Thursday, March 25, 2021

మన బాధ్యత.


                     అంశం :రాజ్యాంగ రక్షణ.

                     శీర్షిక : మన బాధ్యత.       
                         
                         రచన: శ్రీమతి :
                         పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
                         కల్యాణ్ : మహారాష్ట్ర .
                         ----------------------
1950 జనవరి 26 న  అమలులోకి వచ్చిన.భారత రాజ్యాంగం , న్యాయ సంబంధమైన చట్టాలన్నింటికి
ముాలాధారమై ,
ఒక దేశం లేదా ఒక రాష్ట్రం యొక్క పరిపాలనా నిర్వహణకు పాటించాల్సిన న్యాయ సంబంధిత పత్ర సంపుటి తో
ప్రభుత్వాధికారాల నియమనిబంధనలతో బాటు,
పౌర హక్కులు, దేశం సాధించాల్సిన లక్ష్యాలతో
కలసిన పటిష్టమైన  పట్టికగా రుాపొందింపబడింది.
ఆనాటి నుంచీ ఈ నాటి వరకు పౌర సంబంధిత వ్యవహారాల లో న్యాయపరమైన
 చట్ట సంబంధిత మార్పులు  ఎన్నో, జరిగేయి.
 
జన్మత భారతీయుల్తెన వారి పౌరసత్వ హక్కు మత, జాతి, కుల, లింగ,  వివక్షతల నిషేధన , ప్రభుత్వోద్యోగ వసతులలో సమానవకాశాలు 
వాక్స్వాతంత్ర్యము మెదల్తెన హక్కుల పరిరక్షణలు,  లాంటి ఎన్నో  హక్కులతో పాటు , స్త్రీ సంబంధిత, 
అధికార చట్టాలు, హక్కుల సమానతలు ,విద్య , ఉద్యోగార్హతల తో పాటు , ఆరక్షణా కేంద్రాల స్థాపనలతో పాటు పర్యావరణ పరిరక్షణ, అడవుల పెంపకం వన్యప్రాణుల సంరక్షణే ,  కాక, అంతర్జాతీయ శాంతి,
 భారత ప్రభుత్వ వ్యవహరాల నిర్వహణాధికరణల
 వంటి ఎన్నో మార్పులతో చట్టాలను తీసుకు వచ్చేరు.
 ఈ ప్రభుత్వ చట్టాలను పరిరక్షించే బాధ్యత ప్రజలమైన
 మనపై చాలా ఉంది. న్యాయ పరమైన ప్రతీ పనికి మద్దతు ఇస్తుా , మత కలహాలను సృష్టించ కుండా, 
 స్త్రీ స్వాతంత్ర్యతకు సమానహక్కును ఇచ్చి గౌరవిస్తుా, 
 పర్యావరణ రక్షణ కై ప్రతీ ఒక్కరుా తమ వంతు కృషిని
 బాధ్యతాయుతంగా చేస్తుా , ఓటు హక్కును సద్వినియొాగ పరచుకొని, సరైన నాయకుని
 ఎన్నుకొని , ఎన్నుకున్న నాయకుని న్యాయ అదేశాలను
 అమలుపరచే బాధ్యతను తమదిగా ఆచరిస్తుా
 మన రాజ్యాంగ రక్షణకు మనమే ప్రతినిధులం కావాలి.
అన్యాయం,అక్రమం ,లంచగొండితనం ,రుాపుమాపాలి , స్త్రీ ల మాన సంరక్షణ మన బాధ్యతగా చేపట్టాలి. చట్టాలను తెచ్చేవరకు మాత్రమే మన 
 కేంద్రం మనకు సహరిస్తుంది. వాటిని అమలుపరచే బాధ్యత మనపైనే ఉందన్న నిజాన్ని మనం గ్రహించి 
 వ్యక్తగత, పరిసరాల పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల మన విద్యుక్త ధర్మాన్ని  మనమే నిర్వర్తించాలి.
 అప్పుడే మన రాజ్యాంగం రక్షింపబడి , దేశం 
 సుభిక్షమౌతుంది. 
 


No comments:

Post a Comment