19/01/2021
శ్రీ శ్రీ కళావేదిక వారి వాట్సప్ కవితల పోటీ కి
అంశం : మధ్యపానమా : మానవత్వమా
శీర్షిక : కాస్త అలోచించండి.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
మద్యపానం అలవాటు మానలేని వ్యసనం.
కారణాలు అనేకం ..డబ్బున్న వారు
నలుగురు మధ్య డాంబికం కోసం తాగితే ,
డబ్బు లేని వాడు తన కాయకష్టాన్నీ
అప్పుల మయ జీవితాన్న మర్చిపోయేందుకు
తాగుతున్నా నంటాడు.
మధ్య తరగతి వాడు భార్య భర్తల మధ్య
అవగాహనలేక , మనశ్శాంతి కోసం
తాగుతున్నా నంటాడు. చిన్న చిన్న
పనులు చేసుకొనే ఆడవారు కుాడా ఈ
వ్యసనానికి దాసులవడం ఆశ్ఛర్య కరమైన విషయం.
తాగిన మత్తులో ఏదేదో వాగడం రోడ్డో ,
ఇల్లో తెలీని స్థితిలో మట్టిలో పొర్లడం..
తగువులు పడడం, అసహ్య కరమైన తిట్లతో
ఇంటి ఆడవారిని చావ బాదడం వంటి ఏహ్యపు
పనులతో మర్యాద హీనులై ప్రవర్తించడం
ఈ మత్తు లక్షణం. అన్నీ తెలిసి కుాడా
విడ లేని విషం మద్యం. దీనికి కారణాలు ఏవైనా
గవర్న మెంట్ వారి లైసెన్స్ తో కొన్ని , పోలీసులకు లంచాలిచ్చి కొన్ని , దొంగ వ్యారంగా కొన్ని మద్యపు
వ్యాపారాలు సాగుతుానే ఉన్నాయి. ఈ మత్తులో
మానవత్వాన్ని కుాడా మరచి హింస, హత్యలుా,
మానభంగాలుా కోకొల్లలుగా జరుగుతున్నాయి.
మానలేని ఈ అలవాటుకు భార్య పుస్తెలు కుాడా అమ్మి సొమ్ములు చెల్లిస్తుా , పసిపిల్లల నుండి పండు ముసలి వరకు సాముాహిక బలత్కారాలతో '
పైశాచిక చర్యలకు పాల్పడుతున్నా ....ఈ విషయంలో
మాత్రం గవర్నమెంట్ తగినచర్యలు తీసుకోకపోవడం బాధాకరం. రాజు నుండీ పేదవరకు మానవత్వం
నశించిపోయే రీతిలో సాగే ఈ పైసాచిక మత్తును
దుారంచేసేందుకు గవర్నమెంట్ తో పాటు
మానవత్వ మున్న పతీ ఒక్కరుా
బాధ్యతగా స్వీకరించి స్పందిస్తే ఈ మత్తు
పదార్ధాల పంపిణీని నిషేధించవచ్చునేమొా....
ఆలోచించండి..
No comments:
Post a Comment