18/3/2021.
శ్రీ శ్రీ కళా వేదిక వారి,
ప్రపంచ కవితా దినోత్సవ పోటీ కొరకు..
రచన:శ్రీమతి: పుల్లాభట్ల -
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర.
8097622021.
అంశం : పుస్తకంలో నాకో పేజీ...
మనసుకు, మనిషికి మధ్య కదలాడే
భావ వ్యక్తీకరణకు మాధ్యమమై
జరిగే సంఘటనలకు సాక్షీ భుాతమై ,
జరిగిపోయిన గతపు జ్ఞాపకాల పడవకు
దారి చుాపే అక్షర చుక్కాని పుస్తకం .॥
చిన్న తనపు , వలపు తలపుల
చిలిపి భావాల ప్రేమ సందేశాలకు
పలకరింపు పరిమళం పుస్తకం.
అంతులేని ఆప్యాయతను పంచే
అమ్మ ఒడి జ్ఞాపకాలను అక్షరాల్లో
భద్రపరచిన , అనంద జ్ఞాపకం పుస్తకం.॥
తెలియని లోకాన్ని , వేద సారాన్ని ,
భరత చరితల త్యాగ నిరతిని
భద్రంగా నిక్షిప్తపరచి, భావి తరాల
భవ్య చరితలకు గట్టి పునాది వేస్తున్న
జ్ఞాన సంపదల గౌరవ పురస్కారం పుస్తకం.॥
నా లోని భావాలకు అక్షర సమర్పణ చేసి
నన్ను నాకు , పరిచయం చేస్తున్న ..
నవోదయ కాంతి కిరణం పుస్తకం .॥
అటువంటి పుస్తక పఠనంతో ,వికశించిన
నా మనో జ్ఞాన వికాశ సార భుామిలో,
సామాజిక హితానికై , కలం హలం తో,
సాహిత్యాక్ష సేద్యం చేయడానికి
నాకు కుాడా కావాలి , పుస్తకంలో ఒక పేజీ..
No comments:
Post a Comment