Monday, February 15, 2021

ద్విపద పద్యాలు.


శీర్షిక : తెలుగు వెలుగుల తల్లి.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .

వెల్లి విరిసినదౌ  వేద సంభాషి
తల్లి భారతి నిత్య ధర్మ -సంవాసి  ॥

శోభ లేలెడు తల్లి  సౌభాగ్య రాసి 
శుభ సంప్రదాయాల సుగుణాల శ్రేష్ఠి ॥

కట్టు బొట్టుల తీరు కనువిందు  జేయు 
జుట్టుసిం గారమ్ము చుాపుకే తీరు ॥

దేశ  కీర్తిని పెంచ  తెలుగింటి నాతి ॥ 
దేశ సౌభాగ్యమే  తెలుగింటి కీర్తి ॥

నిగమసా రసుమొాద  నిత్యసం తోషి
జగతి సార్ధక నామ జయ సౌమ్య రాశి ॥

సిరి సంపదల వల్లి  శీల సజ్జనని
సరి సంప్రదాయాల సంస్కృుతుల ధని ॥

తెలుగు భాషకును రాదేదియుా సాటి 
వెలుగు  సంస్క్రుతదేను  పెంచుగా కీర్తి  ॥

అక్షర మ్ములకుార్పు  నలరు ఛందస్సు
లక్షణ మ్ములనేలు  లలిత వర్చస్సు ॥

పద్య-  గద్యములంటి పలుశ్రేష్ట  నిధులు
విద్యల్లొ మాన్యమౌ  వివిధసం పదలు ॥

ఫల పుష్పములు  నిండు  పచ్చని వనులు
జలరాసి  తోనిండు  చలనదీ  ఝరులు॥

సత్సాంప్రదాయాల సరినేలు శీల  
ఉత్సాహముల నింపు  ఉత్తేజ బాల ॥

మహినేలు  తల్లికీ  మల్లెపుా దండ
సుహిమాద్రి శోభల సుజన బ్రహ్మాండ ॥

నీమాట  నీబాట  నీపాట  తలపు
జైమాల  లొసగేటి  జయమొందు  గెలుపు ॥

తల్లి సేవను నీవు  తధ్యమ్ము  విడకు
తల్లి కంటను నీటి  తడిని రానీకు॥

సమత మమత తోడ సరివారి జుాడు
సమ దృష్టినిడి మను సజ్జన్మ  మేలు ॥

No comments:

Post a Comment