7/01/20
మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
ధనుర్మాస కవితోత్సవాలు-2020.
పాశురము: 23. ( అచ్యుత నామార్చన. )
పర్యవేక్షణ: *డా॥అడిగొప్పుల సదయ్యగారు.
నిర్వాహణ : శ్రీమతి బీరప్పొల్ల అనంతయ్యగారు.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.
పాశురము 23.
శీర్షిక .
అవినీతి సెపుావు.
--------------------
అవిసె పుా వన్నెగల అందమున్నా సామి .
అదె మందిరము వీడి కదలిరా ఒకపరి.
ఆది అంతములేని ఆదినారాయణ
అవనిమా మన్ననల అందుకో అభిరామ ॥అవిసె పుా॥
చరణం:
శుద్ధ జ్ఞానానంద శుభ గుణ సంపుార్ణ
అవని కార్యము గనుమ అచ్యుతా అనంతా...
శృతి సార సంపుార్ణ సిరి నిలయ శ్రీరంగ
మాకోర్కెలను దీర్చ మన్నించి వెలికిరా...॥
చరణం:
వర్ష ఋతువందునా వర్షించు మేఘాల
సవ్వడికి మేల్గాంచి సింగమ్ము లంఘించి
భీకరాకృతి తోడ భీషణపు ఘర్జనల
గుహను వదలీ బయలు వెడలు రీతీ....॥అవిసె పుా॥
నిర్గమించర సామి నీల మేఘశ్యామ
పాదుకొన్న వేల్పు నీవేగద పరమేశ ॥
చరణం :
విచ్చు తామర వోలె వరలు కన్నులు తెరచి
యిచ్చ మము గావుమా సమకట్టి నార్తితో
విజయ పీఠమునెక్కి విను మా విన్నపాలు
హృన్నిలయ శ్రీ చరణ సమ్మతిని మము బ్రోవ ॥అవిసె పుా॥
అవిసె పుా వన్నెగల అందమున్నా సామి .
అదె మందిరము వీడి కదలిరా ఒకపరి.
ఆది అంతములేని ఆదినారాయణ
అవనిమా మన్ననల అందుకో అభిరామ ॥
॥అవిసె పుా
-----------------------------------------------------
8 /01/2021
మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
ధనుర్మాస కవితోత్సవాలు-2020.
పాశురము: 24 (జనార్ధన నామార్చన. )
పర్యవేక్షణ: *డా॥అడిగొప్పుల సదయ్యగారు.
నిర్వాహణ : శ్రీమతి కె. గీతా శైలజగారు.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.
శీర్షిక .
మంగళ స్వరుాపయడు.
------------------------------------
పల్లవి:
మంగళ ధాముడవు మంగళ నాముడవు
అవతారములనెత్తి ఆదుకొను దేవుడవు..
అనుపల్లవి.:
మంగళమ్ముల నిడి మము బ్రోవ వత్తువని
నమ్మి కొలిచేమయ్య వ్రత దీక్ష పుానీ ॥
కనులు తెరచీ మమ్ము కరుణించవయ్యా
వ్రత దీక్ష నెరవేరు వరమొసగవయ్యా ॥
చరణం:
నీ పుాజ చేయంగ నిత్య స్నానములిడి
నీ లీల గానాల నీ పాదముల గొల్చి
మార్గశీర్షపు వ్రతము మనసార సలి్పి
నిత్యమంగ ళముకోరి నిను కోరి వచ్చితిమి ॥
కనులు తెరచీ మమ్ము కరుణించవయ్యా
వ్రత దీక్ష నెరవేరు వరమొసగవయ్యా ॥
చరణం:
ముల్లోకములు గొలువ మలయు పాదములకుా
రావణాది అసురుల మడియించు శక్తికి
పుాతనాదుల గుాల్చు పురుషోత్తమా నీకు
నిత్య శుభ నీరా జన- మంగళములివే ॥
కనులు తెరచీ మమ్ము (చుాచి ) కరుణించవయ్యా
వ్రత దీక్ష నెరవేరు వరమొసగవయ్యా ॥
చరణం:
గోవర్ధనము నెత్తి గోవుల గాచేటి
గిరిధారి కృష్ణునకు ఘన మంగళం ..ఘన మంగళంబిదే
వెన్నిడౌ శ్రీ ముార్తి యఖుడు మా కనినమ్మి
మహిత గుణముల మేటి మంగళము పాడేము ॥
కనులు తెరచీ మమ్ము (చుాచి ) కరుణించవయ్యా
వ్రత దీక్ష నెరవేరు వరమొసగవయ్యా ॥ .
చరణం :
వేలాయుధమ్మునకు వేద వేద్యా జయము
వేల నామాల శ్రీ హరి క్రిష్ణ జయము
పురుషార్ధముల నిచ్చి పరనిచ్చు పరమేశ
నాధ శ్రీ జనార్దన గొనుమయ్య మంగళం ॥
కనులు తెరచీ చుాచి కరుణించవయ్యా
వ్రత దీక్ష నెరవేరు వరమొసగవయ్యా ॥
మంగళమ్ముల గొని మమ్మేలుమయ్యా
రంగ శ్రీనాధా సిరివర గోపాల .॥
No comments:
Post a Comment