రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.
11 / 01 /2021.
పాశురము 27.
శీర్షిక .
వేడుకోలు.
--------------------
పాశురము 27.
11/01/2021.
శీర్షిక .
"పర"నిమ్మ పరమేశ .
---------------------------
కల్యాణ గుణధామ గోవింద నామా
పరనిచ్చు పరమేశ హరి పరంధామా
యెలమి నీ వ్రత దీక్ష పుానియుంటిమిగామ
ఆదుకొని మముబ్రోవవే శేష శయనా..॥కల్యాణ॥
మేమే నీవను నీవే మేమను
భావము నిమ్మా భక్త వత్సలా..
భాగ్యము నీవై భక్తియు నీవగు
"పర" నిచ్చి మమ్మేలు పరమ పావనా॥కల్యాణ॥
మదిలో నీ ముార్తి పలుకుల నీ కీర్తి
కన్నుల నీరుాపే కరముల నీ సేవే
తనువెల్ల భాసిల్లు పాంచజన్యపు ద్యుతి
నిలువెల్ల నింపు నీ ప్రణవ నాదపు స్తుతి ॥కల్యాణ॥
పాటిల్లు భరణముల మేని నిండుగ దాల్చి
మసలి మీతో గుాడి విందారగింప గోరి
ఆర్తి తో వస్తిమీ ఆనంద దాయకా
అభయ మీయగ రావె వైకుంఠ నాయకా ॥కల్యాణ॥
లోకు లెల్లా జుాచి విస్మయమ్మున కుాడి
గబ్బుదేరగ మాదు భాగ్యమ్ము కీర్తింప
అక్కసమ్మున బ్రోచి ఆదరింపవె మమ్ము
తేకువ ననుమతించు చేరి కొలువగ మిమ్ము ॥॥ కల్యాణ॥
ఖలులను అవహతించ కారణ జన్మములెత్తు
కల్యాణ జగదీశ కేశవ శ్రీ కృష్ణ .......
పలు పాటనలిడి పాడుచుంటిమి లీల
మలయు నీ కీర్తులను వర్ణింప మా తరమ ॥కల్యాణ॥
పానీయములు పెక్కు ఫల భక్ష్యముల గనుమ
పసిడి గన్నెలొ నేతి పాయసాన్నము గొనుమ
నెలకొన్న మా వేల్ప నేతివంటల ఋచుల
వెరసి మాతో కలసి ఆరగింపగ రార ॥కల్యాణ॥
No comments:
Post a Comment