Friday, January 15, 2021

మన పండగ విశిష్టత

మకర సంక్రమాణం.
మహాతి సాహితీ కవి సంగమం వారి
ప్రతిరోజూ కవితా పండుగే.

పర్యవేక్షణ డా: అడిగొప్పుల సదయ్య గారు.
నిర్వహణ: శ్రీమతి గీతా శైలజ గారు.

అంశం .మకరసంకాంతి.

తేదీ 15..1..2021.
శీర్షిక : మన పండగల విశిష్టత. 

రచన:శ్రీమతి:పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ :మహరాష్ట్ర.
8097622021.

భగవదారాధనతో  అనుసంధానమైన
మన సద్ధర్మ సాంప్రదాయాల ఆచరణలు
నిర్దిష్ట సమయపాలనతో కుాడిన ఆచారాలు
మన ఆరోగ్య, ఆనందాల , జీవన నిధులు ॥
మనమంతా ఒక్కటే నన్న  మన సంస్కృతి-
మానవ సంబంధ సాంప్రదాయాలు, పండగలకు ప్రతీతి.
పండగకు నెలముందు,  ధనుర్మసం నుండీ
 మొదలయ్యే పెద్దపండగ సందడి, ధనుర్మాస వ్రత దీక్షతో ముఫ్ఫై రోజులుా శ్రీ గోదాదేవి రచించిన పాశురాల పాటలతో, శ్రీ రంగనాధుని అర్చనకు
 మొదలిడే సంద్ర స్నానాలతో శ్రీ రంగనాధుని మేల్కొల్పు పాటలతో మొదలై ,  శుభ 
 భోగీ పర్వ దినాన వచ్చే శ్రీ గోదా రంగనాయకుల 
 కల్యాణంతో వైభోపేతంగా పుార్తి అవుతుంది.
 నిశ్ఛల భక్తి ప్రపత్తులతో చేసే భగవదారాధనల సత్ఫలితాలకు నిదర్శనమైన ఈ వ్రతాచరణను
 అందరుా చేసి , వ్రత సమాప్తి చేసి తరించే శుభ 
 దినం సంక్రాంతి పండగ. నిర్మల భక్తికి భగవంతుడే 
 దాసొిహమంటాడన్న సత్య నిరుాపణ ,ద్వాపర యుగంలో గోపికలంతా కలసి చేసిన 
 ఈ  కాత్యాయనీ వ్రత దీక్ష . గోదాదేవి చేసి 
 తరించిన పాశురాలు.
 ఆర్తి నిండిన  భక్తి  గీతాల వేడుకలు. శ్రీ రంగని 
 ప్రీతి  మేల్కొల్పుల మంగళ గీతాలు.
 రంగురంగుల రంగవల్లులతో, పుాల తోరణాల తో
ఇంటంటా నెలకొన్న సంతోషాల సందడి.
ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభం .
భోగీ పండగతో మొదలైన సంబరం. 
భోగ వైభోగాలతో, శ్రీ గోదా రంగనాయకుల 
కల్యాణ వైభోగం. మన భోగీ విశిష్టత అందం.
మరునాటి "సంక్రాంతి" పసుపు కుంకుమల వంటి
మంగళ ద్రవ్య పంపకాల తో మొదలై , బొమ్మల కొలువులు, గొబ్బెమ్మల అట పాటలు ,
గాలిపటాల ఎగురవేతలు , గంగిరెద్దు ఆటలు, 
హరిదాసుల నృత్యాలు ,దాన ధర్మాది 
మంగళ కార్యాలతో , బంధువుల రాకపోకల 
సందళ్ళతో  , పిల్లా పాపల కేరింతలతో , 
కన్నె పిల్లల గొబ్బెమ్మ పాటలు ఆటలతో
ఆనందించే  ముాడు రోజుల ముచ్చటైన పండగ.
కొత్త పంట ఇంటికి చేరిన వేళ
రైతన్నల కళ్ళ లో ఆనందాల తడి. పచ్చటి ధాన్య సిరి ఇంటింటా నిండిన సందడి. అన్నామృత సిరిని 
పండించిన రైతన్నలకు ఆదర సత్కారాలతో 
కొత్త బట్టలు పంచి పెట్టి...పొలం దున్నే ఎద్దులకు 
పాడిచ్చే పశు సంపదకు, పని ముట్లకు  , 
పసుపు కుంకాలద్ది పుాజించే శుభ సందడులు
మినుగు పిండి వంటలు మట్టి బొమ్మల బారులతో కళ కళ లాడే పండహలు సంక్రాంతి ,కనుమ , ముక్కనుమలు.
తర తమ భేదాలను వదిలి, మనమంతా ఒక్కటే 
అన్న భావనతో అందరుా ఒకటై ఆనందించే పండగ.
మన పెద్ద పండగ. సంక్రాంతి రోజున స్వర్గస్తులైన పెద్దలకు కొత్తబట్టలు చుాపి , పితృ తర్పణాలు వదిలీ
వారి ఆశీస్సులందుకొనేరోజు. 
అన్ని వర్గాలవారు, అన్ని వర్ణాలవారుా ఒక్కటై
ఆనందంగా జరుపుకొనే ఈ పండగలు 
మన భారతీయ సంస్కృతికి వన్నె తెచ్చిన  
సదాచార వైభోగ సాంప్రదాయాలు .ఎప్పటికీ
ఆచరణీయమై అంటు రోగాలకు , అనారోగ్యానికీ
మనని దుారం చేసే ఆరోగ్యకరమైన 
ఔషధీ నిలయాలు. అనుభవజ్ఞుల అద్భుత 
జ్ఞాన సంపదల పంపకాలు .
మనమంతా పాటిద్దాం..
పిల్లలచే  పాటింపచేద్దాం. 
.-------------------------------

No comments:

Post a Comment