[12/17, 14:44] మహతి. అడిగిప్పుల సదయ్య. ఇష్టపదులు: 1 6 /12/2020.
ప్రతీ తోజుా కవితా పండగే కొరకు.
మహతీ సాహితీ కవిసంగమం - కరీంనగరం..
*ధనుర్మాస కవితోత్సవాలు..*
పర్యవేక్షణ: శ్రీ డా. అడిగొప్పుల సదయ్యగారు
నిర్వహణ: శ్రీమతి యాంసాని లక్ష్మీరాజేందర్ గారు..
అంశం : గోదాదేవి (ఆండాళ్ ).
శీర్షిక : 1..వ పాశురము
ప్రక్రియ : గేయ రచన.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
-------------
పల్లవి:
మేలుకొల్పులు చేయ వేల నుతులను పాడ
శ్రీ రంగనాధునీ చిన్మయస్వరుాపుని
అను పల్లవి:
పొద్దు పొడవకమునుపె పుాలంగి సేవలా
నాధు కొలువగ రండి వేద కీర్తుల వేడ॥మేలుకో
చరణం:
తొలి పొద్దు పొడచేను తరుణులారా లెండు
కలిదీర్చు కమలాక్షు కొలువ రారే వేగ
ఫలియించు మీ కోర్కె పడతులారా రండి
మార్గశిర స్నానమిడి మన వేల్పు కొలవండి..॥మేలుకో
చరణం:
స్వర్గ ద్వారము తెరచి యుండు ఘన మాసము
మార్గశిర వ్రత దీక్ష పుాన మహిమలు ఘనము
దుర్గమౌ దురితమ్ముల శమియింపు నీ నోము
దీర్ఘ యశముల బడయు దివ్యమైనది మనుము॥
చరణం:
నిదుర చాలింపుమని నీలమేఘ శ్యాముని
మధుర మంగళ వాద్య వేద ఘోషల తోడ
మేల్కొల్పగారారే మీన నేత్రపు ఘనుని
నందగోపాలనీ రేపల్లె బాలునీ ॥
చరణం:
సుర్య చంద్ర సమ తేజము నిండిన
సుందర వినీల దేహ సుందరుని
నంద యశోదలా నమ్మక వర పుత్రునీ
నటన సుాత్ర ధారి నగధరునీ మాధవునీ ॥
------------------------------------------------------
[12/17, 14:47] మహతి. అడిగిప్పుల సదయ్య. ఇష్టపదులు: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారి స్వరరాగ సుధాఝరి....☝️
నిన్నటి వారి కవితను వారి గాత్రమాధుర్యంలో వినాలని కోరాను....నా కోరిక మన్నించి పాడి పంపించారు ఈరోజు....వారికి బహుధా ధన్యవాదాలు...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺
[12/17, 14:47] మహతి. అడిగిప్పుల సదయ్య. ఇష్టపదులు: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారి స్వరరాగ సుధాఝరి....☝️
నిన్నటి వారి కవితను వారి గాత్రమాధుర్యంలో వినాలని కోరాను....నా కోరిక మన్నించి పాడి పంపించారు ఈరోజు....వారికి బహుధా ధన్యవాదాలు...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺
[12/17, 21:59] మహతి. అడిగిప్పుల సదయ్య. ఇష్టపదులు: మహతీసాహితీ కవి సంగమం , కరీమ్ నగర్
ధనుర్మాస కవితోత్సవాలు
పర్యవేక్షణ : డా . అడిగొప్పుల సదయ్య గారు
నిర్వహణ : ముక్కా సత్యన్నారాయణ గారు
తేది: 17.12.2020
పాశురము (2)
ప్రక్రియ: గేయ రచన.
రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ -మహారాష్ట్ర
పల్లవి:---------
నోముతీరును వినరే నొద్దికగా చెలలుా
పాలకడలి శయను పరమాత్ము రంగనీ
అనుపల్లవి:
తొలి వెలుగుల ప్రభలా తోడు నీడాడరే..
రంగనాధుని కొలువ రయమునను సాగరే..॥నోము ॥
చరణం:-----------
పాలసంద్రమునందు ఫణిశేష తల్పమున
లీలావతారుడదే నిదురపోయెను రారే
వేల నుతులను పాడి వేగ మేల్కొలుపిడరే
పుాలంగి సేవలిడి పదము శరణనరే ॥ నోము ॥
చరణం:----------
కురుల పుాలిడకండి మాలలల్లీ తెండి
పరులు బాధను చెందే పలుకు లిడకండీ
జ్ఞాన ధనులను కొలిచీ ధర్మ మార్గము నడచీ
మార్గశిర వ్రతదీక్ష పుాన రారండీ ॥నోము॥
చరణం----------- :
సత్య భాషణ నిత్యనియమ్ము సుండీ
దాన ధర్మముజేసి తరియింపు మండీ
ఐకమత్యము తోడ హరిని కొలువండీ
జగము కీర్తులనేలు జయము మనదేనండి ॥నోము॥
చరణం-------------
నిదుర చాలింపుమా నీల మేఘ శ్యామా
మధుర మంగళ వాద్య వేదఘోషలు వినుమా
నీదు వాకిట నోర్మి నిలిచి యుంటిమి గదా
పాదు కొన్న శ్రీశా పరమాత్మ చిద్ఘనా మేలుకో ॥
-----------------------------------------------------------
[12/19, 06:36] మహతి. అడిగిప్పుల సదయ్య. ఇష్టపదులు: ప్రతీ తోజుా కవితా పండగే కొరకు.
