అంశం:సాంకేతిక పురోగతి:మానవ సంబంధాలు.
శీర్షిక:
దేశ ప్రగతి పుాల బాట కావాలి.
-----------------------------------------
సాంకేతిక రంగాలలో మనిషి సాధించిన ప్రగతి-
మానవుడే మహనీయుడు అన్న మాటకు నిదర్శనం .
భుామిపై ఉన్న మనిషి అంతరిక్షాన్వేషణ లో
సాధించిన విజయాలే అందుకు నిదర్శనం .
సైన్స్ & టెక్నాలజీల అభివృద్ధి తో పాటు మానవుడు
అత్యున్నత విజ్ఞాన అభివృద్ధి పథానికి
శ్రీకారం చుట్టేడు. సాంకేతిక పరిజ్ఞాన పరికరాలతో
ఎన్నో మౌలిక సదుపాయాల మనకు సమకుారేయి.
కోవిడ్ 19 మహమ్మారి సంక్షోభం లో ఈ
విజ్జాన ఫలితాలు మనిషి క్రియాశీలక పురోగతికి
దోహద పడుతున్నాయి. ఆన్ లైన్ లావా-దేవీలు,
ఆన్ లైన్ ద్వారా విద్యా బోధన, బేంకింగ్ , రైల్వే, నెట్
పేమెంట్స్ ఇలా ఎన్నో సదుపాయాలతో
మానవ మేధస్సు ముందడుగు వేసింది.
అయితే ఈ విషయంలో మనిషి ఎంత పురోగతి
సాధించేడో అంత అధోగతి పాలౌతున్నాడు.
పెరిగిన పర్యావరణ కాలుష్యం, దాంతో క్షీణిస్తున్న
ఆరోగ్యం .రసాయనిక వాడకాల వల్ల వచ్చేవింత
రోగాలు..దుార వాణి ,చరవాణి ల దురుపయొాగాల
వల్ల మనుషుల్లో లోపించిన మానవత్వం.మారుతున్న
మనస్తత్వాలకు మానభంగాలతో మంట కలుస్తున్న
మహిలళల మాన-సమ్మానాలు.పుట్ట గొడుగుల్లా
లేస్తున్న వృద్ధాశ్రమాలు. ఇలా ఎన్నో
అంతులేని అవక తవకలు చోటు చేసుకున్నాయి.
మనిషి విజ్ఞాన విషయాల పురోగతి తో పాటు
ఇటువంటి సమస్యల సమాధానాల్ని కుాడా
తెలుసుకో గలిస్తే మన దేశ ప్రగతి బాట పుాల బాటే ఔతుంది.
----------------------
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
శీర్షిక .
పవిత్ర బంధం.
-------------------
దేవతల కాలం నుండి ఆచరింపబడుతుా
పవిత్రమైన బంధాలకు ప్రతీక గా నిలచిన
ఈ రాఖీ పౌర్ణమి పండగ అత్యంత శ్రేష్టమైనది.
శ్రావణ మాసపు పౌర్ణిమ రోజున వచ్చే ఈ
పండగను రాఖీ పౌర్ణమిగా, జంఝాల పౌర్ణమిగా
వ్యవహరిస్తారు.
అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి నిదర్శనంగా,
రాఖీ అనబడే రక్షణ సుాత్రాన్ని , అన్నదమ్ముల
చేతికి కట్టి, తమ రక్షణ కై, వారి నుండి సోదరి పొందే , "భరోసా "ఈ రాఖీ పండగ.
హిందుా ధర్మం లో గాయత్రీ మంత్రం జపిస్తుా..
కొత్త జంఝం అనే రక్షక సుాత్రాన్ని ధరించి, తమ స్వ పరివార రక్షణ కై , గాయత్రీ శక్రిని ఉపాసించే పవిత్రమైన
పండగ ఈ రాఖీ పండగ.
ఆపత్కాల సమయంలో భర్తకు భార్య కట్టే రక్ష.
ఈ పండగను హిందువులుా జైనులు సిక్కులుా
ముస్లిములు , బౌద్ధులుా, క్రైస్తవులు కుాడా, వారి వారి ఆచార విధానాలతో ఆనందంగా
జరుపుకొనే పవిత్రమైన పండగ ఈ రాఖీ పండగ.
----------------------
No comments:
Post a Comment