి అలవాటుపడుతూ..క్రమశిక్షణ కలిగివుండటం అలవాటుగా చేసుకోవాలి... నామం జపం చేయడం  , రాయడం ద్వారా ఏకాగ్ర దృష్టి పెంచుకోవాలి....నామానికి, రూపానికి, గుణానికి అతీతమైన భగవంతుడు ధ్యానంలో మాత్రమే కనిపిస్తాడు, వినిపిస్తాడు. ధ్యానం చేస్తూ భగవంతుడికి దగ్గరవ్వాలి.
 మహాత్ముల, భక్తుల, సద్గురువుల, వారి శిష్యుల జీవిత చరిత్రలు చదువుతూ వారు ఏ విధంగా చేసారో గమనిస్తూ...వాటిని ఆచరిస్తూ,.మనం అన్నిటినీ ఒదులుకోవటానికి సిద్ధపడగానే 
 భగవంతునికి
 ఆత్మ నివేదన చేసినవారమౌతాము.
 అపుడు భగవంతుని కి భక్తులకు మధ్య
 తేడా లేని దివ్యానుభుాతిని పొందినవారమౌతాము

No comments:

Post a Comment