Sunday, January 17, 2021

తేటగీతి పద్యాలు.

రచన:శ్రీమతి:పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ :మహరాష్ట్ర.

1.
కలుపు మొక్కది  వనమునొ  క్కటియె చాలు
చెలగ వనముకు చీడతో   చేటు యట్లు 
ఖలుల తోడ చెలిమి చేయు ఘనుల కెపుడు
విలువ తరుగు నిహమునను వినుము మనుజ ॥
2.
అమ్మ నాన్నల విడచితి వాశ్రమమున. 
గుడులు గోపురములు జుట్టు  గుణుని గాను
తరచి భజనలు జేయుచు  ధరణి మసలు    
జన్మ  మేటికి, మనిషిగ  జగతి  మనుజ  ॥
3.
సచ్చరితము సంస్కారము  సరళ వాక్కు
స్వశ్ఛమైనట్టి నడతయు  సాధు గుణము
నిశ్ఛ యమ్ముగ సద్గుణా  లివియె ఇలను
మెచ్చు రీతిని  మసలుటే మేలు మనుజ ॥
4.
చీర కట్టు  బొట్టునిడిన  జిలుగు బోడి
ముార పుాలు ముడుచు నట్టి ముద్దు గుమ్మ
వరలు సిగ్గుతో డమసలు వనిత లున్న
వరము మనకదే  ఇలనేలు పడతి లక్ష్మి ॥
5.
ఒరుల మనసుతె లిసినీవు ఓర్మి తోడ
చెరుపు మాటలా డకనుండు చేరి సఖుల
పరుల ప్రేమజుా డగమాట  పలుకు తీపి
నరుని జన్మకు సార్ధక  నడత లివియె॥ 












No comments:

Post a Comment