Thursday, March 25, 2021

రాజ్యాంగ రక్ష.

    28/03/2021.
                       మనుమసిద్ధి కవన వేదిక. కు పంపినది
                       అంశం :  రాజ్యాంగ రక్ష.
                        శీర్షిక :రాజ్యాంగ రక్షణ.మన బాధ్యత.    
                        ప్రక్రియ : వచన కవిత.   
                         
              రచన: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
                         కల్యాణ్ : మహారాష్ట్ర .
                         -----------------------------
1950 జనవరి 26 న  అమలులోకి వచ్చిన.భారత రాజ్యాంగం , న్యాయ సంబంధమైన చట్టాలన్నింటికి
ముాలాధారమై ,ఒక దేశం లేదా ఒక రాష్ట్రం యొక్క పరిపాలనా నిర్వహణకు పాటించాల్సిన న్యాయ సంబంధిత పత్ర సంపుటి తోప్రభుత్వాధికారాల నియమనిబంధనలతో బాటు,పౌర హక్కులు, 
దేశం సాధించాల్సిన లక్ష్యాలతో కలసిన పటిష్టమైన  పట్టికగా రుాపొందింపబడింది.
ఆనాటి నుంచీ ఈ నాటి వరకు పౌర ,చట్ట సంబంధిత మార్పులతో పాటు భారత ప్రభుత్వ వ్యవహరాల నిర్వహణాధికరణలవంటి ఎన్నో మార్పులతో చట్టాలను తీసుకు వచ్చేరు.
ఈ ప్రభుత్వ చట్టాలను పరిరక్షించే బాధ్యత ప్రజలమైన
మనపై చాలా ఉంది. న్యాయ పరమైన ప్రతీ పనికి మద్దతు ఇస్తుా , మత కలహాలను సృష్టించ కుండా, 
 స్త్రీ స్వాతంత్ర్యతకు సమానహక్కును ఇచ్చి గౌరవిస్తుా, 
 పర్యావరణ రక్షణ కై ప్రతీ ఒక్కరుా తమ వంతు కృషిని
 బాధ్యతాయుతంగా చేస్తుా , ఓటు హక్కును సద్వినియొాగ పరచుకొని, వ్యక్తగత, పరిసరాల పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల మన విద్యుక్త ధర్మాన్ని  మనమే నిర్వర్తించాలి.అప్పుడే మన రాజ్యాంగం రక్షింపబడి , దేశం సుభిక్షమౌతుంది. 


హామీ: నా ఈ వచన కవత  ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని నా స్వీయ రచన.
 


No comments:

Post a Comment