30/12/2020.
ఈ వేమన కవితా నిలయం లో
డిశంబరు నెల రెడవ పక్షం కవిత కు
అంశం : ధనమేరా అన్నిటికీ ముాలం.
శీర్షిక :
అతర్మధనం.
---------------
ఆసుపత్రిలో అనాధగా నేను. అన్నీ ఉన్నా...
లేని వాడిలా...నాచుట్టుా చెక్కు బుక్కులే...
పక్షవాత దుర్గతి తో సంతకం చేయలేని స్థితి...
ఎవరుా నన్ను పట్టించుకోవడం లేదు.
నావేపు వెటకారంగా చుాపుల తుాపులు.
నా గుండెని చీల్చే నగుబాటు బాకులు.
కొన్నేళ్ళ క్రితం డబ్బు సంపాదనే నాధ్యేయం
ధనమే అన్నిటికీ ముాలమన్న వితండ వాదం
అడ్డ తోవల్లో సంపాదించిన ధనం ,
కోల్పోయిన మంచితనం , మర్యాదల సారం.
డబ్బు మదంతో మానవత్వం మరచిన నాకు
దుారమైన జనం . స్నేహితులే లేని ఒంటరితనం.
.లంచాలు ,భుాకబ్జాల లిష్ట్ లో ప్రధమ స్థానం.
జైలు శిక్షలో కుాడా డబ్బు కొరకై కొట్టుకున్న ప్రాణం.
తిరిగొచ్చిన నాకు ఇంట్లో ఎవరుా లెేని ఒంటరి తనం.
డబ్బు మనిషిగా నను విడచిన నా పరివారం..
డబ్బిచ్చి కొనుక్కున్న సుఖాలకు అంటిన రోగం.
నీళ్ళ లా ఖర్చు చేసినా పని చేయని వైద్యం.
బేంకుల్లో ముాలుగుతున్న డబ్బు.
మంచంలో ముాలుగుతున్న నేను.
మనిషికి డబ్బు కావాలి బతకడానికి మాత్రమే
కాని బతుకు నిచ్చే ఆనందం ఆప్తులుంటేనే
తీరుతుందని తెలుసుకున్న నిజం..
అంతర్మధనంలో అశృధారలు.
నా అన్న వారికై తపించే మనసు ఘోషలు.
అసహాయ స్థితిలో అంతరాత్మ చేసే తిరుగుబాటు
సరిదిద్దుకోలేని జీవితపు పొరపాటు.
రచన: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.
హామీ: ఈ కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితంకాని నా స్వీయ రచన.
No comments:
Post a Comment