Wednesday, March 17, 2021

మరో కోణంలో మన యుగాది.

రచన:శ్రీమతి: పుల్లాభట్ల -
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
శీర్షిక : మరో కోణం లో,
మన ఉగాది.

ఉరుకుల పరుగుల జీవితంలో
వత్సరానికొకసారి వచ్చే యుగాది
తరతరాల సాంప్రదాయ సారాన్ని,
అరు ఱుచుల అమృతంతో కలిపి,
ఆరోగ్యానందాల ఓషధీ ఉపయొాగాల
వినియొాగాన్ని, ప్రకృతి సంపదల
విశిష్టతను తెలియజేస్తుా, పండగల పేరుతో చేసే పారిశుభ్రతల ప్రాశస్త్యాన్ని తెలుపుతుా,ఆనందామృతాన్ని పంచేది.
మారుతున్న మనస్తత్వాలకు 
మైల పడిన కాలం, మారణహోమాల్లో
దగ్ధమై , మరో చరిత్రను సృష్టించింది.
అంతరాలను మరచిన మనుషుల
స్వార్ధపు-వికటాట్టహాసాలకు ,
నిర్వీర్యమైన మానవత్వం , స్త్రీత్వం వలువల్ని వలిచి ,విలువలను కాలరాస్తుంటే , 
అబలలు  కార్చే కన్నీటి శాపం 
కరోనాగై కాటేస్తుంటే, 
విప్లవ భావాల వింతప్రపంచపు 
వరుస  కాష్టాల్లో  రోజుకో రుాపు ధరించి 
విహరిస్తుా  రోగాలపాలు చేస్తున్న-
 వింత కణానికి విరుగుడుగా 
ఈ సారి మరో కోణంలో మన ముందుకు 
మళ్ళీ వస్తోంది ,మరో చరిత రాసేందుకు  
ఉగాది కన్య.
మాస్క్ ధరించిన -మొాముతో , 
సానిటైజర్ల  బహుమతులతో...
అల్లం, మిరియాలు , ఏలకలు,లవంగాలు
పసుపు, తులసిల మిశ్రమామృత కలశంతో , ప్రేమామృతాన్ని పంచడానికి. 
మానవత్వపు "వాక్సిన్" ని మందుగా
మనకు ఎక్కించ్చేందుకు. పరిశుభ్రతనెరిగించే
పాఠ్య పుస్తకాలతో , ప్లవ నామ ధారిణిగా....

No comments:

Post a Comment