Tuesday, March 23, 2021

ప్రధమబహుమతి పొందిన కవిత..

🙏ప్రపంచ కవితా దినోత్సవం సందర్భగా 💐
పేరు -భరద్వాజరావినూతల 
ఊరు- కొత్తపట్నం 
అంశం  - సాహిత్యం కొత్తపుంతలు 
శీర్షిక- చల్లటిఓదార్పుకావాలి 
********************************************
🙏అక్షరాలను పదాలుచేసి -
భావాల సుధతో రంగరించి -
చక్కని చిక్కని వాక్యాలుగారాయాలని నాతలపు -
మనసునిదినాభావాలను మధించి -
ఆలోచనలసిరాను కలంలోపోసి -
తెల్లటి నామన్సుకాగితంఫై కవితారాస్తాను -
నాబాలు తొలిసంధ్యరాగాలు -
నాఆలోచనలు పుష్పరాగతరంగాలు -
నాకవితాశిల్పం కిన్నెరసాని నడక -
చెరగని నామనసులో ముద్రించి అక్షరాలూ
 భావాలకు అద్దుతాయి పరిమళాలు --
నేను కట్టుతాను కవితాకన్యకు సోయగాలు -
నీవిసురుతాను భావప్రకటనకు వింజామరలు -
బీటలుపడ్డ భూమికి తొలకరి నాకవిత -
వేడెక్కినగ్రీష్మమానికి ఆషాడం నాకవిత  
కూలివానిసేదతీర్చునాకవిత 
పట్టపగలు సిరివెన్నెల నాకవిత -
ముసలివానికి చేయూతనాకవిత 
విప్లవానికి విధాత నాకవిత 
పద్యంతో ప్రారంభమై -
ద్విపదగారూపుదిద్ది -
వచన,భావకవిత్వమంగామారి -
నగ్నకవిత్వమై -నానీలు,సున్నితాలు చిమ్నీలు -
రుబాయిలంటూ ర్పూపుదాల్చుకుని పరిగెత్తింది నాకవిత 
**************************
 ఇదినాస్వీయరచన 
 ✍️ భ రద్వాజ రావినూతల (RB)✏️
*************************

No comments:

Post a Comment