మహతీ సాహితీ కవిసంగమం - కరీంనగరం..
ధనుర్మాస కవితోత్సవాలు..
పర్యవేక్షణ: శ్రీ డా. అడిగొప్పుల సదయ్యగారు .
నిర్వహణ: శ్రీ కుందారపు గురుమూర్తి గారు.
18/12/2020.
పాశురము 4.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
పల్లవి:
శంఖ చక్ర గదా పద్మ ధరుడు శ్రీనాధుడుా..
బ్రహ్మ రుద్రాదులకును నియామకుడితడుా
అనుపల్లవి:
మార్గశీర్ష శుక్ల పక్ష ప్రీతి ఫాల తిలకుడు
ద్వాదశ ఊర్ధ్వ పుండ్ర శ్రేష్ట నామ కేశవుడుా.॥శంఖ చక్ర
చరణం:
కరుణ గల్గిన వరుణ దేవుడు కరుణించ
సంద్రాన సలిలముల తృప్తిగా తాగీ
నింగి నిలచీ నల్ల మేఘాల దాచీ
తా నిండు వర్షపు నీట తేజమై వెలిగే ॥శంఖ చక్ర॥
చరణం:
లోకాలు పాలించు లోకోత్తరుడు చక్రి
సోకాలు దీర్పగ స్వయము నేతెంచే
మెరయు మేనిని పోలు మెరపులే మెరయంగ
మేఘాలు వర్షించి అభిషేకములు సల్పె ॥:శంఖ చక్ర॥
చరణం:
శంఖ నాదము వోలె ఘర్జించె నింగీ..
రామ శరము వోలే వర్షించె నింగీ
అంగనలు తానాలు ఆడ వేగమె రండి
రంగనాధు అర్చించు వేళాయె సుండీ॥2॥శంఖ చక్ర॥
------------------------------------------------------
[12/19, 06:38] మహతి. అడిగిప్పుల సదయ్య. ఇష్టపదులు: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తిగారి నాల్గవ పాశుర మధుర స్వరరాగఝరి-4👆
[12/19, 06:56] +91 77806 56292: పాటను చక్కగా రాశారు
అంతకంటే బాగా పాడి మమ్ము పరవశింజేశారు🙏🏻🙏🏻🙏🏻🙏🏻
[12/20, 07:26] మహతి. అడిగిప్పుల సదయ్య. ఇష్టపదులు: 2012/2020.
మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం.
ధనుర్మాస కవితోత్సవాలు-2020 .
పర్యవేక్షణ: డా॥అడిగొప్పుల సదయ్యగారు.
నిర్వాహణ : వి.టి.ఆర్. మొాహన్ రావుగారు.
పాశురము 5.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
పల్లవి:
క్షీర సాగర శయన హరి నారాయణుడుా...
పరమ పావనుడు పరమాన్న ప్రియుడు
అనుపల్లవి:
పద్మ గదా శంఖ చక్ర ధరుడు పద్మ నాభుడు
పరమేశ్వరుడు పాహి నాధ నారాయణుడు
చెలియలారా రారే చేరికొలువగా హరినీ
శ్రీ రంగ నాధుని శ్రిత జన పాలునీ... ॥క్షీర సాగర॥
చరణం :
మధురాధి పతి మేటి మాధవుండీతడుా
మధురాను భుాతియదే మాత యశోదకు
యదు వంశ కుల రేడు యమునా విహారుడు
పదునాల్గు భువనాల నెరలు నల్లనివాడు ॥క్షీర సాగర॥
చరణం :
ముదముతో నీరాడి పరిధానములగట్టి
పాదపుాజలు సేయ పుానుకొని రారే
పాదుకొన్న మేటి పాపములు గాల్చేటిఞగ
వేద వంద్యుని కొలువ వేగ పడరే మీరు ॥ ॥క్షీర సాగర॥
క్షీర సాగర శయన హరి నారాయణుడుా...
పరమ పావనుడు పరమాన్న ప్రియుడు
అనుపల్లవి:
పద్మ గదా శంఖ చక్ర ధరుడు పద్మ నాభుడు
పరమేశ్వరుడు పాహి నాధ నారాయణుడు
చెలియలారా రారే చేరికొలువగా హరినీ
శ్రీ రంగ నాధుని శ్రిత జన పాలునీ... ॥క్షీర సాగర॥
No comments:
Post a Comment